Thunivu Vs Varisu: కోట్లు కొల్లగొడుతున్న స్టార్ హీరోల సినిమాలు

టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా సంక్రాంతి ఫైట్ బీభత్సంగానే జరిగింది. బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు స్టార్ హీరోలు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు. విజయ్ వారసుడు(వారిసు)గా అజిత్ తెగింపు(తునివు) చిత్రంతో సంక్రాంతి బరిలో దిగారు. వారం రోజుల్లోనే ఈ రెండు సినిమాలు రెండు వందల కోట్లు రాబట్టి బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.
ఇప్పటివరకు వారసుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. అటు తునివు సుమారు రూ.250 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాలు వసూళ్ల దుమ్ము దులుపుతున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అజిత్, విజయ్ సినిమాలు నేరుగా తలపడటంతో ఎవరు ఎక్కువ వసూళ్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Triple ah received your love in 7 days nanba 🔥#MegaBlockbusterVarisu crosses 210Crs+ collection worldwide 😎#VarisuHits210Crs#Thalapathy @actorvijay sir @directorvamshi @SVC_official @MusicThaman @iamRashmika @7screenstudio @TSeries#Varisu #VarisuPongal pic.twitter.com/aVS6vGYhhY
— Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2023
#Thunivu 7 Days Box Office
👉Tamilnadu : ₹149.7 CR
👉Andhra & Nizam : ₹6 Cr
👉Kerala : ₹7.50 Cr
👉Karnataka : ₹12.63 Cr
👉Rest of India : ₹7.5 Cr
👉Overseas : ₹66 CrTotal Worldwide Gross : ₹ 249.33* CRS
Note: Hindi version yet to release.
— TN Theatres Association (@TNTheatres_) January 18, 2023
చదవండి: సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం