నా తల్లిదండ్రులే నన్ను మోసం చేశారు: కన్నీళ్లు పెట్టుకున్న కాంచన | Senior Actress Kanchana About Her Hurdles | Sakshi
Sakshi News home page

Kanchana: వాడి వల్ల అమ్మానాన్న నన్ను వదిలేశారు, ఆస్తి కోసం పోరాడి అలిసిపోయా

Jan 18 2023 2:25 PM | Updated on Jan 18 2023 2:42 PM

Senior Actress Kanchana About Her Hurdles - Sakshi

నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీలోని స్టార్‌ నటులు ఎంతోమంది వెయిట్‌ చేశారు. కింగ్‌ ఆఫ్‌ సైప్రస్‌ ఉన్న చార్టెడ్‌ ఫ్లైట్‌లో ఓసారి నేను వెళ్లాను. జీవితంలో ఎన్నో పరుగులు తీశాను. కానీ చివరికి ఒంటరిదాన్నయ్యాను.

60, 70వ దశకంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది కాంచన. ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్‌ అయింది. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్‌ హీరోలతో జోడీ కట్టింది. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

'నా అసలు పేరు వసుంధర. సినిమాల్లోకి వచ్చాక కాంచన అని మార్చారు. నా చిన్నతనంలో మా ఇంట్లో లక్ష్మీ తాండవం అడేది. కానీ రానురానూ ఐశ్వర్యం అంతా ఐపోయింది. నాన్న అప్పులపాలయ్యాడు. ఆ సమయంలో నాకు ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం వచ్చింది. వెంటనే జాయిన్‌ అయ్యాను. నెలకు రూ.600 జీతం ఇచ్చేవారు. తర్వాత సినిమాలకూ వెళ్లాను. సినిమాల్లో ఎలా ఉన్నా సరే ఇంటికి వచ్చాక మాత్రం పద్ధతిగానే ఉంటాను. సాంప్రదాయ దుస్తులనే కంఫర్ట్‌గా ఫీలయ్యేదాన్ని.

నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీలోని స్టార్‌ నటులు ఎంతోమంది వెయిట్‌ చేశారు. కింగ్‌ ఆఫ్‌ సైప్రస్‌ ఉన్న చార్టెడ్‌ ఫ్లైట్‌లో ఓసారి నేను వెళ్లాను. అతడు కూడా నన్ను అలాగే చూస్తూ ఉండిపోయాడు. కానీ నేను మాత్రం దేనికీ చలించేదాన్ని కాదు. జీవితంలో ఎన్నో పరుగులు తీశాను.. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలావరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్‌లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. అమ్మానాన్న మారుతారేమోనని ఎదురుచూశా. కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు. 12 ఏళ్లుగా ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకుంది కాంచన.

చదవండి: బాక్సాఫీస్‌ వద్ద స్టార్‌ వార్‌.. విజయ్‌, అజిత్‌ సినిమాల కలెక్షన్స్‌ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement