శంకరమంచి జానకి అంటే గుర్తుపట్టరేమో కానీ.. షావుకారు జానకి అంటే ఠక్కున చెప్పేస్తారు.
షావుకారు చిత్రం పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది.
ఆమె అసలు పేరు శంకరమంచి జానకి
తొమ్మిది పదులు నిండినా ఇప్పటికీ తన పని తనే చలాకీగా చేసుకుంటున్నారు.
1950లో ఎన్టీఆర్‌తో షావుకారు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
1931 డిసెంబరు 12న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జానకి జన్మించారు.
ఆమెకు పదిహేను సంవత్సరాల్లోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు.
తాజాగా ఇవాళ తన 93వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది.
తన తొలిచిత్రం షావుకారు సినిమాకు 2500 రూపాయలు పారితోషికం అందుకుంది.
ఆ తర్వాత తెలుగు, తమిళంలో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు.
అంతేకాకుడా దాదాపు 300 నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
వెండితెరపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు షావుకారు జానకి.
తనదైన నటనతో కలైమామణి అవార్డు, అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్ కూడా అందుకున్నారామె.
అంతేకాకుండా పద్మశ్రీ అవార్డుతో ఆమెను కేంద్రం సత్కరించింది.


