ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్‌ | Usha Nadkarni: Nobody will Come for Me if i Slips and Falls | Sakshi
Sakshi News home page

నాకంటూ ఎవరూ లేరు, ఒంటరి జీవితం.. నేను చనిపోతే..: నటి భావోద్వేగం

Aug 22 2025 5:09 PM | Updated on Aug 22 2025 5:28 PM

Usha Nadkarni: Nobody will Come for Me if i Slips and Falls

ఇండస్ట్రీలో అవకాశలెప్పుడూ ఒకేలా ఉండవు. వయసు పెరిగేకొద్దీ నటీనటులకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా యాక్ట్రెస్‌లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ, బాలీవుడ్‌ నటి ఉషా నదకర్ణి (Usha Nadkarni) మాత్రం ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉంటోంది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె గతంలో పవిత్ర రిష్తా సీరియల్‌లో నటించింది. ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించిన అంకిత లోఖండే.. తాజాగా నటి ఉషాను ఇంటర్వ్యూ చేసింది.

గ్లిజరిన్‌ లేకుండా..
ఈ సందర్భంగా ఉషా గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఉషాతో తాను అంత సన్నిహితంగా ఉండేదాన్ని కాదని, అయినా ఆమె తనకు చాలా విషయాలను దగ్గరుండి నేర్పించిందని తెలిపింది. గ్లిజరిన్‌ లేకుండా ఏడ్చేస్తుందని, ఎక్కువ మేకప్‌ వేసుకోదని పేర్కొంది. ఇప్పటికీ ఒంటరిగా ధైర్యంగా జీవిస్తోందని తెలిపింది. ఆ మాటతో ఉషా భావోద్వేగానికి లోనైంది. 

నాకంటూ ఎవరూ లేరు
'అవును, ఒంటరిగా బతుకుతున్నా.. కానీ నాకూ ఎమోషన్స్‌ ఉంటాయి. ఒక్కోసారి భయమేస్తుంటుంది. సడన్‌గా స్లిప్‌ అయి కిందపడిపోతే ఎవరికీ తెలియదు. నన్ను చూసేందుకు ఎవరూ రారు. నా కొడుకు విదేశాల్లో నివసిస్తున్నాడు. ఓ సోదరుడిని ఈ మధ్యే కోల్పోయాను. ఇక్కడ నాకోసం ఎవరూ లేరు' అని భావోద్వేగానికి లోనైంది. అంకిత వెంటనే లేచి ఉషను హత్తుకుని నీకోసం నేనున్నానంటూ మాటిచ్చింది. ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే వచ్చేస్తానంది. 

నేను చనిపోతే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం తన ఒంటరితనం గురించి మాట్లాడింది. 1987 నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. మొదట్లో భయమేసింది. ఎవరైనా తలుపు తీసుకుని వచ్చి నాపై దాడి చేస్తారేమోనని భయపడేదాన్ని. కానీ, ఇప్పుడా భయం లేదు. ఎవరి మరణం ఎలా రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను నిద్రలోనే చనిపోతే పక్కింటివాళ్లు డోర్‌ కొడతారు, ఎంతకూ తలుపు తీయకపోతే చనిపోయానని వాళ్లే అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చింది.

చదవండి: వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement