Senior Actress Raksha Shares About Bad Incident With Director For Bold Role In Movie - Sakshi
Sakshi News home page

Actress Raksha: ఏంట్రా? ఏమనుకుంటున్నావ్‌.. అని డైరెక్టర్‌ను లాగి పెట్టి కొట్టా..

Aug 19 2023 4:53 PM | Updated on Aug 19 2023 5:41 PM

Senior Actress Raksha About Bad Incident - Sakshi

హీరోయిన్‌గా క్లిక్‌ అవకపోయేసరికి ఐటం సాంగ్స్‌ చేశాను. అప్పుడు బాధనిపించలేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తోంది. ఆ సాంగ్స్‌ చేయడం వల్లే నాకు తల్లి పాత్రలు రావడం లేదు. ఒక తమిళ డైరెక్టర్‌ ఈ మధ్యకాలంలో ఒక సినిమా చేశాడు. అందులో ఒక రోల్‌ ఆఫర్‌ చేశారు. నాకు పె

పోలీస్‌ వెంకటస్వామి అనే చిత్రంలో బాలనటిగా కనిపించింది తెలుగమ్మాయి రక్ష అలియాస్‌ రాణి. దాదాపు పదేళ్ల తర్వాత జానీ వాకర్‌ అనే మలయాళ చిత్రంలో నటించింది. చిరునవ్వుల వరమిస్తావా మూవీతో హీరోయిన్‌గా తెలుగులోకి ప్రవేశించింది. తర్వాత ఎక్కువగా తమిళ సినిమాలే చేసింది. అయితే స్పెషల్‌ సాంగ్స్‌ వల్లే మరింత ఫేమస్‌ అయింది. అనంతరం నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథం.. ఇలా చాలా సినిమాల్లో నటిగా చేసి మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈమె వెండితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. సినిమా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్‌ చేస్తోంది.

ఐటం సాంగ్స్‌.. ఇప్పుడు బాధేస్తోంది
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాను. హీరోయిన్‌గా క్లిక్‌ అవకపోయేసరికి ఐటం సాంగ్స్‌ చేశాను. అప్పుడు బాధనిపించలేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తోంది. ఆ సాంగ్స్‌ చేయడం వల్లే నాకు తల్లి పాత్రలు రావడం లేదు. ఒక తమిళ డైరెక్టర్‌ ఈ మధ్యకాలంలో ఒక సినిమా చేశాడు. అందులో ఒక రోల్‌ ఆఫర్‌ చేశారు. నాకు పెళ్లై, పాప ఉంది.. గతంలోలాగా స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ వేసుకుని బోల్డ్‌గా నటించమంటే నా వల్ల కాదు, మంచి పాత్ర అయితేనే చేస్తానని చెప్పాను.

నీ సినిమా వద్దు.. ఏమీ వద్దు
దానికతడు కూడా అలాంటిదేం లేదు, మంచి పాత్ర అని చెప్పాడు. తీరా సెట్‌కు వెళ్లాక బోల్డ్‌గా నటించమన్నాడు. అదేంటి? నేను చేయనని చెప్పాను కదా అని అడిగితే చేయమని ఒత్తిడి తెచ్చాడు. చాలా ఇబ్బంది పెడుతుండటంతో ఆయన చెంప చెళ్లుమనిపించి ఏంట్రా? ఏమనుకుంటున్నావ్‌ అసలు? నీ సినిమా వద్దు, ఏమీ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వినయ విధేయ రామ సినిమా కోసం బోయపాటి నాకు రోల్‌ ఆఫర్‌ చేయాలనుకున్నారు. కానీ మధ్యలో ఉన్నవాళ్లు.. ఆమె బిజీగా ఉంది, తను చేయదు అని చెప్పడంతో ఆ ఆఫర్‌ నాదాకా రాలేదు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది' అని రక్ష చెప్పుకొచ్చింది.

చదవండి: నా జీవితంలో ఇలాంటి రోజులు కూడా ఉన్నాయి, బోరున ఏడ్చిన యాంకర్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌
గ్రాండ్‌గా బ్రహ్మానందం తనయుడి పెళ్లి.. చిన్న కోడలు ఏం చేస్తుందో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement