ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో జానకి పేరు మార్మోగింది. అప్పటి స్టార్ హీరోలందరితో ఆమె సినిమాలు చేసింది. అయితే ఆమెతో పాటే సొంత చెల్లెలు కృష్ణకుమారి సైతం హీరోయిన్‌గా రాణించారు. ఒకప్పుడు వీళ్లిద్దరే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ హీరోయిన్లుగా ఎదిగారు.
కేవల ఏడాది గ్యాప్‌లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కాచెల్లెళ్లు దశాబ్దాల పాటు సినిమాల్లో కొనసాగారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఈ సిస్టర్స్ తమ కెరీర్‌లో ఒక్కసారి కూడా కలిసి ఏ ఒక్క మూవీలోనూ నటించలేదు. షావుకారు జానకి తమిళ చిత్రాల వైపు దూసుకెళ్లగా.. కృష్ణకుమారి తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించారు. వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌ను వేర్వేరుగా ఉంచాలనే విధానం.. 1976లో కృష్ణకుమారి సినిమాలకు గుడ్ బై చెప్పడంతో అక్కాచెల్లెళ్లను ఒకే తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు. కాగా.. కృష్ణకుమారి 2018లోనే కన్నుమూశారు.


