Senior Actress Jaya Kumari: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్‌ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ

Health Minister M Subramanian Meets Actress Jayakumari in Hospital - Sakshi

400లకు పైగా చిత్రాల్లో నటించిన నటి జయకుమారి

సీనియర్‌ నటి జయకుమారిని(70) తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్‌ ఆదివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో ఐటెం సాంగ్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది నటి జయకుమారి. ఆ పాటలకు అప్పట్లో అధిక పారితోషికం వస్తుండడంతో తాను శృంగార తారగా మారానని జయ కుమారి ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. 400 పైగా చిత్రాల్లో నటించారు. అయినా ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు.

ఇప్పుడు రూ. 750కు అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆమె 2 కిడ్నీలు దెబ్బతినడంతో వైద్యం కోసం స్థానిక కీల్‌పాక్కంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎం.సుబ్రమణియన్‌ ఆదివారం ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు. ఆమెకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, సొంత ఇంటిని ఏర్పాటు చేసే విషయమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top