సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమని మనందరికీ తెలుసు. కానీ మనకు పైకి కనిపించనంత అందంగా నటీమణుల జీవితాలు ఉండవని కొందరికే తెలుసు. పైకి కలర్‌పుల్‌గా కనిపించే వారి జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలా సినీతారల పర్సనల్ లైఫ్‌లో కూడా ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయి. కొందరు తమ ఆవేదన చెప్పుకోలేని పరిస్థితుల్లోనూ ఉంటారు. మరికొందరేమో సినీతారలు తాము పడిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. అలా తన పర్సనల్ లైఫ్ గురించి ఆనాటి హీరోయిన్, బుల్లితెర నటి షాకింగ్ విషయాలు పంచుకుంది. అప్పట్లో స్టార్‌గా పలు హీరోల సరసన మెప్పించిన పూజిత తన పెళ్లి, భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్త చేసిన ఘనకార్యాలను బయటపెట్టేసింది.
'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌కు రెండో భార్యగా మెప్పించిన పూజిత.. అప్పటి వారికి సుపరిచితమైన పేరు. రుతురాగాలు వంటి సీరియల్‌తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో మెప్పించింది.
భర్త మోసంపై ఒంటరి పోరాటం..
వెండితెరపై అభిమానులను మెప్పించిన పూజిత రియల్ లైఫ్ మాత్రం భర్త చేసిన మోసంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది. తన భర్త విజయ్ గోపాల్ గురించి తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త దాదాపు 9 మంది మహిళలతో ఎఫైర్స్ నడిపాడని పూజిత తెలిపింది. కానీ చివరికీ ఒక ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. దాదాపు 28 ఏళ్ల వయసు కొడుకు ఉన్న ఓ మహిళా అధికారిణిని పెళ్లాడటం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. తన భర్త మీడియా వ్యక్తి కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి.. తనకి అన్యాయం చేశాడని చాలాసార్లు పూజిత చెప్పుకొచ్చింది.
కాగా.. విజయగోపాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన పూజితకు ఓ కుమారుడు జన్మించారు. దాదాపు 14 ఏళ్ల తరువాత పూజితను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు విజయ గోపాల్. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో నటి పూజిత రోడ్డుకెక్కింది. ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీలో బాగా వైరలైంది. కానీ అప్పట్లో పూజితతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని ఆమె భర్త విజయ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.


