Senior Actress Pavala Syamala Emotional Words About Megastar Chiranjeevi, Deets Inside - Sakshi
Sakshi News home page

Pavala Syamala: ఆ అవమానం గురించి ఆయనతో చెప్పాలనుంది.. పావలా శ్యామల ఆవేదన

Dec 14 2022 6:14 PM | Updated on Dec 14 2022 7:52 PM

Pavala Syamala Emotional Words About Megastar Chiranjeevi - Sakshi

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల అంటే టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు. ఆమె చాలా అగ్రహీరోల సినిమాల్లోనూ నటించింది. మెగాస్టార్‌తో పలు చిత్రాల్లో ఆమె కనిపించింది. కానీ ప్రస్తుతం వయసు రీత్యా ఇంట్లోనే ఉంటోంది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించింది పావలా శ్యామల. అలాగే కెరీర్‌లో తనకు జరిగిన అవమానంపై ఆమె మాట్లాడారు. ఆ విషయం చిరంజీవికి చెబితే ఊరుకోరని అన్నారు.

 పావలా శ్యామల మాట్లాడుతూ..'చిరంజీవి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పని పట్ల ఆయనకు అంకితభావం ఎక్కువ. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేశారు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తెలిసి రూ.2 లక్షలు పంపారు. చిరంజీవిని ఒకసారి కలవాలని ఉంది. నాకు జరిగిన అవమానం గురించి ఆయనతో చెప్పాలి. ఆ విషయం చిరంజీవికి తెలిస్తే సహించరు' అని అన్నారు పావలా శ్యామల. అయితే ఆమెకు ఎదురైన అవమానం ఏంటనేది మాత్రం చెప్పలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement