Senior actress
-
పద్మ విభూషణ్ గ్రహీత, సీనియర్ నటిపై మరణ వార్తలు.. కుమారుడు క్లారిటీ
అలనాటి నటి, పద్మ విభూషణ్ వైజయంతి మాల పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1955లో బాలీవుడ్లో దిలీప్ కుమార్ నటించిన దేవదాస్ చిత్రం హీరోయిన్గా కనిపించారు. అంతేకాకుండా నయా దౌర్, మధుమతి, జ్యువెల్ థీఫ్, సంగం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు గానూ పద్మ శ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఆమెను అభిమానులు ముద్దుగా డ్యాన్సింగ్ క్వీన్ అని పిలుచుకుంటారు.తాజాగా ఈ సీనియర్ నటి వైజయంతిమాల చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలయ్యాయి. దీంతో ఆమె కుమారుడు స్పందించారు. ఆమె మరణించారన్న వార్తలను వైజయంతిమాల కుమారుడు సుచింద్ర బాలి ఖండించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. ఆమె మరణ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆమె వయస్సు 91 ఏళ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.డాక్టర్ వైజయంతిమాల బాలి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆ వార్తలు షేర్ చేసే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని ఆమె కుమారుడు సుచింద్ర బాలి హితవు పలికారు. కాగా.. ఇటీవలే జనవరిలో చెన్నైలోని కళా ప్రదర్శినిలో వైజయంతిమాల భరతనాట్యం ప్రదర్శించారు. ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. వైజయంతిమాల తన నటనకు గాను పద్మభూషణ్ అవార్డ్‌ను దక్కించుకుంది. -
సీనియర్ నటి పుష్పలత కన్నుమూత
-
ఓ హీరో కమిట్మెంట్ అడిగితే.. నా చెప్పుల సైజు 41 అని చెప్పా: ఖుష్బు సుందర్
సీనియర్ నటి ఖుష్బు సుందర్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)-2024 వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే సదస్సులో ఆమె పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రతపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.ఖుష్బు సుందర్ మాట్లాడుతూ..' మహిళలపై వేధింపులు కేవలం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు. అన్ని చోట్లా ఉన్నాయి. బస్సులో, ట్రైన్లో, ఆటోల్లో కూడా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ సినిమా సెట్లో హీరో నాతో అసభ్యంగా మాట్లాడారు. మాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అని నాతో అన్నాడు. అప్పుడు వెంటనే నేను నా చెప్పుల సైజు 41. షూటింగ్ సెట్లోనే అందరిముందు చెంప పగలకొట్టనా? అని వార్నింగ్ ఇచ్చా' అని అన్నారు.కాగా.. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులపై మాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చాలామంది తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటికి చెప్పారు. పలువురు నటులపై ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి. -
ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందువల్లే..
సనా బేగమ్.. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లోనే కాకుండా ఇటు వెండితెరపై సినిమాల్లోనూ నటించింది. వందలకొద్దీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన ఆమె ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుందోనని కెరీర్ తొలినాళ్లలోనే హీరోయిన్ ఛాన్సులను తిరస్కరించింది. సహాయక నటి పాత్రలతోనే సరిపెట్టుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియకు బ్రేక్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె ఐదారు రోజులనుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. అసలే రంజాన్ పండుగ.. ఇంతరవకూ ఒక్కపోస్ట్ కూడా పెట్టడం లేదేంటా? అని అభిమానులు కంగారుపడిపోయారు. కారణాలు ఆరా తీస్తూ ఆమెకు మెసేజ్‌లు చేశారు. దీంతో సోషల్ మీడియాకు చిన్న గ్యాప్ ఇవ్వడానికి గల కారణాన్ని బయటపెట్టింది సనా. సర్జరీ విజయవంతం 'ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండనందుకు నన్ను క్షమించండి. దురదృష్టవశాత్తూ ఇటీవలే నా భర్తకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం తప్పింది. అల్లా దయ వల్ల సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. మీ ఆదరాభిమానాలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: Fahad Fazil: నన్ను కమెడియన్‌ను చేశారు.. పుష్ప విలన్ -
మహేశ్‌ది, నాది సేమ్ ఏజ్.. హీరోయిన్గా చేస్తా కానీ తల్లిగా నో ఛాన్స్!
కస్తూరి శంకర్.. ఒకప్పుడు హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. తమిళ బిగ్‌బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్‌లో మెరిసింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టైఫాయిడ్ రావడంతో వదిలేశా కస్తూరి మాట్లాడుతూ.. 'రజనీకాంత్‌తో మూడుసార్లు నటించే ఛాన్స్ వచ్చింది. కానీ చేజారిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. జెంటిల్మెన్ హిందీ వర్షన్లో చిరంజీవి పక్కన హీరోయిన్గా నేను చేయాల్సింది. సరిగ్గా అదే సమయంలో టైఫాయిడ్ రావడంతో ఆ అవకాశం పోయింది. గతేడాది రిలీజైన డెవిల్ మూవీలో సీత చేసిన పాత్ర కూడా ముందు నాకే వచ్చింది. సినిమాకు సంతకం చేశాక నేను యంగ్‌గా కనిపిస్తున్నానని తీసేశారు. అదే నా బాధ.. కాలా మూవీలో కూడా రజనీ పక్కన యంగ్‌గా కనిపిస్తున్నానని నన్ను తీసేసి ఈశ్వరి రావును సెలక్ట్ చేశారు. నేను పెద్ద వయస్కురాలిగా కనిపించను.. అదే నా బాధ. నా ముఖంలో నా వయసు కనిపించదు. ఇప్పటికీ తెల్లజుట్టు కూడా రాలేదు. అందుకే కొన్ని సినిమాలకు నేనే నా జుట్టుకు తెల్లరంగు వేసుకుంటున్నాను. తల్లి పాత్రలు వస్తున్నాయి.. కానీ ఏ హీరోకు అని చేయగలను? మహేశ్‌బాబుది, నాది ఒకే వయసు. అతడికి జోడీగా నటించగలను.. కానీ, తల్లిగా ఎలా చేయగలను? చూడటానికి అస్సలు బాగోదు' అని కస్తూరి చెప్పుకొచ్చింది. చదవండి: ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్ -
నా కూతురు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది.. ప్రకటించిన సీనియర్ నటి
అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది. ఊర్వశి ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఆమె కోలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తకరమైన విషయాలను పంచుకుంది. తన కుమార్తె 'తేజ లక్ష్మి' గురించి కొంత సమాచారాన్ని పంచుకుంది. అందులో ఇన్నాళ్లుగా తన కూతురు సినిమాల్లో ఎందుకు నటించలేదని, ఇప్పుడు సినిమాల్లో ఎందుకు నటించబోతుందంటూ పలు విషయాలపై ఆమె మాట్లాడింది.ఊర్వశి ఇటీవల తన కుమార్తెతో కలిసి ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అది కాస్త నెట్టింట తెగ వైరల్ అయింది. ప్రస్తుతం తేజ లక్ష్మి వయసు 23 ఏళ్లు కావడంతో సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ఆమె చెప్పింది. అందుకే ఆమెను ఇప్పుడు బయటి ప్రపంచానికి పరిచయం చేసినట్లు తెలిపింది. 'ఇన్ని సంవత్సరాలుగా నా కూతుర్ని సినిమాల్లో నటించేలా చేయలేదు. కారణం ఏంటంటే.. స్టార్ల వారసులు సినిమాల్లో నటించేందుకు వస్తే.. వాళ్ల పేరెంట్స్ ప్రభావం వల్ల జనాలు ఆదరిస్తున్నారు. వారసులకు ఇదే ప్రధాన సమస్యగా ఉంటుంది. అందుకే చదువు పూర్తి చేసి రమ్మని పంపించాను. అయితే ఇప్పుడు ఆమె చదువు పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి తన ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ నటించమని చెబుతున్నారని చెప్పింది. ఆమె కూడా ఇప్పుడు సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపుతోంది. కాబట్టి నేను దానికి అంగీకరించాను.ఇప్పుడు కొన్ని కథలు వింటుంది. ఆమె మొదట్లో సినిమాల్లోకి రాకూడదని భావించింది, కానీ విధి ఆమెను సినిమా వైపు నడిపిస్తుంది. దాన్ని మార్చలేమని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్‌ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వారిద్దరికి జన్మించిన అమ్మాయే తేజ లక్ష్మి. ఆ తర్వాత మనోజ్‌తో విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుని 2013లో శివ ప్రసాద్‌ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రితోనే కలిసి ఉంటోంది. View this post on Instagram A post shared by 𝐕𝐀𝐍𝐈𝐓𝐇𝐀 (@vanithamagazine) View this post on Instagram A post shared by Urvasi Sivaprasad (@therealurvasi) -
భర్త పోయిన తర్వాత విచ్చలవిడిగా..: ఏడ్చేసిన సురేఖ
సురేఖా వాణి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఈమెకు సుప్రిత అనే కూతురు ఉంది. ఈమె కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వెండితెరకు హీరోయిన్గా పరిచయం కానుంది. ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటారు. అయితే వారిని కొందరు అదేపనిగా ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై స్పందించింది నటి. మొదట్లో భరించలేకపోయా.. ఓ ఇంటర్వ్యూలో సురేఖా వాణి మాట్లాడుతూ.. 'మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా మారిందంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. నాకు 19 ఏళ్లకే డైరెక్టర్ సురేశ్ తేజతో పెళ్లయింది. అప్పుడు పెద్దదానిలా మారిపోయాను. ఇప్పుడు నాకు 42 ఏళ్లు.. ఇరవైఏళ్ల పిల్లలా నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నాను. నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని. మొదట్లో ఈ కామెంట్స్ చూసి భరించలేకపోయాను. తర్వాత వీళ్లు మారరని వదిలేశాను. ప్రతివాడి నోరు మూయించలేం కదా.. నాగురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సింగిల్ పేరెంట్ను, కాబట్టి ఇలాంటి విమర్శలు, ఎత్తిపొడుపులు ఎలాగో ఉంటాయి. తేజతో మాట్లాడాలనుంది నా భర్త ఆస్పత్రిపాలైనప్పుడు ఎంత ఏడ్చానో.. ఎంత బాగా చూసుకున్నానో! కానీ అతడి ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనసలు పట్టించుకోలేదని తేజ వాళ్ల కుటుంబసభ్యులు తప్పుగా అనుకున్నారు. అతడికి డయాబెటిస్ ఉండటంతో గుండెలో నొప్పి తెలియలేదు. సడన్‌గా హార్ట్ బీట్ ఆగిపోయింది. దేవుడు ఒక గంట అవకాశమిస్తే తేజతో మనసువిప్పి మాట్లాడాలనుంది. కనీసం కలలో అయినా తేజ కనిపిస్తే తనతో మాట్లాడాలనుంది. తనను క్షమించమని అడగాలనుంది. మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లోవారు అడిగారు. కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు. నాకంటూ సొంతిల్లు లేదు నాకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయి. అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మధ్యే నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను. ఇప్పటివరకు నాకు సొంతిల్లు కూడా లేదు. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు. అప్పుడు నేను మానసికంగా ఎంత నరకం చూశానో.. నెలరోజులు డిప్రెషన్లో ఉండిపోయాను. ముద్ద దిగక.. ఏడుస్తూ కూర్చుండిపోయా.. మీ చెడు తిరుగుళ్ల వల్లే ఇదంతా అని నోటికొచ్చింది తిట్టారు. నేను అమెరికాకు వెళ్తే పారిపోయిందన్నారు. అక్కడికి వెళ్లొచ్చాక ఈ కామెంట్లను పట్టించుకోవడం మానేశాను. ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమలస్వామివారిని కోరుతూ గుండు చేయించుకున్నాను' అంటూ కంటతడి పెట్టుకుంది సురేఖ. చదవండి: చిన్న సినిమాకు పెద్ద రివ్యూ ఇచ్చిన మహేశ్ -
శరత్‌బాబుతో బిడ్డను కనాలనుకున్నా..: జయలలిత
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఐటం సాంగ్స్, గ్లామర్ పాత్రలు పోషించింది జయలలిత. అప్పుడు ఫుల్ క్రేజ్ తెచ్చుకుని చేతినిండా సంపాదించింది. కానీ ఆ గ్లామర్ పాత్రల వల్ల ఇప్పటికీ తనకు మంచి పాత్రలు రావడం లేదు. అప్పటి సీనియర్ హీరోయిన్లంతా అమ్మ, వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అలాంటి చెప్పుకోదగ్గ పాత్రలే రావట్లేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమెకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతడి టార్చర్ భరించలేక మూడు నెలలకే విడిపోయింది. అప్పటినుంచి సింగిల్‌గానే ఉండిపోయింది. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకున్నా తాజాగా ఆమె ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. దివంగత నటుడు శరత్‌కుమార్‌ను మనసారా ప్రేమించానని చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ.. 'చాలామంది నన్ను రెండో పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ నేను ఆసక్తి చూపలేదు. ఒక్క పెళ్లితోనే నరకం చూశాను. ఇక దానికి జోలికి వెళ్లొద్దనుకున్నాను. అమ్మానాన్న చనిపోయాక హైదరాబాద్‌కు షిఫ్టయ్యాను. ఆఫర్ల సంగతి ఏమో కానీ సినీ ఆత్మీయులు ఉంటారని ఇక్కడ సెటిలయ్యాను. బిడ్డను కనాలనుకున్నాం నేను శరత్‌బాబును ప్రేమించాను. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు! ఆయనతో కలిసుండాలని ఎంతో అనుకున్నాను. కానీ ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడాయన లేరు కాబట్టి అన్ని వివరాలు చెప్తాను. ఆయనతో కలిసే యాత్రలన్నీ చేశాను. దేవుడు నాకంటూ ఓ గైడ్ పంపించాడనుకున్నాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపారు. మేమిద్దరం కలిసి ఓ బిడ్డను కనాలని కూడా ప్లానింగ్ చేసుకున్నాం. కానీ ఆయన దేని గురించైనా సంవత్సరాలతరబడి ఆలోచిస్తారు. అభ్యంతరం లేకపోతే.. మనిద్దరం బిడ్డను కని చనిపోయాక ఆస్తి గురించి ఆమెను ఏమైనా హింసిస్తారేమోనని భయపడేవారు. మా మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. శరత్‌బాబు భార్య రమాదేవి నాకు చాలా క్లోజ్. ఆమెను అక్కా అని, ఆయన్ను బావ అని పిలిచేదాన్ని. బావ.. బావ అంటూ నేను తనకు క్లోజ్ అయ్యాను. తన దగ్గర కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. నేను ఆడదాన్ని అన్న అభ్యంతరం లేకపోతే మీరు యాత్రలకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి అని చెప్పాను. అలా తనతో నా జర్నీ మొదలైంది. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుడు పట్టుకెళ్లిపోయాడు' అని చెప్పుకొచ్చింది జయలలిత. తప్పించుకోలేకపోయా.. ఇంకా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు ఎక్కువ వేయడంతో కొందరు ఆర్టిస్టులు వెంటపడేవారు.. కానీ ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని. కొన్ని తప్పించుకున్నాను. మరికొన్నిసార్లు తప్పించుకోలేక, తప్పనిసరై లొంగిపోయాను. నేను చెడిపోయినా పర్వాలేదు, నా ఇంట్లో వాళ్లు బాగుండాలి అనుకున్నాను. అందుకే అలా చేశాను. అలా అని ఎవరూ ప్రేమ చూపించేవారు కాదు. పైశాచికత్వంగా ప్రవర్తించేవారూ కాదు. వాళ్ల అవసరం తీర్చుకునేవారు' అని తెలిపింది జయలలిత. చదవండి: కల నెరవేర్చుకున్న మెగా హీరో.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవేనట! -
'నా ఫస్ట్ క్రష్ ఆ స్టార్ క్రికెటర్'.. మనసులో మాట చెప్పేసిన జయసుధ!
జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన బాల్యంలో చెన్నైలో చెపాక్ స్టేడియం(ఇప్పటి చిదంబరం స్టేడియం) దగ్గర్లోనే తమ నివాసముండేదని జయసుధ తెలిపింది. మా ఇంటికి.. గ్రౌండ్‌కు మధ్య ఒక రోడ్డు మాత్రమే ఉండేదని వివరించింది. అక్కడే ఉన్న హిందూ స్కూల్లో చాలామంది సినిమా, క్రికెట్ ప్రముఖులు కూడా చదువుకున్నారు. తనకు చిన్న వయసులో అక్కడే చాలా క్రికెట్ మ్యాచులు జరుగుతుండేవని పేర్కొంది. నేను చాలాసార్లు స్టేడియంలోకి వెళ్లి మ్యాచులు చూసేవాళ్లమని చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో తనకు ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే క్రష్ ఏర్పడిందని ఆమె తెలిపింది. అప్పట్లో అందరికంటే అతను హ్యాండ్సమ్గా ఉండేవారని జయసుధ తెలిపింది. అంతే కాకుండా ఆయనను చాలామంది ఇష్టపడేవారని వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో జయసుధ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. జయసుధ మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేను క్రికెటర్ అవ్వాలని అనుకున్నా. సెకండ్ ఆప్షన్ సినిమా. ఇక మూడోది టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని. కానీ ఈ క్యారెక్టర్ అన్ని సినిమాల్లో చేశాను. లక్కీగా 12 ఏళ్లకే మొదటి సినిమా చేశా. అప్పట్లో మంజుల గారు చాలా ఫేమస్. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆమె చేయలేని సినిమాలకు నన్ను పరిచయం చేసేవారు. అలా శోభన్ బాబుతో మొదటి సినిమా చేశా. నా అసలు పేరు సుజాత. అప్పటికే మలయాళంలో ఆ పేరుతో మరో హీరోయిన్ ఉండేది. గుహనాథన్ అనే ఒక తమిళ రైటర్ జయసుధ అనే పేరును సూచించారు. నాకు మొదటి నుంచి సినిమా చేసే లక్షణాలు లేవు. నాకు క్రికెట్ అంటే పిచ్చి. షూటింగ్లో ఉన్నప్పుడు కామెంటరీ వినేందుకు సిగ్నల్ కోసం అలా వెళ్లిపోయేదాన్ని. క్రికెట్లో నా ఫేవరేట్ సునీల్ గవాస్కర్, ఏక్నాథ్ సోల్కర్ అని ఒకాయన ఉండేవారు. సినిమాల వాళ్లకు క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో టీనేజర్‌గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ నా క్రష్. అతను చాలా హ్యాండ్సమ్గా ఉండేవారు. నేనే కాదు.. చాలామంది ఆయన్ను చూసేందుకే మ్యాచులకు వచ్చేవారు. ' అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది. -
'చాలా బాగుంది' హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా?
శ్వేత కొన్నూర్ మీనన్.. ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అనుకునేరు? హీరోయిన్ మాళవిక అసలు పేరిది! 19 ఏళ్ల వయసులోనే ఉన్నాయ్ తేడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్‌స్టర్ కొట్టింది. రోజావనం మూవీతో తన సత్తా నిరూపించుకుంది. ఇంకేముంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ రారమ్మని పిలిచింది. చాలా బాగుంది సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తం, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. రీఎంట్రీకి సిద్ధం తెలుగు, తమిళంతోపాటు మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు కూడా చేసింది. 2009లో చివరగా ఆరుపాడై సినిమా చేసింది. అందులో అతిథి పాత్రలో కనిపించింది. 2007లో సుమేష్ మీనన్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయింది. చాలాకాలానికి గోల్మాల్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. 44 ఏళ్ల వయసులోనూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటోందీ బ్యూటీ. మరింత బలంగా మార్చుతుంది తాజాగా తన సోషల్ మీడియాలో యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ జర్నీ అంత సులువేం కాదు.. కానీ యోగా పట్ల నీకు ఎంత నిబద్ధత ఉందనేది తెలుస్తుంది. రోజూ యోగా మ్యాట్ నేలపై పరచడమనేది మొక్కకు నీళ్లు పోయడంలాంటిది. ఇది మిమ్మల్ని మరింత బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుతుంది. కఠినతరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కసారి యోగా చేసి గాఢంగా శ్వాస తీసుకుంటే అది మీ పురోగతికి ఉయోగపడుతుంది. నన్ను నమ్మండి.. ఒక్కసారి కమిట్ అయ్యాక దాన్ని వదిలేయకూడదు.. కట్టుబడి ఉండాలి. ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడు వచ్చే సానుకూల మార్పులను మీరే చూస్తారు. నన్ను నమ్మండి.. ఇదే నిజం అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. కాగా మాళవిక.. తరచూ తన వర్కవుట్, యోగా వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ఆ సినిమాలో నేనూ హీరోయిన్నే.. కానీ నన్ను తీసేశారు! -
ఎన్టీఆర్‌ని వెండితెరకు తెచ్చిన 'కృష్ణవేణి' ఎవరో తెలుసా..?
మణిలాంటి నటి... మణిలాంటి గాయని... మణిలాంటి నిర్మాత... కృష్ణవేణి చిత్రసీమకు ఒక అమ్యూలమైన మణి. మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబర్చారు. మంచి గాయనీమణిగా తన గాత్రాన్ని వినిపించారు. ‘మన దేశం’ వంటి చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. నేడు నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు సి. కృష్ణవేణి. ఈ సందర్భంగా కృష్ణ‘మణి’ జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న జన్మించారు కృష్ణవేణి. తండ్రి యర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి. ఆ తర్వాత వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్లినప్పుడు ఆయన ‘తులాభారం’ నాటకం చూశారు. అందులో కృష్ణవేణి నటన నచ్చి, సినిమాలో నటించమని అడి గారు. అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1973) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. నటిగా ఆమెకు ‘గొల్లభామ, లక్ష్మమ్మ’ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. ‘కచదేవయాని, గొల్లభామ, అనసూయ’ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి. ‘తిరుగుబాటు’ సినిమాలో ఆమె చేసిన వ్యాంప్ క్యారెక్టర్‌పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనూరాధ జన్మించడం.. భర్త రాజా సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి. కుమార్తె పేరుపై ‘ఎంఆర్ఏ’ప్రోడక్షన్ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘మన దేశం’ (1949) సినిమా తీసి, విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవేణి. కాగా ‘వరూధుని’ సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావుని పిలిపించి, ‘మన దేశం’లో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గానూ తన ప్రత్యేకత చాటుకున్నారామె. ‘ధర్మాంగద’కి రూ. నలభై ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన ‘గుడ్ ఈవెనింగ్, లేడీ డాక్టర్’ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, ‘కుమ్మరి మొల్ల’ వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు కృష్ణవేణి. ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సావాసం’ (1952). మహారాష్ట్ర గవర్నర్‌గా చేసిన కోన ప్రభాకరరావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి నిర్మించిన చిత్రాల్లో ‘భక్త ప్రహ్లాద’ (1942) ఒకటి. నిర్మాతగా 1957లో విడుదలైన ‘దాంపత్యం’ కృష్ణవేణి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. గత ఏడాది ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు కృష్ణవేణి. తల్లి బాటలో కుమార్తె కృష్ణవేణి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధా దేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి, లక్ష్మి ఫిలింస్ కంబైన్స్‌పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం ‘భక్త కుంబారా’ (1974)ని నిర్మించారు. ఇందులో రాజ్‌కుమార్ హీరో. తెలుగులో అనురాధ నిర్మించిన తొలి చిత్రం ‘చక్రధారి’ (1977). అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ. ఆమె నిర్మించిన చివరి చిత్రం ‘మా పెళ్లికి రండి’ (2000). జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధా దేవి 2001లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. - అనురాధా దేవి -
భర్తతో విడాకులు, గుక్కపెట్టి ఏడ్చిన హీరోయిన్.. భరణం అడగమంటే..
సులక్షణ.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె ఒకానొక సమయంలో దక్షిణాదిన టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. తర్వాత అమ్మ పాత్రలు సైతం చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అయితే చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం, ముగ్గురు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోవడంతో తన జీవితం అస్తవ్యస్తమైపోయింది. వ్యక్తిగత సమస్యలు కెరీర్‌ను దెబ్బ తీశాయి. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరమైంది. కానీ బతుకుబండిని నడిపించడం కోసం తిరిగి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది, కానీ పూర్వ వైభవం అందుకోలేకపోయింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తున్న ఆమె తాజాగా తన జీవితంలోని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. 18 ఏళ్లకే పెళ్లి.. 23 ఏళ్లకే విడాకులు సులక్షణ మాట్లాడుతూ.. '18 ఏళ్ల వయసులోనే నా పెళ్లి జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎస్ విశ్వనాథన్ తనయుడు గోపికృష్ణన్ను పెళ్లి చేసుకున్నాను. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. ఏ బంధమైనా సరే ఎప్పుడూ గొడవపడుతూ కలిసి ఉండేకన్నా విడిపోవడమే మంచిది. కలిసి కొట్టుకోవడం కన్నా విడిపోయి స్నేహితులుగా ఉండటం చాలా బెటర్. కానీ విడాకులు తీసుకోవాలంటే ఆ బాధను తట్టుకోగలగాలి. దీనివల్ల పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. 23 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. పిల్లల కోసమే బతికాను. భరణం ఆశించలేదు.. విడిపోదామనుకున్నప్పుడు మరీ అంత బాధపడలేదు. కానీ కోర్టులో విడాకులు మంజూరు చేసినప్పుడు గుక్క పెట్టి ఏడ్చేశాను. ఎందుకంటే ఆరోజు సర్వస్వం కోల్పోయినట్లనిపించింది. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డాను. విడాకుల తర్వాత ముగ్గురి పిల్లల బాధ్యత నేనే చూసుకున్నాను. మాజీ భర్త నుంచి ఎటువంటి భరణం ఆశించలేదు. అందుకు నేను గర్వపడుతున్నాను. అయితే మా లాయర్ భరణం అడగమని, పిల్లల గురించి ఆలోచించైనా డబ్బులు డిమాండ్ చేయమని చెప్పాడు. కానీ నాకు కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి కదా.. నేను బతకగలను.. ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. అతడి దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా నాకు వద్దని చెప్పేశాను. పిల్లల కోసం సినిమాల్లో బిజీ అయ్యా.. మొదట్లో పిల్లలను చూసుకోవడానికి ఏడేళ్లపాటు సినిమాలకు దూరమయ్యాను. కానీ అది కరెక్ట్ కాదనిపించింది. బ్యాంకులో ఉన్నదంతా తింటూ పోతే చివరకు ఏమీ మిగలదని తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాను. పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించాలని కష్టపడ్డాను. నాన్న ఉంటే మాకోసం అది చేసేవాడు, ఇది చేసేవాడు అన్న ఆలోచన వారికి ఏనాడూ రానివ్వలేదు. సినిమాలతో బిజీ అయ్యాను. కథ కూడా వినకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను' అని చెప్పుకొచ్చింది. అవకాశాల్లేక వెండితెరకు దూరం సులక్షణ ఆంధప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జన్మించింది. రెండున్నరేళ్ల వయసులో 'కావ్య తలైవి' సినిమాలో చిన్నారి కృష్ణ/డాలీగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన ఆమె చంద్రమోహన్ 'శుభోదయం' సినిమాతో హీరోయిన్గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 450 సినిమాలు చేసింది. ప్రేమ నక్షత్రం, మా ఇంటాయన కథ, మా ఇంటి ప్రేమాయణం, అల్లుళ్లు వస్తున్నారు, డబ్బెవరికి చేదు వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన చివరి చిత్రం గజినీకాంత్ (2018). సులక్షణ ప్రస్తుతం తమిళ, మలయాళంలో సీరియల్స్ చేస్తోంది. చదవండి: కేఎల్ రాహుల్‌పై ట్రోలింగ్.. 100 రెట్లు ఎక్కువ బాధపడతా.. కానీ తను. -
విదేశీ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటి.. పోస్ట్ వైరల్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి రాధిక శరత్ కుమార్. డేరింగ్ అండ్ డాషింగ్ నటిగా 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కే పోగుమ్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం తర్వాత నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. (ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!) తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో ప్రముఖ హీరోల సరసన కథానాయకిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వివిధ రకాల పాత్రలో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా 2001 వివాహం చేసుకున్నారు. అలా తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూసిన రాధిక శరత్ కుమార్ నిర్మాతగాను కొన్ని చిత్రాలు చేశారు. అదే విధంగా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా స్వదేశీ భాషలను అధిగమించి ఫ్రెంచ్ చిత్రంలో నటించడం విశేషం. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఆ చిత్రంలో నటించడానికి ఫ్రాన్స్ దేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్ర షూటింగ్లో తన ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందులో తాను ఫ్రెంచ్ చిత్రంలో నటించడానికి ప్రోత్సహించిన తన భర్త శరత్ కుమార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
మరింత దయనీయంగా పావలా శ్యామల పరిస్థితి.. ఏదో ఓరోజు..
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఎందరో తారలు చివరి దశలో మాత్రం కష్టాల కడలిలో మునిగిపోయారు. ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి కూడా అంతే! వెండితెరపై నవ్వుల వాన కురిపించిన ఆ నటి ఇప్పుడు నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయింది. తనను కాపాడండి అంటూ ఆ కళామాతల్లి ముద్దుబిడ్డ చేతులెత్తి అర్థిస్తోంది. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల జీవిత కథ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఆర్థిక భారం, వయోభారం.. పావలా శ్యామల... అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. ఒకవైపు ఆర్ధిక భారం.. మరో వైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి.. అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం ఆమెకు మనోవేదనను కలిగిస్తోంది. గతంలో ఆమెకు కొంత మంది నుంచి సాయం అందినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించాయి. అవార్డులను అమ్మేసుకుంది తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్న రోజులున్నాయని ఆమె తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వచ్చిందని చెప్పింది. అలాంటిది ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని బాధపడింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని కంటతడి పెట్టుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదని చెప్తుందంటే ఆమె పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినీ కెరీర్.. పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ సహా సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించింది. అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్న ఆమె నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదిగూడలోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి నెలవారీ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతోంది. ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. దినదిన గండంగా బతుకీడుస్తూ, ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న నటి పావలా శ్యామలకు సహాయం చేయాలనుకునేవారు కింద ఇస్తున్న బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపించవచ్చు. Neti Shyamala, A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager, Yusuf guda Branch, Hyderabad , Cell : 9849175713. చదవండి: ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే.. : రేణు దేశాయ్ -
కూతురి వయసున్న వాళ్లతో హీరోలు రొమాన్స్? సిగ్గనిపించట్లేదా?: నటి
సినీ పరిశ్రమలో హీరోయిన్లకు, కమెడియన్లకు, ఇతరత్రా సెలబ్రిటీలకు వయసైపోతుందేమో కానీ హీరోలకు మాత్రం కాదు! ఒక్కసారి హీరోగా పేరు తెచ్చుకున్నారంటే ఏళ్లకు ఏళ్లు హీరోగానే స్థిరపడిపోతారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని వుడ్స్‌లోనూ ఇదే పరిస్థితి! వాళ్లు హీరోగా నటిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేయడం సరే కానీ తమ కూతురి వయసున్న నటీమణులతో రొమాన్స్ చేయడమే చాలామందికి మింగుడుపడటం లేదు. కానీ దర్శకనిర్మాతలు, హీరోలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడింది సీనియర్ నటి రత్న పాఠక్ షా. 'దీని గురించి ఏమని మాట్లాడాలో కూడా తెలియడం లేదు. కూతురి వయసున్న హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడానికి వారికి ఏమాత్రం సిగ్గుగా అనిపించడం లేదు.. అలాంటప్పుడు నేనేం మాట్లాడగలను? నేను చెప్పడానికి ఏం లేదు. దీని గురించి మాట్లాడటం నాకే సిగ్గుగా ఉంది. కానీ కచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. ఆడవాళ్లు నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వాళ్లు సినీ ఇండస్ట్రీలోనూ కచ్చితంగా అద్భుతాలు చేయగలరు. దీనికి కొంత సమయం పడుతుందేమో కానీ తప్పకుండా జరిగి తీరుతుంది' అని చెప్పుకొచ్చింది. కాగా రత్న పాఠక్ షా.. లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, ఖుబ్సూరత్, కపూర్ అండ్ సన్స్ వంటి హిట్ చిత్రాల్లో నటనతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన ధక్ ధక్ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. చదవండి: ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్‌కు కూడా రెడీ అంటూ.. -
మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !
ఒకప్పుడు తన సినిమాలతో అభిమానులను అలరించిన నటి కనకలత. ఆమె సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ తనదైన నటనతో మెప్పించింది. మలయాళ చిత్రాలైన ప్రియం, అధ్యతే కన్మణి చిత్రాలతో ఆమెకు గుర్తింపు లభించింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మలయాళం, తమిళంలో ఇండస్ట్రీలో కొనసాగారు. (ఇది చదవండి: యాత్ర 2.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!) అయితే ప్రస్తుతం కనకలత పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆమెకు అల్జీమర్స్‌తో పాటు పార్కిన్సన్స్ వ్యాధి సోకింది. తాజాగా కనకలత అనారోగ్యం గురించి ఆమె సోదరి విజయమ్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆహారం తీసుకునే పరిస్థితిలోనే లేరని సోదరి చెబుతోంది. కేవలం లిక్విడ్ ఫుడ్తోనే కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపింది. ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతోందని.. డైపర్లు ఉపయోగించాల్సి వస్తోందని వివరించింది. తన పేరు కూడా గుర్తు లేదని ఆమె సోదరి వాపోయింది. ప్రస్తుతం విజయమ్మ, ఆమె మేనల్లుడు కనకలత వద్దే ఉంటున్నారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న నటి 16 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు. (ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ప్రస్తుతం ఆమెకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి నెలకు రూ. 5000 అందుతోంది. ఆమెకు సంస్థ బీమా కూడా ఉంది. ఆమె అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ (ATMA), ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందుకుంటోంది. కనకలత తన కెరీర్లో 360కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె చివరిసారిగా పూక్కలం అనే చిత్రంలో కనిపించింది. నాటకాల ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది -
సిక్కిం వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ నటి..!
ఇటీవల సిక్కింలో అనూహ్యంగా సంభవించిన వరదల్లో అలనాటి నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ఆచూకీని కనిపెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దాన వీర శూరకర్ణ, ఆ తర్వాత సంఘర్షణ లాంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఆమె నివాసముంటున్నారు. ఈ నెల అక్టోబరు 2న ఆమె తన మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న కుమార్తె నబితకు కూడా ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిక్కింలో ఆకస్మాత్తుగా వచ్చిన వరదల తర్వాత సరళ కుమారి ఆచూకీ గల్లంతవ్వడంతో ఆమె కుమార్తె నబిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు 3న చివరిసారిగా నేను అమ్మతో మాట్లాడినట్లు నబిత తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదని.. వార్తల్లో వరదల గురించి తెలుసుకున్నా.. ఆర్మీ నంబర్లకు ప్రయత్నించినా అవీ కూడా పనిచేయడం లేదు. దయచేసి మా అమ్మను కనిపెట్టండి అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సైతం గల్లంతయ్యారు. (ఇది చదవండి: మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!) -
ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ
సినిమా ఇండస్ట్రీ పైకి చూడటానికి కలర్‌ఫుల్. కానీ లోపల చాలా జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఛాన్సుల కోసం ప్రయత్నించే లేడీ యాక్టర్స్.. చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సంఘటన తన విషయంలోనూ జరిగిందని సీనియర్ నటి ప్రమీలా రాణి చెప్పుకొచ్చింది. ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె ఇంకా ఏమేం చెప్పింది? ఎవరీ నటి? కృష్ణా జిల్లాలో పుట్టిన ఈమె పేరు ప్రమీలా రాణి. దాదాపు 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. అప్పట్లో సహాయ పాత్రలు చేసిది. ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు బామ్మగా నటిస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన చిత్రాల్లో విక్రమార్కుడు, వేదం, బాహుబలి ఉన్నాయి. అయితే తనకు అప్పట్లోనే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైనట్లు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!) ఏం జరిగింది? చిన్న వయసులోనే ఈమెకు పెళ్లి చేశారు. అయితే పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో భర్త వదిలేసి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత రెండో పెళ్లి చేశారు. ఈమెకు 23 ఏళ్ల వయసులో అతడు చనిపోయాడు. దీంతో ఒంటరి అయిపోయింది. ఆ సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ ఓ సినిమా విషయంలో మాత్రం తనకు అవకాశం ఇచ్చి, గెస్ట్ హౌస్‌కి పిలిచారని ప్రమీలా రాణి చెప్పింది. యాక్టింగ్, షూటింగ్ అంటే వస్తానని.. ఇలాంటి వాటికి అస్సలు రానని ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆ సినిమా ఛాన్స్ పోయింది. ఇది తప్పితే తనకు ఇండస్ట్రీలో మరెలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వాలనేది చెప్పింది. ప్రస్తుతం ఈమె వయసు 85 ఏళ్లు. ఇప్పటికీ చురుగ్గా ఉంటూ, సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!) -
స్టార్ హీరోయిన్ రవళి కెరీర్ ముగిసిపోవడానికి కారణమిదే!
సినిమాల్లో కనిపిస్తే చాలనుకునేవారు కొందరైతే సినిమా ఇండస్ట్రీనే ఏలేయాలనుకునేవాళ్లు మరికొందరు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది సినీనటి విజయదుర్గ. 1987లో తన ముగ్గురు పిల్లల్ని చేతపట్టుకుని చెన్నపట్నం(ప్రస్తుత చెన్నై) వెళ్లింది. కష్టాలను లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఛాన్సులు చేజిక్కించుకుంది, విజయాలను అందుకుంది. ఆమె ఇద్దరు కూతుర్లు రవళి, హరితలు కూడా నటనారంగంలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. మా అసలు పేర్లు ఇవీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు కనకదుర్గ. మాది గుడివాడ. చెన్నైలో ఓసారి దసరా నవరాత్రులకు వెళ్లాను. అక్కడి వాతావరణం నచ్చడంతో పిల్లలను తీసుకుని చెన్నై షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించాను. అక్కడికి వెళ్లిన నాలుగు నెలలకే.. రఘువరన్ హీరోగా ఎస్పీ ముత్తరామన్ డైరెక్ట్ చేసిన ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే కనకదుర్గ పేరిట ఓ నటి ఉండటంతో నా పేరును విజయదుర్గగా మార్చారు. నటి హరిత దంపతులు పెళ్లి సందడితో ఫుల్ క్రేజ్ తమిళంలో 15, తెలుగులోనూ దాదాపు 15 చిత్రాలు చేశాను. నా కూతురు హరిత(అసలు పేరు శాంతి) మొదట హీరోయిన్గా చేసింది. పొట్టిగా ఉందంటూ తనకు సిస్టర్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం తను బుల్లితెరపై రాణిస్తోంది. ఆ తర్వాత నా కొడుకు విజయ్ (అసలు పేరు శేషు) హీరోగా ఓ సినిమా చేశాడు, కానీ అది విడుదల చేయలేదు. పెళ్లి సందడి సినిమాకు నా కూతురు రవళి(అసలు పేరు శైలజ)కి రూ.50 వేలు ఇచ్చారు. తర్వాత మాత్రం లక్షల్లో అందుకుంది. ఆ ప్రచారం వల్లే కెరీర్ నాశనం తన కెరీర్ ఊపులో ఉన్న సమయంలో రవళి లావైపోయిందని వార్తలు రాశారు. ఆ ప్రచారం వల్ల తన కెరీర్ నాశనమైంది. చెప్పుకోదగ్గ పాత్రలు, సినిమాలు రాలేదు. పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకుంది. ఆ సమయంలో చిరంజీవి స్టాలిన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని చిత్రాలు చేసి 2011లో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. త్వరలోనే తను రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నా ఆస్తి అంతా ముగ్గురికీ సమానంగా పంచాను. నా దగ్గర సెంటు భూమి కూడా పెట్టుకోలేదు. ఉన్నదంతా ఇచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా! -
రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి
సీనియర్ నటి జయలలిత గురించి తెలియనివారి ఉండరు. అప్పట్లోనే తెలుగులో అనేక సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. వెండితెరపై నెగిటివ్, కమెడియన్, గ్లామర్ రోల్స్‌తో మెప్పించారు. మలయాళ చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయలలిత.. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలు చేసింది. ఆమె కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత మామ అల్లుడు, లారీ డ్రైవర్, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, జంబలకిడి పంబా, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి, హంగామా, గోపీ గోపిక గోదావరి, గ్రహణం, భరత్ అనే నేను లాంటి సహాయక పాత్రల్లో నటించారు. అలాగే వ్యాంప్ పాత్రలతో ఆమె ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నారు. బుల్లితెరపైనే కాన్సంట్రేట్ చేసిన ఆమె బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు. సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసిన జయలలిత స్టార్ నటిగా ఎదిగారు. ఇక ఆర్థికంగానూ సెటిలైన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడితో ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆమె ఇంట్లో వాళ్లని ఎదిరించి ఆయనతో ఏడడుగులు వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయలలిత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం!) జయలలిత మాట్లాడుతూ.. 'నేను అత్యధికంగా లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా. ఇంద్రుడు చంద్రుడు సినిమాకు రామానాయుడు ఇచ్చారు. అంత మంచి క్యారెక్టర్ ఏ సినిమాలోనూ రాలేదు. నా రెమ్యునరేషన్ గురించి అంతా మా నాన్నే. డేట్స్ కూడా చూసుకునేవారు. బాలయ్య, చిరంజీవితో సినిమాలు చేశా. బాలయ్య చాలా సరదాగా మాట్లాడేవారు. చిరంజీవి కూడా ఎప్పుడు కనిపించినా అప్యాయంగా పలకరించేవారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉంటాయి. నాకు సెట్లో టైంకు భోజనం పెట్టకపోతే నిర్మాతకు శాపం పెడతా.' అంటూ చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ అసభ్యంగా.. అసిస్టెంట్ డైరెక్టర్ తీరు గురించి మాట్లాడుతూ..' ఓ మలయాళం మూవీ చేసేటప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు మలయాళం భాష రాదు. అప్పుడు మలయాళంలో సినిమా చేసేందుకు ఫస్ట్ టైమ్ వెళ్లా. అందులో రేప్ సీన్ గురించి చెప్పాలని గదిలోకి రమ్మన్నారు. లోపలికి వెళ్లాకా అసిస్టెంట్ డైరెక్టర్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కానీ ఆ తర్వాత అతను ఆరు నెలల్లోనే చనిపోయాడు. అతనెలా చచ్చాడో కూడా నాకు తెలియదు.' నటి జయలలిత చెప్పుకొచ్చారు. అంతే కాకుండా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నట్లు జయలలిత తెలిపారు. వ్యాంప్ పాత్రల వల్లే కారణంగానే ఆ ఛాన్స్ పోయిందన్నారు. అంతేకాకుండా కళాతపస్వి కే. విశ్వనాథ్ బంధువుతో పెళ్లి సంబంధం కూడా పోయిందని.. కుటుంబం కోసమే వద్దకు వచ్చిన పాత్రలన్నీ చేసినట్లుగా జయలలిత వెల్లడించారు. (ఇది చదవండి: అపాయింట్మెంట్ అడిగితే షాకయ్యారు.. విశాల్ కామెంట్స్ వైరల్!) -
6గురు హీరోలతో స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్.. చివరకు ముగ్గురు పిల్లల తండ్రితో..
వైజయంతిమాల.. కలువపువ్వులాంటి కళ్లు.. చంద్రబింబం లాంటి ముఖము.. తేనెలొలికే పెదాలు.. ఆమె ముఖారవిందాన్ని ఏమని వర్ణించగలం. తను నడిస్తే నాట్యం చేసినట్లే ఉంటుంది. అందం, అభినయం, నాట్యం.. అన్నింటినీ ఒకే మనిషిలో గుమ్మరించినట్లుగా ఉంటుంది. ఆమె గురించే ఈ ప్రత్యేక కథనం.. 13 ఏళ్లకే నటిగా.. తినే మెతుకు మీద మన పేరు రాసి ఉన్నట్లే ఎవరు ఏం చేయాలని కూడా ముందే రాసి ఉంటుందేమో! తమిళనాడులో నటి వసుంధర దేవి కడుపున జన్మించింది వైజయంతిమాల. తల్లి పోలికలతో పాటు నటనైపుణ్యాన్ని పుట్టుకతోనే సంపాదించింది. ఐదేళ్లకే క్లాసికల్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. 13 ఏళ్లకే నటిగా మరింది వైజయంతి. అయితే తల్లి అండ మాత్రం ఆమెకు దక్కలేదు, కానీ అమ్మమ్మే అమ్మగా మారి తన ఆలనా పాలనా, బాధ్యతలు చూసుకుంది. తొలి సినిమా.. 1949లో తమిళంలో 'వాస్‌కాయ్' సినిమా చేయగా అది తెలుగులో 'జీవితం' అనే టైటిల్‌తో విడుదలైంది. తమిళ అమ్మాయి అయిన వైజయంతి.. తండ్రి సాయంతో తన తొలి చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తన నటన కన్నా తను వేసే స్టెప్పులకే ఎక్కువమంది ఫిదా అయ్యారు. హిందీ కూడా నేర్చుకుని అక్కడ చేసే సినిమాలకు సైతం తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్లో బడా స్టార్స్‌తో కలిసి నటించింది వైజయంతిమాల. అందరూ నో చెప్పిన పాత్రకు ఎస్ చెప్పిన హీరోయిన్ కొన్ని సినిమాలు ఆడకపోయినా ఆమె డ్యాన్స్ మాత్రం జనాలు అంత ఈజీగా మర్చిపోయేవాళ్లు కాదు. 1955లో దేవదాసు సినిమాలో చంద్రముఖి పాత్రకు నర్గీస్, బీనా రాయ్, సూర్య అందరూ నో చెప్పారు. కానీ వైజయంతిమాల ఏమాత్రం ఆలోచించకుండా నటించింది. ఈ మూవీలో వైజయంతి నటనకుగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డు ప్రకటించారు. అయితే తాను హీరోయిన్‌తో సమానమైన పాత్ర చేశానని, అలాంటప్పుడు అది సహాయ పాత్ర ఎందుకవుతుందని అవార్డును తిరస్కరించింది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ రెండు దశాబ్దాలపాటు నటిగా రాణించి భారతీయ సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా, ప్లేబ్యాక్ సింగర్‌గానూ మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టిందీ హీరోయిన్. ఆ సమయంలో తన గురించి ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. చాలామంది హీరోలతో ఎఫైర్ నడిపిందని టాక్ నడిచింది. ఏ చీర కట్టుకోవాలో కూడా ఆ హీరోనే డిసైడ్ చేసేవారట ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్.. మధుబాలకు బ్రేకప్ చెప్పిన తర్వాత వైజయంతిమాలను ప్రేమించాడని ప్రచారం జరిగింది. తన సినిమాలో ఏ చీర కట్టుకోవాలనేది కూడా దిలీపే నిర్ణయించేవారని టాక్ నడిచింది. తర్వాత షోమాన్ రాజ్ కపూర్‌తో ఆమెను లింక్ చేశారు. నజరాణా సినిమాలో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అప్పట్లో బీటౌన్ కోడై కూసింది. వీళ్లు సహజీవనం చేశారని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన రాజ్ కపూర్ భార్య.. బెదిరింపులకు దిగడంతో ఇకమీదట వైజయంతిమాలను కలడం, ఆమెతో పని చేయడం మానేస్తానని వాగ్ధానం చేశాడట. ఆ సమయంలో వైజయంతి అబార్షన్ చేయించుకుందని ఓ పుకారు. వైజయంతిపై మనసు పారేసుకున్న డాక్టర్ సౌత్‌లో జెమిని గణేశన్, శివాజీ గణేశన్, ఎంజీఆర్, రాజేంద్ర కుమార్‌తోనూ ప్రేమాయణం నడిపిందని ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడైతే డాక్టర్ చమన్‌లాల్ బాలి తన జీవితంలో అడుగుపెట్టాడో అప్పుడే ఈ ప్రచారాల పరంపరకు ఫుల్స్టాప్ పడింది. డాక్టర్ బాలికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన తరచూ వైజయంతి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు వైజయంతి అమ్మమ్మ అతడి తీరు గమనించి.. ముగ్గురు పిల్లల తండ్రివి, నా మనవరాలిని ఏం చేద్దామనుకుంటున్నావు? అని కోప్పడింది. అంత పెద్దాయనను గుమ్మంలో నిలబెట్టి కోప్పడతావేంటని వైజయంతి ఎదురుతిరగడంతో ఆమె మద్రాసు వెళ్లిపోయింది. విడాకులతో లైన్ క్లియర్ 1966లో బాలి, తన భార్య రూబితో విడిపోయారు. అప్పటి నుంచి వైజయంతి, బాలి కలిసి నివసించడం మొదలుపెట్టారు. కానీ తను డ్రగ్స్ తీసుకుంటోందని రూమర్స్ మొదలయ్యాయి. దీంతో మానసిక ఒత్తిడికి లోనైంది వైజయంతి. ఇంతలో 1967లో బాలికి విడాకులు మంజూరవడంతో వైజయంతికి లైన్ క్లియర్ అయింది. 1968 మార్చి 10న మద్రాసులో వైజయంతి- బాలి పెళ్లి చేసుకున్నారు. వీరికి సుచేంద్ర అని ఒక బాబు పుట్టాడు. కొడుకు పుట్టాక డాక్టర్ వృత్తి మానేసిన బాలి.. కుమారుడి పేరిట సుచీ సీ ఫుడ్స్ అనే వ్యాపారం మొదలుపెట్టి కోట్లు సంపాదించాడు. కానీ తర్వాతి కాలంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఆరోగ్యం విషమించి.. అమెరికాలో బైపాస్ సర్జరీ చేయించుకున్న మూడేళ్ల తర్వాత ఆరోగ్యం మరింత దెబ్బతింది. 1986లో ఒకరోజు బాత్రూమ్లో తల గోడకు తగిలింది. కొన్నాళ్లకు తల బొప్పి కట్టి మెదడులో రక్తం గడ్డకట్టడంతో స్పృహ తప్పి పడిపోయారు. ఆపరేషన్ చేసినప్పటికీ మళ్లీ అదే ప్రాంతంలో పుండు ఏర్పడంతో మరోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పటికే కోమాలో ఉన్న బాలి 1986 ఏప్రిల్ 21న కన్నుమూశాడు. వైజయంతి ప్రస్తుతం తన కొడుకుతో కలిసి నివసిస్తోంది. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్, షాక్‌లో ఫ్యాన్స్.. అనారోగ్య సమస్యలే కారణమా? త్వరలోనే అమీర్ ఖాన్ కూతురు పెళ్లి.. వేదిక ఎక్కడంటే! -
కారు డ్రైవర్‌ను నమ్మి ఆస్తినంతా పోగొట్టుకున్నా: ఏడ్చేసిన జయలలిత
రంగుల ప్రపంచంలో నటిగా రాణించిన జయలలిత నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ మనసిచ్చినవాడితో ఏడడుగులు వేసింది. కానీ పెళ్లి తర్వాత ప్రియుడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే ప్రేమను నటించాడని అర్థం అయింది. గృహ హింస తట్టుకోలేక విడాకులు తీసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. కుటుంబమంతా నాపై ఆధారపడటంతో.. 'నేను క్లాసికల్ డ్యాన్సర్‌ను. నేను పదో తరగతి రెండుసార్లు ఫెయిలయ్యాను. మయూరి, సప్తపది సినిమా ఛాన్సులు చేతిదాకా వచ్చినట్లే వచ్చి వెనక్కు వెళ్లిపోయాయి. తర్వాత ఎందుకోగానీ అన్నీ వ్యాంప్ క్యారెక్టర్లే వచ్చాయి. అలా ఐటం సాంగ్స్ చేశాను, పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని నటించాను. నా కుటుంబం నా మీద ఆధారపడి ఉండటంతో వచ్చిన ఆఫర్నల్లా ఒప్పుకుంటూ పోయాను. కానీ ఇలా ఐటం సాంగ్స్ చేయడం వల్ల క్లాసికల్ డ్యాన్స్‌కు దూరమయ్యాను. ఇంటిపై దాడి అయితే జయలలిత అనే పేరు నాకు తమిళనాడులో మైనస్ అయింది. జయలలిత అమ్మ పేరు పెట్టుకుని కమెడియన్‌గా చేస్తున్నావ్, ఐటం సాంగ్స్ చేస్తున్నావ్.. పేరు మార్చుకో అని ఆ పార్టీవాళ్లు మా ఇంటి మీద రాళ్లు రువ్వి దాడి చేశారు. నేను పేరు మార్చుకోననేసరికి అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ ఎలా మొదలైందంటే.. డేట్స్ విషయంలో పెద్ద గొడవ జరిగితే అతడు ముందుండి సమస్యను పరిష్కరించాడు. పెళ్లయిన తెల్లారినుంచే ఆస్తి కోసం గొడవ ఆ చిన్నదానికే లవ్‌లో పడిపోయాను. అతడి కోసం ఎన్ని సినిమాలు మానుకున్నానో! పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు.. తొందరపడుతున్నావని హెచ్చరించడంతో ఆలోచనలో పడ్డాను. కానీ అప్పటికే అతడు రక్తంతో లెటర్స్ రాయడం, విషం తాగి చస్తానని బెదిరించడంతో భయంతో గుడిలో పెళ్లి చేసుకున్నాను.పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఆస్తి కోసం పోరు మొదలుపెట్టాడు. లేదంటే పిల్లల్ని కనమని వేధించాడు. పక్షవాతం.. నేనే డబ్బులు పంపించా ఇంట్లో తెలియకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి పిల్లలు పుట్టకుండా మూడు నెలలపాటు టాబ్లెట్స్ వేసుకున్నాను. డబ్బు తీసుకురా లేదంటే యాసిడ్ పోస్తానని అత్తింటివారు బెదిరించారు. రూ.50 లక్షలు, నా బంగారు నగలు సహా ఉన్నదంతా ఊడ్చేశారు. 6 నెలలకే మేము విడిపోయాం. ఇటీవలే రోడ్డుప్రమాదంలో గాయపడగా కాలికి పక్షవాతం వచ్చింది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అతబి భార్య సరిగా చూసుకోకపోవడంతో మందుల కోసం నెలకు రూ.5 వేలు పంపించాను. అమ్మా అమ్మా అంటూ రూ.4 కోట్లు కాజేశాడు ఈ మధ్య నేను సంపాదించిన రూ.4 కోట్లు పోగొట్టుకున్నాను. అనిల్ గణపతి రాజు.. రాఘవేంద్రరావు దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. రాఘవేంద్రరావుకు సంబంధించిన సీరియల్ చేసేటప్పుడు అనిలే ఇంటికి వచ్చి కారులో పిక్ చేసుకుని వెళ్లేవాడు. తర్వాత అతడు కుందనపు బొమ్మ అని సినిమా కూడా చేశాడు. అయితే సినిమా ఫ్లాప్ అవడంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే తన సీరియల్ కోసం కూడా నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. అమ్మా అమ్మా.. అని అడుక్కోవడంతో ఉన్నదంతా ఇచ్చేశాను. అయితే డబ్బులు బాగున్నాయని విసిరేస్తోందని నా వెనకాల తిట్టేవాడు. ఇలా ఉన్నదంతా పోయి ఇబ్బందులు పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ సపోర్ట్ చేయలేదు' అని చెప్తూ ఎమోషనలైంది జయలలిత. చదవండి: పెద్ద పెద్ద స్టార్స్‌తో నటించింది.. 35 ఏళ్లకే కెరీర్ ముగించింది! -
చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి
చెన్నై: సీనియర్ నటి గౌతమి పోలీసులను ఆశ్రయించింది. రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని.. అదేంటని ప్రశ్నించినందుకు తనను, తన కూతురిని చంపుతామని బెదిరిస్తున్నారంటూ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. గౌతమికి శ్రీపెరుంబూర్ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రూ.46 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. తన అనారోగ్యం కారణంగా కొన్ని ఆస్తులు అమ్మేయాలనుకుంది. ఈ పనిని అలగప్పన్ అనే ఏజెంట్‌కు అప్పజెప్పింది. కానీ ఆ ఆస్తిపై కన్నేసిన అలగప్పన్ ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాల సాయంతో దాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇదేంటని గౌతమి ప్రశ్నించగా.. రాజకీయ అండతో నటిని, ఆమె కూతురిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమస్యల వల్ల తన కూతురి చదువు కూడా డిస్టర్బ్ అవుతోందని ఫిర్యాదులో పేర్కొంది గౌతమంది. తన నుంచి కొట్టేసిన రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి తనకు అప్పజెప్పాలని అభ్యర్థించింది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న అళగప్పన్‌పై చర్యలు చేపట్టాలని కోరింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గౌతమి ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను పెళ్లి చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి సుబ్బలక్ష్మి.. గౌతమి వద్దే ఉంటోంది. కాగా కొన్నేళ్లపాటు కమల్ హాసన్‌తోనూ కలిసి ఉన్న ఆమె 2016లో అతడితో విడిపోయింది. చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన యంగ్ హీరో.. ఫోటోలు వైరల్ -
మొదటి భర్తతో అందుకే విడిపోయా.. ఒంటరితనంతో డిప్రెషన్లో..
అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది. ఊర్వశి పర్సనల్ లైఫ్ ఊర్వశి 2000 సంవత్సరంలో నటుడు మనోజ్ కె.జయన్‌ను పెళ్లాడింది. వీరికి తేజ లక్ష్మి అనే కూతురు పుట్టింది. అయితే వీరి దాంపత్యజీవితం అంత సజావుగా సాగలేదు. 2008లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి చెన్నైవాసి శివప్రసాద్‌ను పెళ్లాడింది. వీరికి ఇషాన్ ప్రజాపతి అనే కొడుకు పుట్టాడు. అటు మనోజ్ కూడా మరొకరిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భర్త మనోజ్ కె.జయన్‌తో ఊర్వశి రోజూ మందు తాగేదాన్ని తాజాగా ఊర్వశి తన మొదటి పెళ్లి గురించి, విడాకులకు గల కారణాన్ని గురించి వెల్లడించింది. 'మనోజ్ నేను విడిపోవడానికి ఒకే ఒక కారణం తాగుడు అలవాటు. అతడి ఇంట్లో అందరూ మందు తాగుతారు. కుటుంబమంతా కలిసే తాగుతారు. నన్ను కూడా తాగమని బలవంతం చేసేవాడు. రోజూ తాగితాగి నేను కూడా తాగుబోతులా తయారయ్యాను. అతడి వల్లే నేను మందుకు బానిసయ్యాను. అదే మా విడాకులకు కారణమైంది. నా కూతుర్ని కూడా నాకు దక్కకుండా చేశాడు. రెండో భర్త శివప్రసాద్‌తో ఊర్వశి ఒంటరితనంతో డిప్రెషన్లోకి.. నేను మందుకు బానిసయ్యానని చెప్పి కూతురి బాధ్యతలను తనే తీసుకున్నాడు. ఒంటరిదాన్నైపోయాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చాలాకాలంపాటు నాలో నేనే కుమిలిపోయాను. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ శివప్రసాద్‌ను రెండో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఆ వయసులో పెళ్లేంటని చాలామంది విమర్శించారు. కానీ నేను వాటిని లెక్క చేయలేదు. ఇప్పుడు నా భర్త, కొడుకుతో సంతోషంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: కిక్ ఇచ్చేందుకు సంతానం రెడీ.. బ్రహ్మానందం, కోవై సరళతో పాటు.. శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను.. సినిమా ఎంట్రీకి ఆ ఫోటోనే కారణం: శ్రీలీల -
అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి
పోలీస్ వెంకటస్వామి అనే చిత్రంలో బాలనటిగా కనిపించింది తెలుగమ్మాయి రక్ష అలియాస్ రాణి. దాదాపు పదేళ్ల తర్వాత జానీ వాకర్ అనే మలయాళ చిత్రంలో నటించింది. చిరునవ్వుల వరమిస్తావా మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ప్రవేశించింది. తర్వాత ఎక్కువగా తమిళ సినిమాలే చేసింది. అయితే స్పెషల్ సాంగ్స్ వల్లే మరింత ఫేమస్ అయింది. అనంతరం నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథం.. ఇలా చాలా సినిమాల్లో నటిగా చేసి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈమె వెండితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. సినిమా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఐటం సాంగ్స్.. ఇప్పుడు బాధేస్తోంది తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాను. హీరోయిన్గా క్లిక్ అవకపోయేసరికి ఐటం సాంగ్స్ చేశాను. అప్పుడు బాధనిపించలేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తోంది. ఆ సాంగ్స్ చేయడం వల్లే నాకు తల్లి పాత్రలు రావడం లేదు. ఒక తమిళ డైరెక్టర్ ఈ మధ్యకాలంలో ఒక సినిమా చేశాడు. అందులో ఒక రోల్ ఆఫర్ చేశారు. నాకు పెళ్లై, పాప ఉంది.. గతంలోలాగా స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని బోల్డ్‌గా నటించమంటే నా వల్ల కాదు, మంచి పాత్ర అయితేనే చేస్తానని చెప్పాను. నీ సినిమా వద్దు.. ఏమీ వద్దు దానికతడు కూడా అలాంటిదేం లేదు, మంచి పాత్ర అని చెప్పాడు. తీరా సెట్‌కు వెళ్లాక బోల్డ్‌గా నటించమన్నాడు. అదేంటి? నేను చేయనని చెప్పాను కదా అని అడిగితే చేయమని ఒత్తిడి తెచ్చాడు. చాలా ఇబ్బంది పెడుతుండటంతో ఆయన చెంప చెళ్లుమనిపించి ఏంట్రా? ఏమనుకుంటున్నావ్ అసలు? నీ సినిమా వద్దు, ఏమీ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వినయ విధేయ రామ సినిమా కోసం బోయపాటి నాకు రోల్ ఆఫర్ చేయాలనుకున్నారు. కానీ మధ్యలో ఉన్నవాళ్లు.. ఆమె బిజీగా ఉంది, తను చేయదు అని చెప్పడంతో ఆ ఆఫర్ నాదాకా రాలేదు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది' అని రక్ష చెప్పుకొచ్చింది. చదవండి: నా జీవితంలో ఇలాంటి రోజులు కూడా ఉన్నాయి, బోరున ఏడ్చిన యాంకర్.. ఆందోళనలో ఫ్యాన్స్ గ్రాండ్‌గా బ్రహ్మానందం తనయుడి పెళ్లి.. చిన్న కోడలు ఏం చేస్తుందో తెలుసా? -
మీరు ఒక్కరే రండి అనేవారు.. నాకు అర్థమయ్యేది కాదు: ఆమని
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని. తెలుగులో జంబలకిడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్లాం సినిమాలో ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నటనలో అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో వినరో భాగ్యము విష్ణుకథ, అల్లంత దూరాన చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమని కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?) ఆమని మాట్లాడుతూ..'హీరోయిన్లలకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు. అందుకే ఎవరికీ తెలియకపోయేది. ఏ వృత్తిలోనైనా సరే మంచి, చెడు రెండు ఉంటాయి. హీరోయిన్స్‌గా అది మనం డెసిషన్ తీసుకోవాలి. తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. కొన్ని చిన్న సంస్థల్లో ఇలాంటివీ జరిగేవి. నాకు ఒకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమని డ్రెస్సు తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇలాంటి వారు కేవలం వాటి కోసమే వస్తారు. నేను వెంటనే అలాంటి క్యారెక్టర్‌ను వద్దనేదాన్ని. ఈ విషయంలో హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయం. మనం ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొందరు అడ్వాన్స్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు. మీరు రావాలంటా అని మేనేజర్ ఫోన్ చేసేవారు. కానీ ఈ విషయాలు నాకు చాలా రోజులకు అర్థమయ్యేవి. ' అని అన్నారు. ఆమని ఓ సంఘటనపై మాట్లాడుతూ..' అప్పుడు సెల్‌ఫోన్స్ లేవు కదా. డైరెక్ట్‌గా మేనేజర్ వచ్చి మాట్లాడేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలని అన్నారు. అది కూడా ఓ బీచ్ దగ్గర అని చెప్పారు. అక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఫైనాన్షియర్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటా అన్నారు. అసలు ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలి? డైరెక్టర్, నిర్మాత చూస్తే చాలు కదా. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలి. ఎందుకంటే ఆయన పక్కన నటించేవారు కాబట్టి తప్పదు. కానీ ఫైనాన్షియర్ చూడటమేంటి? అని అనుమానం వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఒక్కోసారి మమ్మీ వద్దండీ.. మీరు మాత్రమే రండి అని కారు తీసుకొచ్చే వారు. అక్కడే నాకు వారి మైండ్‌సెట్ అర్థమయ్యేది. ఐ యామ్ సారీ.. నేను రాను అని చెప్పేదాన్ని. ' అంటూ సమామాధానమిచ్చింది. (ఇది చదవండి: భార్యతో స్టార్ హీరో విడాకులు.. కానీ మామతో ప్రత్యేక అనుబంధం!) -
తెలుగులో స్టార్ హీరోయిన్.. క్యాన్సర్ సోకి.. అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దుస్థితి!
సినిమాల్లో స్టార్డమ్ వస్తే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చనుకుంటారు. కానీ అది కొంతకాలమే! స్టార్డమ్ ఉన్నన్నాళ్లూ దాన్ని అనుభవిస్తారు. అది పోయిన తర్వాత ఏకాకిగా మారుతారు. వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న అందాల తార అశ్విని జీవితంలోనూ ఇదే జరిగింది. వెండితెరపై వెలుగు వెలిగిన ఈమె అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూసింది. ఆమె ప్రయాణం ఎలా మొదలైంది? తన జీవితం ఎలా ముగిసింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. తెలుగులో 40కు పైగా సినిమాలు నెల్లూరుకు చెందిన అశ్విని 1967 జూలై 14న జన్మించింది. భక్త ధ్రువ మార్కండేయ అనే సినిమాలో బాలనటిగా కనిపించింది. తొలి సినిమాకే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె కొంతకాలానికే హీరోయిన్గా మారింది. వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్‌తో స్టేషన్ మాస్టర్, నాగార్జునతో అరణ్యకాండ చిత్రాలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 110కి పైగా చిత్రాలు చేసింది. పెళ్లి చేసి చూడు, ఇంటి దొంగ, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు.. ఇలా ఒక్క తెలుగులోనే 40కి పైగా సినిమాలు చేసింది. సీక్రెట్‌గా పెళ్లి.. కెరీర్ పీక్స్‌లో ఉండగా ఈమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే కొంతకాలానికే ఆమె భర్త తనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయాడన్న రూమర్స్ కూడా వచ్చాయి. ఒంటరిగా ఉన్న అశ్విని కార్తీక్ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే భర్త చేసిన మోసాన్ని తలుచుకుని అశ్విని ఎంతగానో కుంగిపోయింది. అది ఆమె ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. గుండె నిండా శోకం నింపుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ సినిమాలు చేసుకుంటూ పోయింది. కానీ అటు కెరీర్ గ్రాఫ్ కూడా పడిపోసాగింది. మొదట సీరియల్స్‌లో నటించడానికి ఇష్టపడని ఆమె తర్వాత వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపైనా మెరిసింది. ఒకానొక సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో సినిమాలోనే కాదు, ఏ సినీ ఫంక్షన్లోనూ కనిపించలేదు. ఇంటిని అమ్మేసి అద్దె ఇంట్లో బతుకుబండి.. వంద సినిమాలు చేసిందన్న మాటే కానీ తనకు చెన్నైలో ఒక ఇల్లు మాత్రమే ఉండేదట! చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో దాన్ని కూడా అమ్మేసి అద్దె ఇంట్లో నివసించిందని సమాచారం. 2012లో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఓ సీరియల్‌కు సంతకం కూడా చేసింది. కానీ ఆమె శరీరం సహకరించలేదు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. అశ్విని తుదిశ్వాస విడిచింది. ఆమె కోరిక మేరకు తన సొంతూరైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమెను చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేకపోవడంతో దర్శకుడు పార్తీబన్ ఆర్థిక సాయం చేశాడు. తన నటనతో అందరికీ వినోదాన్ని పంచిన ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది. పెళ్లిపత్రిక పంపింది అశ్విని గురించి డైరెక్టర్ పార్తీబన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'పొందట్టి తెవై సినిమాకు నేను వేరే హీరోయిన్ను అనుకున్నాను. కానీ ఆమె డేట్స్ ఇవ్వకపోవడంతో అశ్వినిని తీసుకున్నాం. తను బాగా సెట్టయింది. ఆ సినిమా రిలీజైన కొంతకాలం తర్వాత నేను మళ్లీ ఆమెను కలవలేదు. అయితే మధ్యలో తన పెళ్లిపత్రిక పంపించింది. కవి, రచయిత పువియరుసు మనవడిని పెళ్లాడుతున్నట్లు తెలిపింది. నేను అవుట్డోర్ షూటింగ్లో ఉండటంతో పెళ్లికి వెళ్లలేకపోయాను. ఆ తర్వాత ఓసారి నా కుమారుడు రాధాకృష్ణన్ తన స్నేహితుడు కార్తీక్ తల్లి ఆస్పత్రిలో ఉందని, ఆమె చికిత్స కోసం డబ్బులు సేకరిస్తున్నామని చెప్పాడు. ఆమె మరెవరో కాదు, అశ్విని అని ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చివరికి 2012 సెప్టెంబర్ 23వ తేదీన 45 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆమె కన్నుమూసింది. తన కొడుకును చదివించే బాధ్యత నేను భుజాన వేసుకున్నాను' అని చెప్పాడు. చదవండి: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న హీరోయిన్, పెళ్లికొడుకు ఎవరో తెలుసా? -
66 ఏళ్ల వయసులో భార్య చనిపోయిన వ్యక్తిని పెళ్లాడిన నటి.. నెల రోజులకే..
ఇష్టానికి వయసుతో పనేంటి? నటన మీద ఆమెకున్న మక్కువ 71 ఏళ్ల వయసులో తనను ఇండస్ట్రీ వైపు అడుగులు వేయించేలా చేసింది. డాక్టర్, రచయిత్రి, కవయిత్రి, క్లాసికల్ డ్యాన్సర్, లాయర్.. ఇలా భిన్న రంగాల్లో ఆరితేరిన ఆమె రిటైర్మెంట్ తీసుకునే సమయంలో నటనా రంగంలో ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బామ్మ తర్వాత ఏకంగా పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ బామ్మ పేరు విజయలక్ష్మి. కానీ తన జీవిత ప్రయాణాన్ని చూస్తే ఆమెను ధైర్యలక్ష్మి అని మెచ్చుకుని తీరాల్సిందే! సలార్, పుష్ప 2లో బామ్మ తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నటి విజయలక్ష్మి మాట్లాడుతూ.. 'నేను మొదట షార్ట్ ఫిలింలో నటించాను. అది బాగా క్లిక్ అయింది. అలా మరికొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. వెండితెరపై తొలిసారిగా రాజరాజ చోళ చిత్రం చేశాను. విరూపాక్ష, ఆచార్య, పొన్నియన్ సెల్వన్ 2.. ఇలా చాలా సినిమాలు చేశాను. సలార్, పుష్ప 2 కూడా చేస్తున్నాను. ఈ ఏడాది 12 సీరియల్స్ చేశాను. ఇంకా చాలా అవకాశాలు వస్తున్నాయి. సంతోషంగా ఉంది. 11 ఏళ్లకే తండ్రి కన్నుమూత నా కుటుంబ విషయానికి వస్తే.. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. అందులో ఒకరైన నా మిలటరీ తమ్ముడు(60) ఈ మధ్యే చనిపోయాడు. తనంటే నాకెంతో ఇష్టం. తను చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా తోబుట్టువలను చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్దవాళ్లను చేశాను. నా 11 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. మేనమామలు అప్పుడే నాకు పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోలేదు. ముందు నా తమ్ముళ్లను బాగా చదివించి గొప్ప స్థానానికి తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాను. వారిని మంచి స్థానంలో చూడాలనుకున్నాను. అలా నా పెద్ద తమ్ముడు మిలటరీకి వెళ్లాడు. రెండో తమ్ముడు బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. చెల్లె గృహిణిగా ఉంది. భార్య చనిపోయిన వ్యక్తితో పెళ్లి బాధ్యతలు అన్నీ తీరిపోయాక 32 ఏళ్ల వయసులో నా కోరిక తీర్చుకుందామని ఆంధ్ర నాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఓ ప్రోగ్రామ్‌లో కింద పడటంతో కాలుకు దెబ్బ తగిలి డ్యాన్స్‌కు దూరమయ్యాను. 66 ఏళ్ల వయసులో నాకంటూ ఓ తోడుండాలని మామయ్య నాతో పెళ్లివైపు అడుగులు వేయించారు. భార్య చనిపోయిన ఓ రైల్వే ఉద్యోగిని నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు, కోట్ల ఆస్తి ఉంది. ఆస్తి కోసం అతడిని పెళ్లి చేసుకున్నానన్న బద్నాం నాకు వద్దని అతడి ఆస్తినంతా తన కుమారుల పేరిట రాసిచ్చాకే వివాహానికి ఒప్పుకుంటానన్నాను. ఆస్తిని రాసిచ్చేశానని ఆయన అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని తర్వాత తెలిసింది. మాపెళ్లి జరిగాక అసలు కష్టాలు మొదలయ్యాయి. నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలియదు నన్ను ఇంట్లోవాళ్లే బెదిరించారు, రాచిరంపాన పెట్టారు. ఆయన మనవళ్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? లేదా? తనతో ఎలాగైనా ఆస్తి రాయించమని కొడుతుంటే కూడా నా భర్త మౌనంగా ఉండేవాడు. ఆయన ఆస్తి రాయడు, వీళ్లు హింసలు పెట్టడం మానరు. పెళ్లయ్యాక నెల రోజులు మాత్రమే అక్కడున్నాను. వాళ్ల చిత్రహింసలు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. 2016 నుంచి ఇప్పటివరకు ఆయన ఎలా ఉన్నాడో కూడా తెలియదు. అసలు బతికున్నాడో లేదో కూడా తెలియదు. నా శవాన్ని అక్కడివ్వండి నేను ఎవరికీ భారం కాను. కాళ్లూచేతులు బాగున్నన్నాళ్లు పని చేస్తాను. తర్వాత అనాధాశ్రమానికి వెళ్లిపోతాను. నేను చనిపోయాక నా శవాన్ని కర్నూలులోని జనరల్ ఆస్పత్రిలో అప్పగించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈమేరకు నేను నా శరీరాన్ని మెడికల్ స్టూడెంట్స్‌కు దానం చేసేందుకు ఒప్పుకున్నాను. వీలైతే నా జీవిత కథను పది అధ్యాయాలుగా పుస్తకంగా తేవాలన్నదే నా ఆశయం' అంటూ తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చింది విజయలక్ష్మి. చదవండి: పెళ్లై 8 ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్.. నాలుగోసారికి సక్సెస్.. కానీ రౌడీ హీరో షర్ట్ వేసుకున్న రష్మిక మందన్నా, మళ్లీ దొరికిపోయిందిగా -
సెక్రటరీతో సహజీవనం.. అది భరించలేకే ఉరేసుకున్న హీరోయిన్ భర్త?
అందాల అభినయానికి నిలువెత్తు నిదర్శనం రేఖ. దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రేఖ జీవితంలో ప్రేమకథలెన్నో ఉన్నాయి. పెళ్లైందని తెలిసి కూడా అమితాబ్ బచ్చన్‌ను ప్రేమించింది రేఖ. కానీ జయాబచ్చన్ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కూడా ఆమె ప్రేమలో పడిందంటూ ఆ మధ్య ఓ పేపర్ క్లిప్ బాగా వైరలయింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్లి చేసుకుంటారనుకునేలోపే విడిపోయారని అందులో రాసుకొచ్చారు. ఏడాది తిరగకముందే ఆత్మహత్య పెళ్లి కాకముందే రేఖ నుదుటన సింధూరం ధరించేది. వినోద్ మెహ్రాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని, కానీ అతడితో సెట్ అవ్వకపోవడంతో తనకు దూరంగా వచ్చేసిందని కూడా ప్రచారం నడిచింది. సెలబ్రిటీలతో నడిపిన ఏ లవ్ స్టోరీకి మంచి క్లైమాక్స్ పడకపోవడంతో అవుట్సైడర్ను పెళ్లాడింది. నాలుగు పార్టీల్లో కలిసిన వ్యాపారవేత్త ముఖేశ్ అగర్వాల్ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని అడగడం, రేఖ సరేనని తలూపడంతో ఆగమేఘాల మీద పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడు నెలలకే రేఖ చున్నీతో ముఖేశ్ ఉరేసుకుని మరణించాడు. మహిళా సెక్రటరీతో ఎఫైర్ ఆ సమయంలో రేఖ నటించిన ‘శేష్నాగ్’ విడుదలైతే జనం పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ భర్త మరణానికి ఆమె తన సెక్రటరీయే ప్రపంచంగా బతకడమనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఇకపోతే రేఖ జీవిత కథను రచయిత యాజీర్ ఉస్మాన్ ఓ పుస్తకంగా తీసుకొచ్చాడు. ఇందులో రేఖకు తన మహిళా సెక్రటరీతో ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేశాడు. ఎవరితో ఎంత చనువుగా ఉన్నా సరే రేఖ బెడ్రూమ్లోకి అడుగుపెట్టే స్వేచ్ఛ, అధికారం ఒక్క ఫర్జానాకు మాత్రమే ఉండేదట. ఈవిడ రేఖ దగ్గర వ్యక్తిగత సెక్రటరీగా పని చేసేది. ఫర్జానా ఏది చెప్తే అదే చేసేది రేఖ. వీరిద్దరూ మూడు దశాబ్దాలపాటు కలిసి పని చేశారు. ఆమె లేకుండా రేఖ బతకలేదా? రేఖ ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే, తన సెక్రటరీ అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదు. రేఖ భర్త ముఖేశ్ మరణానికి ఫర్జానాయే కారణమని సదరు పుస్తకంలో పరోక్షంగా ప్రస్తావించారు. 'రేఖకు ఫర్జానా సరైన జోడి. ఆమె తన స్నేహితురాలు, మద్దతురాలు.. తన ప్రపంచం. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె లేకుండా రేఖ బతకలేదు' అని పుస్తకంలో పొందుపరిచారు. రేఖ ఆమెతో సహజీవనం చేసిందని అందరూ అంటుంటే.. తను మాత్రం ఆమెను సొంత సోదరిలా భావిస్తానని ఎప్పుడూ చెప్పుకొచ్చేది. చదవండి: నో అంటే నో అంతే.. ఇంక ఎక్కువ వాగద్దు.. విశ్వక్ ట్వీట్ బేబి డైరెక్టర్నుద్దేశించేనా? తమన్నాతో పెళ్లి.. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైందన్న విజయ్ వర్మ -
రెండో భర్త మరణం.. 23 ఏళ్లకే నా జీవితం ముగిసిపోయింది: నటి
'వద్దు బావ తప్పు' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది నటి ప్రమీలా రాణి. వేద, బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో అందరినీ మంత్రముగ్దులు చేసిన ఆమె సహజ నటిగా పేరు తెచ్చుకుంది. ఏడుపు సన్నివేశాల్లో కూడా గ్లిజరిన్ లేకుండా అతి సాధారణంగా నటించగల సామర్థ్యం ఆమెది. అందుకే ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ నటిగా రాణిస్తోంది. 85కు పైగా సినిమాలు చేసిన బామ్మ తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టింది. 'నేను 107 ఎకరాల ఆసామికి పుట్టాను. కానీ పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు ఇస్నోఫియా అనే జబ్బు ఉండేది. మబ్బు పట్టినప్పుడు ఆయాసం వచ్చేది. 1997 నుంచే షుగర్ కూడా ఉంది. ఈ జబ్బులతో ఎలాగోలా నెట్టుకొస్తున్నాను. పెళ్లి చేసుకున్నాక భరతనాట్యం చేసేదాన్ని. పలు స్టేజీపై నృత్యం చేసేదాన్ని. అయితే పెళ్లైన కొత్తలో నాకు పిల్లలు పుట్టరని చెప్పడంతో నా భర్త విడాకులిచ్చాడు. మేము ఇచ్చిన డబ్బు కూడా తిరిగిచ్చేశాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ అప్పటికే అతడికి పెళ్లైంది. ఆ విషయం దాచి నన్ను మోసం చేశాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పారు.. కానీ నెల తప్పాను. 8వ నెలలో రైల్వే ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్తే..నీకు గర్భం లేదు ఏం లేదని డాక్టర్ కసురుకుంది. తర్వాత రెండు నెలలకే ఓ ఆస్పత్రిలో నిండు పౌర్ణమినాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాత పాప, కొడుకు పుట్టారు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. 1986 మార్చి 26న భర్త చనిపోయాడు. 23 ఏళ్లకే భర్త చనిపోవడంతో జీవితం ముగిసిపోయినట్లనిపించింది. నాటకాలు వేస్తూ, సినిమాలు చేస్తూ కొద్దికొద్దిగా సంపాదించడం మొదలుపెట్టాను. అలా తక్కువకాలంలోనే అందరి నోట్లో నాలుకలా మారిపోయాను. డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి విజయరాణి నాకు స్నేహితురాలు. నా దగ్గర రూ.15 లక్షలు తీసుకుంది. ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. అలా ఆమెకు డబ్బులిచ్చి మోసపోయాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: అందుకే సినిమాలకు దూరమయ్యాను: హీరోయిన్ -
రూ.90 లక్షలు మోసపోయాను, ఇంట్లో బియ్యం కూడా లేని దుస్థితి: నటి
వైజాగ్ జగదీశ్వరి.. మూడు వేలకు పైగా నాటకాలు, 76 సీరియల్స్, బోలెడన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. విలన్‌గా స్క్రీన్‌పై భయపెట్టించే ఆమె నిజజీవితంలో మాత్రం ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి నుంచి ఛాన్సుల కోసం ఆఫీసులు తిరగాల్సి వస్తోంది అంటోంది నటి జగదీశ్వరి. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లవుతుండగా ఇప్పటికీ పెద్దగా కూడబెట్టుకోలేదని, సంపాదించిన కొద్దిమొత్తం కూడా పోగొట్టుకున్నానంటోంది. నా కొడుకుతో నా గురించి చీప్‌గా మాట్లాడారు తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను 30 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఆర్. నారాయణమూర్తి గారితో 6 సినిమాలు చేశాను. ఓసారి నా కొడుకు సినిమా అవకాశాల కోసం ఓ ఆఫీసుకు వెళ్లి అక్కడ నా ఫోటో చూపించాడు. అక్కడున్న వ్యక్తి.. ఓహ్, ఈవిడా.. అమ్మాయిలను వెంటేసుకుని తిరిగే ఈమె మీ అమ్మగారా? నాతో అన్నావు కానీ బయట ఎక్కడా ఆమె మీ అమ్మ అన్న విషయం చెప్పకు అని అన్నాడట. చాలా కాలం తర్వాత నా కొడుకు ఈ విషయం చెప్పాడు. ఎంతో బాధేసింది. కానీ నాకు వివాదాల జోలికి వెళ్లడం ఇష్టముండదు. వివాదాల్లో చిక్కుకుంటే తర్వాత నేను ఇండస్ట్రీలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక అడుగు వెనక్కే వేస్తాను. ఉన్నదంతా పోగొట్టుకున్నా.. ఓసారి మా ఇంట్లో దొంగలు పడి పాతిక లక్షల బంగారం పోయింది. మరోపక్క చిట్టీలు కట్టి దారుణంగా మోసపోయాను. మొత్తం రూ.90 లక్షల దాకా కోల్పోయాను. నేను తెచ్చుకుంది, ఇక్కడ సంపాదించి అంతా పోగొట్టుకున్నాను. ఒకప్పుడు నెలకు 20 రోజులకు పైగా పనిచేసేదాన్ని. ఇప్పుడు సరిగా పని దొరకడం లేదు. ఈ ఆరు నెలల్లో ఏవో కొన్ని సీరియల్స్, ఓ సినిమా చేశానంతే! ఆ సినిమాకు కూడా ఒకే ఒక రోజు పని చేశాను. కానీ ఇంతవరకు డబ్బులివ్వలేదు. ఒకానొక సమయంలో ఇంట్లో బియ్యం కూడా లేదు. సీరియల్స్ కూడా తక్కువ రోజులే చేశాను. దానికి కూడా సరిగా డబ్బులు ఇవ్వడం లేదు. జల్సాల కోసం పెళ్లి చేసుకున్నాడు వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగత విషయంలోనూ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నాకు 18 ఏళ్లున్నప్పుడు నా భర్త లారీ ప్రమాదంలో చనిపోయాడు. అప్పటికి నాకు ఓ చిన్న బాబున్నాడు. పాప కడుపులో ఉంది. నా నటనను మెచ్చి ఓ లాయర్ నన్ను ఇష్టపడ్డాడు. 25 ఏళ్లకు అతడిని రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ అతడు జల్సాలు చేయడానికి నన్ను పెళ్లాడాడు. నువ్వు నేను సినిమా నేను చేయాల్సింది. మా ఆయన వల్లే ఆ అవకాశం చేజారింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత తెలంగాణ శకుంతల 400 సినిమాలు చేశారు, అంత బిజీ అయింది. నా భర్త నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నేను ఆత్మహత్యాయత్నం చేశాను. ఇప్పటికీ చేతి మీద ఆ గుర్తులు ఉన్నాయి అంటూ కంటతడి పెట్టుకుంది వైజాగ్ జగదీశ్వరి. చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా పుష్ప 2లో ఐటం సాంగ్, ఊర్వశి రెమ్యునరేషన్ అన్ని కోట్లా? -
నా సినిమాలకు సరైన ప్రచారం లభించడం లేదు: ఊర్వశి
సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చార్లెస్ ఎంటర్ప్రైజెస్'. నటుడు బాలు వర్గీస్, కలైయరసన్, గురుసోమసుందరం, సుజిత్ శంకర్, అభిజ శివకళ, మణికంఠన్, ఆచారిను, మృదుల మాధవ్, సుధీర్ పరవూర్ ముఖ్యపాత్రలు పోషించారు. సుభాష్ లలిత సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతుండగా జాయ్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అజిత్ జాయ్ తమిళం, మలయాళం భాషల్లో నిర్మించారు. కె.వి.సుబ్రమణ్యం, అశోక్ పొన్నప్పన్ కలిసి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి స్వరూప్ పిలిప్ ఛాయాగ్రహణం అందించారు. మలయాళంలో ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఊర్వశి మాట్లాడుతూ.. సాధారణంగా తమలాంటి నటీనటులను పత్రికల వాళ్లు నీకు ఇష్టమైన నటీనటులు ఎవరు, నచ్చిన పాత్ర ఏమిటి, దర్శకుడు ఎవరు? లాంటి ప్రశ్నలు వేస్తుంటారన్నారు. అయితే ఈ చిత్రానికి బలం నిర్మాతేనన్నారు. ఇకపై నీకు నచ్చిన నిర్మాత ఎవరు అని అడగండి అన్నారు. అలా ఈ చిత్రం నిర్మాత తనకు చాలా ఇష్టమని చెప్పారు. కొందరు నిర్మాతలపై ఫిర్యాదు కూడా చేసే అవకాశం ఉందని అన్నారు. చిత్ర కథ బాగుందా? అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉందా? వ్యాపారపరంగానూ లాభసాటిగా ఉందా అంటూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్మాత అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. ఇకపోతే చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా శ్రమ ఒకటేనని, అయితే తన చిత్రాలకు తగిన ప్రచారం లభించడం లేదని అన్నారు. ఈ చిత్రానికి మీడియా సహకారం అవసరం అని ఊర్వశి పేర్కొన్నారు. చదవండి: షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం -
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్‌లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
ప్రేక్షకులను ఉర్రూతలూగించిన తెలుగింటి బామ్మ.. నిర్మలమ్మ అరుదైన చిత్రాలు
-
భర్త చనిపోయిన 10 రోజులకే కొడుకు మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న నటి
పదకొండేళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై రంగప్రవేశం చేసింది కవిత. సిరిసిరి మువ్వతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె ఆ తర్వాత హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సత్తా చాటింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో దాదా 350కి పైగా చిత్రాలు చేసింది. 1983లో దశరాథరాజ్ను పెళ్లాడగా కరోనా వల్ల అతడు 2021లో కన్నుమూశారు. ఆయన మరణించిన కొద్దిరోజులకే కొడుకు కూడా మరణించి ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చారు. తాజాగా సీనియర్ నటి కవిత సినీ విశేషాలతో పాటు తన జీవితంలోని విషాదాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 'నా భర్త బిజినెస్ చేసేవారు. ఆరేళ్ల క్రితం ఆయనకు బిజినెస్‌లో భారీ నష్టం వచ్చింది. కేవలం 9 నెలల గ్యాప్‌లోనే రూ.132 కోట్లు పోయాయి. ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టాడు. తనే లోలోప మధనపడ్డాడు. ఒకరోజు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే బతకడని చెప్పారు. 11 రోజులు కోమాలో ఉన్నాడు. 12వ రోజు కళ్లు తెరిచాడు. కానీ మరో 35 రోజులు ఐసీయూలో ఉంచారు. ఆ తర్వాత కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చాం. అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకోవాలని ఓ మూడు నెలల తర్వాత ఆయన్ను కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లాను. అప్పుడు ఆయన రూ.132 కోట్లు నష్టపోయిన విషయాన్ని బయటపెట్టాడు. కొన్ని ప్రాపర్టీలు అమ్మాల్సి వచ్చిందన్నాడు. మేము ఏమైపోతామోనని భయపడ్డాడు. దీనికోసం ప్రాణం మీదకు తెచ్చుకుంటావా? అని మందలించాను. ఆ భయాన్నంతా పక్కన పడేయమని నేను ధైర్యాన్నిచ్చాకే ఆయన కోలుకున్నాడు' అని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌తో జరిగిన గొడవ గురించి స్పందిస్తూ.. 'జయచిత్ర నన్ను చాలా ఏడిపించేవారు. ఒకరోజు షూటింగ్‌కు ఇద్దరం ఒకే కలర్ సారీ కట్టుకుని వచ్చాం. డైరెక్టర్ తనను చీర మార్చుకోమన్నాడు. ఆమె నన్ను చిటికేసి పిలిచి ఏయ్, పోయి చీర మార్చుకోపో అని చెప్పింది. అప్పటికే ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన నేను.. మీ పని మీరు చూసుకోండి. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ముందు వాళ్లు ఏం చెప్తున్నారో అది వినండి. మీకూ నాకూ గొడవెందుకు? అన్నాను. అంతే, ఈ గొడవ పెద్దదై ఏడాది దాకా ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత ఎవరూ నాతో మాట్లాడలేదు. మరోసారి ఏమైందంటే.. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి ఒకరి క్యారవాన్‌లోకి వెళ్తే గెట్ అవుట్ అన్నారు. వెంటనే కోపంతో చెంప పగిలిపోద్ది అని తిట్టాను' ఆనాటి గొడవను గుర్తు చేసుకుంది. కరోనా తన జీవితంలో మిగిల్చిన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది నటి. 'కరోనా వల్ల నా భర్త నాకు దూరమైపోయాడు. జయప్రద ఫోన్ చేసి నీకు దొరికిన భర్త ప్రపంచంలో ఎవరికీ దొరకడు అని చెప్పగానే గుక్కపెట్టి ఏడ్చేశాను. నన్ను ప్రాణంగా ప్రేమించేవాడు. ఆయన చనిపోయిన పది రోజులకే నా కొడుకు సాయి చనిపోయాడు. ఈ విషాదాన్ని తట్టుకోలేకపోయాను. మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. తర్వాత నా పిల్లల కోసం బతకాలనుకున్నాను. షూటింగ్‌తో బిజీ అయిపోతే ఈ బాధను మర్చిపోవచ్చకున్నాను. అప్పుడు తమిళ సీరియల్‌కు ఓకే చెప్పాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కవిత. చదవండి: పెళ్లై 14 ఏళ్లు, పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి -
ఆ హీరోతో డేటింగ్ చేస్తోందని బాధపడ్డ మరో హీరో.. హర్టయిన నటి!
ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయే పాటల్లో దమ్మారో దమ్ సాంగ్ ఒకటి. ఈ పాటను ఆస్వాదించినవాళ్లంతా జీనత్ కాన్ను అంత ఈజీగా మర్చిపోలేరు. బాలీవుడ్ తారే అయినా అన్ని భాషల ప్రేక్షకులు ఆమెను ఆరాధించారు. కెరీర్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలో హీరో రాజ్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అప్పటికి జీనత్‌ను మరో హీరో దేవ్ ఆనంద్ ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోయాడు. తన ఆటోబయోగ్రఫీలో మాత్రం... తాను ప్రేమిస్తున్న జీనత్ మరొకరితో ప్రేమలో ఉందన్న వార్తలు బాధించాయని రాసుకొచ్చాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఓపెన్ అయింది జీనత్. పబ్లిక్‌గానే కంగ్రాచ్యులేషన్స్ చెప్పా 'నా కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో గోల్డెన్ త్రయం నడుస్తోంది. దేవ్ సాబ్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ హిందీ సినిమాకు తలమానికంగా నిలిచారు. ఈ క్రమంలో 1973లో రాజ్ కపూర్ డైరెక్షన్లో వచ్చిన బాబీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా అవార్డులు సైతం గెల్చుకుంది. పబ్లిక్‌గానే అతడికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను. వకీల్ బాబు, గోపీచంద్ జసూస్ సినిమాల్లో అతడితోపాటు నటించాను. అతడి డైరెక్షన్లో సినిమా చేయాలనుండేది. తీరా ఆ అవకాశం వచ్చేసరికి నేను సత్యం శివం సుందరం సినిమా ఒప్పుకోవడంతో దాన్ని తిరస్కరించక తప్పలేదు. తర్వాత రాజ్ కపూర్ సినిమాల్లోనూ నటించాను. కానీ మా మధ్య ఉన్న సాన్నిత్యాన్ని దేవ్ సాబ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. అబద్ధాన్ని ప్రచారం చేశాడు 2007లో వచ్చిన ఆయన ఆటోబయోగ్రఫీ రొమాన్సింగ్ విత్ లైఫ్ పుస్తకంలో దేవ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ రాజ్‌కు నాకు మధ్య బంధం చిక్కపడటం చూసి తన మనసు ముక్కలైందని రాసుకున్నాడు. అది చూశాక నాకు విపరీతమైన కోపం వచ్చింది. దేవ్ నన్ను ప్రేమిస్తున్న విషయమే నాకు తెలియదు, ఆయనను గురువుగా ఆరాధించాను, ఎంతో అభిమానించాను. కానీ తను ఓ అబద్ధాన్ని నమ్మి నాపైనే దుష్ప్రచారం చేశాడు. చాలా బాధేసింది. ఆ పుస్తకం పబ్లిష్ అయ్యాక నా ఫోన్ రింగవుతూనే ఉంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని నా స్నేహితులు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎంతో అవమానకరంగా భావించిన ఈ విషయం గురించి ఇన్నేళ్లుగా మాట్లాడలేకపోయాను. ఇన్నాళ్లకు దీనిపై క్లారిటీ ఇవ్వాలనిపించింది. దేవ్ ఆనంద్ అరుదైన ప్రతిభ కలవాడు. ఆయన్ను ఎవరైనా అవమానిస్తే నేను సహించలేను' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది జీనత్. సంజయ్ఖాన్తో ప్రేమ పెళ్లి, హింసతో బ్రేకప్ జర్నలిస్టు, మోడల్‌గా ఉన్న జీనత్ అమాన్ 1970లో హల్చల్తో నటిగా పరిచయమైంది. హరే రామ హరే కృష్ణతో స్టార్డమ్ తెచ్చుకుంది. కుర్రకారంతా ఆమెను ఆరాధించింది. ప్రముఖ హీరో ఫిరోజ్ ఖాన్ తమ్ముడు, హీరో సంజయ్ ఖాన్‌ను ఆమె అందం కలవరపెట్టింది. అటు జీనత్కూ సంజయ్ అంటే ఇష్టం మొదలైంది. ఇద్దరూ అబ్దుల్లా సినిమాలో జంటగా నటించారు. ఈ క్రమంలో వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే సంజయ్‌కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. పైగా అతడు ముక్కోపి! ఓసారి పార్టీలో అందరి ముందే దవడ ఎముక విరిగేలా జీనత్‌కు కొట్టాడట సంజయ్. ఆ సంఘటనతో సంజయ్ జీవితంలో నుంచి తప్పించుకుంది. జీనత్. మూడేళ్ల వారి ప్రేమ హింసాత్మకంగా ముగిసింది. ఆ తర్వాత 1985లో మజర్ ఖాన్‌ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కుటుంబంతో సంతోషంగా జీవనం సాగిస్తుందనుకున్న సమయంలో 1998లో మజర్ కన్నుమూశాడు. సింగిల్ పేరెంట్‌గానే పిల్లలను పెద్ద చేసింది జీనత్. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: కమెడియన్ యోగిబాబు సరసన మరోసారి నయనతార -
'చేసేదేమిలేక శరీరానికి కవర్ చుట్టుకున్నా'..సీనియర్ నటి శోభన
హీరోయిన్ శోభన అంటే ఇప్పటి తరం గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఆ కాలం నాటి సినీ ప్రేక్షకులకు మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. 1980 దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. 1986లో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది శోభన. ఆ తర్వాత విజృంభణ, అజేయుడు, మువ్వగోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెప్పించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌బాబు లాంటి అగ్ర హీరోలతో నటించింది. కేవలం నటిగానే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభన తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శివ మూవీ సెట్లో జరిగిన ఓ విషయాన్ని బయటపెట్టారు. శోభన మాట్లాడుతూ..'రజనీకాంత్‌తో శివ, దళపతి సినిమాల్లో నటించా. అయితే శివ చిత్రం షూటింగ్లో వర్షం పాట చిత్రీకరించడానికి సెట్ వేశారు. ఆ విషయం నాకు తప్ప.. అక్కడున్న వారందరికీ తెలుసు. శరీరం కనిపించేలా ఉన్న ఓ తెల్ల చీర ఇచ్చి నన్ను కట్టుకోమన్నారు. దీంతో వెంటనే కాస్ట్యూమ్ బాయ్‌ని పిలిచి.. చీర చాలా పల్చగా ఉంది. ఇంటికెళ్లి.. లోపల ఏదైనా ధరించి దానిపై కట్టుకుని వస్తా అని చెప్పా. అయితే షూట్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేమిలేక అక్కడే ఉన్న ఓ టేబుల్ కవర్ని ఒంటికి చుట్టుకున్నా. దానిపై చీర కట్టుకుని షూట్‌కి రెడీ అయిపోయా. ఆ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కవర్ సౌండ్‌కు రజనీకాంత్ ఇబ్బంది పడ్డారు. ఆరోజు నేను టేబుల్ కవర్ ధరించానని ఎవరికీ తెలియదు. నాకు తెలిసి రెయిన్ సాంగ్స్ అంటే హీరోయిన్స్‌ను మర్డర్ చేసినట్టే అని నవ్వుతూ.' అన్నారు. కాగా.. 1980లోనే ప్రతిభ గల కళాకారిణులలో శోభన ఒకరు. అందం, నటనే కాదు.. నాట్యంలోనూ అద్భుతంగా రాణిస్తోంది. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఎంతో మంది చిన్నారులకు నాట్యం నేర్పిస్తోంది. 1994లో కళార్పణ అనే సంస్థ ఏర్పాటు చేసి భారతనాట్యంలో శిక్షణ ఇస్తుంది. ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నాట్యానికే తన జీవితాన్ని అంకితమిచ్చారు. కాగా.. 2011లో ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది శోభన. -
పెళ్లైన కొంత కాలానికే విడాకులు.. రెండో పెళ్లిపై స్పందించిన ప్రేమ
ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది ప్రేమ. ఎయిర్ హోస్టెస్ అవుదామనుకుని హీరోయిన్గా మారింది. తన అందంతో, సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. 1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో తన జర్నీ మొదలైంది. తొలి సినిమా పరాజయం పాలైనా ఓం అనే రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. కన్నడలో స్టార్ హీరోలందరితో జోడీ కట్టి టాప్ హీరోయిన్గా వెలుగొందింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, పోలీస్ పవర్ సహా పలు చిత్రాలు చేసింది. జీవన్ అప్పాచ్చు అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రేమ కొంతకాలానికే ఆయనకు విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'దర్శకుడు కోడి రామకృష్ణ నాకు తెలుగు నేర్పించారు. పెళ్లైన కొంతకాలానికి విడాకులు తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని మొదట మా పేరెంట్స్‌కు చెప్పాను. వాళ్లు నా నిర్ణయానికి మద్దతు తెలిపారు. చాలామంది అలాంటి సమయంలో ఆత్మహత్య దిశగా ఆలోచిస్తుంటారు. కానీ నేను సూసైడ్ చేసుకోలేదు. ఇది ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను. పెళ్లనేదే జీవితం కాదు. ఛాలెంజ్‌లు స్వీకరిస్తేనే ధృడంగా తయారవుతారు. నేను సెన్సిటివ్‌గా, ఎమోషనల్‌గా ఉండేదాన్ని. కానీ తర్వాత స్ట్రాంగయ్యాను. రెండో పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. జీవితంలో పెళ్లి ఉండాలి. నాకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలనేది నాకు తెలుసు. నా మీద ఇంకో రూమర్ కూడా సృష్టించారు. నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేదు. డిప్రెషన్ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్ ఉందని పుకార్లు వ్యాప్తి చేశారు' అని చెప్పుకొచ్చింది ప్రేమ. -
వందల కోట్ల ఆస్తి ఉన్న అతడు నాకోసం బిల్డింగ్‌పై నుంచి దూకాడు: నటి
తన హావభావాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి రాధ ప్రశాంతి. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె టైగర్, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. భయమనేదే ఎరుగనని చెప్తూ ఉండే రాధ ప్రశాంతి ఆంధ్రా-ఒడిశా బార్డర్‌లోని కాశీనగర్‌లో జన్మించింది. ఆమె అసలు పేరు కృష్ణవేణి. తొమ్మిదో తరగతిలోనే తండ్రిని కోల్పోవడంతో చదివించేవాళ్లు లేక విద్యకు దూరమైంది. స్టేజీపై డ్రామాలు చేస్తూ నెమ్మదిగా వెండితెరకు పరిచయమైంది. పెళ్లిపందిరి, పెళ్లికానుక, లవకుశ.. వంటి పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, సహాయక నటిగా పలు పాత్రలు పోషించింది. రెండు దశాబ్దాలుగా వెండితెరకు దూరమైన ఆమె కరోనా సమయంలో ఆహారం పంపిణీ చేస్తూ ఎంతోమందికి సేవ చేసింది. భర్త సాయంతో శ్రీకాకుళంలో గూడు లేనివాళ్లకు ఇళ్లు సైతం కట్టించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. నా కోసం బస్సు తగలబెట్టాడు.. 'మా ఇంట్లో అందరం ఫైర్‌బ్రాండ్సే. నేను కాలేజీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సు మా ఇంటి ముందు ఆపడం లేదని మా పెద్దన్న ఏకంగా బస్సునే తగలబెట్టాడు. ఎక్కడికి వెళ్లినా నాతో బాడీగార్డులా వచ్చేవాడు. మొదట నేను నాటకాలు వేసేదాన్ని. తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టా. హిందీతో పాటు దక్షిణాదిలో నాలుగు భాషల్లో చేశాను. వి.మధుసూదన్‌రావు డైరెక్షన్లో లవకుశ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేశా. హిందీలో స్వప్నసుందరి సీరియల్ చేశాను. నిద్రమాత్రలు మింగి.. 12 ఏళ్లపాటు సినీ పరిశ్రమలో ఉన్నాను. హీరోయిన్గా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో పెళ్లైంది. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి ఎలా జరిగిందంటే.. ఆయన నన్ను చూసి ఇష్టపడ్డారు. నా నెంబర్ తీసుకుని రాత్రి ఫోన్లు చేసేవాళ్లు. ఏంటి? ఇలా విసిగిస్తున్నావని అడిగితే తన ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన యాడ్ చేస్తారా? అని అడిగేవాడు. ఫైనాన్స్ కంపెనీలకు నేను యాడ్ చేయనని ముఖం మీదే చెప్పాను. అయినా తన ప్రవర్తన వింతగానే ఉండేది. అసలు విషయం ఆరా తీస్తే నన్ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని తెలిసింది. నేను నో చెప్పడంతో నిద్రమాత్రలు మింగి మూడంతస్తుల భవంతిపై నుంచి దూకాడు. వందల కోట్ల ఆస్తి ఉన్న అతడు ఎవరినీ కాదని, నిన్నే కావాలనుకుంటున్నాడంటే అతడి ప్రేమను అర్థం చేసుకోమన్నారు. చిన్నప్పటి నుంచి కష్టాలు.. నిజానికి నేను అతడికి నో చెప్పడానికి కారణం ఉంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూశాను. నటిగా పేరు ప్రఖ్యాతలు వచ్చిన సమయంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నన్ను పెళ్లి చేసుకునేందుకు మా ఇంటి ముందుకు వచ్చేవారు. నాకు మాత్రం పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. కానీ చివరకు నాకోసం ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డ కిరణ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నాను. అయితే అత్తారింట్లో వాళ్లు సినిమా ఇండస్ట్రీకి కొంత దూరంగా ఉండేవారు. పెళ్లైన ఏడాది తర్వాత రామానాయుడు మంచి ఆఫర్లు ఇచ్చారు, కానీ నా భర్త ఒప్పుకోలేదు. పిల్లలు చిన్నవాళ్లు.. ఇప్పుడెందుకు అనడంతో ఆ అవకాశాలు తిరస్కరించాను. అలా వచ్చిన గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇల్లు తగలబెట్టారు కరోనా సమయంలో నా ఇల్లు తగలబడిపోయింది. కానీ అది ప్రమాదవశాత్తూ జరగలేదు, కొందరు కావాలనే చేశారు. జూన్ 6న నా ఇంటికి నిప్పుపెట్టారు. మూడు ఫ్లోర్ల భవంతిలో కేవలం నా ఒక్క ఇల్లే కాలిపోయిందంటే అక్కడే అర్థమైపోతుంది ఇదంతా ఓ కుట్ర అని! ఆ సమయంలో మా ఆయన పిల్లలతో పాటు ఊర్లో స్ట్రక్ అయిపోయారు. అందరూ కరోనా భయంతో ఉన్నారు. ఎవరి దగ్గర తలదాచుకోవాలో తెలియలేదు. ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో రామకృష్ణ మఠ్ వాళ్లు ఆశ్రయం కల్పించారు. వారు ఆశ్రయం ఇవ్వకపోతే నేనీ రోజు ఉండేదాన్ని కాదేమో! నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. కానీ మనిషి జీవితం మారిపోవడానికి, చనిపోవడానికి ఒక్క క్షణం చాలు అని చెప్పుకొచ్చింది రాధా ప్రశాంతి. -
‘ఒక్క సినిమాతో ఆస్తులన్నీ పోయాయి.. అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది’
కాకినాడ శ్యామల అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె దాదాపుగా 200 సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా నటించింది. నటిగా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా కాకినాడ శ్యామల గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తకర విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత జీవితంపై శ్యామల మాట్లాడారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ..'నేను చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశా. సిల్క్ స్మిత సొంత సినిమాకి కూడా డబ్బులిచ్చాను. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వల్ల సిల్క్ స్మిత అప్పులపాలైంది. ఒక్క సినిమాతోనే సిల్క్ స్మిత ఆస్తులన్నీ పొగొట్టుకుంది. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. తెరపై వేసే పాత్రలు వేరు .. బయట కనిపించే స్మిత వేరు. ఆమె నిజాయితీ ఉన్న మనిషి. ఆమెను హత్య చేశారని కొంతమంది అంటారు. ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. నిజానికి ఏం జరిగిందనేది ఆ పైవాడికి మాత్రమే తెలియాలి. కానీ ఆమె ఎందుకు చనిపోయిందో కారణాలు తెలియవు. అయినప్పటికీ సిల్క్‌స్మిత అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది. ఆ తరువాత ఆమె కెరియర్ బాగానే సాగింది. అలాంటి సమయంలోనే ఆమె చనిపోయిందనే వార్త విన్నా. ' అని అన్నారు -
ఆర్థిక కష్టాలు.. నేను నటించకపోతే అమ్మ విషం తాగి చస్తానంది: నటి
తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలు కలుపుకుని 500కు పైనే సినిమాలు చేసింది నటి శ్రీ లక్ష్మి. 1983లో వచ్చిన రెండు జళ్ల సీతలో నవ్వులు పండించిన ఆమె తర్వాత కూడా కమెడియన్‌గానే రాణించింది. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో ఆమె చెప్పిన బాబూ.. చిట్టీ డైలాగు అప్పటికీ, ఇప్పటికీ ఫేమసే. హావభావాలతోనే కామెడీ పండించే ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి స్టార్‌గా వెలుగొందింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మా నాన్నకు మేము ఎనిమిది మంది పిల్లలం. నాన్న అమర్నాథ్ ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద హీరో. జాండిస్ రావడంతో పని చేయడం మానేశాడు. సైడ్ క్యారెక్టర్లు వస్తే తాను హీరోగా మాత్రమే చేస్తానని మొండికేశాడు. ఆర్థిక కష్టాలు తీవ్రం కావడంతో అమ్మ నన్ను ఇండస్ట్రీలోకి పంపించాలనుకుంది. కానీ నాన్నకు అసలు ఇష్టం లేదు. ఆడపిల్లవి, ఇండస్ట్రీలో కష్టాలు పడటం ఎందుకమ్మా? అన్నాడు. పరిస్థితులు బాలేవు కదా అని బదులిస్తే నా చేతకానితనం వల్లే ఇలా మాట్లాడుతున్నావంటూ బాధపడ్డాడు. శ్రీలక్ష్మి సోదరుడు, నటుడు రాజేశ్ మరోవైపు అమ్మ మాత్రం.. నువ్వు నటిస్తేనే అందరం కడుపునిండా తినగలుగుతాం, లేదంటే విషం తాగి చస్తాం అంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చి 41 ఏళ్లుగా రాణిస్తున్నా. శుభోదయం సినిమాకు హీరోయిన్గా సంతకం చేశాక నాన్న చనిపోయారు. నేను ఇంటిదగ్గర ఉండాల్సి రావడంతో ఆ అవకాశం చేజారిపోయింది. కానీ హీరోయిన్గా చేయకపోవడం వల్లే ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉండగలిగాను. నా తమ్ముడు రాజేశ్ కూడా హీరో అయ్యాడు. ఆరోజుల్లోనే లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా వెళ్లిపోయాడు. సెట్లో ఉన్నంతసేపు నేను సంతోషంగా ఉండేదాన్ని. ఇంటికి వెళ్లాలంటే మాత్రం భయమేసేది. ఆ కష్టాలు, బాధలు భరించలేకపోయేదాన్ని. కానీ మేము ఎనిమిది మందిమి కాస్తా ముగ్గురమే మిగిలాం.. అదే నాకు బాధనిపిస్తూ ఉంటుంది. నాకు పెళ్లైంది. భర్త ఉన్నాడు. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదు, చెప్పను కూడా! ఎందుకంటే తన గురించి అందరికీ తెలియడం తనకిష్టం లేదు. నేను నా కుటుంబంతో చెన్నైలో స్థిరపడ్డాను. అయితే ప్రొఫెషనల్‌గా మాత్రం ఇక్కడే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి. -
బికినీలో సీనియర్ నటి రాధ.. ఎలా ఉందో చూశారా?
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ రాధ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 1980లో సీనియర్ స్టార్ హీరోలతో నటనతో మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో రాధ పేరుతోనే ఫేమ్ సాధించింది. కానీ ఆమె అసలు పేరు ఉదయచంద్రిక. దక్షిణాదిలో దాదాపు 250కు పైగా సినిమాల్లో నటించింది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆమె కూతురు కార్తీక తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ఓ సినిమాలోని ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. అప్పట్లో కమల్‌హాసన్ సినిమాలో నటించిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారామె. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాధ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ రోజుల్లో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇదీ ఒకటి. అప్పటికి అది నా కెరీర్లో ఒక భాగం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటున్నా. సరైన లుక్‌తో కనిపించిన మాధవికి ప్రత్యేక ప్రశంసలు. యాటిట్యూడ్‌తో పని చేయగలిగినందుకు ఆమెకు హ్యాట్సాఫ్. కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆలాంటి కొన్ని చెప్పలేని ఆలోచనలను ఇక్కడ పంచుకుంటున్నా. ఈ అందమైన దుస్తులను తయారు చేసిన డిజైనర్ వాణీ గణపతికి మా కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో కమల్ హాసన్ కుర్చీలో ఉండగా.. రాధ, స్వప్న, మాధవి ఆయన వెనక నిలబడి ఉన్నారు. కమల్ హాసన్ హీరోగా 1981లో తెరకెక్కిన టిక్ టిక్ టిక్ చిత్రంలో రాధ నటించింది. View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
అప్పట్లోనే సొంతంగా హెలికాప్టర్ కొన్న ఏకైక హీరోయిన్ కేఆర్ విజయ.. ఇప్పుడెలా ఉందంటే!
సీనియర్ నటి కేఆర్ విజయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె దేవత పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందారు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు లెజెండ్స్‌తో పాటు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర నటుల సరసన నటించి మెప్పించారు. స్టార్ నటిగా కొనసాగుతున్న క్రమంలోనే ఓ బడా వ్యాపావేత్తనుపెళ్లి చేసుకున్న ఆమె బాగా సెటిలైపోయారు. చదవండి: అప్పుడు విష్ణుకు సన్నిహితంగా.. ఇప్పుడు మనోజ్ అనుచరుడిగా.. అసలు ఎవరీ సారథి? భర్త చనిపోవడంతో కూతురితో కలిసి చెన్నైలో నివసిస్తున్న కేఆర్ విజయ గతంలో ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. తాజాగా ఆమె పాత వీడియో మరోసారి వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తన గురించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కాగా పెళ్లి అనంతరం ఓ మహారాణిలా లైఫ్ లీడ్ చేసిన ఆమె వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారట. అప్పట్లోనే ఆమెకు సొంతంగా హెలికాప్టర్ ఉండేదని, దానిని ఆమె భర్తే నడిపేవారని చెప్పారు. కేరళ, హైదరాబాద్, తమిళనాడు ఇలా ఎక్కడ సినిమా షూటింగ్స్ ఉన్నా సొంత హెలికాప్టర్లోనే ప్రయాణించేవారట. చదవండి: స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం అప్పట్లో ఏ హీరో కూడా సొంత హెలికాప్టర్ లేకపోవడం గమనార్హం. ఆమె భర్తకు వివిధ రకాలు బిజినెస్ ఉండేవని, ఈ క్రమంలో మద్రాస్ సమీపంలో ఏకంగా 67 ఎకరాలు తోట కోనుగోలు చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఆమె రాజభవనం లాంటి లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారట. దీనిపై హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదని అప్పట్లో విజయ రాజా వైభోగం గురించి ఇండస్ట్రీలో అంతా చర్చించుకునేవారట. ఇంటిలో స్విమ్మింగ్ పూల్తో పాటు.. అన్ని రకాల వసతులు ఉండేవట. ఆమె ఇంటిలోని లగ్జరీ వసతులు చూసి అప్పట్లోని స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారట. ఇక తన భర్త మరణాంతరం బిజినెస్ వ్యవహారాలను కొంతకాలం పాటు ఆమె చూసుకున్నారట. ప్రస్తుతం వ్యాపారాలను తన కూతురు చూసుకుంటున్నట్లు కేఆర్ విజయ తెలిపారు. -
అప్పట్లో అందంతో అలరించింది.. ఇప్పుడేంటీ ఇంతలా మారిపోయింది!
సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలు ఎక్కడికెళ్లినా తమ అభిమానులతో ఫోటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. ఇటీవల సీనియర్ హీరోయిన్స్ సైతం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించని ఓ సీనియర్ నటి తాజాగా కెమెరాకు చిక్కింది. బుల్లితెరతో పాటు పలు చిత్రాల్లో తనదైన నటనతో పేరు తెచ్చుకున్నారు. 2003లో వచ్చిన తమిళ బాయ్స్ చిత్రం ద్వారా గుర్తింపు దక్కింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మొదటి చిత్రం కుర్ కురే. తెలుగులో దొంగ రాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమ శాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించిన భువనేశ్వరి వెండితెరకు దూరమై పలు సీరియల్స్‌లో నటించింది. ఏపీలోని చిత్తూరు ఆమె స్వస్థలం కాగా.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. చాలా రోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కింది భువనేశ్వరి. తిరుమల దర్శనానికి వచ్చిన ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో సినిమాల్లో తన అందంతో అలరించిన ఆమెను ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు. కెరీర్ ప్రారంభంలో డబ్బింగ్ సీరియల్స్‌లో నటించిన భువనేశ్వరి.. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. చాలా వరకు బోల్ట్ సీన్స్‌లోనే నటించింది. కానీ అనుకోకుండా ఓ సారి ఊహించని షాక్ ఇచ్చింది. చెన్నైలో ఓ వ్యభిచార గృహాన్ని నడిపారని ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఆ వార్త సంచలనంగా మారింది. తాజాగా ఆమె తిరుమలకు రావడంతో కెమెరాలకు చిక్కింది. (ఇది చదవండి: డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు) -
రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు
అలనాటి అందాల తార, సీనియర్ నటి కాంచన ఇప్పటితరం ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే. అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఎన్నో వందల చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆడపదడపా పాత్రలు చేస్తున్న ఆమె అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండకు బామ్మగా కనిపించారు. అందాల నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన కాంచన తాజాగా దర్శక ధీరుడు రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేశారు. చదవండి: ఆస్కార్‌కు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే.. తనని రాజమౌళి అవమానించారని ఆరోపించారు. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ ‘బాహుబలి’ సినిమా సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కాంచన మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. రెండు రోజులు షూటింగ్‌కి నా డేట్స్ అడిగారు. నేను రూ. 5 లక్షల పారితోషికం అడిగాను. నాకు అంత ఇవ్వడానికి ఆయన చాలా ఆలోచించారు. నా పాత్రకు అది ఎక్కువ అన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పి నన్ను వద్దనుకున్నారు’ అని వాపోయారు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? అనంతరం మాట్లాడుతూ.. ఐదు లక్షలు తనకు పెద్ద అమౌంట్ కాదని, తనలాంటి వాళ్లకు ఇస్తే సేవలు చేసుకుంటాము కదా అని కాంచన పేర్కొన్నారు.. ‘రాజమౌళిలాంటి స్టార్ డైరెక్టర్‌కి అది పెద్ద అమౌంట్ కాదు. నాకు ఆ డబ్బు పెద్ద విషయమే కాదు. కానీ, నా లాంటి వారికి ఇస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అదే ముసలి హీరోలకు మాత్రం ఇస్తారా? నేను మిమల్ని విమర్శించడం లేదు. నాలాంటి ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేస్తున్నా’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అకాడమీ అవార్డు వేడుక నేపథ్యంలో మూడు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్న జక్కన్న నాటు నాటు ఆస్కార్ గెలిచిన అనంతరం రీసెంట్గా ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఆ హీరో అర్ధరాత్రి తాగి వచ్చి తలుపు తీయమని గొడవ చేశాడు: నటి
ఒకప్పుడు తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వెన్నిరాడై నిర్మల. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అనే బేధాలు లేకుండా దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిందామె. వందలాది చిత్రాలు చేసిన ఆమె తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. వెన్నెలాడె చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాలుగు వందలకు పైగా చిత్రాలు చేసింది. తెలుగులో భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కల్యాణం చూద్దము రారండి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక తెలుగు చిత్రాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. 'ఒక రోజు ఏమైందంటే.. సినిమా షూటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేశా. ఆ సినిమాలోని హీరో నా ఇంటికి అర్ధరాత్రి తాగి వచ్చి తలుపు తట్టాడు. నేను డోర్ ఓపెన్ చేయలేదు. అతడేమో అలాగే తలుపు తడుతూనే ప్లీజ్, డోర్ ఓపెన్ చేయండి, నేనేం చేయను.. జస్ట్ లోపలకు వచ్చి నీ పక్కనే నిద్రించి వెళ్లిపోతా అన్నాడు. తర్వాతి రోజు నుంచి నేను షూటింగ్‌కే వెళ్లలేదు సరికదా సినిమా కూడా చేయనని చెప్పేశాను. దర్శకనిర్మాతలు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ నా వల్ల కాదంటూ సినిమా నుంచి వైదొలిగాను. ఇలాంటివాటిని నేనస్సలు సహించను' అని చెప్పుకొచ్చింది నిర్మల. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్
వెండితెరపై అలరించిన అలనాటి తారలేందరో ప్రస్తుతం కనుమరుగయ్యారు. అందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. 80,90లో తమ అందం, అభిమనయంతో ఆకట్టుకున్న ఎంతో స్టార్ హీరోయిన్స్ వెండితెరకు దూరమై పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో సీనియర్ నటి, ‘మాతృదేవోభవ’ ఫేం మాధవి ఒకరు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్‌కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన తెనె కళ్లలతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు. చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక మాధవి గ్లామర్, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్ పీక్‌లో ఉండగానే మాధవి సడెన్‌గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్ మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్ ఫొటోలు చూసి నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Maadhavi (@actress.maadhavi) View this post on Instagram A post shared by Maadhavi (@actress.maadhavi) -
‘ఖడ్గం’లో ఆ సీన్ చేస్తుండగా నన్ను హేళన చేశారు: నటి సంగీత
నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మసూద చిత్రంతో పలకరించిన ఆమె గతంలో ఖడ్గం మూవీపై ఆమె చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఖడ్గం మూవీ సమంయలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఈ సినిమా సంగీత ఫుల్ జూవేల్లరితో సినిమా చాన్స్‌ల కోసం సిటీకి వచ్చిన పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సీన్లో తనకు వేసిన మేకప్ అసలు నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కృష్ణవంశీకి పిచ్చా అన్నారు: సంగీత ‘‘ఖడ్గం’ సినిమాలో నా ఎంట్రీ సీన్ మేకప్ నాకు మైనస్ అయ్యింది. అది నాకు అసలు నచ్చలేదు. దాంట్లో నన్ను నేను చూసుకోలేకపోయా. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అయితే అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆ సీన్ షూటింగ్ జరిగింది. షూట్ అనంతరం చిత్ర యూనిట్ అంతా నా దగ్గరికి వచ్చి ‘మీరు బాగా చేశారు. షాట్ చాలా బాగా వచ్చింది’ అని ప్రశంసించారు. కానీ షూటింగ్ చూడటానికి వచ్చిన పబ్లిక్ మాత్రం ‘ఈమె హీరోయిన్ ఏంటీ?’ అంటూ హేళన చేశారు. ‘కృష్ణవంశీకి పిచ్చా. ఈమెను హీరోయిన్గా తీసుకున్నారేంటి’ అంటూ విమర్శించారు’’ అని సంగీత చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి ముందు సంగీతకు పెళ్లి తర్వాత సంగీతకు తేడా ఏంటి? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ‘నాకు నా భర్త ఎలాంటి షరతులు పెట్టలేదు’ అని చెప్పారు. ఆ తర్వాత తనకు పడుకోవడమంటే చాలా ఇష్టమని, వదిలేస్తే 24 గంటలు పడుకూనే ఉంటానంది. తన బెస్ట్ హాలిడే స్పాట్ ఏంటని అడగ్గా.. తన ఇల్లే తనకు బెస్ట్ హాలిడే స్పాట్ అంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. చదవండి: 30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్‌కు చెల్లిగా.. అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. -
పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: సీనియర్ నటి
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సరసన నటించి తెలుగు నటీమణుల్లో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటీమణి రాజశ్రీ. అలనాటి అందాల నటీమణులలో రాజశ్రీ ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు వంటి స్టార్ హీరోల సరసన నటించారు. అప్పట్లోనే ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమా చేసి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇక తెలుగు ఎన్టీఆర్, కాంతారావు వంటి స్టార్స్‌తో ఎక్కువగా నటించిన ఆమె జానపద జోనర్ చిత్రాలతో గుర్తింపొందారు. చదవండి: భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి? కెరీర్ పీక్స్‌లో ఉండగానే పొలిటికల్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్లి సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం కొడుకు, మనవళ్లతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఆమె భర్త చనిపోయిన అనంతరం కఠిన పరిస్థితులు చూశానని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలను, మూవీ కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయాక హైదరాబాద్‌కు పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసకున్నానని చెప్పారు. ‘‘హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకున్నా. నాకు చెప్పకుండ పెళ్లి చూపులు అరెంజ్ చేశారు. అంతా ఒకే అయ్యి పెళ్లి అయిపోయింది. వివాహం తర్వాత సినీ పరిశ్రమ వైపు తొంగి చూడలేదు. అందరు నన్ను ఎంతో అదృష్టవంతురాలిగా చూశారు. రాజశ్రీకి ఏంటి ఆహా, తంతే బూరెల బుట్టలో పడింది’ అని అంతా నా గురించి మాట్లాడుకునేవారు’’ అని చెప్పారు. ‘అలా మా అత్తగారి వాళ్లది ఉన్నతమైన కుటుంబం కావడంతో గూటిలో పక్షిలా బతికాను. కొంతకాలానికి నా భర్త చనిపోయారు. దీంతో ఒక్ససారిగా నా జీవితం తలకిందులైంది. చదవండి: ఇకపై మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుంది: ఖుష్బూపై చిరు ప్రశంసలు నా కొడుకు మూడేళ్లు ఉన్నప్పుడే ఆయన గుండెపోటుతో చనిపోయారు. మా అమ్మ చనిపోయింది, పెళ్లయిన కొంతకాలానికే భర్త మరణించాడు. ఆ డిప్రెషన్‌తో నేను పదేళ్లు బయటకు రాలేదు. బయట ప్రపంచానికి నా ముఖం కూడా చూపించకుండ బతికాను. అప్పటి వరకు ఆహా అంటూ సాగిన నా జీవితం ఒక్కసారిగా కిందకు పడిపోయింది’ అంటూ వాపోయారు. ప్రస్తుతం తన కొడుకు అమెరికాలో సెటిలైయ్యాడని, చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. తరచూ అమెరికా, ఇండియాకు తిరుగుతూనే ఉంటానని ఆమె తెలిపారు. -
అందుకే సినిమాలకు దూరమయ్యాను: లయ
స్వయంవరం(1999) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది లయ. తొలి సినిమాకే నంది అవార్డు గెలుచుకుంది. మనోహరం, ప్రేమించు సినిమాలకు సైతం వరుసగా నంది అవార్డులు అందుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు సినీరంగంలో స్టార్‌గా వెలుగొందిన లయ పలువురు హీరోలతో నటించింది సీనియర్ నటి లయ.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో హల్చల్ చేస్తోంది. తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఆయనెప్పుడూ సినిమాలు చేయొద్దనలేదు. కానీ ఎందుకో అలా జరిగిపోయింది. ఇప్పటికీ నా రీల్స్, ఫోటోలు అన్నీ ఆయనే తీస్తాడు. నా భర్త నన్ను అన్నిరకాలుగా సపోర్ట్ చేస్తాడు. ఆయన లేకుండా నేనేం చేయలేను. అయితే కష్టపడి ఇండస్ట్రీలో ఒక పొజిషన్‌కు వచ్చాక అన్నీ వదిలేసుకుని వెళ్లిపోవడమంటే చాలా కష్టం. నా కుటుంబాన్ని, సినిమాలను బ్యాలెన్స్ చేసుకోగలను. కానీ మా ఆయన యూఎస్‌లో ఉండటం వల్ల దూరం పెరిగింది. ఇండియాకు, అక్కడికి తరచూ ప్రయాణించడం కష్టం. అలా సినిమాలకూ దూరమయ్యాను' అని చెప్పుకొచ్చింది లయ. చదవండి: నయనతార, హన్సిక పెళ్లైపోయింది.. నెక్స్ట్ శింబు పెళ్లే.. క్లారిటీ ఏంటంటే? -
డైరెక్టర్ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు: ఆమని
కలలు అందరూ కంటారు, కానీ కొందరే అది నెరవేర్చుకునేందుకు కృషి చేస్తారు, అందులో కొందరే సఫలీకృతులవుతారు. ఆ కొద్దిమందిలో నటి ఆమని ఒకరు. నటి అవ్వాలనుకున్న ఆమె ఒడిదుడుకులెదురైనా జంకలేదు. పట్టు వీడకుండా తన ప్రయత్నాలు కొనసాగించింది. చివరకు నటిగా ఛాన్స్ పట్టేయడమే కాదు, తన యాక్టింగ్ స్కిల్స్‌తో అద్భుత నటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. 'ఇండస్ట్రీలోకి రావడానికి నేను కూడా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్ కోసం కంపెనీలకు వెళ్లేదాన్ని. కొన్ని కంపెనీల్లో సెలక్ట్ అయ్యేదాన్ని. కొన్నింటిలో రిజెక్ట్ చేసేవాళ్లు. అయితే కొందరు చెప్పి పంపిస్తామనేవాళ్లు. అంటే ఏంటో మొదట నాక్కూడా అర్థం కాలేదు. మేడమ్, డైరెక్టర్‌గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేవాళ్లు. ఎందుకు? అని అడిగితే మేకప్ టెస్ట్ చేయాలంట అని చెప్పారు. సరే, అమ్మతో కలిసి వస్తా అన్నాను. ఆయన మాత్రం అమ్మగారు వద్దు, మీరు ఒంటరిగా రావాలి అన్నాడు. వెంటనే అమ్మ.. తను ఒంటరిగా రాదు, ఇద్దరం కలిసే వస్తామని చెప్పింది. దీంతో ఆయన వద్దులెండి, డైరెక్టర్ గారు వద్దంటున్నారు అని ఫోన్ కట్ చేసేవాళ్లు. నాకు పోనుపోనూ అర్థమైంది. అమ్మ లేకుండా నన్నొక్కదాన్నే ఎందుకు రమ్మంటున్నారో తర్వాత తెలిసొచ్చింది. ఇలా చాలా జరిగాయి. కానీ ఎక్కడా నేను కాంప్రమైజ్ కాలేదు. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకిష్టం లేదు. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది' అని క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది ఆమని. చదవండి: కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది: ఆమని -
పెళ్లిపీటలెక్కుతున్న జయమాలిని తనయుడు!
స్పెషల్ సాంగ్స్‌తో ఓ ఊపు ఊపేసిన నిన్నటితరం హీరోయిన్ జయమాలిని. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అప్పట్లో ఆమెకు మంచి క్రేజ్ ఉండేది. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో ఆడిపాడింది. కెరీర్ ప్రారంభంలో ఒకటీరెండు సినిమాల్లో హీరోయిన్గా నటించినా తర్వాత మాత్రం డ్యాన్సర్‌గానే అభిమానులను ఉర్రూతలూగించింది. పోలీస్ అధికారి పార్తీబన్‌ను పెళ్లాడిన తర్వాత ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయించింది. కాగా జయమాలిని తనయుడు శ్యామ్ హరి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న చెన్నైలోని వీజీపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్‌లో శ్యామ్ పెళ్లి జరగనుందంటూ ఓ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయట. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతడి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినీప్రముఖులు సైతం మండపానికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తారట. చదవండి: ఆ కష్టం విలువ తెలుసు, మా పిల్లల్ని అలానే పెంచుతాం: ఉపాసన -
ఎంతగానో ప్రేమించా, పెళ్లి చేసుకున్నా, కానీ నన్ను వదిలేసి..: నటి
ప్రముఖ నటి భానుప్రియ చెల్లెలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శాంతిప్రియ. తనదైన నటనతో కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహర్షి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. మహర్షి మూవీలో మాట రాని మౌనమిది.. పాటలో ఆమె పలికించిన హావభావాలు అందరినీ కట్టిపడేశాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'సౌత్‌లోనే కాకుండా హిందీలో కూడా నటించాను. బాలీవుడ్లో ఏడాదిన్నర కాలంలోనే ఐదారు సినిమాలు చేశా. ఆ సమయంలో సిద్దార్థ్ రాయ్‌తో ప్రేమలో పడ్డా, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని ఎవరూ చెప్పలేదు, కానీ నేనే ఇక ఇల్లాలిగా ఉండిపోదామనుకున్నాను. భర్త చనిపోయాక నేనొక షాక్‌లో ఉండిపోయాను. ముంబైలో నాకంటూ ఎవరూ లేరు, దీంతో నేను ఇల్లు దాటి బయటకు రాలేదు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అమ్మ, అక్క, అన్నయ్య, నా పిల్లలు నాకు అండగా నిలబడ్డారు. చెన్నై వచ్చేయమన్నారు, కానీ నేను నా కాళ్ల మీద నేను నిలబడాలనుకున్నాను. అమ్మ కూడా సింగిల్ పేరెంట్ కావడంతో తనను చూసి ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఈ మధ్యే ధారావి బ్యాంక్ అనే ఓటీటీ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాను. వెంకటేశ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు' అని చెప్పుకొచ్చింది శాంతిప్రియ. -
సాంగ్ షూటింగ్.. నా కళ్లముందే మంటల్లో కాలిపోయాడు: ఆమని
అమ్మదొంగ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది ఆమని. ఒకప్పుడు హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం హీరోహీరోయిన్ల తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కళ్లముందు జరిగిన ఘోరాన్ని చెప్పుకొచ్చింది. 'నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. కెమెరామన్ లోక్ సింగ్ గారు నా కళ్లముందే మంటల్లో కాలిపోయారు. ఆ రోజు జూబ్లీహిల్స్‌లో ఓ పాట షూట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బండలపై పెట్రోల్ పోశారు. ఆ మంటల మధ్యలో మేము డ్యాన్స్ చేస్తున్నాం. లోక్‌నాధ్‌గారు పైన క్రేన్‌లో ఉన్నారు. ఫస్ట్ టేక్ ఓకే అయింది. కానీ ఆయనకు మంటలు ఇంకాస్త ఎక్కువుండాలంటూ వన్ మోర్ అన్నాడు. అప్పుడు చలికాలం కావడంతో మేము దుప్పటి పట్టుకుని ఓ పక్కన కూర్చున్నాం. తిరిగి లొకేషన్లో మంటలు అంటిస్తున్నారు. ఆ క్రేన్‌లో ఉన్న వ్యక్తి కిందకు దిగి వచ్చి మీరు సరిగా పెట్రోల్ పోయడం లేదంటూ చెంబు అందుకున్నాడు. ఓ బండపైన పెట్రోల్ పోశాడు. అంతే ఆ పక్కనున్న ఫైర్ ఒక్కసారిగా లేచి ఈయనకు కూడా మంటలంటుకున్నాయి. మా కళ్ల ముందే ఆయన నిలువునా కాలిపోయాడు. మరణం ఆయన్ను పిలిచింది. లేదంటే ఎక్కడో కూర్చున్న వ్యక్తి పెట్రోల్ పోయడమేంటి? అది అంటుకోవడమేంటి? చాలా భయంకరమైన మరణమిది' అని గుర్తు చేసుకుంది ఆమని. చదవండి: ఆ ఒక్క సినిమా వల్ల నేను హీరోయిన్ కాలేకపోయా -
నా భర్తను హత్య చేసి ఆ నింద నాపై వేశారు: నటి
మరో చరిత్ర సినిమాతో వెండితెరకు పరిచయమైంది కాకినాడ శ్యామల. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, బాబాయ్ అబ్బాయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 200 చిత్రాల్లో నటించింది. ఇటీవలే తన ఆస్తులు ఎలా కరిగిపోయాయో వెల్లడించిన ఆమె తనపై, తన భర్తపై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టింది. 'నా భర్తను హత్య చేశారు. కానీ ఆ హత్య నేను చేయించినట్లు నాపై నింద వేశారు. దాన్ని నేను తప్పని నిరూపించి హత్య చేసిన వ్యక్తికి 18 ఏళ్లు జైలుశిక్ష పడేలా చేశాను. ఒకరోజు నేను బయటకు వెళ్లి వస్తుంటే ఒకతను నా నెత్తిపై కొట్టాడు. బాధతో నేను తల్లడిల్లుతుంటే నన్ను ఇంకా కొడుతూనే ఉన్నాడు. అలా నన్ను కూడా చంపాలని చూశారు. ఇదంతా చేయించింది మరెవరో కాదు, నాకు వరుసకు కొడుకైన వ్యక్తి! స్వయానా నా భర్త అన్న కొడుకే ఆస్తి కోసం ఇంత కుట్ర పన్నాడు. చివరకు నన్ను అనాధను చేశారు. నాకు పిల్లలు పుట్టకపోవడంతో చెల్లి కూతుర్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను' అంటూ కంటతడి పెట్టుకుంది కాకినాడ శ్యామల. చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం -
600 ఎకరాలు పోయాయి.. మగాడివే కాదని భర్తను తిట్టాను: నటి
కాకినాడ శ్యామల.. తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుని దాదాపు 200 భాషల్లో నటించింది. రంగస్థలంలో తన సత్తా చాటిన ఆమె మరో చరిత్ర సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మరో చరిత్ర, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, ఆనంద భైరవి, మయూరి, బాబాయ్ అబ్బాయ్.. ఇలా చెప్పుకుంటే పోతే తెలుగులో చాలా సినిమాలే చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తులు ఎలా కరిగిపోయాయనే విషయాన్ని బయటపెట్టింది. 'మరో చరిత్ర మూవీతో నా సినీ కెరీర్ మొదలైంది. నటించడమే కాకుండా నిర్మాతగానూ కొన్ని చిత్రాలు తెరకెక్కించాను. కృష్ణంరాజుతో నిత్య సుమంగళి సినిమా తీశాను. అది బానే ఆడింది, కానీ డిస్ట్రిబ్యూటర్ మోసం చేయడంతో డబ్బులు పోయాయి. పచ్చబొట్టు సినిమా తీశాం. అప్పుడు మళ్లీ డిస్ట్రిబ్యూటర్‌తో విబేధాలు రావడంతో సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. మధ్యలో మా ఆయన్ను పెళ్లి చేసుకున్నాను. ఆయనకు మా మామయ్యగారు 600 ఎకరాలు రాసిచ్చారు. మా ఆయన రసికుడు, పని పాటా లేదు. ఆరు వందల ఎకరాలను 38 ఎకరాలు చేశాడు. నేను ఆయన్ను చాలా తిట్టేవాడిని.. మగాడివైతే సంపాదించి భార్యాబిడ్డలకు పెట్టాలి. అలాంటి మగాడిని ఇష్టపడతాను. నా దృష్టిలో నువ్వు మగాడివే కాదని ముఖం మీదే తిట్టాను. ఆయన 63 ఏళ్ల వయసులో చనిపోయాడు' అని చెప్పుకొచ్చింది. చదవండి: నాన్న చనిపోయారనగానే హ్యాపీగా ఫీలయ్యా: జబర్దస్త్ పవిత్ర -
రూమ్‌లో అడ్జస్ట్ అవుతారా అని అడిగారు: సీనియర్ నటి
కుట్టి పద్మిని సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించిది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళ చిత్రంతో బాల నటిగా తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ మొదలైన నటులతో కలిసి నటించింది. ఆమె నటనకు తమిళనాడు రాష్ట్రం జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకున్న తొలినటిగా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పద్మిని మాట్లాడూతూ.. 'అప్పుడు నా వయసు 16 ఏళ్లు. అప్పట్లో సావిత్రి, జమున ఉన్న సమయం. అప్పట్లో దర్శకులు కొంచెం అడ్జస్ట్మెంట్లు చేస్తారా అని అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు. నాకు గ్లామర్ డ్రెస్ అంటే ఇష్టముండదు. అలాంటి డ్రెస్సులు నాకు నచ్చవు. నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. అలా కొన్ని సినిమాలు మిస్సయ్యా. హీరోయిన్గా చాలా అవకాశాలు వదులుకున్నా. నాకన్న శ్రీదేవి బాగా ఫేమస్ అయింది. ఆ అదృష్టం నాకు రాలేదు.' అని అన్నారు. అనంతరం పద్మిని మాట్లాడూతూ.. 'కానీ నేను ఇప్పుడు రోజు 140 మందికి జీతాలు ఇస్తున్నా. ఎవరెవరు నాకు అవకాశం ఇవ్వలేదో వారికే నేను ఉపాధి కల్పించా. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఎవరైతే నన్ను రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాలని పిలిచారో వారికే సాయం చేస్తున్నా. నేను బాగున్నానంటే నేను చేసిన పనులే. నా భర్త పెళ్లయిన 22 ఏళ్ల తర్వాత నా సెక్రెటరీని లవ్ చేశారు. పెళ్లయి పిల్లలు కన్నాక సడన్‌గా భర్తపై కోపం ఎలా వస్తుంది. నేను అడ్జస్ట్ చేసుకుని ఉండాలి లేదా ఒంటరిగా ఉండాలి. నేను ఒంటరిగానే ఉంటున్నా. చాలా సంతోషంగా ఉన్నా' అని అన్నారు. -
కాపురాలు కూల్చడం మాకు సరదా కాదు: నటి
పచ్చని కుటుంబం చిన్నాభిన్నం కావడానికి ఆడవాళ్లే కారణం కాదంటోంది సీనియర్ నటి అరుణ ఇరానీ. మగవాళ్లే ఇల్లాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని, కానీ వారిని పక్కనపెట్టి ఇతర మహిళలనే లోకం తప్పుపడుతోందని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడవాళ్లు తమ కాపురాలు కూలిపోవడానికి మరో ఆడదే కారణం అని వారిని తిడుతుంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి.. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత మీ భర్తది కానీ వేరేవాళ్లది ఎలా అవుతుంది? ముందు అతడిని అదుపులో పెట్టండి. కేవలం ఒకరి సంసారాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఏ అమ్మాయి వివాహేతర సంబంధానికి పూనుకోదు. ఉదాహరణకు హేమమాలినిని తీసుకోండి. ఆమె ధర్మేంద్ర కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాన్న ఉద్దేశంతో అతడిని పెళ్లి చేసుకుందా? కాదు కదా! ఏదో ఒక కాగితం మీద రాసుకున్నదాన్ని బట్టి అతడు నా భర్త, ఆమె నా భార్య అంటుంటారు, కానీ ఆ పేపర్‌కు పెద్ద విలువేమీ ఉండదు. ప్రేమకు ఉన్న సెక్యూరిటీ పెళ్లికి లేదు. ప్రేమ లేనిచోట పెళ్లి చేసుకున్నా వృధానే.. అయినా ఆల్రెడీ పెళ్లైన మగవారితో మళ్లీ ఏడడుగులు నడవడం అంత సులువైన విషయం కాదు. అర్ధరాత్రి నా బిడ్డకేదైనా అయితే ఆ మనిషికి నేను ఫోన్ చేయలేను. అలాంటి బాధలు పడటం ఎందుకని పిల్లలు వద్దనుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అరుణ ఇరానీ 1990లో ఫిలింమేకర్ కుకు కోహ్లిని పెళ్లాడింది. అప్పటికే అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నటి, కొడుకుతో కలిసి విదేశాలకు -
తెలుగులో ఫస్ట్ మూవీ.. పది పేజీల డైలాగ్: సీనియర్ నటి
రజని అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ అప్పటి తెలుగు సినిమా అభిమానులకు ఆమె సుపరిచితురాలు. ఆ కాలంలో ఆమె అందాల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచింది. దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఆగ్ర హీరోల సినిమాల్లోనూ కనిపించింది. ఎలాంటి సినీ నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1985లో ‘బ్రహ్మముడి’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు రజనీ. తొలి సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. సీతారామ కల్యాణం, రెండు రెళ్ల ఆరు, అహ నా పెళ్లంట చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మజ్నులో నాగార్జున , సీతరాముల కల్యాణంలో బాలకృష్ణ సరసన నటించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు సినిమాల్లో ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రజిని మాట్లాడుతూ..' దాసరి నారాయణరావు నుంచి ఫోన్ వచ్చింది. మా అన్నయ్య దాసరి వద్దకు వెళ్లారు. ఈ సినిమాలో మీ చెల్లెలు హీరోయిన్ అని చెప్పారు. నాన్నను అడిగితే నీకు ఇష్టమైతే చేయి అన్నారు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. అప్పట్లో డీడీలో తెలుగు నెలకొకసారి వచ్చేది. నాకేమో తెలుగు రాదు. ఫస్ట్ డేనే కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్. ఈ డైలాగ్స్ అన్నీ మీవే అని ఒకాయన ఓ పది పేజీల నా చేతిలో పెట్టారు. అప్పుడే నాకు చాలా భయమేసింది. ఇక డైరెక్టర్ వస్తే బయటకు పో అనడం ఖాయమని ఫిక్స్ అయిపోయా. ఆయన చెప్పిన వెంటనే వెళ్లిపోదామనుకున్నా. నాకు తెలుగులో నమస్కారం తప్ప ఏమీ రాదు. కాసేపటికే దాసరి నారాయణరావు వచ్చారు. ఆ డైలాగ్ చెప్పడం రాదు సార్ అన్నా. వెంటనే డైలాగ్ పేపర్ ఇచ్చిన ఆయన్ను పిలిచి బయటకు పంపారు. ఆ డైలాగ్ పేపర్ తీసుకుని అవీ చదవడం నాకే కష్టంగా ఉంది నీకెలా వస్తాయన్నారు. ఆ క్షణం నాకు దేవుడిలా కనిపించారు. అప్పుడే ఆయనను గురువుగా భావించా. అంతవరకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నేను కాస్త కూల్ అయ్యా. 1234 వచ్చా అన్నారు. ఏ భాషలోనైనా చెప్పు.. ఏమీ రాకపోతే 1234 చెప్పు చాలు అన్నారు. నా ఫస్ట్ మూవీలో నంబర్స్తోనే నేను డైలాగ్స్ చెప్పా. బ్రహ్మముడి సినిమాతో నా కెరీర్లో తెలుగులో ప్రారంభమైంది. నేను తెలుగులో మాట్లాడాతుంటే నవ్వడం స్టార్ట్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చింది అలనాటి అందాల నటి రజినీ. -
‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
సీనియర్ నటి, హీరోయిన్ సాక్షి శివానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు, రాజశేఖర్ వంటి అగ్ర నటులతో జతకట్టింది. 90లో స్టార్ హీరోయిన్గా రాణించిన సాక్షి చిరంజీవి మాస్టర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున సీతారామారాజు మూవీలో అలరించింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సాక్షి ఆ తర్వాత సడెన్‌గా సినిమాలకు దూరమైంది. తెలుగులో హీరోయిన్గా కనిపించిన ఆమె చివరి చిత్రం సింహరాశి. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పుటికి ఆ తర్వాత సాక్షికి అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో తమిళ్, కన్నడ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. అలా ఆడపదడపా చిత్రాల్లో నటించిన ఆమె 2008లో జగపతిబాబు నటించిన హోమం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత 2010లో శ్రీకాంత్ నటించిన ‘రంగ ది దొంగ’ సినిమాలో నటించిన సాక్షికి తెలుగులో చివరి చిత్ర ఇదే. ఆ తర్వాత ఆమె మరే సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంటుంది. కాగా తెలుగులో ఆమె బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు మహేశ్ బాబుతో యువరాజుతో పాటు మరిన్ని చిత్రాలతో ఆకట్టుకుంది. పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే ఇటీవల ఆమె బర్త్‌డే సందర్భంగా ఆమె లేటెస్ట్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో సాక్షి గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పటికే అలాగే అందంగా, గ్లామరస్‌గా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Happy Birthday to Sakshi Shivanand#SakshiShivanand #Actress About: https://t.co/FxnCqP9IQf pic.twitter.com/Z4K69OVLpX — Celebrity Born (@CelebrityBorn) April 15, 2017 -
అందుకే అజిత్ సినిమా నుంచి తప్పుకున్నా: జయసుధ
‘సహజనటి’ జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 80లలో హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తున్నారు. తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వెండితెరపై తల్లి పాత్ర అంటే వెంటనే గర్తొచ్చే పేరు జయసుధదే. అందుకే ఆమె దాదాపు స్టార్ హీరోలందరికి తల్లిగా నటించారు. చదవండి: కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం ఒక్క తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు(వారసుడు) మూవీలో ఆమె హీరోకి తల్లిగా నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. వారిసు సక్సెస్ నేపథ్యంలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు స్టార్ హీరోలందరిక మదర్‌గా చేశారని, కానీ నటుడు అజిత్‌తో మాత్రం నటించలేదు ఎందుకు? అని ప్రశ్న ఎదురైంది. చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ దీనికి ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు అజిత్ వలిమై సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక్క రోజు షూటింగ్‌కు కూడా హాజరయ్యాను. అయితే కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్ వాయిదా పడింది. తర్వాత షూటింగ్ మొదలైనా.. కొవిడ్ భయం కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. నా స్థానంలో ఆ పాత్రకు సుమిత్ర నటించారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఏడాది సంక్రాతికి అజిత్ తునివు, విజయ్ వారిసు చిత్రాలు విడుదల కాగా వారి అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడిచిన విషయం తెలిసిందే. -
కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున, కానీ..
తెలుగువారి సత్యభామగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన జమున (86) ఇకలేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 7.30 ని‘‘లకు తుదిశ్వాస విడిచారామె. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ హైదరాబాద్ చేరడానికి ఆలస్యం కావడంతో కుమార్తె స్రవంతి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పాణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించారు జమున. తండ్రికి గుంటూరులో పొగాకు, పసుపు వ్యాపారాలుండేవి. శ్రీనివాసరావు వ్యాపార రీత్యా జమున బాల్యమంతా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో గడిచింది. చక్కని సంగీత విద్వాంసురాలు అయిన కౌసల్యాదేవి జమునకి శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. దుగ్గిరాల గ్రామస్తులు వేసిన ‘ఛలో ఢిల్లీ’ నాటకంలో తొలిసారి వసుంధర అనే పాత్ర వేశారు జమున. ఆ తర్వాత ‘మా భూమి, ఖిల్జీ రాజ్యపతనం..’ ఇలా పలు నాటకాలు వేశారు జమున. దుగ్గిరాలకు చెందిన శ్రీమన్నారాయణమూర్తి అనే నటుడు జమున గురించి నిర్మాత బీవీ రామానందంకు (‘వరూధిని’ సినిమా తీశారు) చెప్పారు. దీంతో ఆయన నిర్మిస్తున్న తర్వాతి చిత్రం ‘జై వీర భేతాళ’(1952 మార్చిలో స్టార్ట్ అయింది) అనే సినిమాలో హీరోయిన్గా జమునకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో గుమ్మడి హీరోగా ఎంపికయ్యారు. అయితే ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ (1953) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు జమున. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య వంటి అగ్రహీరోల సరసన కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించి భేష్ అనిపించుకున్నారామె. దాదాపు 200 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో జమున నటించినా బాగా పేరు తెచ్చినవాటిలో సత్యభామ పాత్రని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో ఆమెను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం అన్నట్టుగా జీవించారు జమున. ‘సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్, భాగ్యరేఖ, గుండమ్మకథ’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమున. ‘తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారామె. లెక్చరర్‌తో పెళ్లి... హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోని వారిని కాకుండా ఇతర రంగంలోని వారిని వివాహం చేసుకోవడం నటి పద్మినీతో ఆరంభమైంది. అలా వివాహం చేసుకున్న రెండో హీరోయిన్ జమున. దూరపు బంధువైన రమణారావుతో 1965లో జమున వివాహం తిరుపతిలో జరిగింది. రమణారావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ, జువాలజీ లెక్చరర్‌గా చేసేవారు. డాక్టరేట్ అందుకున్న తర్వాత ఉస్మానియా విశ్వ విద్యాలయానికి బదిలీ అయ్యారాయన.. దీంతో కాపురాన్ని హైదరాబాద్‌కి మార్చారు. జమున కూడా మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. 1976లో బంజారాహిల్స్‌లో సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారామె. రమణారావు–జమునలకు వంశీకృష్ణ, స్రవంతి సంతానం. తొలి సంతానం వంశీకృష్ణ పుట్టిన తర్వాత కూడా పదేళ్లపాటు హీరోయిన్గా బిజీగానే కొనసాగారు జమున. వంశీకృష్ణ శాన్ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. బర్కిలీలోని స్టెయిన్డ్ గ్లాస్ గార్డెన్లో గ్లాస్ పెయింటింగ్‌లో శిక్షణ పొంది, అదే రంగంలో స్రవంతి స్థిరపడ్డారు. స్రవంతిని హీరోయిన్ చేయాలనుకున్నారు జమున. అయితే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారామె. కాగా ఓ నవల ఆధారంగా సినిమా తీయాలని, దానికి తనే దర్శకత్వం వహించాలని సంకల్పించారు జమున. నాలుగు పాటలు రికార్డు చేసిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. అయితే దర్శకత్వంపై తనకున్న మమకారంతో ‘డాక్టర్ మమత’ అనే సీరియల్‌ని తెరకెక్కించారామె. దూరదర్శన్‌లో 15 ఎపిసోడ్స్‌గా ఆ సీరియల్ ప్రసారం అయింది కూడా! రాజకీయ రంగంలో... 1980లలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు జమున. పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికై 1983లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేశారామె. తర్వాత రాజీవ్ గాంధీ సపోర్ట్‌తో 1989లో రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు జమున. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొన్నాళ్లు చేసిన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యవహార శైలి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు.. 1990వ దశకంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పర్యటించి, పదివేల మంది కళాకారుల వివరాలు సేకరించారామె. అంతేకాదు.. ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’కు 26 శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు, పెన్షన్లు మంజూరు చేయించి పెద్ద మనసు చాటుకున్నారు జమున. అవార్డులు... 1964లో విడుదలైన ‘మూగమనసులు’ (తెలుగు), 1968లో రిలీజైన ‘మిలన్’ (హిందీ) చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 2008లో ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ అందుకున్నారామె. అలాగే 2021 సంవత్సరానికిగాను ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు జమున. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో అద్వితీయమైన పాత్రలు చేసిన జమునకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే‘పద్మ’ పురస్కారం వరించలేదు. అయినా అవార్డులకు అతీతంగా ‘సత్యభామ’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ అద్భుత నటి చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. కూతురే కుమారుడై... 2014 నవంబరు 10న జమున భర్త రమణారావు గుండెపోటుతో మృతి చెందారు. అప్పటినుంచి కుమార్తె స్రవంతి దగ్గరే ఉంటున్నారు జమున. తల్లికి అన్నీ తానయ్యారు స్రవంతి. శుక్రవారం ఉదయం జమున మరణించగా, మధ్యాహ్నం ఆమె పార్థివ∙దేహాన్ని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ సాయంత్రం 4.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి జమున అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరింది. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ నేడు (శనివారం) హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో అన్నీ తానై అశ్రునయనాల మధ్య తల్లికి స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజాతోపాటు పలువురు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు. గాయం చేసిన లేత మనసులు... ‘లేత మనసులు’ సినిమా తమిళ వెర్షన్ చేస్తుండగా జరిగిన ఓ ప్రమాదం వల్ల జమున మెడ బాగా దెబ్బతింది. ‘అందాల ఓ చిలుకా..’ పాట తమిళంలో తీస్తున్నారు. హీరో గడ్డిమేట మీద నుంచి జారుకుంటూ వచ్చి జమున పక్కన చేరాలి. అయితే కొత్తవాడైన ఆ చిత్ర హీరో జయశంకర్.. సీనియర్ హీరోయిన్ జమునతో చేస్తున్నాననే కంగారుతో అడ్డదిడ్డంగా వచ్చి జమున తలపై పడ్డారు.. దీంతో ఆమె మెడ విరిగినంత పనయింది. షూటింగ్ నిలిచిపోయింది. సున్నితమైన మెడ నరాలు దెబ్బతినడంతో కొన్నాళ్లు చికిత్స తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు జమున. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.. దీంతో ఆమె మెడ ఎక్కువగా ఊగిపోయేది. ‘రాజపుత్ర రహస్యం’ సినిమాలో ఈ ఇబ్బంది ఆమెలో బాగా కనిపించేది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా తల ఊగడం తగ్గలేదు. 1978లో విడుదలైన ‘శ్రీరామ పట్టాభిషేకం’ తర్వాత సినిమాల నుంచి గౌరవంగా తప్పుకున్నారు జమున. ఆ తర్వాత ‘బంగారు కొడుకు’(1982), ‘జల్సా రాయుడు’(1983), ‘రాజకీయ చదరంగం’(1989) వంచి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు చేశారు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ 2021 జనవరి 29న విడుదలైంది. నటి జమునతో తన అనుబంధాన్ని ‘సాక్షి’తో నటి కాంచన ప్రత్యేకంగా పంచుకున్నారు. నన్ను ఏడిపించేశావ్ కాంచీ అన్నారు – కాంచన ► వారానికి మూడు నాలుగు సార్లు జమున అక్క, నేను మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈ నెల నాకు తీరిక లేకపోవడం, అక్క కూడా ఫోన్ చేయకపోవడంతో మాట్లాడుకోలేదు. మామూలుగా ఫోన్ చేసి, అప్పటి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. ‘భోజనం చేశావా.. వంట ఏంటి?’.. ఇవన్నీ కూడా చెప్పుకునేవాళ్లం. ► జమున అక్క నా సీనియర్. నేను కాలేజీ డేస్ నుంచే సీనియర్లతో జూనియర్లు మాట్లాడకూడదా అనుకునేదాన్ని. ఆ ఫీలింగ్‌తో సీనియర్లతో కూడా బాగా మాట్లాడేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక కూడా అంతే. పైగా మేం చిన్నవాళ్లం అనే ఫీలింగ్ ఏమీ పెట్టుకోకుండా జమునక్క, సావిత్రక్క బాగా మాట్లాడేవారు. ► ఇక దసరా వచ్చిందంటే చాలు... బొమ్మల కొలువు సందడి ఉండేది. ఒకరింటికి ఒకరు వెళ్లడం.. సుండల్ (శెనగలు) తినడం... అంతా బాగుండేది. పైగా జమున అక్క భలే డ్రెస్ చేసుకునేవారు. ఆవిడకు బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. నా డ్రెస్సింగ్ డిఫరెంట్‌గా ఉండేది. సింపుల్‌గా రెడీ అయ్యేదాన్ని. బాగున్నావని మెచ్చుకునేవారు. ► అట్లతద్దిని అయితే ఎప్పటికీ మరచిపోలేను. అప్పట్లో అందరం మదరాసు (చెన్నై)లో ఉండేవాళ్లం కదా. అట్లతద్ది నాడు ఒకళ్లు అట్లు వేసేవాళ్లం. ఇంకొకరు చట్నీ చేసేవాళ్లం. ఇంకొకరు పులుసు.. జమున అక్క, నేను అందరం మెరీనా బీచ్‌కి వెళ్లిపోయేవాళ్లం. అక్కడ ఉయ్యాల కుదరదు కదా. పరుగు పందేలు పెట్టుకుని, చాలా హ్యాపీగా గడిపేవాళ్లం. ► ఆ మధ్య ఒకసారి జమున అక్క ఫోన్ చేసి, ‘నన్ను ఇవాళ బాగా ఏడిపించేశావ్..’ అంటే, నాకేం అర్థం కాలేదు. ‘నేనేం ఏడిపించాను అక్కా...’ అంటే... నువ్వు యాక్ట్ చేసిన ‘కల్యాణ మంటపం’ సినిమా చూశాను. ‘ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశావ్. ఎమోషనల్ సీన్స్‌లో ఏడిపించావ్’ అంటే నాకు పట్టరానంత ఆనందం కలిగింది. ► జమునక్క యాక్ట్ చేసినవాటిలో నాకు ‘మూగ మనసులు’ చాలా ఇష్టం. ఇక ‘మిస్సమ్మ’లో ‘బృందావనమది అందరిదీ..’ పాటకి ఎంతో నాజూకుగా డ్యాన్స్ చేసింది. మనకు ఏమీ తెలియనప్పుడు టీచర్ చెప్పింది చెప్పినట్లు చేస్తాం... ఆ సినిమాలో డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్‌గా టీచర్ చెప్పింది చెప్పినట్లు చేసే క్యారెక్టర్ని అక్క అద్భుతంగా చేసింది. ► మేం కలిసి నాటకాలు కూడా వేసేవాళ్లం. ముఖ్యంగా ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకం చాలాసార్లు వేశాం. అందరూ ఆడవాళ్లే నటించాలన్నది అక్క ఆశ. అలానే ఆడవాళ్లందరం కలిసి నటించాం. సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. నాటకంలో ఆ పాత్ర నాది. సత్యభామగా జమున అక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది కృష్ణుడిగా నా నటనను మెచ్చుకునేది. ► మేమంతా సత్య సాయిబాబా భక్తులం. జీవితం అనేది పోరాటం. ఈ పోరాటంలో గెలిచి నిలబడటం చాలా కష్టమైన విషయం. జమున అక్క నిలబడింది. ఈ గెలుపు కన్నా కూడా బతికున్నంతవరకూ పోరాటం చేసే మనిషి పోయేటప్పుడు ప్రశాంతంగా పోవడమనేది ముఖ్యం. ఆ ప్రశాంతత అక్కకు దక్కింది. ‘దేవుడా.. ఆస్పత్రిపాలు కాకుండా ప్రశాంతంగా తీసుకెళ్లు’ అని కోరుకుంటాం. ఆ సత్య సాయిబాబా ఆశీస్సులతో అక్క ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్లిపోయింది. ఆ జీవుడు చివరి నిమిషంలో ఎలాంటి బాధ పడకుండా నిష్క్రమించింది. ప్రశాంతమైన మనిషికి ప్రశాంతమైన నిష్క్రమణ దక్కింది. ఇది కదా కావాల్సింది (గద్గద కంఠంతో..) పేరు మారిందిలా... జమున పేరు వెనక ఓ విశేషం ఉంది. ఆమె తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేస్తూ, పండరీపురంలోని పాండురంగని దర్శనం చేసుకున్న తర్వాతే కౌసల్య కడుపులో పడ్డారట జమున. ఈ కారణం చేత ‘జనాబాయి’ అని పేరు పెట్టుకోవాలనుకున్నారు జమున తల్లిదండ్రులు. కానీ జన్మరాశి ప్రకారం ఏదైనా నది పేరు రావాలని పెద్దలు చెప్పడంతో ‘జ’కి ‘న’కు మధ్యలో ‘ము’ అక్షరాన్ని చేర్చి ‘జనాబాయి’ పేరును ‘జమున’గా మార్చారు. ఉత్తరాదిలో ‘యుమున’ నదిని ‘జమున’ అంటారు. ‘ఇంత నాజుకైన పేరు పెట్టి సినిమారంగం కోసం మళ్లీ పేరు మార్చుకునే అవసరం లేకుండా చేసిన మా అమ్మను నిజంగా అభినందించాల్సిందే’ అని పలు సందర్భాల్లో జమున గుర్తుచేసుకుని హ్యాపీ ఫీలయ్యేవారు. సావిత్రితో ప్రత్యేక అనుబంధం ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘గుండమ్మకథ’ వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సావిత్రి, జమునల మధ్య మంచి అనుబంధం ఉంది. అక్కాచెల్లెళ్లుగా అన్ని విషయాలను అరమరికలు లేకుండా చర్చించుకునేవారు. అయితే కొందరు వ్యక్తులు కావాలని వీరిద్దరి మధ్యలో తగువులు పెట్టడంతో ఏడాది పాటు సావిత్రి, జమున మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి మునుపటిలానే ఉండసాగారు. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు.. తన కొడుకు బారసాల వేడుకకు సావిత్రి వచ్చారని, ఆ సమయంలో ఆమె (సావిత్రి) జీవితం సజావుగా సాగనందుకు చాలా బాధపడి ఏడ్చారని, అప్పుడు తానే సావిత్రిని ఓదార్చినట్లుగా కూడా జమున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే ఒకానొక స్థితిలో సావిత్రి పరిస్థితిని చూసి తనకు చాలా బాధకలిగిందని కూడా జమున పేర్కొన్నారు. నటన–డైరెక్షన్–మ్యూజిక్: జమున! చిన్నతనం నుంచే జమునకు కళల పట్ల మక్కువ ఎక్కువ. అందుకే తొమ్మిదేళ్లు వచ్చేలోపే నాటకాల్లో నటించారు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో తిరునగరి రామాంజనేయులు, బుర్రకథ పితామహుడు నాజర్ తదితరుల నాయకత్వంలో ‘మా భూమి’, ‘ముందడుగు’ ‘దిల్లీ’, ‘ఛలో’, ‘విందు’ వంటి నాటకాల్లో నటించారు జమున. ముఖ్యంగా ‘మా భూమి’ నాటికలోని జమున నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరో విశేషం ఏంటంటే... ‘విందు’ అనే నాటికలో యశోదగా నటించడమే కాదు.. ఆ నాటికకు దర్శకత్వం వహించడంతో పాటు, మ్యూజిక్‌ను కూడా కంపోజ్ చేశారట జమున. ఇలా నటనలో ఎదగడానికి సరిపడా ఓనమాలు నేర్చుకున్నది నాటక రంగం నుంచేనని చెబుతారు జమున. ఆ తర్వాత ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకంతో జమున పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చి, తొలి సినిమా ‘పుట్టిల్లు’లో అవకాశం వచ్చేలా చేసింది. ఎస్వీరంగారావు సలహా సినిమా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్న సమయంలో ఓ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారట జమున. కానీ ఓ సందర్భంలో అప్పటి సీనియర్ నటులు ఎస్వీ రంగారావు జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పి, అన్నీ ఆలోచించుకుని ముందడుగు వేయాలన్నట్లుగా హితబోధ చేశారట. దీంతో అప్పటి ఆ హీరోతో వివాహాన్ని వద్దనుకున్నారట జమున. ఆ తర్వాత రమణారావును పెళ్లి చేసుకున్నారు జమున. తల్లి స్ఫూర్తితో... ఇండస్ట్రీలో జమున చాలా ధైర్యంగా, ఆత్మాభిమానంతో ఉండేవారు. ఈ లక్షణాలతో పాటుగా ఆత్మవిశ్వాసం, వ్యక్తితాన్ని నిలబెట్టుకోవడం వంటి వాటిని తన తల్లి కౌసల్యాదేవి నుంచే అలవరచుకున్నారట జమున. విశేషం ఏంటంటే.. జమున తల్లి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రెండు రోజులు జైల్లోనే ఉన్నారట. ప్రముఖుల నివాళి జమున మృతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. 70ఏళ్ల నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆమె చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. జమున కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటి తరం నటీమణుల్లో అగ్రనాయికగా వెలుగొందిన సీనియర్ నటి జమున తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆమె మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. నటి జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. తొలి తరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళా సేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ హీరోయిన్ జమునగారు స్వర్గస్తులయ్యారనే వార్త విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్రవేశారు. మహానటి సావిత్రిగారితో జమునగారి అనుబంధం ఎంతో గొప్పది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – చిరంజీవి అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమునగారు. చిన్ననాటి నుంచే నాటకాల అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారామె. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమునగారు. – బాలకృష్ణ జమునగారు మహానటి. ఆవిడతో కలిసి నేను ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఆ మహానటి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు సన్నిహితురాలు. మేం కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేవారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – మంచు మోహన్‌బాబు భారతీయ సినీ పరిశ్రమకు జమునగారి మరణం తీరని లోటు. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక మహానటి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేశన్.. వంటి ఎంతోమంది మహానటులతో నటించి మెప్పించారామె. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని పోరాడారు. జమునగారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించాలని కోరుతున్నాను. – ఆర్. నారాయణమూర్తి జమునగారు దివంగతులు కావడం బాధాకరం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారామె. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన జమునగారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారామె. ఠీవి, గడుసు పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు. – పవన్ కల్యాణ్ జమునగారి మరణవార్త విని తీవ్రంగా కలత చెందాను. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు, పోషించిన వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – మహేశ్‌బాబు దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిగా కొనసాగారు జమునగారు. ‘గుండమ్మకథ’, ‘మిస్సమ్మ’లాంటి ఎన్నో మరపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. – ఎన్టీఆర్ జమునగారి మరణవార్త విని నా హృదయం ముక్కలైంది. క్లాసికల్ తెలుగు సినిమాకు ఆమె సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. – అల్లు అర్జున్ జమునగారు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ‘మూగమనసులు’ సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమాలతోపాటుగా రాజకీయాల్లోనూ ముందున్నారామె. జమునగారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఉంటే బాగుండేది. – అలీ -
Veteran actor Jamuna: నివాళి: అలిగితివా సత్యభామ
తెలుగు అలక నీవే.. తెలుగు మొలక నీవే వాల్జడను విసిరి వలపు చూపును దూసేది నీవే అతిశయము నీవే.. స్వాతిశయము నీవే కనుచూపులో ధిక్కరింపు దుడుకువు నీవే నీవు సత్యభామవు.. నీవే సతీ అనసూయవు నీవే రాణి మాలినీదేవివి.. నీవే కలెక్టర్ జానకివి. పాతికేళ్లపాటు తెలుగు తెరను ఏలావు. నీ మార్గము నీదయ్యి నీ దుర్గము నీకు నిలిచింది. ప్రజల అభిమానమే నీకు పద్మభూషణ్. ప్రేక్షకుల ఆరాధనే రఘుపతి వెంకయ్య. నీకు అలంకారమైన అలకతో మా నుంచి వీడ్కోలు తీసుకున్నావని సర్ది చెప్పుకుంటున్నాము. మరోసారి దుగ్గిరాల నుంచి పద్యమై పలుకు. మరోసారి అపర సత్యభామవై మువ్వల సడి చెయ్యి. అలక తీరాక తిరిగి వస్తావు కదూ! సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. తప్పు. నిప్పాణి శ్రీనివాసరావు కుమార్తె సత్యభామ. ఒప్పు. తెలుగువారికి సంబంధించినంత వరకు సత్యభామది దుగ్గిరాల. ‘అమ్మా... కాఫీ’... బంగారు బుగ్గలతో, మెరిసే కళ్లతో, గారాబంగా పెరిగి, పెంకిగా మారి, కాలు నేలన పెట్టకుండా, నిద్ర కళ్లతో లేచి కాఫీ అడిగే గారాల పట్టి ఎవరు? ఇంకెవరు జమున. ‘గుండమ్మ కథ’లో ఆ పాత్రను జమునే చేయాలి. కానీ... ‘గుండమ్మ కథ’ సినిమా తీయబోయే ముందు. నిర్మాత చక్రపాణి ఇంట్లో పంచాయితీ. ఒక గదిలో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్. మరో గదిలో జమున, ఆమె తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు. ‘క్షమాపణ పత్రం రాసివ్వమనండి సరిపోతుంది... జమునతో కలిసి పని చేస్తాం’ అని ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ల గది నుంచి ప్రతిపాదన వచ్చింది. ‘క్షమాపణ రాసేది లేదు. నా తప్పేమిటో చెప్పమనండి’ జమున నుంచి జవాబు. ఈ తగాదా తీర్చకపోతే గుండమ్మ కథ పట్టాలెక్కదు. చక్రపాణి రెండు గదుల వైపు మార్చి మార్చి చూశాడు. ‘భూకైలాస్’ క్లయిమాక్స్ సీన్. మద్రాసు సముద్ర ఒడ్డున తీస్తున్నారు. ఆత్మలింగం చేజార్చుకున్న రావణుడు అంతకంతకూ పెరిగి పెద్దదవుతున్న ఆ లింగాన్ని మోయలేక, తనతో తీసుకెళ్లలేక, దానికి తల కొట్టుకుని ఆత్మత్యాగం చేయబోతున్న దృశ్యం అది. ఎన్.టి.ఆర్ మీద తీస్తున్నారు. ఆ సమయంలో నారదుడైన అక్కినేని పరిగెత్తుకొని రావాలి. మండోదరి పాత్ర పోషిస్తున్న జమున కూడా పరిగెత్తుకుని రావాలి. ఎండ మండిపోతోంది. అప్పటికే జమున షూటింగ్‌కి ఆలస్యంగా వస్తున్నదని అక్కినేనికి అభ్యంతరం ఉంది. కాలు మీద కాలు వేసుకుని కూచుంటున్నదని ఎన్.టి.ఆర్కు అసౌకర్యం ఉంది. జమునకు ఇవన్నీ తెలియవు. ఆ ఎండలో ఇంకా రాని జమున కోసం ఎదురు చూస్తూ అక్కినేని, ఎన్.టి.ఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మరునాడు ఇండస్ట్రీ అంతా ఆ నిర్ణయం విని హాహాకారాలు చేసింది. అచ్చొచ్చోలు విడిచింది. ఇక మీదట ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు జమునతో నటించబోవడం లేదు. బాయ్‌కాట్ ట్రెండ్ ఇటీవల మొదలైంది. కాని తెలుగులో బాయ్‌కాట్ చూసిన తొలి హీరోయిన్ జమున. ఊ... అంటావా మావా ఉహూ అంటావా మావా. కొత్త పాట. విశేషం ఏముంది? ఊ అను ఉఊ అను ఔనను ఔనవునను... జమున పాట. ఏనాడో జమున ఉఊ అంది. ఔనవునని అనలేకపోయింది. పెద్ద హీరోలు బాయ్‌కాట్ చేస్తే ఏంటి? తానొక నటి. తనకు సామర్థ్యం ఉంది. తను పని చేయగలదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు లేకపోతే ఇక హీరోలే లేరా? అయినా తెర మీద జమున ఉంటే ఇక ఆవిడే ఒక హీరో లెక్క. 1959, 60, 61... దాదాపు మూడేళ్ల పాటు అక్కినేని, ఎన్.టి.ఆర్ జమునతో పని చేయలేదు. జమున ఆగిందా... ఆగలేదు. హిందీకి వెళ్లింది. జూబ్లీ హీరో రాజేంద్ర కుమార్‌తో ‘హమ్రాహీ’ చేసి హిట్ కొట్టింది. అందులో ‘ముజ్ కో అప్ నే గలే లగాలో’ పాటకు ముబారక్ బేగం, ‘మన్రే తూహీ బతా క్యా గావూ’ పాటకు లతా మంగేష్కర్ జమునకు ప్లేబ్యాక్ ఇచ్చారు. ‘మూగ మనసులు’ హిందీ రీమేక్ మిలన్లో అదే గౌరి పాత్రను వేసి ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించింది. ‘బేటి బేటె’ సినిమాలో సునీల్ దత్‌కు హీరోయిన్గా చేసింది. తెలుగులో జగ్గయ్య, జె.వి.రమణమూర్తి, కృష్ణ, శ్రీధర్, హరనాథ్ వీరితో పని చేసింది. ఈలోపు జమున లాంటి గ్లామర్ స్టార్ లేక కొన్ని సినిమాలు ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్లవి వెలవెలబోయాయి. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు లేక జమున పెద్ద సినిమాలు చేయలేకపోయింది. ఇరు పక్షాలా నష్టం. ఈ నష్టాన్ని నివారించి అందరినీ కలిపి ‘గుండమ్మ కథ’ తీయాలని చక్రపాణి నిశ్చయం. ‘సార్. క్షమాపణలు వద్దు ఏమొద్దు. వాళ్లనూ కూచోబెట్టండి. నన్నూ కూచోబెట్టండి. కావాలంటే నన్ను నాలుగు చివాట్లు పెట్టండి. ఏదో తెలియని రోజుల్లో తెలియని ప్రవర్తన. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను’ అంది జమున, చక్రపాణితో. ‘ఏమయ్యా రామారావు, నాగేశ్వరరావూ. ఈ బాయ్‌కాట్ వల్ల భవిష్యత్తు తరాలకు మీరో తప్పు మార్గం చూపిస్తున్నారు. ఇలా వద్దు. అంతా కలిసి పని చేయండి. నా గుండమ్మ ఇప్పటికే ఆలస్యమై ఏడుస్తోంది’ అన్నాడు చక్రపాణి. సమస్య సద్దుమణిగింది. జమున గెలవకపోయి ఉండవచ్చు. కాని ఓడలేదు. గుంటూరు జిల్లాలో పక్కపక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు. సావిత్రి, జమున. కృష్ణా జిల్లాలో పక్క పక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోలు వచ్చారు. అక్కినేని, ఎన్.టి.ఆర్. ఈ నలుగురు తెలుగు సినిమాలకు ‘స్వర్ణచతుష్టయం’. ఆ స్వర్ణ చతుష్టయం నటించి సూపర్‌హిట్ కొట్టిన సినిమా గుండమ్మ కథ. జమున తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు మధ్వ బ్రాహ్మణులు. కన్నడిగులు. జమున తల్లి కౌసల్యాదేవి వైశ్యులు. తెలుగు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాసరావు హంపిలో ఉండగా పెద్ద కూతురుగా జమున పుట్టింది. ఆమెకు ఆరేడేళ్లు ఉండగా శ్రీనివాసరావు పసుపు, పొగాకు వ్యాపారానికి వీలుగా ఉంటుందని కాపురాన్ని ‘దుగ్గిరాల’కు మార్చాడు. అలా దుగ్గిరాల జమునకు రెండో జన్మస్థలం అయ్యింది. జమున తల్లికి హరికథలు చెప్పడం వచ్చు. ఆమె కచ్చేరీల్లో మధ్య మధ్య చిన్నారి జమునను స్టేజీ ఎక్కించి పాట పాడించేది. దుగ్గిరాలలో చదువుతూ స్కూల్లో కూడా జమున ఆడేది, పాడేది. నాటకాల వాళ్లు విని బాలనటిగా బతిమిలాడి తీసుకెళ్లేవారు. ‘ఢిల్లీ చలో’, ‘మా భూమి’, ‘ఖిల్జీ రాజ్య పతనం’... వీటిలో జమున బాలనటి. మండూరులో ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకం వేయాలని ఒక తెలుగు మాస్టారు వచ్చి జమునను తీసుకెళ్లాడు. రైలు దిగి పొలాల మీద నడుస్తూ మండూరు చేరుకోవాల్సి ఉంటే జమున నడవలేక మారాము చేసింది. పాపం... ఆ తెలుగు మాస్టారు జమునను ఎత్తుకొని అంతదూరమూ నడిచి వెళ్లాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక సినిమాలో జమున– అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా... అనే పాటకు అభినయించింది. ఆ రోజు ఆమెను భుజాల మీద ఎత్తుకుని నడిచిన తెలుగు మాస్టారు ఆ పాటలో పడక్కుర్చీలో కూచుని ఆస్వాదిస్తుంటాడు. అతని పేరు జగ్గయ్య. గరికపాటి రాజారావు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ జమున మొదటి సినిమా. షాపుకారు జానకి, కృష్ణకుమారి, జమున... వీరు మాత్రమే స్ట్రయిట్‌గా హీరోయిన్ వేషాలతో చిత్ర ప్రవేశం చేశారు. మిగిలిన వారు చిన్న పాత్రలు వేసి, ఎదిగి, హీరోయిన్లు అయ్యారు. 16 ఏళ్ల వయసులో జమున ‘పుట్టిల్లు’ లో చాలా మెచ్యూరిటీ ప్రదర్శించాల్సిన పాత్రను పోషించింది. కాని గరికపాటి, జమునల జంటను ప్రేక్షకులు మెచ్చలేదు. ‘పతియే ప్రత్యక్షదైవమే’ థీమ్‌తో సినిమాలు వస్తున్న ఆ రోజుల్లో ‘పుట్టిల్లు’ సినిమా వ్యసనపరుడైన భర్తను నిరాకరించి తనకు తాను నిలబడే భార్య పాత్రను చూపించేసరికి జనం హడలెత్తి తెరను చింపేస్తామన్నారు. మూడ్రోజుల్లో బాక్సులు తిరిగొచ్చేసరికి క్లయిమాక్స్ మార్చి తీసి మళ్లీ అతికించినా ఫలితం రాలేదు. ఆ తర్వాత జమున నటించిన రెండు మూడు సినిమాలు ఆడలేదు. వెనక్కు వెళ్లిపోదామనుకుంటూ ఉండగా ‘మిస్సమ్మ’ సినిమాలో మెరిసి నిలబడింది. ఆ సినిమా నాటికే స్టార్లుగా మారిన అక్కినేని, ఎన్.టి.ఆర్, సావిత్రిల సరసకు అతి త్వరగా చేరింది. అయితే ప్రతి నటికి ఒక సిగ్నేచర్ కేరెక్టర్ దొరకాలి. అలాంటి కేరెక్టర్ జమునకు దొరికింది. ఆ పాత్రే సత్యభామ. సత్యభామ పాత్రంటే తెలుగు నాటకాల్లో పాపులర్. స్థానం నరసింహారావు ఆ పాత్రను పోషిస్తూ పాత్ర ఆంగిక, అభినయ, ఆహార్యాలను స్థిరపరిచేశాడు. ప్రేక్షకులు ఎవరైనా ఆయనతో పోల్చి వెండితెర సత్యభామను అంచనా కడతారు. జమున సత్యభామ పాత్రను మొదట తెలిసీ తెలియని వయసులో ‘వినాయక చవితి’ చిత్రంలో పోషించింది. అసలైన సత్యభామగా ఎన్.టి.ఆర్తో ‘శ్రీ కృష్ణ తులాభారం’లో నటించింది. స్థానం నాటకాల్లో పాపులర్ చేసిన ‘మీరజాల గలడా నా యానతి’ పాటను అంతకు దీటుగా అభినయించింది. పెంకితనం, మొండితనం, స్వాతిశయం వీటితో పాటు తెలియని అమాయకత్వాన్ని సత్యభామకు జోడించడంతో జమున సత్యభామ అయ్యింది. సత్యభామ జమున అయ్యింది. కృష్ణుడి వేషంలో ఉన్నా ఎన్.టి.ఆర్ అంతటి వాడి కిరీటాన్ని కాలితో తన్నాలి. జమున ధైర్యంగా తన్నగలిగింది. అలాంటి షాట్ చేశాక సీనియర్ ఆర్టిస్ట్‌కు ‘సారీ’ చెప్పాలన్న పరిణితి అప్పటికే ఆమెకు వచ్చేసింది. ‘సారీ సార్’ అని ఎన్.టి.ఆర్తో అంటే ‘ఇట్స్ ఆల్రైట్... యాక్టింగే కదా’ అని ఆయన ఈజీగా తీసుకున్నారు. తెలుగువారికి కృష్ణుడు ఎన్.టి.ఆర్. సత్యభామ జమునే. తెలుగువారి తొలి గ్లామర్ స్టార్ కాంచన మాల. తర్వాతి గ్లామర్ స్టార్ జమున. భానుమతి, సావిత్రి, అంజలి... వీరంతా పెర్ఫార్మర్లు. వీరి పక్కన అందరూ సరిపోరు. కాని ఎవరి పక్కనైనా అందంగా సరిపోయే స్టార్‌గా జమున తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు ఏలింది. హరనాథ్‌తో ‘లేత మనసులు’ పెద్ద హిట్ సాధించింది. అందులోని ‘హలో మేడమ్ సత్యభామా’, ‘అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ’ పాటల్లో జమున జాంపండులా ఉందని ప్రేక్షకులు మురిసిపోయారు. ఒక సీనియర్ హీరోయిన్ అయి ఉండి, పెద్ద స్టార్ అయి ఉండి చలంతో ‘మట్టిలో మాణిక్యాలు’ హిట్ కొట్టింది జమున. అందులో ‘నా మాటే నీ మాటై చదవాలి’ పాట అతి మధురం. ముచ్చటం. ఫీల్డ్‌కు వచ్చిన కొత్తల్లో జమునను ‘హంపీ సుందరి’ అని, ‘ఆంధ్రా నర్గిస్’ అని పిలిచేవారు. చిత్రంగా నర్గిస్‌కు చిరఖ్యాతి తెచ్చి పెట్టిన ‘మదర్ ఇండియా’ను జమునే తెలుగులో చేసింది. ఆ సినిమా పేరు ‘బంగారు తల్లి’. సినిమా వాళ్లు సినిమా వాళ్లనే చేసుకుంటున్న రోజుల్లో ఆ ఆనవాయితీని తప్పించి లెక్చరర్‌ను వివాహం చేసుకుంది జమున. కొడుకు పుడితే అక్కినేని భార్య అన్నపూర్ణ వచ్చి ‘సిజేరియన్ అటగదా. ఇన్నాళ్లూ నువ్వొక్కదానివే సన్నగా ఉన్నావనుకున్నాను. ఇకపై లావెక్కిపోతావు’ అని నిట్టూర్చి వెళ్లింది. కాని జమున మారలేదు. కొడుకు పుట్టిన తర్వాత కూడా పదేళ్ల పాటు హీరోయిన్గా కొనసాగింది. సగటు ప్రేక్షకుడి డ్రీమ్ గర్ల్గానే ఉంది. ఒక ఔత్సాహికుడికి జీవితంలో ఒకసారైనా జమున పక్కన నటించి ఆమెతో ఒక డ్యూయెట్ పాడాలని కోరిక. అందుకోసం ఆ ఔత్సాహికుడు భారీ డబ్బు ఖర్చు పెట్టి, పెద్ద తారాగణంతో సినిమా తీశాడు. జమునకు వారితో వీరితో రికమండేషన్ చేయించి తన పక్కన నటించేలా ఒప్పించాడు. ఆమె ఆకర్షణ అలా ఉండేది. అన్నట్టు ఆ సినిమా పేరు ‘బొబ్బిలి యుద్ధం’. ఆ ఔత్సాహికుడు సీతారామ్. మురిపించే అందాలే అవి నన్నే చెందాలే... ‘మిస్సమ్మ’, ‘చిరంజీవులు’, ‘సతీ అనసూయ’, ‘గులే బకావళి కథ’, ‘మంగమ్మ శపథం’, ‘రాముడు భీముడు’, ‘మూగనోము’.... జమున హిట్లు ఎన్నో ఉన్నాయి. ‘మూగ మనసులు’ స్క్రిప్ట్ మొత్తం తయారయ్యాక సావిత్రి విని ఇందులో గౌరి పాత్ర నేను వేస్తాను... రాధ పాత్రను జమునకు ఇవ్వండి. గౌరి పాత్ర చాలా బాగుంది’ అన్నదట. ‘గౌరిగా నువ్వు బాగోవు. అది జమునకే కరెక్ట్’ అని అక్కినేని సర్దిచెప్పారట. ‘మూగ మనసులు’ సినిమాలో జమున విశ్వరూపం చూపింది. గోదారి గట్టు మీద తన పాద ముద్రలను శాశ్వతంగా విడిచింది. రాయీ రప్పా కాని మామూలు మనుషులను కదిలించింది. కొత్త తరం వచ్చాక తన ప్రాభవాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకుంది జమున. చిల్లర మల్లర క్యారెక్టర్లు వేయలేదు. ఆమె వేసే క్యారెక్టర్ ‘పండంటి కాపురం’లో రాణి మాలినీ దేవిలా ఉండాలి. అంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఉంది. పండంటి కాపురం సూపర్ హిట్ కావడంలో జమున పాత్ర ఒక ముఖ్య కారణం. జమున తాను రిటైరై పోయినా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. చివరి నిమిషం వరకూ గ్లామర్‌తోనే కనిపించింది. తెల్లజుట్టు జమునను ఎవరూ చూడలేదు. ఉత్సాహం లేని జమునను ఎవరూ చూడలేదు. స్వాతిశయం తప్పిన జమునను ఎవరూ చూడలేదు. సినిమా రంగంలో ఎన్నో ప్రతికూలతలు దాటి, ఎదురు నిలిచి, తన స్థానాన్ని పొందింది జమున. ఆమె రాకతో ఒక వెన్నెల వచ్చింది. ఆమె వీడ్కోలుతో ఆ వెన్నెల జ్ఞాపకాల్లోనే మిగిలింది. పగలే వెన్నెల... జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే... జమున హిట్ సాంగ్స్‌లో కొన్ని.. 1. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా... (మూగ మనసులు) 2. నీ మది చల్లగా స్వామీ నిదురపో... (ధనమా దైవమా) 3. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి... (దొరికితే దొంగలు) 4. అంతగా నను చూడకు.. ఇంతగా గురి చూడకు... (మంచి మనిషి) 5. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... (మూగనోము) 6. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ గుట్టు తెలిసిందిలే... (రాముడు భీముడు) 7. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట... (మట్టిలో మాణిక్యం) 8. వసంత గాలికి వలపులు రేగ... (శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ) 9. నన్ను దోచుకొందువటే... (గులేబకావళి కథ) 10. బులి బులి ఎర్రని బుగ్గల దానా... (శ్రీమంతుడు) 11. మనసా కవ్వించకే నన్నిలా... (పండంటి కాపురం) 12. రివ్వున సాగే రెపరెపలాడే... (మంగమ్మ శపథం) 13. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు .. (రాము) 14. బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే... (మిస్సమ్మ) 15. ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో.. (గుండమ్మ కథ) 16. నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట... ఒకే మాట (డబ్బుకు లోకం దాసోహం) ఖదీర్ -
మహాప్రస్థానంలో ముగిసిన జమున అంత్యక్రియలు (ఫొటోలు)
-
పిఠాపురం జమీందారుతో పెళ్లి, ఆస్తులన్నీ పోయాయి: సీనియర్ నటి
అరవై దశకంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార సుజాత. భీష్మ సినిమాలో మత్స్యకన్యగా నటించి అందరికీ దగ్గరైన ఆమె భీష్మ సుజాతగా స్థిరపడారు. నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం.. ఇలా ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు చేశారు. నాగేశ్వరరావుతో ఒకే ఒక్క సినిమా 'మహాత్ముడు' చేసినప్పటికీ చివరకు తన పాత్రను ఎడిటింగ్‌లో తీసేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చారు. 'మాది తెనాలి. స్కూలు ఫంక్షన్లో నాటకాలు వేసేవాళ్లం. అమ్మానాన్న నన్ను బాగా ప్రోత్సహించేవారు. వాళ్ల ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చాను. ఇకపోతే అప్పట్లో నా పెళ్లి పెద్ద సంచలనం. పిఠాపురం జమీందారును పెళ్లి చేసుకున్నా. అప్పుడే పెళ్లెందుకమ్మా, తర్వాత ఫీలవుతావు అని శోభన్‌బాబు చెప్పినా నేను వినిపించుకోలేదు. పైగా పిఠాపురం జమీందారుకు అప్పటికే పెళ్లయింది. ఆయన మొదటి భార్య ఒప్పుకున్న తర్వాతే నేను అతడిని పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో నేను నిశ్చింతగా సినిమాలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ తర్వాత మాత్రం సినిమాలే వద్దన్నారు. మా ఆయన దానధర్మాలు ఎక్కువగా చేసే వారు. అలా ఉన్న ఆస్తంతా పోయింది. మిగిలిన కొన్ని ఆస్తులు కోర్టు ఆధీనంలోకి పోయాయి. ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో తిరిగి మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కానీ ఈసారి డ్రామాలు, సినిమాలు, డబ్బింగ్‌లు, కోరస్‌లు.. ఇలా అన్నీ చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్నారు భీష్మ సుజాత. చదవండి: షారుక్ ఖాన్ పని అయిపోయిందంటూ ఆర్జీవీ ట్వీట్ ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం -
జమునను పద్మ అవార్డుతో సత్కరించాలి: నారాయణమూర్తి
సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. ఆమె మరణంపై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో జమున ఒక మహానటి. అగ్రహీరోలతో ఆమె నటించి మెప్పించారు. యావత్ భారతీయ సినీపరిశ్రమకు ఆమె మరణం తీరని లోటు. మూగమనసు సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమా మొత్తం ఆమెతోనే నడుస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ సహా ఎంతోమంది నటులతో ఆమె నటించారు. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని తను ఎంతగానో పోరాడింది. ప్రభుత్వ లాంఛనాలతో జమున అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కేంద్రం ఆమెకు పద్మ అవార్డ్ ఇవ్వాలని కోరుకుంటున్నా' అన్నారు నారాయణమూర్తి. చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం తెలుగు సినీ ఇండస్ట్రీ మహారాణి.. జమున మరణంపై సెలబ్రిటీల సంతాపం -
మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు పూర్తి
అలనాటి అందాల తార జమున అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె కూతురు స్రవంతి జమునకు దహన సంస్కారాలు నిర్వహించింది. జమున మరణంతో ఇండస్ట్రీలో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెను కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌ఛాంబర్‌లోని ఆమె భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. లక్ష్మీ పార్వతి, తమ్మా రెడ్డి భరద్వాజ, మురళి మోహన్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు తదితరులు నివాళులు అర్పించారు. -
మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు
అలనాటి అందాల తార జమున మరణంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు వారి సత్యభామ ఇక లేరనే విషయాన్ని అటు తారలు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో శుక్రవారం ఉదయం ఆమె కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. దాదాపు 200కు పైగా సినిమాలు చేసిన ఆమె పదిహేనేళ్లకే పుట్టిల్లు సినిమాతో రంగప్రవేశం చేశారు. అంతా మనవాళ్లే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత అగ్ర హీరోలందరితోనూ నటించారు. చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత -
తెలుగు సినీ ఇండస్ట్రీ మహారాణి, నటనకే ఆభరణం జమున
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగు వెలిగిన తార జమున. స్టార్ హీరోలతో జత కట్టి తెలుగు తెరకు బోలెడు హిట్స్ అందించిన ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ కలెక్షన్లు కురిపించారు. సినీపుస్తకంలో తనకంటూ ప్రత్యేక పాఠం లిఖించుకున్న జమున శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో అటు సినీఇండస్ట్రీ, ఇటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ జమున స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం - చిరంజీవి అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. -నందమూరి బాలకృష్ణ దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - జూనియర్ ఎన్టీఆర్ సుప్రసిద్ధ బహుభాషా నటీమణి, లోక్ సభ మాజీ సభ్యురాలు జమున మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో చింతించాను. వెండి తెరపై సత్యభామ అంటే జమున గారు అనేలా గుర్తుండిపోయారు. ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. ప్రేక్షకలోకంలో స్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. లోక్ సభ సభ్యురాలిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కళాపీఠం తరఫున ఆమెను సమున్నతంగా సత్కరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. - డా. టి. సుబ్బరామిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు జమున తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా 1989లో రాజమండ్రి ఎంపీగా ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్థున్నాను - అనిల్ కుర్మాచలం, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ Saddened to hear about the demise of #Jamuna garu. Will fondly remember her for all her iconic roles and her immense contribution to the industry. My condolences to her family and loved ones 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) January 27, 2023 సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను — Chiranjeevi Konidela (@KChiruTweets) January 27, 2023 దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/ImmYbmBFl0 — Jr NTR (@tarak9999) January 27, 2023 చదవండి: లావైపోయింది అని సత్యభామగా వద్దన్నారు -
ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం..
అలనాటి స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన హీరోయిన్ జమున ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దాదాపు ముప్పై ఏళ్లపాటు హీరోయిన్గా రాణించిన ఆమె ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. నందమూరి తారకరామారావుతో మిస్సమ్మ, భూకైలాస్, గుండమ్మ కథ, గులేబకావళి కథ, శ్రీకృష్ణ తులాభారం.. ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే జమున సత్యభామగా యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో జమున కృష్ణుడిని కాలితో తన్నే సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అయితే తన పాత్ర కోసమే అలా చేయాల్సి వచ్చిందని నటి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కానీ అప్పటికీ ఇప్పటికీ తెలుగువాళ్లకు సత్యభామ అంటే జమునే గుర్తొస్తుంది. చదవండి: అందాల చందమామ.. తెలుగు తెర సత్యభామ సీనియర్ నటి జమున కన్నుమూత -
సీనియర్ నటి జమున (ఫొటోలు)
-
మహానటి సావిత్రి కారణంగానే సినిమాల్లోకి వచ్చిన జమున
సీనియర్ నటి జమున(86) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నూమూశారు. జమున స్వస్థలం కర్ణాటక అయినా ఆమె పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే. జమున తల్లిదండ్రులది కులాంతర వివాహం. తండ్రి వ్యాపారవేత్త కావడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వలస వచ్చారు. దీంతో ఏడేళ్ల వయసు నుంచి ఆమె దుగ్గిరాలలో పెరిగారు. మహానటి సావిత్రి నాటకాలు వేసే సమయంలో ఓసారి దుగ్గిరాలకు వచ్చారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు సినిమాలపై ఆసక్తిని గమనించిన సావిత్రి స్వయంగా జమునను చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానించారు. అలా 15ఏళ్ల వయసులోనే జమున సినీరంగ ప్రవేశం చేశారు. జమున నటించిన తొలిచిత్రం 'పుట్టిల్లు'. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న జమున ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య వంటి అగ్రహీరోలతో జతకట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారామె. జమున ఇక లేరనే వార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Jamuna Death: అందాల చందమామ.. తెలుగు తెర ‘సత్యభామ’
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించినవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే తమదైన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ జమున ఒకరు. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. తెలుగింటి అమ్మాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దాదాపు 30 ఏళ్ల పాటు హీరోయిన్గా రాణించిన జమున..వందలాది పాత్రలు పోషించింది. కానీ ‘వినాయకచవితి’ చిత్రంలో పోషించిన సత్యభామ పాత్రే జమునకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘శ్రీకృష్ణ తులాభారం’లో కూడా ఆమె అదే పాత్ర పోషించి మెప్పించింది. ఇప్పటికీ తెలుగు వాళ్లకి సత్యభామ అంటే జమునే. అలా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున(86)..నేడు(జనవరి 27) ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె మరణ వార్త విన్న అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ► 1937లో కర్నాటక రాష్ట్రంలోని హంపీలో జమున జన్మించింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆమె బాల్యంలోనే ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చింది. జమున బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జనాబాయి. కానీ జన్మనక్షత్రం రీత్యా ఏదైనా నదిపేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ‘ము’ అక్షరం చేర్చడం జరిగింది. అలా ఆ విధంగా ఆమె పేరు జమునగా మారింది. ► జమునకు చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే చాలా ఇష్టం. స్కూల్లో చుదువుకునే సమయంలో నాటకాల్లో నటించింది. తెనాలీ సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజ్యపతనం అనే నాటిక ప్రదర్శనకోసం నటుడు జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపికచేసి తీసుకెళ్లారు.అలా ఆమె ఓ నాటక ప్రదర్శనలో దర్శకుడు గరికపాటి రాజారావు ఆమెను చూశారు. తన సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. అలా ‘పుట్టిల్లు’ సినిమాతో కథానాయికగా జమున సినీరంగ ప్రవేశం చేశారు. ► తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్యలతోబాటు ఇతర ప్రముఖ నటులతో కలిసి వందలాది చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ఆమె పోషించిన సత్యభామ పాత్రే ఆమెను మరింతగా పేరుప్రఖ్యాతలు వచ్చేలా చేసింది. సత్యభామ పాత్రను ఆ స్థాయిలో పోషించినవారెవరూ లేరు .. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. ► తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల సినిమాల్లో కూడా నటించింది. ఆ చిత్రాలు కూడా ఘనవిజయాలనే అందుకున్నాయి. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి. ► 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి జమున(86)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు జమున భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున 1953లో 'పుట్టిల్లు' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆమె పోషించిన సత్యభామ పాత్ర జమునకు మంచి పేరు తీసుకువచ్చింది. 'సినిమా సత్యభామ'గా జమునకు పేరుంది. మిస్సమ్మ సినిమా జమున కెరీర్లో మైలురాయిగా నిలిచింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. అలనాటి అగ్రనటులు అందరితోనూ నటించారామె. గుండమ్మ కథ, మిస్సమ్మ ఇల్లరికం, ఇలవేల్పు, లేత మనసులు సహా సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్ ఫేర్‌అవార్డులు అందుకున్న జమునకు 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది. వైవిధ్యమైన పాత్రలతో అలరించిన జమున మృతి టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇక పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లవ్ మ్యారేజ్.. నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలీదు: నటి
మూడు దశాబ్దాలపాటు వెండితెరపై తన నటనతో అలరించారు సీనియర్ నటి పీఆర్ వరలక్ష్మి. సుమారు 800 సినిమాల్లో నటించిన ఆమె కమల్ హాసన్, జెమిని గణేశన్, ఎన్టీఆర్, కృష్ణ వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో నటించారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అలరించిన ఆమె వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. బిగ్‌స్క్రీన్ నుంచి బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఆమె ప్రస్తుతం తమిళ సీరియల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. 'నాకు సాయం చేసే అలవాటు ఎక్కువ. రోజూ ఎంతోకొంత దానం చేయకపోతే నిద్రపట్టేదే కాదు. అలా అందరికీ సాయం చేసుకుంటూ పోవడం వల్ల కొంత ఆస్తి పోయింది. సినిమాల కోసం ఇల్లు అమ్ముకున్నాను, కోట్లు ఖర్చు పెట్టాను. అలా మరికొంత కరిగిపోయింది. ఇప్పుడు సంపాదిస్తోంది నా ఖర్చులకు సరిపోతుంది. అంతేకానీ నాకు వందల కోట్లు లేవు. నాది లవ్ మ్యారేజ్. ఏడేళ్లు ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నాం. నా భర్త మంచి మనిషి, గోల్డ్ మెడలిస్ట్. కానీ మామధ్య ఏదైనా చిన్న గొడవయ్యిందంటే ఏడాది దాకా మాట్లాడే వాడు కాదు. అలా ఓసారి ఇల్లు అమ్మే విషయంలో మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో మా మధ్య దూరం పెరిగింది. ఆయన నన్ను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. 30 ఏళ్లవుతోంది.. ఒక్కసారి కూడా టచ్‌లోకి రాలేదు. బతికున్నాడో లేదో కూడా తెలియదు. అయినా... తనంతట తానుగా నన్ను వెతుక్కుంటూ వస్తే సరి కానీ ఆయన ఎక్కడున్నాడో అని మేము వెతుక్కుంటూ వెళ్లడం వద్దనుకున్నాను. కానీ చిన్న గొడవ వల్ల బంగారం లాంటి మనిషికి దూరమయ్యానని బాధపడుతుంటా' అని చెప్పుకొచ్చారు వరలక్ష్మి. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! -
అందరూ అలా పిలవడంతో చాలా బాధపడేదాన్ని: వరలక్ష్మి
సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ నటిగా వెలుగొందిన వారిలో బేబీ వరలక్ష్మీ ఒకరు. మొదట 1973లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె దాదాపు 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బేబీ వరలక్ష్మి తెలుగులో ఎక్కువగా హీరోలకు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైనా పలు చేదు అనుభవాలను వివరించారు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు తాను బాగా ఏడ్చానని ఆమె తెలిపారు. అయితే ఈ రేప్ సీన్స్‌లో నటించిన కారణంగా తాను అనేక అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కొంతమంది నన్ను రేపుల వరలక్ష్మి అని పిలిచినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపింది. కొంతమంది సహనటులు అలా పిలిస్తే.. తనకు నచ్చేది కాదని గుర్తు చేసుకుంది. అనంతరం తన అస్తుల విషయాల గురించి కూడా ఆమె స్పందించింది. అయితే తమకు చెన్నైలో తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులకు చాలా తక్కువగా పారితోషికాలు ఉండేవని.. శాలిని అధిక పారితోషికం తీసుకుందని తెలిపింది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్లతో సమానంగా సినిమాలు చేసిన వరలక్ష్మి.. పారితోషికం భారీగానే తీసుకున్నట్లు పేర్కొంది. అప్పట్లో మా పారితోషికాలు తన స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేవి కాదని బేబీ వరలక్ష్మి తెలిపింది. తన తండ్రి స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చెల్లెలు పాత్రలు చేశాక.. పారితోషికాలు బాగా అందుకున్నట్లు తెలిపింది. తనకు కోట్ల ఆస్తులు ఏమీ లేవని మినిమం ఆస్తులు సంపాదించుకొని ప్రస్తుతం సంతోషంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ తరం హీరోలకు తల్లి పాత్రల్లో నటించాలన్న కోరికను బయటపెట్టారు. -
క్యాన్సర్‌తో పోరాటం.. మందులకు కూడా డబ్బుల్లేని దీనస్థితిలో నటి..!
కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన నటి శైలా శ్రీ. కన్నడలో పలు సినిమాల్లో నటించింది. 1960-70 రోజుల్లో ప్రముఖ నటిగా పేరు సంపాదించింది. సినిమాల్లో ఆమె చేసిన కృషికి 2019లో కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు కూడా లభించింది. తెలుగులో కొన్ని సినిమాల్లోనూ నటించింది. సంధ్యారాగ అనే చిత్రంలో చిన్న పాత్రతో వెండితెర అరంగేట్రం చేసింది శైలా శ్రీ. 1971లో నేషనల్ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం నాగువా హూవులో ఆమె పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆమె తెలుగులో భలే అబ్బాయిలు సినిమాలో కనిపించింది. ఆమె కన్నడ నటుడు ఆర్.ఎన్. సుదర్శన్‌ను వివాహం చేసుకుంది. ఆమె అతనితో నాగువ హూవు, కదీనా రహస్య, కల్లారా కల్లా, మాలతి మాధవ, వంటి చిత్రాల్లో నటించింది. అది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడామె పరిస్థితి దయనీయంగా మారింది. శైలా శ్రీ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమెకు చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. క్యాన్సర్ చికిత్స కోసం బెంగళూరు ఆర్ఆర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె మందుల ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె పరిస్థితి తెలిసిన దంపతులు ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు చెక్‌ను అందజేశారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థిక సాయం అందించినందుకు శైలా శ్రీ సంతోషం వ్యక్తం చేశారు -
నా తల్లిదండ్రులే నన్ను మోసం చేశారు: కన్నీళ్లు పెట్టుకున్న కాంచన
60, 70వ దశకంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది కాంచన. ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయింది. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టింది. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు వసుంధర. సినిమాల్లోకి వచ్చాక కాంచన అని మార్చారు. నా చిన్నతనంలో మా ఇంట్లో లక్ష్మీ తాండవం అడేది. కానీ రానురానూ ఐశ్వర్యం అంతా ఐపోయింది. నాన్న అప్పులపాలయ్యాడు. ఆ సమయంలో నాకు ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం వచ్చింది. వెంటనే జాయిన్ అయ్యాను. నెలకు రూ.600 జీతం ఇచ్చేవారు. తర్వాత సినిమాలకూ వెళ్లాను. సినిమాల్లో ఎలా ఉన్నా సరే ఇంటికి వచ్చాక మాత్రం పద్ధతిగానే ఉంటాను. సాంప్రదాయ దుస్తులనే కంఫర్ట్‌గా ఫీలయ్యేదాన్ని. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీలోని స్టార్ నటులు ఎంతోమంది వెయిట్ చేశారు. కింగ్ ఆఫ్ సైప్రస్ ఉన్న చార్టెడ్ ఫ్లైట్‌లో ఓసారి నేను వెళ్లాను. అతడు కూడా నన్ను అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ నేను మాత్రం దేనికీ చలించేదాన్ని కాదు. జీవితంలో ఎన్నో పరుగులు తీశాను.. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలావరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. అమ్మానాన్న మారుతారేమోనని ఎదురుచూశా. కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు. 12 ఏళ్లుగా ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకుంది కాంచన. చదవండి: బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్.. విజయ్, అజిత్ సినిమాల కలెక్షన్స్ ఎంతంటే? -
ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని
సీనియర్ నటి జయమాలిని.. నిన్నటి తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన స్పెషల్ సాంగ్‌లో నటించి అలరించారు. అలనాటి నటి, డాన్సర్ జ్యోతిలక్ష్మి సోదరిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జయమాలిని అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. బెసిగ్గా సినిమాల్లో డాన్సర్ అయిన ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. దాదాపు రెండు దశబ్దాలకు పైగా వెండితెరపై డాన్సర్‌గా అలరించిన ఆమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. చదవండి: పవన్ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే.: హీరోయిన్ ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానళ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తిర విషయాన్ని బయట పెట్టింది. ఇండస్ట్రీలో తనకు చాలామంది ప్రపోజ్ చేశారని చెప్పారు. ‘అప్పట్లో నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. పెళ్లి కూడా చేసుకుంట అని వెంటపడ్డారు. ఇక నాకు వచ్చే లవ్ లెటర్స్ చూడటానికి ప్రత్యేకంగా ఒక మేనేజర్ ఉండేవారు. ఇంక కొందరైతే బ్లడ్తో రాసేవారు. ఓ మిలిటరి ఆఫీసర్ కూడా నాకు లవ్ లెటర్ రాశారు. పెళ్లి గురించి మా అమ్మ-నాన్నతో కూడా మాట్లాడతా అన్నారు. ఇంక కొందరు మాత్రం మా అమ్మను అడిగే ధైర్యం లేక మా అక్క(జ్యోతి లక్ష్మితో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసేవారు’ అంటూ నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఇక తన వెంట అంత మంది పడితే తాను మాత్రం ఓ స్టార్ హీరోని ప్రేమించానంటూ సీక్రెట్ బయటపెట్టారు. ‘నేను ఓ స్టార్ హీరోను ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించారు. కానీ ఇద్దరం బయటక పడలేదు. ఫస్ట్ ఆయన లవ్ చేశారు. ఓ సారి షూటింగ్లో రాత్రి నా దగ్గరి వచ్చి చెప్పడానికి చూశారు. చదవండి: భారత ఆటగాళ్లతో తారక్ సందడి, ఫొటో వైరల్! కానీ ధైర్యం లేక గొంతు సవరించి చెప్పకుండానే వెళ్లిపోయారు. నేను కూడా ధైర్యం లేక ఈ విషయం ఆయనకు ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ నాది రియల్ లవ్. నాకు వయసై చనిపోయేలోపు ఆ హీరో కలిసి ఈ విషయం చెబుతాను. ఆయన ఇప్పటికి బతికే ఉన్నారు. ఆయనకు పెళ్లయింది, భార్య పిల్లలు కూడా ఉన్నారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఆ హీరో ఎవరూ, ఏ భాషకు చెందినవారనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే తనకు పెళ్లయిందని, తన భర్త తనని బాగా చూసుకుంటారని ఆమె పేర్కొంది. -
జయసుధ మూడో పెళ్లిపై వార్తలు.. స్పందించిన నటి
సీనియర్ నటి జయసుధ పేరు టాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులో సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె ‘సహజనటి’గా గుర్తింపు సాధించింది. అప్పట్లో సీనియర్ ఎన్టీర్, ఏఎన్నాఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి స్టార్లతో ఎక్కువగా సినిమాల్లో నటించారు. ఆమె50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో చిత్రం వారసుడులో నటించారు. అయితే తాజాగా జయసుధ సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమెతో ఓ వ్యక్తి ప్రతి కార్యక్రమంలో ఆమె పక్కనే కనిపించడమే దీనికి కారణం. వారసుడు ప్రిరిలీజ్ ఈవెంట్లో కూడా ఓ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడంతో అంతా అలాగే అనుకున్నారు. దీంతో ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించింది. ఆ వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చేసింది. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని.. తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారని జయసుధ స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే ప్రతి ఈవెంట్‌కు హాజరవుతున్నారని వెల్లడించింది. అతని పేరు ఫెలిపే రూయేల్స్ అని.. నా బయోపిక్ తీస్తున్నారని తెలిపింది. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు. జయసుధ మాట్లాడూతూ..'నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో తెలుసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంది? నా సినిమాలు, షూటింగ్స్ వివరాలు తెలుసుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇటీవల అమెరికా వెళ్లి అతడిని కలిశా.' అని చెప్పుకొచ్చారు జయసుధ. కాగా.. జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. -
షాకింగ్.. ఏంటీ జయసుధ మళ్లీ పెళ్లి చేసుకుందా? ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు?
జయసుధ.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పద్నాగేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 80లలో హీరోయిన్గా వెలుగు వెలిగిన జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఆమె సినీప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయింది. తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్, ఫ్యామీలీ ఆడియన్స్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ పార్ట్నర్ ఏదో తెలుసా? స్ట్రీమింగ్ ఎప్పుడంటే! ఇటీవల వారసుడు(తమిళంలో వారీసు) మూవీతో ప్రేక్షకులను పలకరించిన జయసుధ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ నిలిచింది. ఇమె మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జయసుధ పెళ్లి అంశం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఈ మధ్య జయసుధ ఓ వ్యక్తితో బాగా కనిస్తున్నారట. ఏ కార్యక్రమం అయిన మూవీ ఈవెంట్ అయిన అతనితో జంటగా ఆమె హాజరవుతున్నారట. అంతేకాదు ఇటీవల జరిగిన కమెడియన్ అలీ కూతురి పెళ్లికి కూడా జయసుధ అతడితో జంటగా హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తితో ఆమెను చూసి ఆ అతడు ఎవరా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో జయసుధతో ఉన్న ఆ వ్యక్తి ఓ బడా వ్యాపారవేత్త అని తెలిస్తోంది. అతడిని ఆమె సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకున్నారంటూ! ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు. అదే సమయంలో జయసుధ ఆయనను పెళ్లి చేసుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే జయసుధ ఈ వార్తలపై స్పందించేవరకు వేచి చూడాలి. చదవండి: షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’ కాగా జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. -
తినడానికి తిండి లేక మంగళసూత్రం అమ్మాల్సి వచ్చింది: నటి
దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సీనియర్ నటి సుధ. బాలనటిగా, హీరోయిన్గా, అత్తగా, అమ్మగా, వదినగా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో కష్టనష్టాలను చవిచూసింది. దీని గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను డైమండ్ స్పూన్‌తో పుట్టాను. పెద్ద ఇల్లు, ఇంటినిండా పనివాళ్లు, ముగ్గురు డ్రైవర్లు.. ఇలా చాలా రాజసంగా బతికాం. మా నాన్నకు నలుగురు కొడుకుల తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు అమృతం అన్న అర్థం వచ్చేలా సుధ అని పేరు పెట్టారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని. ఆస్తి, ఐశ్వర్యం అన్నీ చూశాను. కానీ తమ్ముడు పుట్టిన కొంతకాలానికే నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పటినుంచి ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది. నేను ఆరో తరగతి చదివే సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అలా అన్నీ ఉన్న స్టేజ్ నుంచి ఏమీ లేని స్థాయికి వచ్చాం. అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నన్ను కూడా యాక్టింగ్ ఫీల్డ్‌కు తీసుకొచ్చింది. డబ్బు, పేరు రావడంతో చుట్టాలు తిరిగి మావంక చూడటం మొదలుపెట్టారు. చిన్నతనంలో సుఖసంతోషాలతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ మధ్య ఢిల్లీలో హోటల్ ప్రారంభించడంతో ఉన్న డబ్బంతా పోయింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను. ఇంకా కొన్ని అప్పులైతే ఇప్పుడిప్పుడే వాటినుంచి బయటపడ్డాను. నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయాడు. నాతో గొడవపడి వెళ్లిపోయాడు. ఇప్పటికీ మాట్లాడట్లేదు' అని చెప్తూ ఎమోషనలైంది సుధ. చదవండి: రాకీ భాయ్ స్థానంలో వేరే హీరో.. షాకిచ్చిన నిర్మాత తమ్ముడి బర్త్‌డే పార్టీలో శ్రీముఖి రచ్చ -
సావిత్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి ఝాన్సీ
సీనియర్ నటి ఝాన్సీ.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు ఓ అద్దే ఇంట్లో ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె చెన్నైలో లగ్జరీ ఇంట్లో రాజసంగా బ్రతికారు. కానీ ఒక్క మూవీ ఫ్లాప్‌తో ఆస్తులన్నీ అమ్మేసిన పరిస్థితి ఎదురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఆమె. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ పుట గడవడం కూడా ఇబ్బందిగా మారిందట ఆమె జీవితం. చదవండి: అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య స్క్రీన్ హీరోయిన్గా, నటిగా ఆకట్టుకున్న ఆమె కళ్లతోనే హావభావాలను పలికించేవారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఝాన్సీ చాలా ఏళ్ల తర్వాత తెరముందుకు వచ్చారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌తో ఆమె ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మహానటి సావిత్రి గురించిన ఓ షాకింగ్ విషయం రివీల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సావిత్రి, కేఆర్ విజయలతో మాట్లాడేదాని. అంతేకాదు తరచూ సావిత్రి ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాకంటే ముందే సావిత్రిగారు సినిమాల్లోకి వచ్చారు. తననే స్ఫూర్తిగా తీసుకుని నటించేవాళ్లం. తెరపై ఆమె అందంగా, హావభావాలను పలికించేవారు. సావిత్రిలా నటించాలని నటనలో తనని అనుసరించేవారు. సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. అయితే సావిత్రి చివరి రోజుల్లో వెళ్లి చూశారా? అని ప్రశ్నించగా.. ‘ఆ సమయంలో సావిత్రిని చూడలేకపోయానని బాధపడ్డారు. అసలు ఆవిడని చూడలేకపోయేవాళ్లమంట. అంత మనిషి చిన్న పిల్లలా అయిపోయారట. అందుకే తనని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేనని నేను వెళ్లలేదు. చదవండి: విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి అయితే ఎంతో రాజసంగా బతికిన సావిత్రి గురించిన ఓ వార్త నన్ను చాలా బాధించింది. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని నెలలు కొమాలో ఉన్నారు. ఆ సమయంలోవైద్యం చేయించేందుకు డబ్బుల ఆమె భర్త జెమిని గణేశన్ ఓ ప్రకటన ఇచ్చారు. సావిత్రి చికిత్స కోసం డబ్బు కావాలని, దాతలు ఈ అడ్రస్ డబ్బు పంపించగలరు అంటూ ఆయన పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఎంతో ధనవంతురాలు, మహానటి అయిన ఆమె జీవితం చివరికి ఇలా అయ్యిందేంటని అనిపించింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా.. జాగ్రత్తపడకపోవడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే సావిత్రి జీవితం ఇలా అయ్యిందేమో అని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఆ విషయం చిరంజీవికి తెలిస్తే సహించరు.. నటి పావలా శ్యామల
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల అంటే టాలీవుడ్లో తెలియని వారు ఉండరు. ఆమె చాలా అగ్రహీరోల సినిమాల్లోనూ నటించింది. మెగాస్టార్‌తో పలు చిత్రాల్లో ఆమె కనిపించింది. కానీ ప్రస్తుతం వయసు రీత్యా ఇంట్లోనే ఉంటోంది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించింది పావలా శ్యామల. అలాగే కెరీర్లో తనకు జరిగిన అవమానంపై ఆమె మాట్లాడారు. ఆ విషయం చిరంజీవికి చెబితే ఊరుకోరని అన్నారు. పావలా శ్యామల మాట్లాడుతూ..'చిరంజీవి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పని పట్ల ఆయనకు అంకితభావం ఎక్కువ. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేశారు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తెలిసి రూ.2 లక్షలు పంపారు. చిరంజీవిని ఒకసారి కలవాలని ఉంది. నాకు జరిగిన అవమానం గురించి ఆయనతో చెప్పాలి. ఆ విషయం చిరంజీవికి తెలిస్తే సహించరు' అని అన్నారు పావలా శ్యామల. అయితే ఆమెకు ఎదురైన అవమానం ఏంటనేది మాత్రం చెప్పలేదు. -
ఒక్క సినిమా ఫ్లాప్ కావడంతో ఆస్తులన్నీ అమ్మేసుకున్నాం : సీనియర్ నటి
సీనియర్ నటి ఝాన్సీ.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఒకప్పుడు చెన్నైలో లగ్జరీ ఇంట్లో ఉన్న ఆమె ఇప్పుడు ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ ప్రతినెలా గడవడం కూడా ఇబ్బందిగా మారిందట. చాలా కాలం తర్వాత స్క్రీన్ ముందు కనిపించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి వివరించింది. ''ఇంతకు ముందు చెన్నైలో ఉండేవాళ్లం. కానీ ఇండస్ట్రీ హైదరాబాదుకు రావడంతో మేం కూడా వచ్చేశాం. అయితే ఇక్కడికి వచ్చాక నాకు అంతగా అవకాశాలు రాలేదు. అప్పుడే సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించాం. సుమన్‌తో 'ఖైదీ ఇన్ స్పెక్టర్' అనే సినిమాను తీశాం. ఆ మూవీ బాగానే ఆడినా డబ్బులు మా వరకు రాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు నిర్మించి బాగా నష్టపోయాం. దీంతో చెన్నై, హైదరాబాద్‌లోని ఇళ్లన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేశాం. ఇక నా ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేశాను. అయితే పెళ్లి అయ్యాక వాళ్ల భార్యలతో కలిసి నన్ను వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంట్లో నేను ఒక్కదాన్నే ఒంటరిగా జీవిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. -
నటి సీత 55 ఏళ్ల వయసులోనూ ఎంత అందంగా ఉందో..
తమిళసినిమా: మనసుకు వయసుతో పని లేదంటారు. అయితే ఆలోచనలు, అలవాట్లపై ప్రభావం చూపుతాయి. నటి సీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1985లో పాండిరాజ్ దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయం అయ్యారు. అదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన నటి సీత. తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న లక్కీ హీరోయిన్. ఆ తరువాత ప్రముఖ నటులతో జతకట్టి పాపులర్ అయ్యారు. తెలుగు తదితర భాషల్లోనూ నటించారు. కాగా 1990లో నటుడు పార్తీపన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన పుదియపాదై చిత్రంలో ఆయనకు జంటగా సీత నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దీంతో నటనకు దూరమయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2001లో విడాకులు తీసుకున్నారు. నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అక్క, అమ్మ, పాత్రల్లో నటిస్తున్నారు. బుల్లితెర, తెలుగులోన నటిస్తున్న సీత 2010లో సురేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలువ లేదు. నటనను కొనసాగిస్తున్న సీత వయసు జస్ట్ 55. తాజాగా ఆమె స్పెషల్ ఫొటో షట్ చేసుకుని ఆ ఫొటోలను సావజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ ఫొటోలను చూస్తే కొత్తవారు అనుకుంటున్నారు. ఇలా సీతను చూస్తే అందానికి వయసుకు సంబంధం ఉండదనిపిస్తోంది. తన అవయవ సంపదను తెలియచేయడానికే సీత ఈ ఫొటోలను సామాజిక మాద్యమాలకు విడుదల చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Seetha PS (@seethaps67) -
పుష్ప మూవీ చూశా, ఆ హీరో ఎవరో తెలియదు: నటి
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్, తగ్గేదేలే అంటూ చిత్తూరు మేనరిజమ్ డైలాగ్స్‌తో సినీలవర్స్‌ను ఎంటర్టైన్ చేశాడు అల్లు అర్జున్. ఈ మూవీతో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన బన్నీ ఇప్పుడు పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అలనాటి నటి, నర్తకి ఎల్ విజయలక్ష్మి. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిలైంది. తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఐదేళ్ల వయసులోనే డ్యాన్స్ షో చూసి యథాతథంగా అలాగే స్టెప్పులేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. నందమూరి తారకరామారావుగారు తనను కోడలా.. కోడలా.. అని పిలిచేవారంటూ మురిసిపోయింది. ఈ మధ్య ఏదైనా సినిమా చూశారా? అన్న ప్రశ్నకు పుష్ప సినిమా చూశానంది. అందులో నటించిన హీరో ఎవరో తెలుసుగా అనేలోపే తనకు తెలియదని చెప్పింది. అతడు అల్లు రామలింగయ్యగారి మనవడు అని చెప్పడంతో ఆశ్చర్యపోయిన నటి.. ఈ మధ్యకాలంలో హీరోల గురించి అడుగుతుంటే రామానాయుడు మనవడు, నాగేశ్వరరావు మనవడు అని ఇలాగే చెప్తున్నారని పేర్కొంది. కాగా ఇటీవల విజయలక్ష్మి ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీకరించేందుకు దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఆమె అమెరికా నుంచి తెనాలి రావడం కొసమెరుపు. చదవండి: బిగ్‌బాస్: టికెట్ టు ఫినాలే బరిలో నిలబడ్డ లేడీ కంటెస్టెంట్ అర్ధరాత్రి ప్రభాస్ చేసిన పనికి సూర్య షాక్ -
కార్తికేయ 2 సినిమా ఒక ఎత్తు.. ఆ ఒక్క స్పీచ్ మరో ఎత్తు: నటి
తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కలిసి దాదాపు 700 సినిమాలు చేసింది నటి తులసి. ఒకప్పుడు హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర ఆర్టిస్టుగా రాణించిన ఆమె ఇటీవల ఎక్కువగా అమ్మ పాత్రల్లో ఒదిగితోంది. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కార్తికేయ 2తో మరింత ఊపు మీదున్న ఆమె వరుస సినిమాలకు సంతకం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తులసి మాట్లాడుతూ.. 'నేను 1967లో జన్మించాను. పుట్టిన మూడు నెలలకే నటించాను. మూడేళ్లకే డైలాగ్స్ చెప్పాను. అంటే 56 ఏళ్లుగా వెండితెరపై నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. నాలుగు స్తంభాలాట సినిమాలో అలీ హీరో, నేను హీరోయిన్. షూటింగ్ గ్యాప్‌లో అలీ నాకు సరదాగా సైట్ కొట్టేవాడు. ఇక కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే ఆ మూవీ సక్సెస్ ఒక ఎత్తయితే, ఆ సినిమా స్పీచ్ వల్ల నాకు బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఫిజికల్ అన్నారంటే ఒక్కొక్కరి తోలు తీస్తా: రేవంత్ వార్నింగ్ సమంత గ్లిజరిన్ కూడా వాడదు: యశోద డైరెక్టర్స్ -
ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల
తెలుగులో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది పావలా శ్యామల. ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. అనారోగ్యం పాలై అనాథాశ్రమంలో కూతురితో సహా జీవిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోడుసుకుంది. 'మా అసోసియేషన్‌లో మెంబర్షిప్ తీసుకోకపోతే చిరంజీవి లక్ష రూపాయలు కట్టి నాకు మెంబర్షిప్ ఇప్పించారు. నా కుమార్తె ఆరోగ్యం బాగోలేకపోతే మరో రూ.2 లక్షలిచ్చారు. అందరూ సాయం చేసిన డబ్బులతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చాం. కానీ ఇప్పుడు ఆత్మహత్య తప్ప నాకు ఏ విధమైన బతుకుదెరువు లేదు. నేను, నా కూతురు బయటకు వెళ్లి విషం కొనుక్కొచ్చి తాగడానికి కూడా శక్తి లేదు. అలా అని చావమని ఎవరూ తెచ్చివ్వరు కదా? చావడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నాం. అప్పట్లో కరాటే కల్యాణి నాకు సాయం చేద్దామని వచ్చింది. కానీ ఇళ్లంతా వాసన అని చీదరించుకుంది. 'సాయం చేద్దామంటే డబ్బులు తీసుకోలేదు. ఎవరు సాయం చేద్దామని వచ్చినా అంత కావాలి, ఇంత కావాలి అని డిమాండ్ చేస్తుంది' అని నా గురించి తప్పుగా మాట్లాడింది. ఆ మాటలు విని అసహ్యం పుట్టింది. నాకు, నా బిడ్డకు బాగోలేనప్పుడు ఇల్లు అందంగా, శుభ్రంగా ఎలా ఉంటుంది? సాయం పేరున ఇలాంటి మాటలు వినాలా అనిపించింది. ఇకపోతే ఉచిత అనాథాశ్రమంలో ఉండొచ్చు కదా? అంటున్నారు. ఇప్పుడున్న అనాథాశ్రమంలో డబ్బులు కడితేనే బాగా చూడట్లేదు. ఉదయం 11 గంటల వరకు పనమ్మాయి రావట్లేదు. అప్పటివరకు మా కుమార్తె ఇబ్బంది పడుతూనే ఉంది. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక నా సాయం కోసం ఓ అమ్మాయిని పెట్టారు. ఆమె నన్ను ఆపరేషన్ చేయించుకోమంది. కానీ డాక్టర్లు ఆపరేషన్‌కు నా శరీరం తట్టుకోదని చెప్పడంతో వద్దన్నాను. దీంతో ఆమె తనకిక ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత నేను బతికి ఉన్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదు' అని బాధపడింది పావలా శ్యామల. చదవండి: దేవిశ్రీపై సైబర్ క్రైమ్‌లో కరాటే కల్యాణి ఫిర్యాదు బాలాదిత్యపై కక్ష, ఎలిమినేషన్ జోన్లో బిగ్‌బాస్ ముద్దుబిడ్డ -
ఎన్టీఆర్‌తో నటించేటప్పుడు విలువలు నేర్చుకున్నా
‘‘నేను చిన్నతనం నుంచి ఎన్టీఆర్‌గారిని ఆదర్శంగా తీసుకునేదాన్ని. ఆయనతో నటించేటప్పుడు క్రమశిక్షణ, సిన్సియారిటీ, అంకితభావం, నిబద్ధత, మాటతీరు.. వంటి విలువలు నేర్చుకున్నాను’’ అని సీనియర్ నటి ఎల్.విజయలక్ష్మి అన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు ఎల్.విజయలక్ష్మి. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెకు హీరో బాలకృష్ణ గౌరవ సత్కారం చేశారు. అనంతరం ఎల్.విజయలక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఎంతో అభిమానంతో అమెరికా నుంచి నన్ను పిలిపించి గౌరవించడం చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. ఇందుకు బాలకృష్ణ, ఆలపాటి రాజా, బుర్రా సాయిమాధవ్‌లకు థ్యాంక్స్. వివాహం అయ్యాక సినిమాలు మానేసి అమెరికా వెళ్లాను. అక్కడ సీఏ చదివానంటే ఎన్టీఆర్‌గారి స్ఫూర్తి వల్లే. రామానాయుడు, ఎన్టీఆర్‌గార్ల తరం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఇలాంటి వేడుకలకు రావాలనుంది’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయలక్ష్మిగారు వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె మహిళా సాధికారతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి’’ అన్నారు. ‘‘1964లో మా బేనర్లో(సురేశ్ ప్రొడక్షన్స్) నిర్మించిన ‘రాముడు భీముడు’ సినిమాలో విజయలక్ష్మిగారు నటించారు. అందులో ‘‘దేశమ్ము మారిందే..’ అనే సాంగ్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో నాన్నగారు (రామానాయుడు) చెబుతుండేవారు’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఈ వేడుకలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, బసిరెడ్డి, రామసత్యనారాయణ, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నటి ప్రగతి ఇల్లు చూశారా? సింపుల్‌గా ఉన్నా అదిరిపోయింది
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలుత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది. పలు చిత్రాల్లో అక్క, అమ్మ పాత్రల్లో నటించి తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే ప్రగతి జిమ్, వర్కవుట్ వీడియోలతో మరింత ఫేమ్ దక్కించుకుంది. రీసెంట్‌గానే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన ప్రగతి ఫుడ్, బ్యూటీ, వర్కవుట్ వంటి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను నెటిజన్లతో పంచుకుంది. తాజాగా తన ఇంటికి సంబంధించి హోంటూర్ వీడియోను షేర్ చేసింది. ప్రతి రూపాయి కూడబెట్టుకొని ఎంతో ఇష్టపడి ప్రతి వస్తువును కొనుగోలు చేసినట్లు ప్రగతి పేర్కొంది. అంతేకాకుండా తన ఇంట్లో ప్రతి వస్తువుకు ఓ కథ ఉందని, ప్రపంచంలోనే తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇల్లేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి
నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలు పోషించి ఆమె బాగా గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియాల్లో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండింగ్ పాటలకు స్టెప్పులేస్తూ, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలను తరచూ పంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ట్రోల్స్ బారిన పడుతోంది. అయితే తల్లి పాత్రలు చేస్తున్న ఆమె మొదట ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు దారుణంగా అవమానించారు: ప్రియదర్శి నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. ఈ క్రమంలో ఓ సీన్‌కు ఆమె అభ్యంతరం చెప్పడంతో హీరో చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయని, దీంతో హీరోయిన్గా చేయొద్దని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఆమె ఓ టాక్‌లో షో చెప్పింది. ఈ సందర్భంగా ప్రగతి తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. చదవండి: Actress Prema: మోహన్ బాబు గారిని చూస్తేనే భయం వేసేది, అలాంటిది..: ప్రేమ లాక్డౌన్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఫేస్ చేశానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘కరోనా సమయంలో షూటింగ్స్ లేవు. దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నా నగలు తాకట్టు పెట్టి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా’ అని తెలిపింది. ఇక అలాగే తన వైవాహిక జీవితం, విడాకులపై స్పందించింది. ‘నా వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నా పిల్లలను ఒంటరిగా నేనే చదివించాను. ఇప్పుడు వాళ్లు వారి లైఫ్‌కి సంబంధించిన నిర్ణయాలను సొంతంగా తీసుకునే స్థాయికి ఎదిగారు’ అంటే చెప్పుకొచ్చింది. -
షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారు: నటి ప్రేమ
హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ధర్మ చక్రం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలు చిత్రాల్లో దేవత పాత్రలు చేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె సినిమాలకు దూరమయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం తాజాగా ఆమె ‘అనుకోని ప్రయాణం’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 28న విడుదల కాబోతోంది. చదవండి: రామ్ చరణ్ మాటలకు ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ టాక్‌లో షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినిమా విశేషాల గురించి పంచుకుంది. తాను మొదట కన్నడ ఓం చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చానంది. ఆ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని బాగా తిట్టారంటూ ఆసక్తికర విషయం చెప్పింది. ‘కన్నడ హీరో శివరాజ్ కుమార్‌తో నటించాలన్నది నా చిన్ననాటి కల. ఆయనతోనే నా తొలి సినిమా. ఆయనను చూస్తుంటే అసలు డైలాగ్ చెప్పడానికి రావట్లేదు. డైరెక్టర్ ఎన్నిసార్లు చెప్పిన డైలాగ్స్ అసలు నా తలకెక్కట్లేదు. పదే పదే షాట్స్ తీస్తున్నా డైలాగ్ డెలివరి రావట్లేదు. చివరికి డైరెక్టర్ నాపై అరిచారు. బ్రేక్‌లో మా అమ్మ కూడా నన్ను తిట్టింది. ‘ఎన్ని సార్లు చెప్పించుకుంటావు. ఆయన చెప్తుంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. వాళ్లు చెప్పింది తలకెక్కట్లేదా?. చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్ 15 షాట్స్ అయ్యాయి నీకు రావడం లేదా’ అని తిట్టింది. అమ్మ తిట్టాగానే కోపం వచ్చింది. షాట్ రెడీ కాగానే వెళ్లి డైలాగ్ చెప్పాను. సింగిల్ షాట్స్‌లోనే ఒకే అయిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తెలుగుకు ఎలా వచ్చారని అడగ్గా.. కన్నడ ఓం సినిమా చూసి రామానాయుడు గారు తనకు ధర్మ చక్రం సినిమాలో చాన్స్ ఇచ్చారని తెలిపింది. అనంతరం తెలుగులో మోహన్ బాబు గారు అంటే మొదట్లో భయమేసేదని పేర్కొంది. ‘‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో మోహన్ బాబు గారితో కలిసి నటించాను. ఇందులో నాది నెగిటివ్ రోల్. ఆయనను డైరెక్ట్‌గా చూడాలంటేనే భయం.. అలాంటిది ఆయనతో పోటీపడి నటించాల్సి వచ్చింది’’ అని ప్రేమ పేర్కొంది. -
నన్ను అలా అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో హీరోహీరోయిన్లకు అమ్మ పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఈ మధ్య తెరపై కంటే సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. అయితే మొదట హీరోయిన్గా నటించని ఆమె మదర్ రోల్స్ చెయడానికి కారణమెంటో తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఒక హీరోతో రెయిన్ సీన్ చేయాలన్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో నేను అభ్యంతరం చెప్పాను. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..! ఆ సమయంలో ఆ హీరో చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. దాంతో ఆ పాట చేయకుండా వెళ్లిపోయాను. ఆ సంఘటనతో ఇకపై హీరోయిన్గా నటించొద్దని నిర్ణయించుకున్న. అందుకే తల్లి పాత్రలు, సీరియల్స్ చేసుకోవడం మొదలుపెట్టాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే మొదటి సారి తాను తల్లి పాత్ర చేసినప్పుడు తనకు చేదు అనుభవం ఎదురైందని చెప్పంది. ‘‘తొలిసారి నేను మదర్ రోల్ చేసినప్పుడు నా వయసు 24 ఏళ్లు అప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇక మేకప్ అయ్యాక సెట్‌కి వెళితే డైరెక్టర్ నన్ను చూసి ‘ఈవిడెంటి జడ వేసుకుని వచ్చింది. ముడి వేసుకుని రమ్మనండి’ అని అన్నారు. చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా? ఆ మాటలు నన్ను చాలా బాధించాయి. ఎందుకంటే అప్పటికే నేను కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశాను. నా వయసు ఉన్న హీరోయిన్స్‌కి నేను తల్లి పాత్రలు చేయాల్సి వచ్చింది. అప్పటికే బాధలో ఉన్న నాకు డైరెక్టర్ మాటలు ఇంకా బాధించాయి. దీంతో మేకప్ రూంకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. అయితే ఆ తర్వాత నుంచి మాత్రం తల్లి పాత్రలను గౌరవించడం మొదలు పెట్టాను. ఆ తరహా పాత్రలు వేయడానికి ఆలోచన చేయలేదు. ఆ రోజు నుంచి అవకాశాలు కావాలని నేను ఎవరి దగ్గర నోరు తెరిచి అడిగింది లేదు’’ అని పేర్కొంది. -
నేను ఎలా ఉన్నా అందగత్తెనే, సినిమాలు అవే వస్తాయి!
ఒకప్పుడు హీరోయిన్గా చేసిన ప్రగతి తర్వాత అమ్మ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందానికి, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఆమె చేసే వర్కవుట్లు సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. పదో తరగతి చదివేటప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయ్యాం. సింగిల్ పేరెంట్‌గా అమ్మ పెంచింది. కొన్నిసార్లు ఇల్లు గడవడానికి కష్టమైనప్పుడు అమ్మ బంగారం కుదువ పెట్టేది. నేను సైకిల్ మీద వెళ్లి నెలనెలా వడ్డీ కట్టేదాన్ని. చెన్నైలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు రోజా మూవీ రిలీజైంది. అది చూశాక నేను మధుబాలలా ఉంటానని అందరూ అనేవారు. సరిగ్గా అదే సమయంలో సీనియర్ నటి సీఆర్ సరస్వతి నన్ను చూసి భాగ్యరాజాగారికి చెప్పారు. అలా ఆయన నన్ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ అప్పట్లో కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌ను పెద్దగా పట్టించుకునేవారే కాదు. కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందితో పాటు బాధేసింది. అందుకని హీరోయిన్గా చేయడం వద్దనుకున్నాను. అలా హీరోయిన్గా చాలా తక్కువ సినిమాలు చేశాను. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలయ్యాను. జిమ్‌కు వెళ్లేది అందం కోసం కాదు బలం కోసం! నేను ఎలా ఉన్నా అందగత్తెనే! నాకు సినిమాలు వస్తాయి' అని చెప్పుకొచ్చింది ప్రగతి. చదవండి: గాడ్‌ఫాదర్ హిట్, కానీ ఆ సినిమా కంటే వెనుకంజ నువ్వు కన్నింగ్.. యాంకర్ మాటకు షాకైన అర్జున్ -
పాచి పని చేసే అత్త, నిరుపేద ఇంటికి కోడలిగా వెళ్లా: తులసి
సీనియర్ నటి తులసి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 56 ఏళ్లకు పైనే అయింది. తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా పలు భాషల్లో దాదాపు 700 సినిమాలు చేసింది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన అనుకోని ప్రయాణం మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. 'డైరెక్టర్ శివమణితో వన్ డే మ్యాచ్‌లా నా పెళ్లయిపోయింది. బెంగళూరులో మా తాతగారు కట్టిన బాబా గుడిలో ఆయనతో నా వివాహం జరిగింది. నిజం చెప్పాలంటే ఒక బీదవాడిని పెళ్లి చేసుకున్నా. మా అత్తగారు వేరే వాళ్ల ఇంట్లో పాచిపనులు చేసింది. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాక ఆస్తి వచ్చింది. కాకపోతే మా ఆయన హీరోగా సినిమాలు చేసి అప్పులప్పాలయ్యారు. ఓసారి నేను మిణుగు తార అనే సినిమా రాశాను. దాన్ని మేమే నిర్మించాం. సినిమా హిట్టయితే బాబా గుడి లోపల ప్రభావళి చేస్తానని మా ఆయన మొక్కుకున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్టయంది. రూ.13 కోట్ల లాభం వచ్చింది, కానీ మా ఆయన మొక్కు మాత్రం తీర్చలేదు. దీంతో వచ్చింది వచ్చినట్లు పోయింది. చాలా లేట్‌గా ఆయన మొక్కు తీర్చుకున్నాడు. ఇకపోతే నేను మొదట్లో బాబాను నమ్మేదాన్ని కాదు. నా తమ్ముడు అర్ధాంతరంగా చనిపోయినప్పుడు సాయిబాబాను చాలా తిట్టాను. అప్పుడు ఒక రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు బాబా నా గదిలోకి వచ్చి అమ్మా అని పిలిచి, గత ఏడు జన్మలుగా నువ్వే నా తల్లి అన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ నీ కడుపులో పుడతానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమ్ముడు చనిపోయిన ఆరేళ్లకు నాకు కొడుకు పుట్టాడు. అతడికి సాయి అని పేరు పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది. అలనాటి హీరోయిన్ సావిత్రమ్మ గురించి చెప్తూ.. ఆమె అక్షయపాత్రవంటివారు. ఎవరు ఏం అడిగినా ఇచ్చేసేవారు. కానీ చివరి రోజుల్లో నరకం అనుభవించారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మహానటి సినిమాలో సావిత్రి తల్లి పాత్ర చేయమని నన్ను అడిగారు, కానీ కుదర్లేదు, పిన్ని రోల్ అడిగారు.. అప్పుడు కూడా డేట్స్ సెట్టవులేవు. చాలా ఫీలయ్యాను. తర్వాత సమంత తల్లి రోల్ ఆఫర్ చేశారు. చిన్న పాత్రయినా సరే చాలని చేసేశా. మా తాతగారు ఎప్పుడూ అంటుండేవారు... హీరోయిన్గా ఫేడవుట్ అయ్యాక అమ్మగా మంచి పేరు తెచ్చుకుంటావు అని! ఆయన చెప్పిందే జరిగింది అని తెలిపింది తులసి. చదవండి: ఐటం సాంగ్.. అసభ్యంగా ప్రవర్తించిన డైరెక్టర్ ఈ ఇద్దరు తప్ప అందరూ నామినేషన్లో -
రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ
సీనియర్ నటి జయకుమారిని(70) తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ ఆదివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో ఐటెం సాంగ్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది నటి జయకుమారి. ఆ పాటలకు అప్పట్లో అధిక పారితోషికం వస్తుండడంతో తాను శృంగార తారగా మారానని జయ కుమారి ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. 400 పైగా చిత్రాల్లో నటించారు. అయినా ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు రూ. 750కు అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆమె 2 కిడ్నీలు దెబ్బతినడంతో వైద్యం కోసం స్థానిక కీల్పాక్కంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎం.సుబ్రమణియన్ ఆదివారం ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు. ఆమెకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, సొంత ఇంటిని ఏర్పాటు చేసే విషయమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
దీన స్థితిలో సీనియర్ నటి జయకుమారి.. కిడ్నీలు దెబ్బతినడంతో
చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో సీనియర్ నటి జయకుమారి (70) చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చేరారు. వివరాలు.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో నాడోడి చిత్రంతో నటిగా పరిచయం అయిన ఆమె ఎంగిరిందో వందాళ్, గౌరవం, నూట్రుక్కు నూరు, అనాథై ఆనందన్ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. జయకుమారి భర్త పేరు నాగపట్టినం అబ్దుల్లా. ఈయన చాలాకాలం క్రితమే కన్నుమూశారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జైయకుమారి చెన్నై, వేలచ్చేరిలోని అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. కాగా ఈమెకు కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. చదవండి: పుష్ప భామకు మరో భారీ ఆఫర్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే..! -
దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్టు ఇవ్వండి..
సీనియర్ హీరో, నటుడు నరేశ్ పెళ్లి వార్తలు ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాం అవుతున్నాయి. నటి పవిత్రా లోకేశ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నరేశ్ మూడో భార్య తెరపైకి వచ్చి నరేశ్‌కు తనకు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. నరేశ్ నిజంగానే పవిత్ర లోకేశ్‌ను పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనకు విడాకుల నోటీసులు ఇచ్చాడని ఆమె మీడియాతో చెప్పింది. చదవండి: పొన్నియిన్ సెల్వన్: చోళులు వచ్చేస్తున్నారు ఈ క్రమంలో నరేశ్ పెళ్లి అంశం, రమ్య ఆరోపణలపై నటి పవిత్ర స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేశ్ మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ‘నేను తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. చాల సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. కన్నడ నుంచి వచ్చిన తెలుగు ప్రేక్షకులకు నేను దగ్గరయ్యాను. ఇప్పుడు నా ప్రాబ్లమ్ మీతో పంచుకోవాలనే ఇలా మీ ముందుకు వచ్చాను. నరేశ్ ఎవరనేది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మూడో భార్య రమ్య ఇక్కడ బెంగళూరు మీడియాతో నా గురించి, నరేశ్ గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. ఆయన గురించి, నా గురించి చాలా ఆసభ్యంగా మాట్లాడుతన్నారు. మేం రిలేషన్లో ఉన్నామని, పెళ్లి చేసుకున్నామంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. ఇదంత నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ నన్ను ఒక దోషిగా చిత్రీకరించారు ఆమె’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ‘అయితే ఇప్పటికే నరేశ్ గారు కూడా బెంగళూరు వచ్చి మీడియాతో మాట్లాడారు. మా మధ్య ఏం లేదని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఈ వార్తలపై మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మా మధ్య ఏం లేదు. చదవండి: Ram Charan-RC15: భిన్నమైన లుక్‌లో రామ్ చరణ్, వీడియో వైరల్ ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే.. నాకు భర్త కావాలి అనుకుంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఇలా బయటకు వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నరేశ్ గారు తెలుగులో మంచి పేరున్న నటుడు. ఆయన ఆమె భర్త అయితే ఏదైన ఉంటే హైదరాబాద్‌లో కదా ఆమె మాట్లాడిల్సింది. పెద్ద వాళ్లు ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. వారందరిని పిలిచి ఇలాంటిది జరుగుతుందంటూ వారితో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలి. కానీ బెంగళూరు వచ్చి నన్ను చాలా చెడ్డగా చూపిస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పటికైన మీరందరు నాకు, నరేశ్‌కు సపోర్టు చేయాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. Actress #Pavitralokesh gives clarity on recent Allegations. #PavithraLokesh #naresh #tollywoodactress #Tollywood pic.twitter.com/1VyKpLG3LE — Medi Samrat (@Journo_Samrat) July 1, 2022 -
వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు..
సీనియర్ నటుడు నరేశ్ పెళ్లి వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన నటి పవిత్రా లోకేశ్‌ను నాలుగో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పవిత్రతో వివాహంపై నరేశ్ స్పందించలేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిరాశలో కుంగిపోయి ఉన్నప్పుడు పవిత్ర తనకు అండగా నిలిచారని చెప్పారు. మరోవైపు ఆయన మూడో భార్య రమ్య.. నరేశ్ 4వ పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు. తనకు, నరేశ్‌కు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆమె ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. అలాగే నరేశ్ జనవరిలో తనపై ఫిర్యాదు చేసిన విషయంపై కూడా ఆమె స్పందించారు. జూన్‌లో నాకు నోటీసులు అందాయని, వీటిపై తాను లీగల్ కోర్టులోనే ఫైట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు. రమ్య చెప్పేదంత అబద్ధం: నరేశ్ నరేశ్ తన మూడో భార్య రమ్య ఆరోపణలను ఖండించారు. రమ్య చెప్పేదంత అబద్ధమని, ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందన్నారు. ‘రమ్య చెప్పిన దాంట్లో నిజం లేదు. గతంలో తను నా దగ్గర నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేసింది. కృష్ణగారు చెబితే రూ. 10 లక్షలు ఇచ్చాను. బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు తీసుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. 200లకు పైగా సినిమాలు చేశాను. 100 మందికి పైగా హీరోయిన్స్‌తో వర్క్ చేశాను. కానీ ఎప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు. నేను ఏలాంటి వాడినో అందరికి తెలుసు. అయినా ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. నేను పవిత్రను పెళ్లి చేసుకోలేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. నాకు పవిత్ర ఎమోషనల్ సపోర్టు మాత్రమే. పవిత్ర వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితమే. కానీ రమ్య నేను విడిపోయి 8 సంవత్సరాలు అవుతుంది’ అంటూ వివరణ ఇచ్చారు. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి: సుచేంద్ర ఈ పెళ్లి వార్తలపై పవిత్ర లోకేశ్ భర్త డైరెక్టర్ సుచేంద్ర మాట్లాడుతూ.. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెది పైలా పచ్చిస్ జీవితమని, అందుకు తనని వదిలి వెళ్లిపోయిందన్నారు. సుచేంద్ర నా భర్త కాదు.. సుచేంద్ర తన మొదటి భర్త అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు పవిత్రా లోకేశ్. ‘సుచేంద్ర నా భర్త కాదు. నేను ఆయనతో రిలేషన్ షిప్లో మాత్రమే ఉన్నా. ఇక ఆరేళ్లుగా సుచేంద్రకు దూరంగా ఉంటున్నా’ అన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్స్ తో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పవిత్రా లోకేశ్ ఇప్పటికే కర్ణాటక సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అలాగే నరేశ్‌తో తన రిలేషన్‌పై నోరు విప్పిందామె. ఫార్మ్ హౌజ్‌లో నరేశ్‌తో కలిసి ఉంటున్నానని, నరేశ్ ఫ్యామిలీ మెంబర్‌గా తనని అంగీకరించారని చెప్పారు. -
సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్
మైసూరు (కర్ణాటక): సీనియర్ నటి పవిత్ర లోకేష్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, అంతటితో ఆగకుండా తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఆరోపణల మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు. కాగా దివంగత కన్నడ నటుడు మైసూరు లోకేశ్ కుమార్తె పవిత్ర లోకేశ్. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. ఇకపోతే పవిత్ర.. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! దీనిపై అటు నరేశ్ కానీ, ఇటు పవిత్ర కానీ ఇంతవరకు స్పందించనేలేదు. చదవండి: మేజర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలగిన శివానీ -
‘గుండమ్మ కథ’కు షష్టిపూర్తి: అలనాటి నటి జమునకు సత్కారం
సాక్షి, బంజారాహిల్స్: తెలుగు సినిమా రంగంలో 60వ దశకంలో చరిత్ర సృష్టించిన గుండమ్మ కథ చిత్రం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర కథానాయిక అలనాటి అందాల నటి జమునకు అభినందన, ఆత్మీయ సత్కారం బుధవారం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జరిగింది. ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారి ఆకృతి సుధాకర్‌తో కలిసి జమునను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘గుండమ్మ కథ’ వచ్చి 60 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఇంటిల్లిపాది టీవీల్లో ఈ చిత్రాన్ని ఉత్సాహంగా చూస్తున్నారన్నారు. అగ్రనటుల కలయికలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిందన్నారు. ఇందులో నటించి జీవించి ఉన్న ఒకరిద్దరిలో జమున ఒకరన్నారు. ఆమె చిరకాలం సంతోషంగా జీవించాలని వీలైయితే సినిమాల్లో నటించి తనలాంటి అభిమానులను అలరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. జమున మాట్లాడుతూ.. అప్పటి నటుల మధ్య ఆత్మీయ భావాలు ఉండేవన్నారు. గయ్యాళిగా కనిపించే ‘గుండమ్మ’ పాత్రధారి సూర్యకాంతం ఎంతో మంచివారని, షూటింగ్ సమయంలో క్యారేజీలు తెచ్చి నటీనటులందరికీ తానే వడ్డించేవారన్నారు. కార్యక్రమంలో జమున కూతురు కళాకారిణి స్రవంతి పాల్గొన్నారు. చదవండి: ముడతలు కనిపిస్తున్నాయ్.. గ్లో తగ్గింది.. అనసూయపై కామెంట్లు వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
కాస్టింగ్ కౌచ్ ఎదురైనా పబ్లిసిటీ చేసుకోలేదు : నటి
సీనియర్ నటి రాధా ప్రశాంతి కాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్నది ఇంతకు ముందు ఉంది..ఇప్పుడు ఉంది.. ఇక ముందు కూడా ఉంటుంది. అయితే అప్పట్లో ఇలాంటివి ఎదురైనా ఎవరూ పబ్లిసిటీ చేసుకోలేదు. ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కారు. అంతే తేడా. ఇక్కడ ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. సినిమా కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అనే పాలసీ ఉందిక్కడ. నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఓ సినిమాలో నన్ను సెకండ్ హీరోయిన్గా పెట్టుకొని ఆ తర్వాత తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేనేజర్ని అడిగితే ఈ విషయం తెలిసింది. నా స్థానంలో కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లని పెట్టుకున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. -
వెండితెర తల్లులు.. ఆనాటి నుంచి ఈనాటి వరకు
శ్రీనివాసుడు తల్లి వకుళాదేవిగా నటించారు శాంతకుమారి. కృష్ణ, శోభన్‌బాబుల తరం రాగానే తల్లిగా మారారు అంజలీ దేవి. పండరీబాయి లేకుంటే ఎన్నో తల్లి పాత్రలు తెల్లముఖం వేసేవి. అమ్మంటే అన్నపూర్ణే అన్నట్టు ఒక కాలం గడిచింది. అమ్మ లేని కథ లేదు. అమ్మ లేని సినిమా ఉండదు. తెల్లజుట్టు అమ్మల కాలం నుంచి నల్లజుట్టు అమ్మలు వచ్చినా పాత్రల ప్రాభవం పోలేదు. నటీమణుల డిమాండ్ తగ్గలేదు. ఆ కాలం తల్లుల నుంచి ఈ కాలం తల్లుల వరకూ ‘మదర్స్ డే’ సందర్భంగా రీలు తిప్పేద్దామా? పౌరాణికాలలో ప్రేక్షకులు తప్పక మెచ్చే తల్లులు ఇద్దరు ఉన్నారు. ఒకరు కుంతీ దేవి. మరొకరు సీతమ్మ తల్లి. కుంతీదేవిగా అందరు నటీమణులు సరిపోరు. ఆ పాత్రలో రాజసం, అదే సమయంలో అమాయక తెగింపు ఉండాలి. ఎస్.వరలక్ష్మి ఆ పాత్రను ‘దానవీరశూరకర్ణ’లో గొప్పగా పోషించారు. ఇక సీతమ్మ తల్లి అంటే తెలుగువారికి అంజలీదేవే. ఆమె ‘లవకుశ’లో లవకుశుల తల్లిగా బిడ్డల కోసం పరితపించే మాతృమూర్తిగా చెరగని ముద్ర వేశారు. ‘భక్త ప్రహ్లాద’ను కన్నతల్లిగా కూడా అంజలీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఇక అభిమన్యుడిని కన్న పౌరుషమూర్తిగా ‘మాయాబజార్’లో ఋష్యేంద్రమణి కనిపిస్తారు. అదే సినిమాలో శశిరేఖను కన్న లోకరీతి గల తల్లిగా ఛాయాదేవి కనిపిస్తారు. ఛాయాదేవి అంత చక్కగా ఒక్క తల్లి పాత్రలో కనిపించిన మొదటి, చివరి సినిమా అదే. పరమ గయ్యాళిగా భావించే సూర్యకాంతం ‘మాయాబజార్’లోనే అరమరికలు లేని తల్లిగా ఘటోత్కచునితో ‘ఇది నీకు తగదంటిని కదరా’ అని ఎంతో ఆత్మీయంగా అనిపిస్తారు. ∙∙ సాంఘికాలు వచ్చాక బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో తల్లి పాత్రలు సంఘర్షణతో, కథకు మూలస్తంభాలగానో నిలవడం పెరిగింది. ఈ కాలంలో కన్నాంబ, హేమలత, అంజలీ దేవి, సంధ్య, దేవిక... వీళ్లంతా తల్లి పాత్రల్లో రాణించారు. ఎన్.టి.ఆర్ ‘ఆత్మబంధువు’లో కడుపున పుట్టకపోయినా ఎన్.టి.ఆర్ మీద కన్నాంబ పెంచుకున్న మమత చాలా కదిలించేలా ఉంటుంది. ‘మిస్సమ్మ’లో తప్పిపోయిన కన్నకూతురిని తలుచుకుని బాధపడే ఋష్యేంద్రమణిని చూసి మహిళా ప్రేక్షకులు సానుభూతి చూపిస్తారు. హిందీలో వచ్చిన ‘మదర్ ఇండియా’ భారతీయ సినిమాలలో తల్లి పాత్ర రూపు రేఖలను మార్చేసింది. అంత ఉదాత్తమైన తల్లి పాత్రను తిరిగి తయారు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఆ సినిమా రీమేక్‌గా తెలుగులో ‘బంగారు తల్లి’ నిర్మిస్తే హిందీలో నర్గిస్ చేసిన పాత్రను జమున చేశారు. సావిత్రి హీరోయిన్గా ఎంత రాణించారో తల్లి పాత్రల్లో కూడా అంతే రాణించారు. ‘అమ్మ మాట’, ‘కన్నతల్లి’.. రెండు సినిమాల్లోనూ ఆమెది మంచి తల్లి పాత్ర. ఆ తర్వాత ‘గోరింటాకు’ సినిమాలో శోభన్‌బాబుకు తల్లిగా కనిపిస్తారామె. కాని ‘మట్టిలో మాణిక్యం’ సినిమాలో భానుమతిది వదిన పాత్రే అయినా చలంను ఆమెను కొడుకులా చూసుకోవడం, వెనకేసుకు రావడం చాలా బాగుంటుంది. ఆ పాత్రను అలా ఆమె మాత్రమే చేయగలదు. ∙∙ అయితే డెబ్బైల తర్వాత వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ చిన్నప్పుడు కుటుంబానికి అన్యాయం చేసిన విలన్‌ను గుర్తు పట్టడానికి మాత్రమే ఆ తల్లి ఉండేది. హీరో పెద్దయ్యాక ‘చెప్పమ్మా... ఎవరు మనకింత అన్యాయం చేసింది’ అనంటే ఆ తల్లి విలన్ నాగభూషణం గురించో, రాజనాల గురించో చెబుతుంది. ఈ కాలంలో పండరి బాయి చాలా సినిమాలలో తల్లిగా కనిపిస్తారు. ఆ తర్వాత పుష్పలత, జయంతి, శారద, కాంచన ఆ పాత్రల్లో కనిపిస్తారు. ∙∙ కృష్ణ, శోభన్‌బాబుల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వచ్చే సమయానికి ముందుతరం హీరోయిన్లు తల్లిపాత్రలకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో జయసుధ ఎక్కువగా తల్లి పాత్రలలో ప్రేక్షకులకు నచ్చారు. ఆ తర్వాత జయచిత్ర, సుజాత, శ్రీవిద్య, మంజుల, వాణిశ్రీ... వీరందరూ చాలా సినిమాల్లో తల్లులుగా ఉన్నారు. జయచిత్ర నటించిన ‘అబ్బాయిగారు’ ఆమెను భిన్నమైన తల్లిగా చూపిస్తే మంజుల ‘ప్రేమ’ సినిమాలో కూతురి ప్రేమను అంగీకరించని తల్లిగా గట్టి పాత్రలో కనిపిస్తుంది. వాణిశ్రీ ‘సీతారత్నం గారి అబ్బాయి’ హిట్ అయ్యింది. శారద ‘అమ్మ రాజీనామా’తో పెద్ద హిట్ కొట్టారు. వీరు కాకుండా ‘ముందడుగు’ సినిమాతో గట్టి తల్లి పాత్రతో ముందుకు వచ్చిన అన్నపూర్ణ తెలుగు సినిమాల తల్లిగా ఒక కాలాన్ని ఏలారనే చెప్పాలి. ఆ తర్వాత సుధ ఎక్కువ మంది హీరోలకు తల్లిగా కనిపించారు ∙∙ ఇప్పుడు గ్లామర్ ఉన్న తల్లులు వెండితెర పై కనిపిస్తున్నారు. నదియ, తులసి, పవిత్ర లోకేష్, సుకన్య, రేవతి, రోహిణి, ప్రగతి వీరంతా తల్లులుగా కొత్త హీరోలతో కలిసి నటిస్తున్నారు. నటి శరణ్య గత పదేళ్లలో తెలుగు – తమిళ భాషల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తల్లి పాత్రధారిగా గుర్తింపు పొందారు. ఇక రమ్యకృష్ణ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా సంచలనమే సృష్టించారు.సృష్టి మొదలైనప్పటి నుంచి మదర్ సెంటిమెంట్ మొదలైంది. సినిమాలో ఆ సెంటిమెంట్ తప్పక పండుతుంది. నటీమణుల పేర్లు మారుతుండొచ్చు. అమ్మ పాత్ర మారదు. అది చిరకాలం ఉంటుంది. చిరంజీవ అని ఆశీర్వదిస్తూ ఉంటుంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి వాణిశ్రీ
రాపూరు: సీనియర్ నటి వాణిశ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామినిదర్శించుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. వాణిశ్రీతో సెల్ఫీ దిగేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపారు. -
మా నాన్న ముందే గొల్లపూడి నా చెంప పగలగొట్టాడు: నటి
బాలనటిగా కెరీర్ ఆరంభించిన పూర్ణిమ సింగర్ అవుదామనుకుంది. కానీ కాలం, ఆమెలోని నటనా చాతుర్యం ఆమెను నటిని చేసింది. 'శ్రీవారికి ప్రేమలేఖ', 'ముద్దమందారం', 'నాలుగు స్తంభాలాట', 'పుత్తడిబొమ్మ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' వంటి సినిమాలతో హీరోయిన్గా అలరించింది. ఆ తర్వాత సహాయక పాత్రలు సైతం పోషించి తెలుగువారి మనసుల్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పూర్ణిమ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా పేరు మలయాళంలో సుధ, తెలుగులో పూర్ణిమ. నేను సింగర్ అవుదామనుకున్నా, కానీ నటినయ్యా. హీరోయిన్గా చేస్తున్నప్పుడే కృష్ణగారికి చెల్లెలిగా కూడా చేశా. సావిత్రిగారితో కూడా నటించాను. ఆమె చనిపోయే ముందు రోజుల్లో.. పాన్ తింటూ ఇలా యాక్ట్ చేయాలి, అలా చేయాలని సూచనలిచ్చేవారు. ఇక నేను సినిమా ఆర్టిస్ట్ అని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఆరు సంబంధాలు వచ్చినదారినే వెళ్లిపోయాయి. నాకింక లైఫ్‌లో పెళ్లవదు, కుమారిగానే మిగిలిపోతాననుకున్నా. కానీ 1998లో నాకు పెళ్లైంది. నాలుగు స్తంభాలాట సినిమా సమయంలో వైజాగ్ అందాలు చూసివద్దామని నేను, నరేశ్ బైక్‌పై వెళ్లి వస్తుండగా చున్నీ టైర్లో చుట్టుకోవడంతో కింద పడిపోయా, గాయాలయ్యాయి. నన్ను అలా చూసి నరేశ్ కంట్లో నీళ్లు తిరిగాయి. 'మనిషికో చరిత్ర' సినిమా సెట్స్‌లో గొల్లపూడి మారుతీరావు నన్ను సీరియస్‌గా కొట్టేశారు. అక్కడే ఉన్న మా నాన్న మా అమ్మాయిని ఎందుకు కొట్టారు? అని మారుతీరావును నిలదీశాడు. అందుకాయన నాకు కూతుర్లు లేరమ్మా, అందుకే కొట్టేశాను అని చెప్పడంతో ఊరుకున్నాడు' అని చెప్పుకొచ్చింది పూర్ణిమ. -
నా భర్తను కరెంట్ వైర్లతో కాల్చి పీక పిసికి చంపారు
1979లో 'నగ్న సత్యం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నటి కృష్ణవేణి. 43 సంవత్సరాల కెరీర్లో హీరోయిన్గా, సహాయక నటిగా, కమెడియన్‌గా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిందావిడ. సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది. 'నేను 'వారాలబ్బాయి' డైరెక్టర్ రాజచంద్రను పెళ్లి చేసుకున్నాను. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వాళ్లు ఏమీ లేనివారు. ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా కష్టాలు పడ్డారు. తీరా ఒక్కో మెట్టు ఎదిగి ఒక సినిమాకు రెండు, మూడు లక్షల రూపాయలు తీసుకునే సమయానికి చచ్చిపోయాడు. మేం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక కలిసి నాలుగేళ్లున్నాం. నిజానికి నాకు నలుపంటేనే నచ్చదు. టీ నల్లగా ఉంటేనే తాగను, అలాంటిదాన్ని అనుకోని పరిస్థితుల వల్ల నల్లగా ఉండే అతడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీలాంటోళ్లు నాకు హెల్ప్‌గా ఉంటే నేనెక్కడో ఉండేవాడిని అని తరచూ అంటుండేవాడు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు వందరోజులు ఆడాయి. ఇది చూసి ఓర్వలేక ఇండస్ట్రీవాళ్లే ఆయనను హత్య చేశారు. కరెంట్ వైర్లతో కాల్చి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. పోలీసువాళ్లు కూడా ఎవరు చేయించారో మాకు తెలుసు, కానీ మేం ఏం చేయలేం అని చేతులెత్తేశారు. మా కుటుంబాన్ని లేపేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు రెండేళ్లపాటు ఇంటిచుట్టూ కాపలాగా ఉన్నారు. దీనికంతటికీ కారణమైన హీరోయిన్ చనిపోయింది' అని చెప్పుకొచ్చింది కృష్ణవేణి. కానీ ఆ హీరోయిన్ ఎవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. -
విషాదం : ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి జయంతి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున బనశంకరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1963లో కన్నడలో 'జెనుగూడు' చిత్రంతో సినీ ప్రవేశం చేసిన జయంతి..తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీ రామచంద్రన్ వంటి ప్రముఖులతో నటించారు. మోహన్ బాబు నటించిన పెదరాయుడు చిత్రంలో నటనకు గాను తెలుగులోనూ జయంతికి మంచి గుర్తింపు వచ్చింది. వీటితో పాటు జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, శాంతి నివాసం వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించారు. జయంతి హఠాన్మరణంతో కన్నడ నాట విషాద ఛాయలు అలుముకున్నాయి. జయంతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ಪ್ರಖ್ಯಾತ ಹಿರಿಯ ಕಲಾವಿದೆ, ಅಭಿನಯ ಶಾರದೆ ಜಯಂತಿ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ಅತೀವ ದುಃಖ ತಂದಿದೆ. ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಅವರ ಕೊಡುಗೆ ಅಪಾರವಾಗಿದ್ದು, ಕನ್ನಡ ಕಲಾಲೋಕಕ್ಕೆ ತುಂಬಲಾರದ ನಷ್ಟವುಂಟಾಗಿದೆ. ದೇವರು ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಸದ್ಗತಿ ಕರುಣಿಸಲಿ, ಅವರ ಕುಟುಂಬ, ಅಪಾರ ಅಭಿಮಾನಿ ಬಳಗಕ್ಕೆ ನೋವನ್ನು ಭರಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. pic.twitter.com/JuGWeyX4Ce — B.S. Yediyurappa (@BSYBJP) July 26, 2021 Senior actress Jayanthi (76 years) passed away @NewIndianXpress @santwana99 pic.twitter.com/ryhwPpJlSa — Ashwini M Sripad/ಅಶ್ವಿನಿ ಎಂ ಶ್ರೀಪಾದ್ (@AshwiniMS_TNIE) July 26, 2021 -
దీనస్థితిలో సీనియర్ నటి, అయినవాళ్లు కూడా పొమ్మన్నారు!
Veteran Actor Savita Bajaj Needs Financial Help: సీనియర్ నటి సవితా బజాజ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. 'నిశాంత్', 'నజ్రానా', 'బెటా హోతో ఐసా' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆదుకునేందుకు అయినవాళ్లు కూడా ముందుకు రాకపోవడంతో మూగగా రోదిస్తోందీ నటి. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. "నేను సంపాదించి కూడబెట్టినదంతా ఊడ్చుకుపోయింది. ఆ డబ్బంతా నా వైద్యం కోసమే ఖర్చు పెట్టాను. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు చాలవన్నట్లు శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పుడేం చేయాలో కూడా పాలు పోవడం లేదు. అసలే నాకు ముంబైలో సొంతిల్లు కూడా లేదు. ఒక చిన్న కిచెన్ రూమ్‌లో అద్దెకుంటున్నాను. దీనికి ఏడు వేల రూపాయలు అద్దె కడుతున్నాను. 2016లో నేను ఓ ప్రమాదంలో గాయపడినప్పుడు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) రూ.50 వేలు, రైటర్స్ అసోసియేషన్ లక్ష రూపాయలు ఇచ్చింది. కానీ ఈ సారి నా ఆరోగ్యాన్ని నేను చక్కదిద్దుకునే పరిస్థితిలో లేను. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే తిరిగి పనిలోకి ఎక్కగానే వారిచ్చిన మొత్తాన్ని ఇచ్చేయాలనుకునేదాన్ని. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తిరిగి నటిస్తానన్న నమ్మకం లేదు. ఇక నా కుటుంబం అంటారా! నా దురదృష్టం కొద్దీ నా బాగోగులు చూసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. 25 ఏళ్ల క్రితం నా స్వస్థలమైన ఢిల్లీకి వెళ్లాలనుకున్నా. కానీ నా కుటుంబంలోని ఏ ఒక్కరూ నన్ను వారితో ఉండనిచ్చేందుకు ఇష్టపడలేదు. ఎంతో సంపాదించాను, కుటుంబం కోసం మరెంతో ఖర్చు చేశాను. కానీ ఇప్పుడు ఒంటరినై సాయం కోసం అర్థించాల్సిన దుస్థితికి చేరుకున్నాను" అని నటి ఎమోషనల్ అయింది. కాగా బుల్లితెర నటి షగుఫ్త అలీ కూడా తన వైద్యం కోసం బంగారు నగలు, కారును అమ్మేసిన విషయం తెలిసిందే. ఆమె గురించి తెలిసిన ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ దీవానీ 3 టీం తరపున రూ.5 లక్షల చెక్ అందించింది. ఇప్పుడు దీనస్థితిలో ఉన్న సవితా బజాజ్‌కు కూడా ఎవరైనా చేయూత అందిస్తే బాగుండంటున్నారు నెటిజన్లు. -
400 చిత్రాల్లో నటించిన సీనియర్ నటి కన్నుమూత
సీనియర్ నటి జెమినీ సరస్వతి ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. ఈమె వయస్సు 94 ఏళ్లు. కారైకుడికి చెందిన జెమినీ సరస్వతి 5వ తరగతి చదువుతున్న వయసులోనే నాట్యంపై ఆసక్తితో, సినిమాల్లో నటించాలనే ఆశతో చెన్నైకి వచ్చారు. చంద్రలేఖ చిత్రం ద్వారా డాన్సర్‌గా పరిచయమయ్యారు. ఈమె అసలు పేరు సరస్వతి. జెమినీ సంస్థ నిర్మించిన చంద్రలేఖ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయడంతో జెమినీ సరస్వతిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కాదల్ పడుత్తుమ్ పాడు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో పలు చిత్రాల్లో నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో అలరించారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. ఇటీవల శ్వాసకోస సంబంధిత సమస్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈమెకు దక్షిణామూర్తి, సెల్వరాజ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. సరస్వతి మరణానికి పలువురు సినీ ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికి రెడీ అయిపోయిన లవ్ బర్డ్స్ నయన్-విఘ్నేష్ -
ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందట!
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ పుల్గా రాణించడం అంత సులువు కాదు. కొన్ని సందర్భాల్లో ఆరంగ్రేటం అదిరినా, అది కొనసాగించలేక మధ్యలోనే కెరీర్ ముగించేసిని వాళ్లు ఉన్నారు. ఇక సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత సరైన గుర్తింపు, ఆఫర్లు రాకపోవడంతో వెండితెరను వదులుకున్న సెలబ్రిటీల పిల్లలు చాలా మందే ఉన్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్ ఈ జాబితాలోకి చేరనుందనే వార్త ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు.. తొలి సినిమాగా ‘జోష్’ లో నాగచైతన్య సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత జీవా హీరోగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘రంగం’ సినిమాలో నటించింది. ఈ సినిమా రెండు భాషల్లో హిట్ కావడంతో మంచి గుర్తింపుతో పాటు ఆఫర్లును అందుకుంది. ఫలితంగా ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ లో నటించగా, ఆ అవకాశం తన కెరీర్‌కు ఉపయోగపడలేదనే చెప్పాలి. గత కొంత కాలంగా కార్తీక ఆఫర్లు లేకపోవడంతో ఇక నటనకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఈ వార్త కోలీవుడ్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. సినిమాలకు స్వస్తి పలికి వ్యాపారం వైపు శ్రద్ధ పెట్టాలని కార్తీక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: salaar movie: ఇది నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే! -
బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సీనియర్ నటి రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ తన అందం, అభినయంతో ఎంతోమంది అబిమానులను సొంతం చేసుకుంది. శ్రీదేవి, మీనల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాశీ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. 1997లో జగపతిబాబుతో నటించిన శుభాకాంక్షలు సూపర్ హిట్ కావడంతో ఇండస్ర్టీని తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ, పవన్ కల్యాణ్, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన రాశీ 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. టాప్ డైరెక్టర్లు కూడా ఈమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారంటే రాశీ పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలతోనూ మెప్పించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో నెగిటివ్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటివరకు ఫ్యామిలీ ఆడియోన్స్‌కు దగ్గరైన రాశీ నిజ సినిమాతో ఓ వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశీ ప్రస్తుతం ఓ బుల్లితెర ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్లో జ్ఞానాంబగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ టీఆర్పీ రేటింగులో దూసుకుపోతుంది. ముఖ్యంగా రాశీ పాత్రకు ఆడియోన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారట. హిందీ సీరియల్ దియా ఔర్ బాతి హమ్కు రీమేక్‌గా వచ్చిన ఈ సీరియల్‌తో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన రాశీకి మరోసారి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తన నటనతో బుల్లితెర శివగామిగా పేరు గాంచిన రాశీ ఈ సీరియల్ కోసం భారీ రెమ్యునరేషనే తీసుకుంటుందట. ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వారానికి దాదాపు లక్ష రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్లే సీరియల్లో నటిస్తుందనే వార్తలను రాశీ ఖండించినట్లు సమాచారం. చదవండి : సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్ అనిత అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి -
వాణీ విశ్వనాథ్ నట వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ
ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భాషతో సంబంధం లేకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వర్షా విశ్వనాథ్. ఆమె ఎవరో కాదు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ సోదరి ప్రియా విశ్వనాథ్ కూతురు. వాణీ విశ్వనాథ్‌కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నారు వర్ష. కేరళలోని త్రిస్సూర్‌లో ఇంటర్ పూర్తి చేసిన వర్షా విశ్వనాథ్ తమిళంలో మూడు చిత్రాల్లో నటించారు. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. రమణ్ కథానాయకుడిగా శిరీషారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఎం.రమేశ్, గోపీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్ష పక్కింటి అమ్మాయిగా కనిపించనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు వర్ష. రెండో చిత్రం హీరో రమణ్‌తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేయనున్నారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరితో ఓ సినిమా చేయడానికి వర్షా విశ్వనాథ్ అంగీకరించారు. ఇవి కాకుండా తమిళంలోనూ సినిమాల్లో నటించారు వర్షా విశ్వనాథ్. చదవండి: యాంకర్ సుమ తల్లి వీడియో.. 70 ఏళ్ల వయసులో కూడా.. -
నటి జయచిత్రకు భర్త వియోగం
సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర భర్త గణేశ్ (62) శుక్రవారం ఉదయం తిరుచ్చిలో గుండెపోటుతో కన్నుమూశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి జయచిత్ర తెలుగునాట జన్మించినా తమిళనాడులో నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 200 పైగా చిత్రాల్లో కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన జయచిత్ర 1970–80 ప్రాంతంలో అగ్రకథానాయికగా వెలుగొందారు. కథానాయికగా రాణిస్తున్న సమయంలోనే జయచిత్రకు కుంభకోణంకు చెందిన గణేశ్‌తో 1983లో వివాహం జరిగింది. గణేశ్ నటుడిగా ఓ చిత్రంలో నటించారు. ఈ దంపతుల సంతానమే యువ సంగీత దర్శకుడు అమ్రేష్. గణేశ్ శుక్రవారం ఉదయం తిరుచ్చిలో కన్నుమూయగా ఆయన భౌతికకాయాన్ని చెన్నై, పోయెస్ గార్డెన్‌లోని స్వగృహానికి తరలించారు. గణేశ్ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. గణేశ్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. -
అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మరో సీనియర్ నటి జమున ప్రధాన పాత్రలో నటించగా బాలాదిత్య, అర్చన జంటగా నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం (అక్టోబర్ 25న) ఓవర్సీస్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ చిన్న సినిమా ఒకేసారి ఓవర్సీస్లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి. అమేజాన్ ప్రైమ్‌లో విడుదలవుతున్న మా సినిమాని ఇండియాలో మాత్రం థియేటర్లు ప్రారంభించాక విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి అభిరుచిగల దర్శకుడు శివనాగు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. పాటలు చాలా బావున్నాయి’’ అని అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్. -
నవరసాల నటి సీతాదేవి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి, దివంగత విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి పొట్నూరి సీతాదేవి (87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబర్ 14న కాకినాడలో రామస్వామి దంపతులకు జన్మించారు సీతాదేవి. సమీప బంధువు నీలాబాయి భర్త రాజా శాండో ఫిల్మ్ మేకర్ కావడంతో సీతని కాకినాడ నుంచి మదరాసుకు దత్తపుత్రికగా తీసుకెళ్లారు. బాల్యం నుంచే నృత్యాలపట్ల మక్కువ పెంచుకుని అభ్యాసన మొదలెట్టారామె. 1947లో కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు సీత. కేవీ రెడ్డి రూపొందించిన ‘మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు’ తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు చేశారామె. కేవలం హాస్యమే కాకుండా తనలోని నటిని అన్ని రసాల్లో ఆవిష్కరించారు సీత. 1940 నుండి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారామె. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి ‘రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి’ లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు. ‘లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాత వ్రతం, దేవదాసు, మాయాబజార్’ వంటి గొప్ప చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటారు సీత. ‘ఋతురాగాలు’ టీవీ సీరియల్లో నటించారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరపైనా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘రక్తకన్నీరు’ నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు సీత. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. హిందీలో రూపొందించిన ‘అల్బేలా’ చిత్రాన్ని నాగభూషణం తెలుగులో ‘నాటకాల రాయుడు’గా రూపొందించారు. ఆ చిత్రంలో ఆయన వదిన పాత్రలో విషాద ఛాయలు పలికిస్తూ సీత చేసిన నటన అందర్నీ కదిలించింది. ఓ హాస్యనటి జీవితంలో ఓ విలక్షణమైన పాత్రగా అందరూ అభివర్ణించారు. నాగభూషణం, సీతాదేవి దంపతులకు కూతురు భువనేశ్వరి, కొడుకు సురేందర్ ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యాక తనకు వీలు కుదిరినప్పుడల్లా సినిమాల్లో నటించేవారు ఆమె. సినిమా పరిశ్రమలో ఉన్న అనేకమందితో పాటు బంధువుల కష్టాలను విని గుప్తదానాలు ఎన్నో చేశారు సీత. రేలంగితో అనేక హాస్య పాత్రల్లో నటించిన సీతకు ‘యువ కళావాహిని’ సంస్థ వారు రేలంగి పురస్కారం ప్రదానం చేశారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో సోమవారం ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ‘మాయాబజార్’ చిత్రంలో సావిత్రితో... నా తొలినాళ్ల గురువు సీతాదేవి నేను అప్పుడప్పుడే డ్యా¯Œ ్స నేర్చుకుంటున్నాను. ‘రక్తకన్నీరు’ నాటకంలో నటించడానికి ఓ మంచి నటి కావాలని మామ సత్యం అనే మా ఇంటిపక్కనున్న ఓ టెక్నీషియన్ మా అమ్మను, నన్ను నాగభూషణంగారి ఇంటికి తీసుకువెళ్లారు. అప్పుడే సీతగారు నన్ను తొలిసారి చూశారు. నువ్వేమీ భయపడకు, స్టేజీపై మేము ఉంటాం కదా! చక్కగా నటించాలి అని ప్రోత్సహించారు. అలాగే ‘ఎక్కువకాలం మా గ్రూపులో ఉండవు.. పెద్ద హీరోయి¯Œ అయిపోతావు’ అని చెప్పారామె. నా కెరీర్ తొలినాళ్లలో దొరికిన ఓ అద్భుతమైన గురువు ఆమె. – వాణిశ్రీ, నటి -
కోలుకుంటున్న నటి జయంతి
కర్ణాటక, యశవంతపుర: సీనియర్ నటి జయంతి ఆరోగ్యం కొంతవరకు మెరుగు పడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడకపోవడం, ఆస్తమా సమస్యలతో మంగళవారం రాత్రి ఆమెను బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా వచ్చింది. నాలుగు నెలల క్రితం కూడా ఆమె అస్తమాతో బాధపడుతూ చికిత్సలు తీసుకున్నారు.(నటి జయంతికి అస్వస్థత) -
సీనియర్ నటి ఉషారాణి కన్నుమూత
సినిమా: సీనియర్ నటి ఉషారాణి(65) ఆదివారం కన్ను మూశారు. ఇటీవల అనారోగ్యానికి గురై చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈమె మలయాళ దర్శకుడు శంకర్ నాయార్ను 1971లో వివాహం చేసుకున్నారు. తమిళంతో పాటు మలయాళంలో 200 పైగా సినిమాల్లో నటించారు. చివరిగా తమిళంలో 2004లో మైలాటం చిత్రంలో నటించారు. భౌతిక కాయానికి పోరూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతిపై దక్షిణ భారత నటీనటుల సంఘం సంతాపం ప్రకటించింది. -
తోటకు నిప్పు ..నటి కన్నీరు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: నెలమంగల తాలూకా సోలదేనహళ్లిలో సీనియర్ నటి లీలావతికి చెందిన తోటకు బుధవారం నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న లీలావతితోపాటు ఆమె కుమారుడు, కన్నడ హీరో వినోద్‌రాజ్ కూలీలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చినప్పటికీ తోట గేట్ ఇరుకుగా ఉండడంతో ఫైరింజన్ లోపలకు రావడానికి వీలుకాలేదు. ఆకతాయిలు సిగరెట్ తాగి వేయడంతో మంటలు వ్యాపించి ఉంటాయని వినోద్‌రాజ్ అభిప్రాయపడ్డారు. తోటలో పూలు,పండ్ల చెట్లు పెంచుతున్నారు. పశుపక్ష్యాదులకు ఆశ్రయం కల్పించారు. ప్రాణంగా చూసుకుంటున్న తోట కళ్లముందే కాలిపోవడంతో లీలావతి కన్నీరుమున్నీరయ్యారు. -
సీనియర్ నటి జమీలా కన్నుమూత..
సీనియర్ నటి జమీలా మాలిక్(73) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె కేరళ పాలోడ్లో తన కుమారుడు అన్సార్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. కొల్లాంలో జన్మించిన జమీలా.. తల్లి ప్రోద్భలంతో పుణే ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో విద్యార్థిగా చేరారు. అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి కేరళ మహిళగా నిలిచారు. ఆ తర్వాత 1972లో ‘ ఆద్యతే కథ’ చిత్రం ద్వారా జమీలా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత పలు మలయాళం, తమిళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఆమె.. సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. పలు హిందీ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. దివంగత జయలలిత కూడా కలిసి నటించారు. అయితే 1983లో వివాహం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత భర్తతో విడిపోయారు. ప్రస్తుతం కొడుకుతో కలిసి ఉంటున్నారు. -
నా కూతురు హీరోయిన్ ఏంటి : వాణి విశ్వనాథ్
చెన్నై : ‘నా కుమార్తె హీరోయిన్’గా మారుతోందా..అబ్బే లేదండీ.. అది ఇంకా చిన్నపిల్ల.. అలాంటిది ఏదైనా ఉంటే నేనే చెబుతాగా అంటున్నారు ప్రముఖ సినీ నటి వాణీ విశ్వనాథ్. పిల్లల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా తల్లిదండ్రులు నడుచుకోవాలనేది నా సిద్ధాంతం. నా కుమార్తె ఆర్చా ప్రస్తుతం ప్లస్‌వన్ చదువుతూ డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ మధ్యలో తన మనసు మార్చుకుని నటిగా మారాలని భావిస్తే ఆ సంగతి నేనే సగర్వంగా ప్రకటిస్తాను కదా. అయితే వాణి విశ్వనాథ్ కుమార్తె నటిగా రంగప్రవేశం చేస్తోదంటూ ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వర్ష...వాస్తవానికి స్వయానా నా సోదరి శ్రీప్రియ కూతురు. వర్ష నా కుమార్తే అనుకుని అభిమానంతో ఎందరో నాకు ఫోన్లు చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. వర్ష కూడా నా కుమార్తెతో సమానమే. అందుకే నటిగా ఆమె ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవాలని, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని చెప్పారు వాణి విశ్వనాథ్. -
సీనియర్ నటి కన్నుమూత
సీనియర్ నటి రీటా భాదురి(82) ఇక లేరు. బాలీవుడ్లో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో నటించిన రీటా.. గత కొంతకాలంగా వయసురిత్యా సమస్యలతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘రాజీ’ ఫేమ్, నటుడు శిశిర్ శర్మ తన ఫేస్బుక్లో తెలియజేశారు. ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరు. కబీ హాన్ కబీ నా, క్యా కహెనా, దిల్ విల్ ప్యార్ వ్యార్, మై మాధురిదీక్షిత్ బన్నా చాహితీ హూ.. తదితర చిత్రాలతో రీటా మంచి గుర్తింపు పొందారు. హిందీతోపాటు పలు గుజరాతీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవటంతో.. బుల్లితెర వైపు ఆమె తన దృష్టిసారించారు. హస్రాతేన్, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, కిచిడీ, ఏక్ నయీ పెహ్చాన్, అమనత్, కుమ్‌కమ్ తదితర సీరియళ్లలో ఆమె నటించారు. నిమ్కీ ముఖియా సీరియల్లో ఇమ్రాతి దేవి పాత్ర.. రీటా బుల్లితెరపై వెలిగిపోయేలా చేసింది. ఆమె మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం అంధేరీలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. రాత్రి రోడ్డు పక్కన నటి... -
34 ఏళ్ల తర్వాత
తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు వెండితెరను ఏలిక నాయిక బి. సరోజా దేవి. తమిళ, కన్నడ భాషలతో పోల్చితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ కూడా బాగా ఫేమస్. ఇప్పుడామె తొమ్మిదేళ్ల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు. 2009లో సూర్య నటించిన ‘ఆదవన్’లో కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నటసార్వభౌమ’ చిత్రంలో ఈ సీనియర్ నటి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. దాదాపు 34 ఏళ్ల తర్వాత సరోజా దేవి, పునీత్ రాజ్‌కుమార్ సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు. సరోజా దేవి కథానాయికగా నటించిన ‘యారివాను’లో పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. కన్నడ కంఠీరవ, పునీత్ తండ్రి రాజ్‌కుమార్ సరసన సరోజా దేవి కథనాయిక పలు చిత్రాల్లో నటించడం విశేషం. ఆ సంగతలా ఉంచితే అప్పట్లో సరోజా దేవి సినిమాలో పునీత్ బాల నటుడిగా నటిస్తే, ఇప్పుడు అతను హీరోగా నటిస్తోన్న సినిమాలో ఆమె కీలక పాత్ర చేయడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. -
నిలకడగా నటి జయంతి ఆరోగ్యం
యశవంతపుర (బెంగళూరు): బహుభాషా నటి జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు చికిత్స అందిస్తున్న విక్రం ఆస్పత్రి వైద్యులు సతీశ్, విజయ చెప్పారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. వారు బుధవారం జయంతి తనయుడు కృష్ణకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో వెంటిలేటర్ తొలగించి ఆమెను సాధారణ వార్డుకు బదిలీ చేస్తామని తెలిపారు. -
నటి జయంతి ఆరోగ్యంపై గందరగోళం
సాక్షి, బెంగళూరు : అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటి జయంతి క్రమంగా కోలుకుంటున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరూ నమ్మద్దని ఆమె కుమారుడు కృష్ణకుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జయంతి చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... సోషల్ మీడియాలో జయంతి మరణించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ వార్తలను ఎవరు నమ్మవద్దని అన్నారు. అయితే ఆమె మరణించినట్లు కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. వాటిని ఆయన తోసిపుచ్చారు. దీంతో ఆమె ఆరోగ్యంపై గందరగోళం నెలకొంది. 1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు. -
సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత
దశాబ్ధాల పాటు వెండితెర మీద ఎన్నో అద్భుతపాత్రల్లో నటించిన మెప్పించిన అలనాటి నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బెంగళూరులో ఉంటున్న ఆమె కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో బంధువులు బెంగళూరులోని సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పూర్తి చికిత్సకు తగిన ఏర్పాట్లు లేకపోవటంతో వైధ్యుల సూచన మేరకు విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం జయంతికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. 1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు. -
ప్రముఖ సినీ నటి జయంతికి తీవ్ర అస్వస్థత
-
గీతాదేవి
-
‘ఆరేళ్ల వయసులో నాపై అత్యాచారం’
సాక్షి, సినిమా : తమ పిల్లల భవితవ్యం బాగుండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఆ ప్రయత్నంలో జరిగే పొరపాట్లు.. తర్వాత పిల్లల్ని జీవితాంతం నీడలా వెంటాడుతాయి. అందుకే తల్లిదండ్రులు వారిని కెరీర్‌ను చాలా జాగ్రత్తగా గమనించి కాపాడాలంటున్నారు బాలీవుడ్ సీనియర్ నటి డైసీ ఇరానీ. చిన్న వయసులో తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఓ ప్రముఖ పత్రికు ఆమె వివరించారు. ఆరేళ్ల వయసులో సంరక్షుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపారు. 1950-60 మధ్య కాలంలో బాల నటిగా రాణించిన డైసీ.. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించారు. ‘అప్పుడు నా వయసు ఆరేళ్లు. మా అమ్మ ...నాజర్ అనే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని నాకు గార్డియన్‌గా నియమించింది. మద్రాస్‌లో ‘హమ్ పంచీ ఏక్ దల్ కే’ చిత్ర షూటింగ్ కోసం మేము వెళ్లాం. అక్కడ ఓ హోటల్లో నన్ను ఉంచిన నా సంరక్షకుడు ఓ రోజు నాపై అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత బెల్ట్‌తో నన్ను చితకబాది విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం ఏనాడూ నా తల్లితో చెప్పలేదు. పదేళ్ల క్రితం వాడు చనిపోయాడు కూడా’ అని 60 ఏళ్ల ఇరానీ తెలిపారు. ఇక మరో ఘటనను వివరిస్తూ... ‘నాకు పదిహేనేళ్ల వయసు ఉన్న సమయంలో ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఓ చిత్రం కోసం నన్ను కలవాలని మా అమ్మను కోరాడు. నాకు చీర కట్టి అందంగా అలంకరించిన మా అమ్మ నన్ను అతని ఆఫీస్‌కు తీసుకెళ్లింది. అయితే అప్పటికి నా శరీరం సౌష్టవంగా లేదు. దీంతో మా అమ్మ నా దుస్తుల్లోపల స్పాంజ్‌ను కుక్కింది. అతని కార్యాలయంలో ఓ సోఫాలో కూర్చుని ఉన్నాను. ఇంతలో అతను వచ్చాడు. మా అమ్మను బయటికి వెళ్లమన్నాడు. భయపడుతూనే అమ్మ బయటకు వెళ్లింది. మాటల మధ్యలో అతను నన్ను తాకాలని యత్నించాడు. అతని ఉద్దేశం అర్థమైన నేను నా లోపల ఉన్న స్పాంజిని తీసి అతని చేతిలో పెట్టాను. అంతే కంగుతిన్న అతను బయటకు పరుగులు తీశాడు’ అని ఆమె వివరించారు. తల్లిదండ్రుల పిల్లలను స్టార్లను చేయాలన్న యత్నంలో దారుణమైన తప్పిదాలు చేస్తున్నారని.. కానీ, ఆ పొరపాట్లను, అనుభవించిన నరకాన్ని గుర్తు చేసుకుంటూ తర్వాత జీవితాంతం ఆ పిల్లలు బాధపడుతున్నారని ఆమె వాపోయారు. అయితే తర్వాతి కాలంలో ఆ తరహా ఘటనలు పునరావృతం కాలేదని.. తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా తన సోదరీమణుల(హనీ ఇరానీ, మేనకా ఇరానీ) విషయంలో మాత్రం ఆ తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో తాను రక్షణగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న డైసీ.. కాస్టింగ్ కౌచ్ పేరిట నటీనటులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న అంశాలను ప్రస్తావించారు. చివరకు చిన్న పిల్లలను కూడా వదలటం లేదని.. అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. వారిలో టాలెంట్ ఉంటే వెతుక్కుంటూ వస్తారని.. అంతేగాకీ దొడ్డిదారిని ఆశ్రయించకండని ఆమె చెబుతున్నారు. బూట్ పాలిష్, జగ్తే రమో, నయా దౌర్ లాంటి చిత్రాల్లో నటించిన డైసీ ఇరానీ తర్వాత బుల్లితెరపై కూడా రాణించారు. చివరిసారిగా షారూఖ్ ఖాన్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో కనిపించారు. తల్లిదండ్రులూ... జాగ్రత్త! : ఫర్హాన్ అక్తర్ డైసీ ఇరానీ ఇంటర్వ్యూ పై ఆమె సోదరి తనయుడు, దర్శక,నటుడు ఫర్హాన్ అక్తర్ ట్విటర్లో స్పందించాడు. పిల్లల్ని స్టార్‌గా చూడాలని బలవంతంగా చేసే ప్రయత్నాలు మంచివి కావని.. అందుకు డైసీ ఇరానీ ఉదంతమే ఓ ఉదాహరణ, ఆమెకు ఎదురైన పరిస్థితులు మరెవరికీ కలగకూడదు అని ఫర్హాన్ అంటున్నారు. తల్లిదండ్రుల ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. Heartbroken upon reading this article but proud that my aunt #DaisyIrani spoke up. It’s tragic to see parents push their kids to breaking point in order to achieve success vicariously through them. This should serve as wake up call for the film & TV industry. Be aware. Be warned. https://t.co/8ONbHJ21lG — Farhan Akhtar (@FarOutAkhtar) 23 March 2018 -
సీనియర్ నటికి లైంగిక వేధింపులు
సాక్షి, ముంబై : బాలీవుడ్ వెటరన్ నటి జీనత్ అమన్(66) లైంగిక వేధింపులకు గురయ్యారు. ఓ వ్యాపారవేత్త ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సోమవారం కేసు నమోదు అయ్యింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అమర్ ఖాన్.. జీనత్ కుటుంబానికి మంచి స్నేహితుడు. కొంత కాలం క్రితం ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా మనస్పర్థలు రావటంతో వారిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. కానీ, కొద్ది నెలలుగా అమర్ మళ్లీ ఆమెతో మాట్లాడేందుకు యత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఓరోజు కలుద్దామని చెప్పి తన ఇంటికి రమ్మని ఆమెను అమర్ ఆహ్వానించాడు. అయితే ఇంటికి వచ్చిన ఆమెపై సెక్యూరిటీ గార్డు సాయంతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో జీనత్ జూహు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముంబై డీసీపీ పరమజీత్ సింగ్ దహియా కేసు విషయాన్ని మీడియాకు విషయాలను వెల్లడించారు. సర్ఫరాజ్ అలియాస్ అమర్ ఖాన్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు డీసీపీ తెలిపారు. కాగా, 1970 ఫెమినా మిస్ ఇండియా ఏషియా ఫసిఫిక్ అయిన జీనత్ అమన్.. తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. బోల్డ్ పాత్రలకు ఆమె పెట్టింది పేరు. హరే రామ్ హరే కృష్ణ, సత్యం శివం సుందరం, యాదోన్ కి బారాత్ తదితర చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 1985లో మజార్ ఖాన్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు కుమారులు. 1998లో మజార్ చనిపోవటంతో ఇద్దరు కుమారులతో ఆమె జూహులోనే నివసిస్తున్నారు. తిరిగి చిత్రాల్లో కనిపించని జీనత్.. అవార్డు పంక్షన్లో, ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తున్నారు. -
దేవదాస్ బామ్మ కన్నుమూత
సాక్షి, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి అవా ముఖర్జీ కన్నుమూశారు. 88 ఏళ్ల అవా అనారోగ్యం కారణంగానే చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేవదాస్ చిత్రంలో షారూఖ్ ఖాన్ బామ్మ పాత్రలో ఆమె నటించి మెప్పించారు. రచయితగా కెరీర్‌ను ప్రారంభించిన అవా.. తర్వాత నటన వైపు మక్కువ చూపారు. 1966లో బెంగాళీ చిత్రం రామ్ ధక్కా ద్వారా ఆమె సినిమాల్లోకి అరంగ్రేటం చేశారు. దేవదాస్, ది ఫర్మ్ ల్యాండ్(2009), సిద్ధార్థ్(2009) చిత్రాలు ఆమె నటించిన వాటిలో చెప్పుకోదగినవి. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో.. సతీష్ కౌశిక్ డైరెక్ట్ చేసిన డర్నా జరూరీ హై(2006) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇక ఈమె లీడ్ రోల్లో చేసిన డిటెక్టివ్ నాని చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్ర దర్శకురాలు రోమిల్లా ముఖర్జీ, అవా కూతురే కావటం మరో విశేషం. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. -
పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ నటి శోభన!
తమిళసినిమా: సాధారణంగా సినిమా హీరోయిన్లు యుక్త వయసులో పెళ్లి చేసుకోవడం అన్నది అరుదనే చెప్పాలి. అతిలోకసుందిరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి కూడా 40 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నారు. ఇక నటి శోభన అంతకు మించి అన్నట్లుగా 47 ఏళ్లు అంటే ప్రౌఢ వయసుల్లో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. నిజానికి నటన, నృత్యం పేరు, డబ్బు లాంటివన్నీ శోభన చిన్న తనంలోనే వరించేశాయి. ఒక్క పెళ్లి మినహా. 1970లో కేరళ, తిరువనంతపురంలో పుట్టిన శోభన బాల్యవయసులోనే నటిగా తెరంగేట్రం చేశారు. తమిళంలో ఎనక్కుల్ ఒరువన్ చిత్రం ద్వారా కమలహాసన్‌కు జంటగా కథానాయకిగా పరిచయమైన శోభన, ఆ తరువాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ చిత్రాల్లో నటించి.. బహుభాషా నటిగా ప్రాచుర్యం పొందారు. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించిన శోభన ఎందుకనో పెళ్లిపై దృష్టి సారించలేదు. స్థానిక అడయార్‌లో శిష్య స్కూల్ పేరుతో నాట్య పాఠశాలను నెలకొల్పి అధిక సమయాన్ని నృత్య శిక్షణలోనే గడిపేస్తున్నారు. నృత్య ప్రదర్శనలపై ఎక్కువ మక్కువ చూపుతున్న శోభన 2001లో అనంతనారాయణి అనే పాపను దత్తత తీసుకున్నారు. అలా పెళ్లి చేసుకోరాదని భావించిన శోభన అనూహ్యంగా ఇప్పుడు తనకు ఒక తోడును వెతుక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన చిరకాల స్నేహితుడైన ఒక వ్యక్తితో మూడుముళ్లకు సిద్ధం అవుతున్నట్లు పత్రికల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ కథనాలను నటి శోభన ఖండించలేదు, అలాగనీ పెళ్లిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆమె సన్నిహితులు మాత్రం శోభన త్వరలో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. -
ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత .
-
ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత
-
ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూత
చెన్నై : 300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. 80వ దశకంలో జ్యోతిలక్ష్మి పాట ఉంటే చాలు సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. గాంధర్వ కన్య, సీతారాములు, కలుసుకోవాలని, బెబ్బులి, బంగారు బాబు, స్టేట్ రౌడి లాంటి చిత్రాల్లో ఆమె చేసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఐటమ్ సాంగ్స్ తో ఊపు ఊపేసిన జ్యోతిలక్ష్మి పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యారు.. చాలా కాలం పాటు మీడియా కంట పడకుండా ఉన్న జ్యోతిలక్ష్మి, తరువాత బుల్లితెరపై హుందాగా కనిపించే పాత్రల్లో నటించారు.గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆ మృతికి పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
లక్ష్మమ్మలో ఆ పాట నాకు బాగా ఇష్టం!
సి. కృష్ణవేణి, సీనియర్ నటి, గాయని, నిర్మాత బాలాంత్రపు రజనీకాంతరావు గారు అటు సంగీతంలోనూ, ఇటు సాహిత్యంలోనూ పరిజ్ఞానం ఉన్న అరుదైన ప్రతిభావంతులు. చక్కటి స్వరకర్తే కాక, మంచి కవి, గాయకుడు కూడా! నేను సినిమాల్లో నటిస్తూ, మీర్జాపురం రాజా వారు శోభనాచల పతాకంపై సినిమాలు తీస్తూ ఉన్న సమయంలోనే ఆయన సినిమాల్లో గీత రచన, సంగీతం ప్రారంభించారు. అప్పటికే ఆయన ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నారనుకుంటా. అందుకే, టైటిల్స్‌లో వేరే పేరు వేసేవారు. రజని రాసి, వరుస కట్టగా ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట అందరికీ తెలిసిందే. ఇక ఎల్వీ ప్రసాద్, భానుమతి నటించిన ‘గృహప్రవేశం’ చిత్రానికైతే పాటలు, సంగీతం పూర్తిగా ఆయనవే. నా చిత్రాల్లో రజనీ గారి సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోవలసిన చిత్రాలు ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’. లక్ష్మమ్మ’ చిత్ర నిర్మాణం ఒక పెద్ద కథ. రజనీకాంతరావు, రచయిత-దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ చాలా సన్నిహితులు. గోపీచంద్ గారు ‘లక్ష్మమ్మ’ స్క్రిప్టు మాత్రమే కాకుండా, పాటలు-వాటి వరుసలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని, మద్రాసులో మా బంగళాకు వచ్చారు. స్క్రిప్టు, పాటలు వినిపించారు. పాటలు, వరుసలు - రజనీకాంతరావు గారివి. ఆ లక్ష్మమ్మ పాత్రకు నేను బాగుంటాననీ, నన్ను చేయమనీ గోపీచంద్ అడిగారు. అలాగే అనుకున్నాం. తరువాత చాలా కథ జరిగి, పలువురి చేతులు మారినా, చివరకు ప్రాజెక్ట్ నా దగ్గరకే వచ్చింది. చిత్ర నిర్మాణమూ మేమే చేపట్టాం. తీరా అదే సమయంలో జనబాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉన్న నిజజీవిత కథ అయిన లక్ష్మమ్మ కథతోనే, అక్కినేని, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా నిర్మించ తలపెట్టారు. మా ‘లక్ష్మమ్మ’, వాళ్ళ ‘లక్ష్మమ్మ కథ’ ఒకే రోజు షూటింగ్ మొదలై, అనేక సంచలనాల మధ్య ఒకే రోజు విడుదలయ్యాయి. మాది హిట్టయ్యింది. ‘లక్ష్మమ్మ’ పాటలు రజనీ రాసి, వరసలు కట్టినా, వాటిని సినిమాకు తగ్గట్లుగా రికార్డింగ్ చేసింది ఘంటసాల. అందుకే, టైటిల్స్‌లో సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరే ఉంటుంది. రజనీ గారి సాహిత్యం ఎంత సులభంగా, సహజంగా ఉంటుందంటే... ‘లక్ష్మమ్మ’లో పాటలన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా, లక్ష్మమ్మ పాత్ర అత్తవారింటికి పల్లకీలో వెళ్ళే సందర్భంలో వచ్చే ‘చిన్ననాటి స్వప్నసీమ... కన్న ఊరు విడువలేము...’ పాట నాకు మరీ మరీ ఇష్టం. ఆయన వరుసల్లో నా పాటలన్నీ నేనే పాడుకున్నా. అలాగే, ఆ తరువాత విజయలక్ష్మీ బ్యానర్‌పై మేమే నిర్మించిన ‘పేరంటాలు’కు కూడా గోపీచంద్ దర్శకుడు. రజనీ పాటలు రాశారు. అందులోనూ పాటలు పాడాను. ఇప్పుడు ఆ సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే, కాలం వెనక్కి వెళ్ళినట్లుంది. -
దయనీయ స్థితిలో మనోరమ
సీనియర్ నటి మనోరమ ఆరోగ్య పరిస్థితి క్షీణించి, దిక్కు లేకుండా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఆమెనెవరూ పట్టించుకోవడంలేదని నటుడు మన్సూర్ అలీఖాన్ వాపోయారు. సహస్రాధిక చిత్రాల్లో నటించి చరిత్రకెక్కిన బహుభాషా నటి మనోరమ. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించి రక్తి కట్టించే నటధీశాలి మనోరమ. ఆ మధ్య బాత్రూమ్లో కాలుజారి పడినప్పటి నుంచి మనోరమ అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. మూత్రనాళ సమస్యతో బాధపడుతున్న మనోరమ కొన్ని నెలల క్రితం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే మూత్రనాళ సమస్య నుంచి ఆమె కోలుకోలేదు. ఈ విషయం గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ వెల్లడిస్తూ ఎంజీఆర్, శివాజీ కాలం నుంచి మనోరమ నటిస్తురన్నారు. ఈ తరం నటులతో కూడా నటించారని తెలిపారు. కొంతకాలం క్రితం మూత్రనాళ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరిన మనోరమ మళ్లీ అదే సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే ఆమెనెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించలేదని తెలిపారు. తాను తన కూతురు వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికి ఇటీవల మనోరమ ఇంటికి వెళ్లానని చెప్పారు. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి గుండె బరువెక్కిందన్నారు. మనోరమ వెయ్యి చిత్రాలకు పైగా నటించి కోట్లాది రూపాయలను సంపాదించారని, ఇప్పటికీ ఆమె ఆస్తులు కోట్ల విలువ చేస్తాయన్నారు. అయినా ఆమెను ఆస్పత్రిలో చేర్చే దిక్కు లేకపోవడం విచారకరం అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ మనోరమపై ప్రేమాభిమానాలు కలిగి వున్నారని ఆమెను ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తే, మనోరమ మరి కొంత కాలం ఆరోగ్యంగా జీవించగలరని మన్సూర్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు.