L Vijayalakshmi: పుష్ప సినిమా హీరో ఎవరో నాకు తెలియదు

Veteran Actress L Vijayalakshmi Comments On Pushpa Star Allu Arjun - Sakshi

పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌, తగ్గేదేలే అంటూ చిత్తూరు మేనరిజమ్‌ డైలాగ్స్‌తో సినీలవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు అల్లు అర్జున్‌. ఈ మూవీతో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన బన్నీ ఇప్పుడు పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ ఎవరో తనకు తెలియదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది అలనాటి నటి, నర్తకి ఎల్‌ విజయలక్ష్మి. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిలైంది. తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

ఐదేళ్ల వయసులోనే డ్యాన్స్‌ షో చూసి యథాతథంగా అలాగే స్టెప్పులేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. నందమూరి తారకరామారావుగారు తనను కోడలా.. కోడలా.. అని పిలిచేవారంటూ మురిసిపోయింది. ఈ మధ్య ఏదైనా సినిమా చూశారా? అన్న ప్రశ్నకు పుష్ప సినిమా చూశానంది. అందులో నటించిన హీరో ఎవరో తెలుసుగా అనేలోపే తనకు తెలియదని చెప్పింది.

అతడు అల్లు రామలింగయ్యగారి మనవడు అని చెప్పడంతో ఆశ్చర్యపోయిన నటి.. ఈ మధ్యకాలంలో హీరోల గురించి అడుగుతుంటే రామానాయుడు మనవడు, నాగేశ్వరరావు మనవడు అని ఇలాగే చెప్తున్నారని పేర్కొంది. కాగా ఇటీవల విజయలక్ష్మి ఎన్టీఆర్‌ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీకరించేందుకు దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఆమె అమెరికా నుంచి తెనాలి రావడం కొసమెరుపు.

చదవండి: బిగ్‌బాస్‌: టికెట్‌ టు ఫినాలే బరిలో నిలబడ్డ లేడీ కంటెస్టెంట్‌
అర్ధరాత్రి ప్రభాస్‌ చేసిన పనికి సూర్య షాక్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top