శరత్‌బాబుతో బిడ్డను కనాలనుకున్నా..: జయలలిత | Sakshi
Sakshi News home page

Jayalalitha: బావతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను

Published Sat, Mar 9 2024 10:49 AM

Jayalalitha Reveals Her Love Matter With Sarath Babu - Sakshi

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఐటం సాంగ్స్‌, ‍గ్లామర్‌ పాత్రలు పోషించింది జయలలిత. అప్పుడు ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుని చేతినిండా సంపాదించింది. కానీ ఆ గ్లామర్‌ పాత్రల వల్ల ఇప్పటికీ తనకు మంచి పాత్రలు రావడం లేదు. అప్పటి సీనియర్‌ హీరోయిన్లంతా అమ్మ, వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అలాంటి చెప్పుకోదగ్గ పాత్రలే రావట్లేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమెకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతడి టార్చర్‌ భరించలేక మూడు నెలలకే విడిపోయింది. అప్పటినుంచి సింగిల్‌గానే ఉండిపోయింది.

ప్రేమ జోలికి వెళ్లకూడదనుకున్నా
తాజాగా ఆమె ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. దివంగత నటుడు శరత్‌కుమార్‌ను మనసారా ప్రేమించానని చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ.. 'చాలామంది నన్ను రెండో పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ నేను ఆసక్తి చూపలేదు. ఒక్క పెళ్లితోనే నరకం చూశాను. ఇక దానికి జోలికి వెళ్లొద్దనుకున్నాను. అమ్మానాన్న చనిపోయాక హైదరాబాద్‌కు షిఫ్టయ్యాను. ఆఫర్ల సంగతి ఏమో కానీ సినీ ఆత్మీయులు ఉంటారని ఇక్కడ సెటిలయ్యాను.

బిడ్డను కనాలనుకున్నాం
నేను శరత్‌బాబును ప్రేమించాను. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు! ఆయనతో కలిసుండాలని ఎంతో అనుకున్నాను. కానీ ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడాయన లేరు కాబట్టి అన్ని వివరాలు చెప్తాను. ఆయనతో కలిసే యాత్రలన్నీ చేశాను. దేవుడు నాకంటూ ఓ గైడ్‌ పంపించాడనుకున్నాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపారు. మేమిద్దరం కలిసి ఓ బిడ్డను కనాలని కూడా ప్లానింగ్‌ చేసుకున్నాం. కానీ ఆయన దేని గురించైనా సంవత్సరాలతరబడి ఆలోచిస్తారు.

అభ్యంతరం లేకపోతే..
మనిద్దరం బిడ్డను కని చనిపోయాక ఆస్తి గురించి ఆమెను ఏమైనా హింసిస్తారేమోనని భయపడేవారు. మా మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. శరత్‌బాబు భార్య రమాదేవి నాకు చాలా క్లోజ్‌. ఆమెను అక్కా అని, ఆయన్ను బావ అని పిలిచేదాన్ని. బావ.. బావ అంటూ నేను తనకు క్లోజ్‌ అయ్యాను. తన దగ్గర కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. నేను ఆడదాన్ని అన్న అభ్యంతరం లేకపోతే మీరు యాత్రలకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి అని చెప్పాను. అలా తనతో నా జర్నీ మొదలైంది. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుడు పట్టుకెళ్లిపోయాడు' అని చెప్పుకొచ్చింది జయలలిత.

తప్పించుకోలేకపోయా..
ఇంకా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో గ్లామర్‌ పాత్రలు ఎక్కువ వేయడంతో కొందరు ఆర్టిస్టులు వెంటపడేవారు.. కానీ ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని. కొన్ని తప్పించుకున్నాను. మరికొన్నిసార్లు తప్పించుకోలేక, తప్పనిసరై లొంగిపోయాను. నేను చెడిపోయినా పర్వాలేదు, నా ఇంట్లో వాళ్లు బాగుండాలి అనుకున్నాను. అందుకే అలా చేశాను. అలా అని ఎవరూ ప్రేమ చూపించేవారు కాదు. పైశాచికత్వంగా ప్రవర్తించేవారూ కాదు. వాళ్ల అవసరం తీర్చుకునేవారు' అని తెలిపింది జయలలిత.

చదవండి: కల నెరవేర్చుకున్న మెగా హీరో.. నెక్స్ట్‌ టార్గెట్‌ చిరంజీవేనట!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement