P R Varalakshmi: పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. చిన్న ఆస్తి గొడవ.. 30 ఏళ్లు దూరంగా..

Senior Actress P R Varalakshmi About Her Personal Life Struggles - Sakshi

మూడు దశాబ్దాలపాటు వెండితెరపై తన నటనతో అలరించారు సీనియర్‌ నటి పీఆర్‌ వరలక్ష్మి. సుమారు 800 సినిమాల్లో నటించిన ఆమె కమల్‌ హాసన్‌, జెమిని గణేశన్‌, ఎన్టీఆర్‌, కృష్ణ వంటి ఎంతోమంది స్టార్‌ హీరోలతో నటించారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అలరించిన ఆమె వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది.  బిగ్‌స్క్రీన్‌ నుంచి బుల్లితెరకు షిఫ్ట్‌ అయిన ఆమె ప్రస్తుతం తమిళ సీరియల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

'నాకు సాయం చేసే అలవాటు ఎక్కువ. రోజూ ఎంతోకొంత దానం చేయకపోతే నిద్రపట్టేదే కాదు. అలా అందరికీ సాయం చేసుకుంటూ పోవడం వల్ల కొంత ఆస్తి పోయింది. సినిమాల కోసం ఇల్లు అమ్ముకున్నాను, కోట్లు ఖర్చు పెట్టాను. అలా మరికొంత కరిగిపోయింది. ఇప్పుడు సంపాదిస్తోంది నా ఖర్చులకు సరిపోతుంది. అంతేకానీ నాకు వందల కోట్లు లేవు. నాది లవ్‌ మ్యారేజ్‌. ఏడేళ్లు ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నాం. నా భర్త మంచి మనిషి, గోల్డ్‌ మెడలిస్ట్‌.

కానీ మామధ్య ఏదైనా చిన్న గొడవయ్యిందంటే ఏడాది దాకా మాట్లాడే వాడు కాదు. అలా ఓసారి ఇల్లు అమ్మే విషయంలో మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో మా మధ్య దూరం పెరిగింది. ఆయన నన్ను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. 30 ఏళ్లవుతోంది.. ఒక్కసారి కూడా టచ్‌లోకి రాలేదు. బతికున్నాడో లేదో కూడా తెలియదు. అయినా... తనంతట తానుగా నన్ను వెతుక్కుంటూ వస్తే సరి కానీ ఆయన ఎక్కడున్నాడో అని మేము వెతుక్కుంటూ వెళ్లడం వద్దనుకున్నాను. కానీ చిన్న గొడవ వల్ల బంగారం లాంటి మనిషికి దూరమయ్యానని బాధపడుతుంటా' అని చెప్పుకొచ్చారు వరలక్ష్మి.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top