Jayasudha: అతను నా కోసమే వచ్చారు.. ఎందుకంటే: జయసుధ

Senior Actress Jayasudha Clarity On Her Third Marriage Rumours - Sakshi

సీనియర్ నటి జయసుధ పేరు టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులో సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె ‘సహజనటి’గా గుర్తింపు సాధించింది. అప్పట్లో సీనియర్ ఎన్టీర్, ఏఎన్నాఆర్‌, సూపర్ స్టార్ కృష్ణ లాంటి స్టార్లతో ఎక్కువగా సినిమాల్లో నటించారు. ఆమె50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో చిత్రం వారసుడులో నటించారు. 

అయితే తాజాగా జయసుధ సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమెతో ఓ వ్యక్తి ప్రతి కార్యక్రమంలో ఆమె పక్కనే కనిపించడమే దీనికి కారణం. వారసుడు ప్రిరిలీజ్ ఈవెంట్లో కూడా ఓ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడంతో అంతా అలాగే అనుకున్నారు. దీంతో ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించింది. ఆ వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చేసింది. 

అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని.. తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారని జయసుధ స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే ప్రతి ఈవెంట్‌కు హాజరవుతున్నారని వెల్లడించింది. అతని పేరు ఫెలిపే రూయేల్స్ అని.. నా బయోపిక్ తీస్తున్నారని తెలిపింది. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు.

 జయసుధ మాట్లాడూతూ..'నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్‌లో తెలుసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంది? నా సినిమాలు, షూటింగ్స్ వివరాలు తెలుసుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇటీవల అమెరికా వెళ్లి అతడిని కలిశా.' అని చెప్పుకొచ్చారు జయసుధ.

కాగా..   జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్‌ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. 
 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top