34 ఏళ్ల తర్వాత

Saroja Devi plays herself in Puneeth rajkumar next movie - Sakshi

తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు వెండితెరను ఏలిక నాయిక బి. సరోజా దేవి. తమిళ, కన్నడ భాషలతో పోల్చితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ కూడా బాగా ఫేమస్‌. ఇప్పుడామె తొమ్మిదేళ్ల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు. 2009లో సూర్య నటించిన ‘ఆదవన్‌’లో కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా పవన్‌ వడియార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నటసార్వభౌమ’ చిత్రంలో ఈ సీనియర్‌ నటి ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. దాదాపు 34 ఏళ్ల తర్వాత సరోజా దేవి, పునీత్‌ రాజ్‌కుమార్‌ సిల్వర్‌ స్క్రీన్‌ను షేర్‌ చేసుకుంటున్నారు. సరోజా దేవి కథానాయికగా నటించిన ‘యారివాను’లో పునీత్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. కన్నడ కంఠీరవ, పునీత్‌ తండ్రి రాజ్‌కుమార్‌ సరసన సరోజా దేవి కథనాయిక పలు చిత్రాల్లో నటించడం విశేషం. ఆ సంగతలా ఉంచితే అప్పట్లో సరోజా దేవి సినిమాలో పునీత్‌ బాల నటుడిగా నటిస్తే, ఇప్పుడు అతను హీరోగా నటిస్తోన్న సినిమాలో ఆమె కీలక పాత్ర చేయడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌ జరుగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top