Ankita Lokhande
-
నా ప్రపంచంలో నాకు నేనే రాణి : అంకిత లోఖండే (ఫోటోలు)
-
పింక్ శారీలో ట్రెడిషనల్‌గా అందంగా మెరిసిన బాలీవుడ్ నటి (ఫోటోలు)
-
ఆధ్యాత్మిక శోభ : భర్తతో కలిసి బిగ్‌బాస్ నటి సంప్రదాయపూజలు
-
జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది.. సుశాంత్ సింగ్ వల్లే.. : నటి
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదట సీరియల్స్‌లో నటించాడు. పవిత్ర రిష్తా సీరియల్ అతడికి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో అతడికి జోడీగా అంకితా లోఖండే నటించింది. వీరిద్దరూ షూటింగ్ టైంలో లవ్‌లో పడ్డారు. కానీ ఆ ప్రేమ ఎంతోకాలం సాగలేదు. ఇకపోతే 2009లో ప్రసారమైన ఈ సీరియల్ కొన్నేళ్లపాటు కొనసాగింది.అర్చనగా మొదలైన జర్నీతాజాగా పవిత్ర రిష్తా సీరియల్ ప్రేక్షకుల్ని అలరించి పదిహేనేళ్లు అవుతున్న సందర్భంగా అంకిత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 15 ఏళ్ల క్రితం పవిత్ర రిష్తా సీరియల్లో అర్చనగా నా జర్నీ మొదలుపెట్టాను. తర్వాత కొన్ని వేరే ప్రాజెక్టులు కూడా చేశాను కానీ జనాలు నన్ను అర్చనగానే గుర్తుపెట్టుకుని నాపై ప్రేమాభిమానాలు కురిపించారు. అందుకే ఆ పాత్ర ఇప్పటికీ నాలోనే, నాతోనే ఉంది. ఆ పాత్ర నాకు జీవితమంటే ఏంటో నేర్పింది.సుశాంత్ వల్లే..కెరీర్ ప్రారంభంలో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సీరియల్ యూనిట్‌కు థ్యాంక్స్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సపోర్ట్ లేకుండా నా జర్నీయే పూర్తి కాదు. సీరియల్ ప్రారంభమైన కొత్తలో ఎలా నటించాలో తెలిసేది కాదు. అతడే దగ్గరుండి యాక్టింగ్ నేర్పించాడు. అందుకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నాకు ఇంత ప్రేమాభిమానాలు అందించిన టీవీ ఇండస్ట్రీకి థ్యాంక్స్. అభిమానులు, స్టార్డమ్ ఇవన్నీ ఈ సీరియల్ నుంచే మొదలయ్యాయి అని ఇన్స్టాగ్రామ్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాగే మిస్ యూ సుశాంత్ అంటూ కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది. View this post on Instagram A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita) View this post on Instagram A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita)చదవండి: 'ఆడిషన్ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్! -
నా కోడలు మాయలాడిది.. ఇప్పుడేమో ఏక్దమ్ చించిపారేసిందట!
ఈ అత్తలున్నారే.. ఎప్పుడెలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు అని కోడళ్లు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు చెప్పే విషయం వింటే వారేంటి.. మీరు కూడా అదే మాట అంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే... బుల్లితెర నటి అంకిత లోఖండే ఇటీవలే హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో పార్టిసిపేట్ చేసింది. తను ఒక్కతే వెళ్లలేదు. వెంట భర్తను కూడా తీసుకెళ్లింది. ఆలూమగలన్నాక గొడవలు సర్వసాధారణమే! కానీ చుట్టూ కెమెరాలున్న సంగతే మర్చిపోయి ఈ దంపతులు వేరే లెవల్లో తిట్టుకున్నారు.. కొట్టుకున్నంత పని చేశారు. అప్పుడేమో తిట్టేసి.. ఇది చూసిన అంకిత అత్త రంజనా జైన్‌కు మండిపోయింది. నా కొడుక్కి కనీస గౌరవం ఇవ్వట్లేదు.. నేనెప్పుడో చెప్పా.. ఈమె అలాంటిది, ఇలాంటిది అంటూ విమర్శల పారాయణం చేసింది. అంకిత.. తన మాజీ ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటే కూడా.. అంతా ఫేమస్ అవడం కోసమే, ఓట్ల కోసమే.. పెద్ద మాయలాడి అని నానామాటలు అంది. ఇప్పుడేమో మెచ్చుకుని కట్ చేస్తే అంకిత కీలక పాత్రలో నటించిన స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా మార్చి 22న విడుదలైంది. థియేటర్లో మూవీ చూసిన అంకిత అత్తయ్య.. నా కోడలు ఎంత బాగా కనిపిస్తుందో! మా అంకిత ఏ1. ఏక్దమ్ యాక్ట్ చేసింది అని మెచ్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కమల్ హాసన్‌ను మించిపోయిందిగా అని కామెంట్లు చేస్తున్నారు. నటి పారితోషికం? ఇకపోతే స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా కోసం డైరెక్టర్ కమ్ హీరో రణ్‌దీప్ హుడా 32 కిలోలు తగ్గాడు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే రూ.6 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ తొలి రోజు ఈ చిత్రం కేవలం కోటి రూపాయల పైచిలుకు మాత్రమే సాధించడం గమనార్హం. ఈ మూవీకి అంకిత ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఆ సినిమాలు చేశానని వేశ్య అని ట్రోల్ చేస్తున్నారు -
బరాబర్ తన గురించే మాట్లాడతా.. నన్నెవరూ ఆపలేరు: నటి
బాలీవుడ్ నటి అంకిత లోఖండే గతంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ప్రేమించింది. దాదాపు ఆరేళ్లపాటు రిలేషన్లో ఉన్న వీరు 2016లో విడిపోయారు. అనంతరం అంకిత..విక్కీజైన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అటు సుశాంత్.. రియా చక్రవర్తితో లవ్‌లో పడ్డాడు. కానీ కొంతకాలానికే డిప్రెషన్‌తో 2020లో తనువు చాలించాడు. ఈ మధ్య హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్‌కు భర్తతో కలిసి వెళ్లింది అంకిత లోఖండే. హౌస్‌లో ఉన్ననాళ్లూ పోట్లాటలతోనే గడిపారు. బయటకు వచ్చాక మాత్రం మామూలైపోయారు. ఆఖరికి సొంత అత్త కూడా.. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు తరచూ సుశాంత్ గురించి మాట్లాడింది అంకిత. ఇది చూసిన నెటిజన్లు.. సుశాంత్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికే అతడి పేరు వాడుకుంటోందని విమర్శించారు. అంత ప్రేముంటే ఎందుకు విడిపోయిందో.. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం అవసరమా? సింపతీ కోసమే ఇలా చేస్తోందని ట్రోల్ చేశారు. ఆఖరికి ఆమె సొంత అత్తయ్య కూడా అదే మాట అనడంతో అగ్గిమీద గుగ్గిలమైంది నటి. తనకంలాంటి సింపతీ అక్కర్లేదని చెప్పింది. నా లైఫ్ నా ఇష్టం.. తాజాగా మరోసారి ఈ అంశంపై మాట్లాడుతూ.. 'నా జీవితం నా ఇష్టం. నాకెవరైనా తెలిసినా.. వారి గురించి ఏదైనా మంచి విషయాలు తెలిసున్నా వాటిని బయటకు చెప్తూ ఉంటాను. దాన్ని ఎవరూ ఆపలేరు. మీరు తిట్టుకోండి.. ఏమైనా చేసుకోండి.. నాకవసరమే లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా అంకిత.. బిగ్‌బాస్ 17వ సీజన్ థర్డ్ రన్నరప్‌గా నిలిచింది. చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న ఊరుపేరు భైరవకోన.. టాప్‌లో ట్రెండింగ్! -
19 ఏళ్లకే హీరోయిన్ ఆఫర్.. ఎగిరి గంతేశా! కానీ..: నటి
హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట అంకిత లోఖండే- విక్కీజైన్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరి గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఈర్ష్య, అసూయలు.. ఇవన్నీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. అయితే ఈ షో వల్ల ఎక్కువ నెగెటివిటీని మూటగట్టుకుంది అంకితనే! తాజాగా ఈ బ్యూటీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ షోకి హాజరైన ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశావా? అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆమె అవునని తలూపుతూ ఆనాటి ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేసుకుంది. ఎగిరి గంతేశా.. 'దక్షిణాది చిత్రపరిశ్రమలో నేను ఓ ఆడిషన్‌కు వెళ్లాను. తర్వాత వాళ్లు కాల్ చేసి మీరు సెలక్ట్ అయ్యారు, వచ్చి సంతకం చేయండన్నారు. నేను సంతోషంతో ఎగిరిగంతేశాను. ఈ విషయం అమ్మకు చెప్పి సంబరపడ్డాను. అయితే ఇంత తేలికగా ఎలా సెలక్ట్ చేశారబ్బా అన్న అనుమానం కూడా వచ్చింది. నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తిని బయటే ఉండమన్నారు. లోపలికి వెళ్లాక నన్ను కాంప్రమైజ్ కావాలని అడిగారు. షాకయ్యాను. నేనలాంటిదాన్ని కాదని.. నాకప్పుడు 19 ఏళ్లే. నన్ను హీరోయిన్ చేస్తారేమోనని కాంప్రమైజ్ అంటే ఏంటని అడిగాను. అందుకు వాళ్లు.. నిర్మాతతో ఒక రాత్రి ఉండాలని చెప్పారు. అప్పుడు నేను.. మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటా.. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. అయితే సౌత్‌లో ఏ భాషా ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవం ఫేస్ చేసిందో వివరంగా చెప్పలేదు. చదవండి: ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ -
భార్య లేని సమయం చూసి ముగ్గురమ్మాయిలతో నటుడు పార్టీ!
బిగ్‌బాస్ షోకి కావాల్సిందే గొడవలు, లవ్ ట్రాకులు. అందుకనే ఆచితూచి కంటెస్టెంట్లను ఎంపిక చేసుకుంటూ ఉంటుంది బిగ్‌బాస్ టీమ్. అన్ని భాషల్లో కంటే హిందీ బిగ్‌బాస్ ఈ విషయంలో ఓ మెట్టు పైనే ఉంటుంది. ఆల్రెడీ బ్రేకప్ చెప్పుకున్న జంటలను, ప్రేమలో ఉన్నవారినీ, పెళ్లైన దంపతులను తీసుకొస్తారిక్కడ. ఇంకేముంది.. బుల్లితెర ఆడియన్స్‌కు సినిమా కనిపిస్తుంది. అలా హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట అంకిత లోఖండే-విక్కీ జైన్‌ను తీసుకొచ్చారు. చుట్టూ కెమెరాలున్నాయన్న సంగతే మర్చిపోయి గొడవపడ్డారు. మావాడిమీదకు కాలెత్తుతుందా? అని విక్కీ తల్లి, నీ కొడుకు చేయెత్తింది మర్చిపోయావా? అని అంకిత తల్లి వాదులాడుకున్నారు. అలా ఈ దంపతుల విభేదాలు రెండు కుటుంబాల మధ్య గొడవలుగా మారాయి. విక్కీ లేకపోతే నీ గేమ్ ఎక్కడ? అయితే ఈ వారం జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు విక్కీ బలయ్యాడు. ఐదు రోజుల క్రితం హౌస్‌లో నుంచి బయటకు వచ్చేశాడు. నేటి గ్రాండ్ ఫినాలేతో షోకి ఎండ్ కార్డ్ పడనుంది. ఈ క్రమంలో శనివారం నాడు దర్శకుడు రోహిత్ శెట్టి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఫైనలిస్టులతో మాట్లాడి వారికి శుభాకాంక్షలు చెప్పాడు. అలా అంకిత లోఖండేతోనూ ముచ్చటించాడు. విక్కీ నిన్ను పట్టించుకోవడం లేదని, నువ్వెంత బాధపడుతున్నా లెక్క చేయడం లేదని ఫీలయ్యావు. అసలు విక్కీనే లేకపోతే నీ ఆట ఎలా ఉండేది? అని అడిగాడు. నేనేమీ అతడిని అడ్డుకోలేదు అందుకు అంకిత.. తను లేకపోతే ఇంకా బాగా ఆడేదాన్ని. సరైన నిర్ణయాలు తీసుకునేదాన్నది బదులిచ్చింది. అందుకు రోహిత్.. విక్కీ కూడా బయట ఇదే అంటున్నాడు అని చెప్పాడు. అంకిత మాట్లాడుతూ.. నేనేమీ అతడిని ఆటకు అడ్డుకోలేదు. నిన్ననే నా జర్నీ చూసుకున్నాను. విక్కీ నేను చాలాసార్లు గొడవపడ్డాం. అయినా సరే అతడు ఎప్పటికీ నాకు హీరోనే అని చెప్పింది. ఆ తర్వాత బిగ్‌బాస్ అనుమతితో ఓ ఆసక్తికర వార్తను అంకితకు చేరవేశాడు రోహిత్. ఆమెవరో తెలీదు 'విక్కీ ఇప్పటికి రెండుసార్లు పార్టీ చేసుకున్నాడు. ఓ పార్టీలో సనా, ఆయేషాతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఆమెవరో నాకు తెలీదు. కానీ ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పుడు మూడోసారి కూడా పార్టీ చేసుకుంటున్నాడు' అని చెప్పాడు. ఇందుకు అంకిత నవ్వుతూనే బయటకు వచ్చాక గట్టిగానే దెబ్బలు పడతాయి అని బదులిచ్చింది. కాగా సనా, ఆయేషా మరెవరో కాదు బిగ్‌బాస్ 17వ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లే! View this post on Instagram A post shared by Purva Rana (@purva_rana) చదవండి: పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. అయోధ్యలోనే మా పెళ్లి! -
నువ్వేనా? నీ తల్లి కూడా ఇంతేనా? నటిపై విరుచుకుపడ్డ అత్త
బిగ్‌బాస్‌లో కొట్లాటలు సహజం. పెళ్లైన జంటల్ని తీసుకొచ్చి మరీ వాళ్ల మధ్య చిచ్చు పెడుతుంటాడు బిగ్‌బాస్. అయితే భార్యాభర్తలు గొడవపడటం, తిరిగి కలిసిపోవడం సర్వసాధారణం. ఈ పోట్లాటలు చాలానే చూశాం. కానీ కనీవినీ ఎరగని రీతిలో లోపల భార్యాభర్తలు ఫైటింగ్‌లు చేస్తుంటే బయట వారి తల్లులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒకరినొకరు నిందించుకుంటున్నారు. దీనికి గల కారణమేంటి? అసలేమైంది? అనేది తెలియాలంటే ఇది చదివేయండి.. ఒకరిని మించి మరొకరు హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట అంకిత లోఖండే- విక్కీ జైన్ పాల్గొంది. చుట్టూ కెమెరాలున్నా సరే ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఇద్దరూ పోట్లాడుతూనే ఉంటారు. అందరిముందే భర్తను చులకన చేసి మాట్లాడటమే కాక ఒకానొక సమయంలో అతడిని తన్నిందా ఇల్లాలు. అతగాడేమీ తక్కువ కాదన్నట్లు భార్య ముందే మరో అమ్మాయి చేయి పట్టుకుని మాట్లాడిందే కాక అర్ధాంగి మీదకే చేయెత్తాడు. వీళ్లు చేసే రచ్చకు ఇది సాంపుల్ మాత్రమే! అంకిత అయితే పదేపదే తన మాజీ ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంది. ఇదేనా నీ సంస్కారం? ఇది విక్కీ జైన్ తల్లి రంజనాకు మింగుడుపడలేదు. ఇంకేముంది.. ఇంటర్వ్యూలలో కోడలి తీరును ఉతికారేసింది. సింపతీ కోసమే నా కోడలు తన మాజీ ప్రియుడైన సుశాంత్‌ను తలుచుకుంటోంది. అతడు బతికి ఉన్నప్పుడు ఎంతో ప్రేమను పొందాడు. ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఇప్పుడతడు లేడు. మరి తన గురించి తలుచుకుని ఏం లాభం? అంకిత నా కొడుకును కాలితో తన్నడం చూసి తట్టుకోలేకపోయాం. మన దేశంలో భర్తను దేవుడిగా చూస్తారు. కానీ నువ్వు నీ భర్తను ఎలా చూస్తున్నావు? ఇదేనా సంస్కారం? అని తిట్టిపోసింది. మరో ఇంటర్వ్యూలో అంకితను తన ఇంటి కోడలిగా తెచ్చుకోవడమే ఇష్టం లేదని చెప్పింది. కానీ కుమారుడి ఇష్టాన్ని కాదనలేక మౌనంగా ఉన్నామని చెప్పింది. నీ తల్లి కూడా ఇంతేనా? అయితే భార్యాభర్తలన్నాక లక్ష గొడవలుంటాయి. ప్రతిదాంట్లో మనం దూరనవసరం లేదు. వారి సరదా చేష్టలను సీరియస్‌గా తీసుకోనవసరం లేదు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అంకిత తల్లి వందన. ఎనిమిదేళ్లపాటు సుశాంత్‌తో కలిసి ప్రయాణించింది. బ్రేకప్ చెప్పుకున్నాక కూడా అతడి మంచే కోరుకుంది. అతడి గురించి ఆలోచిస్తే సింపతీనా? అని ఆగ్రహించింది వందన. ఇకపోతే ఫ్యామిలీ వీక్‌లో భాగంగా మంగళవారం నాడు అంకిత తల్లి, విక్కీ తల్లి ఇద్దరూ హౌస్‌లో అడుగుపెట్టారు. విక్కీని తన్నినందుకు అంకితకు ఆమె అత్త మొట్టికాయలు వేసింది. 'నీ ప్రవర్తన చూశాక నా భర్తకు ఎంత కోపమొచ్చిందో తెలుసా? ఆవేశంతో నీ తల్లికి ఫోన్ చేసి నువ్వు కూడా ఇలాగే నీ భర్తను తంతావా? నీ కూతురికి అదే నేర్పించావా? అని అడిగాడు' అని చెప్పింది. ఇకనైనా గొడవలు తగ్గించేస్తారా? ఈ మాటలు విని అంకిత బాధపడింది. ఈ మధ్యే నాన్న చనిపోయాడని, అలాంటప్పుడు ఈ గొడవలోకి మా అమ్మను ఎందుకు లాగుతున్నారంటూ ఏడ్చేసింది. అనంతరం అంకిత తల్లి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. కూతురు-అల్లుడును దగ్గరకు తీసుకున్న ఆమె ఇద్దరూ గొడవలు తగ్గించుకుని ఆప్యాయంగా ఉండమని సలహా ఇచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా.. అంకితాకు మద్దతుగా నిలబడటం విశేషం. మరి ఇకనుంచైనా అంకిత- విక్కీ పోట్లాటలు ఆపేస్తారా? లేదా అలాగే మొండిగా వ్యవహరిస్తారా? అనేది చూడాలి! చదవండి: ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన హీరో విజయ్‌కాంత్.. ఆయన కుమారుడి కోసం.. -
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్టిదే!
బిగ్‌బాస్ షోలో సింగిల్ కంటెస్టెంట్లతోపాటు అప్పుడప్పుడూ జోడీలను కూడా తీసుకొస్తుంటారు. మాజీ ప్రేమికులను, ప్రస్తుత ప్రేమపక్షులను, పెళ్లి చేసుకున్న దంపతులను షోకి రప్పిస్తూ ఉంటారు. అలా హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో బాలీవుడ్ జంట అంకితా లోఖండే- విక్కీజైన్ను తీసుకొచ్చారు. అక్కడ ఇక్కడ సేమ్ టు సేమ్... వీరు ఇంట్లో ఎలా ఉన్నారో బిగ్‌బాస్ హౌస్‌లోనూ అలాగే ఉన్నారు. అలకలు, కోపతాపాలు, గిల్లికజ్జాలు, పోట్లాటలు, ప్రేమానురాగాలు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు. అయితే ఇటీవల అంకిత తనకు నెలసరి రాలేదని కంగారు పడింది. ఒంట్లో కూడా నిస్సత్తువగా ఉందని, రోజులు గడుస్తున్నా పీరియడ్స్ రావడం లేదని భర్తతో చెప్పింది. మొదట విక్కీ జైన్ అదేంటి.. ఇంతవరకు రాకపోవడమేంటి? అని అడిగాడు. అందుకు ఆమె సమాధానమిస్తూ.. నెలసరి రాకపోవడంతో మెడికల్ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశారు అని పేర్కొంది. పరీక్షల రిజల్ట్ ఇదే రక్త, మూత్ర పరీక్షలు చేశారు, కానీ ఫలితాలు మాత్రం చెప్పలేదట. దీంతో అంకిత ప్రెగ్నెంటా? కాదా? అని అభిమానులు కంగారుపడుతున్నారు. తాజాగా ఆమె ప్రెగ్నెన్సీ రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. పరీక్షలో నెగెటివ్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నామని ఆలోచిస్తున్న అంకిత- విక్కీల ఆశల మీద నీళ్లు గుమ్మరించినట్లవుతుంది. కాగా హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ అక్టోబర్ 15 న అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ సారి కూడా సల్మాన్ ఖానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి.. రెస్టారెంట్లు మూసేసి నటననే నమ్ముకున్నాడు.. -
బిగ్‌బాస్ హౌస్‌లో అందరిముందే భర్తను చెప్పుతో కొట్టిన భార్య..!
ప్రస్తుతం బాలీవుడ్లో బిగ్ బాస్ 17 సీజన్ అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహిస్తున్నారు. అయితే హౌస్‌లో ఈసారి భార్యభర్తలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. బుల్లితెర నటులైన అంకిత, విక్కీ జైన్ రియాల్టీ షో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా కొనసాగుతున్నారు. హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఇద్దరి మధ్య చాలాసార్లు వివాదాలొచ్చాయి. (ఇది చదవండి: నాగచైతన్య-చందు మొండేటి మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!) అయితే తాజాగా హౌస్‌లో భార్యభర్తలిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. పక్కనే మరికొందరు కంటెస్టెంట్స్ ఉండగా.. ఒకరినొకరు తోసుకుంటూ హౌస్‌లో అల్లరి చేశారు. విక్కీ చేసిన సరదా కాస్తా అంకిత కోపానికి కారణమైంది. దీంతో ఆమె వెంటనే తన చెప్పులను తీసి భర్తపైకి విసిరింది. హౌస్‌లోని కంటెస్టెంట్స్ ముందే తన భర్తను చెప్పులతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ వారం నామినేషన్స్‌లో అంకిత లోఖాండే ఉన్నారు. కానీ ఆమె భర్త విక్కీ మాత్రం నామినేట్ కాలేదు. కాగా.. గతంలో తనతో ఎక్కువ సమయం మాట్లాడటం లేదని.. ఇతర హౌస్‌మేట్స్‌తోనే చనువుగా ఉంటున్నారని అంకిత చాలాసార్లు హోస్ట్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు తాను కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు అంకితకు వివరించాడు. అయితే హౌస్‌లో వీరిద్దరి తీరుపై ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. అయితే అంతకుముందే విక్కీ జైన్ మరో మహిళ కంటెస్టెంట్‌తో సన్నిహితంగా మెలిగారు. హౌస్‌లోని ఉన్న సనాతో చేయి పట్టుకుని కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో భార్య ఉండగా.. ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు, మరికొందరేమో సనానే అతని చేయి పట్టుకుందని విమర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఓటీటీలో 20 సినిమాలు.. ఆ హిట్ సినిమా ఉచితం కాదు!) Mujhe yeh vali fight dekhni hain Serious vali nahi bolna mat chappal maari 😂 Kyuki yeh bohot Masti vala tha jaise bestfriends ek dooshre ko maarte hain Ek gala daba raha ek chapal 😂😂🤣 Ankita is in muanku mood#ankitalokhande #vickyjain #biggboss17 #munawarfaruqui pic.twitter.com/zbtRESokWN — Ankitalokhande (fan) (@Ankitafam) November 19, 2023 -
సుశాంత్ ఆత్మహత్య.. అందుకే వెళ్లలేదన్న మాజీ ప్రియురాలు!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎంస్ ధోని సినిమాతో సినీ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా సుశాంత్ మరణించారు. ముంబయిలోని తన గదిలో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్-17 జరుగుతోంది. ఈ రియాలిటీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో బాలీవుడ్ నటి, సుశాంత్ ప్రియురాలు అంకితా లోఖాండే కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఉన్న ఆమె తన మాజీ ప్రియుడు సుశాంత్‌ను గుర్తుకు తెచ్చుకుంది. అతని గురించి మరో కంటెస్టెంట్ మునావర్ ఫారూఖీతో మాట్లాడింది. అంకితా లోఖండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. మునావర్ ఫరూఖీతో మాట్లాడుతూ.. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సుశాంత్ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. అందువల్లే నేను అతని అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఈ విషయం తెలిసి కూడా నేను వెళ్లలేకపోయాను. ఆ పరిస్థితిలో నేను సుశాంత్‌ను చూడలేను. విక్కీ నన్ను వెళ్లమని చెప్పాడు. కానీ నేనే నిరాకరించాను. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదు. మొదటిసారి మా నాన్నని అలా చూశా. ఒక వ్యక్తిని కోల్పోతే కలిగే నష్టాన్ని నేను గ్రహించా. కాగా.. అంకిత తండ్రి శశికాంత్ లోఖండే ఈ ఏడాదిలోనే మరణించారు. అంకిత ప్రస్తుతం బిగ్ బాస్ -17లో తన భర్త విక్కీ జైన్‌తో కలిసి పాల్గొంది. వీరిద్దరు 2021లో పెళ్లి చేసుకున్నారు. #AnkitaLokhande talks abt SSR, what a great man he was, his funeral, how it’s difficult talking abt him in past tense n breaks down remembering him n her dad ❤️#BB17 #BiggBoss17 pic.twitter.com/MWUshVXPG0 — Rachit (@rachitmehra_2) November 20, 2023 -
బిగ్‌బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్
భార్యాభర్తల మధ్య వంద గొడవలు జరుగుతాయి. ఆ గొడవలన్నీ నీటిబుడగలాంటివే! ఇలా దెబ్బలాడుకుని అలా కలిసిపోతుంటారు. ఇప్పుడు చెప్పుకునే జంట కూడా ఇదే కోవలోకి వస్తుంది. బాలీవుడ్ జంట అంకితా లోఖండే- విక్కీ జైన్ హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లోకి వెళ్లారు. ఇక బిగ్‌బాస్ ఉన్నదే ఆలూమగల మధ్య చిచ్చు పెట్టడానికి! ఈ క్రమంలో వీళ్లు ఎన్నో సార్లు గొడవపడ్డారు. తర్వాత ఎప్పటిలాగే కలిసిపోయారు. ఒంట్లో బాగోలేదు.. పీరియడ్స్ కూడా.. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయానికి బయటపెట్టింది అంకిత లోఖండే. 'నాకెందుకో ఒంట్లో బాగోలేనట్లు అనిపిస్తోంది. నాకు ఈ నెల పీరియడ్స్ కూడా రాలేదు. ఇంటికి వెళ్లాలనిపిస్తోంది అని భర్తతో వాపోయింది. దీంతో అవాక్కైన విక్కీ.. అదేంటి? నీకు పీరియడ్స్ వచ్చాయనుకున్నానే అని చెప్పగా.. లేదు.. నన్ను మెడికల్ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. నిన్న రక్తపరీక్షలు చేశారు. ఈరోజు మూత్రపరీక్ష చేశారు. కానీ ఫలితాలను మాత్రం చెప్పలేదు. రిజల్ట్ కోసం వెయిటింగ్ అందుకే టెన్షన్ అవుతోంది. నేను ఎలా ఫీలవుతున్నాననేది మాటల్లో చెప్పలేను. ఏమీ అర్థం కాకుండా ఉంది' అని చెప్పుకొచ్చింది. ఒకవేళ పాజిటివ్ ఫలితాలు వస్తే మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లో పేరెంట్స్ అయిన జంటగా ఈ దంపతులు చరిత్రలో నిలిచిపోతారు. కాగా బిగ్‌బాస్ 17వ సీజన్ అక్టోబర్ 15 న మొదలైంది. ఈ సారి కూడా సల్లూ భాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: యావర్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్.. రతిక సేవ్? కానీ ఆ లేడీ కంటెస్టెంట్ బలి! -
సుశాంత్‌తో బ్రేకప్‌పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణించి మూడేళ్లు దాటిన(2020 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు).. ఇప్పటికీ ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన మాజీ ప్రియురాలు అంకిత లోఖండేతో పాటు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న రియా చక్రవర్తి.. ఇప్పటికీ సుశాంత్‌ని తలచుకొని బాధపడుతుంటారు. తాజాగా హీరోయిన్ అంకితా లోఖండే..సుశాంత్‌తో బ్రేకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌ని తాను ఎంతగానో ప్రేమించానని, కానీ ఇతరుల మాటలను విని తనకు బ్రేకప్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణాలేవి లేవు. సుశాంత్ విడిపోదామని చెప్పగానే నేను షాకయ్యాను. ఆయన నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితంలోని పరిస్థితులన్నీ మారిపోయాయి. బ్రేకప్ ఎందుకు చెప్పాడో తెలియదు. కానీ అతని నిర్ణయాన్ని మాత్రం తప్పుబట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎదుట వాళ్ల మాటలు విని ఆయన నాకు బ్రేకప్ చెప్పాడేమో అనిపిస్తుంది’అని అంకితా లోఎఖండే చెప్పుకొచ్చింది. కాగా, సుశాంత్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అంకితతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఓ సీరియల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే సుశాంత్ హీరోగా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్.. రియా చక్రవర్తితో ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అనుహ్యంగా 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇక్కడ కూడా మనశ్శాంతి లేదా?.. హౌస్‌లో భార్యభర్తల పంచాయతీ!
హిందీ బిగ్ బాస్ సీజన్ -17 విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహహరిస్తున్నారు. ఈ సీజన్లో భార్యా భర్తలైన బుల్లితెర నటీ అంకితా లోఖాండే, విక్కీ జైన్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు. హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుండి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కనిపించింది. దీంతో ఆమె భర్త విక్కీ జైన్ తీరుపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజా ఎపిసోడ్లో విక్కీ.. అంకితను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తనను చూసి ముఖం చాటేస్తోందని ఆరోపించారు. (ఇది చదవండి: పిచ్చోడంటూ తిట్టిన శోభ.. ఉగ్రరూపం దాల్చిన ప్రిన్స్) విక్కీ మాట్లాడుతూ.. "నువ్వు నీలోని నీచమైన బుద్ధిని చూపిస్తున్నావు. అది నాకు ఇష్టం లేదు. నీ చుట్టూ ఉన్నవాళ్లంటే కనీస గౌరవం కూడా లేదు. ఈ ఇంట్లో కనీసం ఒకరితోనైనా మీరు మంచిగా ఉన్నావా? ఎవరినీ లెక్కచేయవు. ఇంత వరస్ట్‌గా నిన్ను ఎప్పుడూ చూడలేదు. కనీసం నన్ను ఇక్కడైన కాస్తా మనశ్శాంతిగా ఉండనివ్వండి. నీ ప్రవర్తన చూస్తుంటే నాకు సిగ్గుగా అనిపిస్తోంది." అని అంకితతో అన్నాడు. అయితే విక్కీ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్‌లో అంకిత పట్ల అతని తీరు ఏం బాగాలేదని కామెంట్స్ చేస్తున్నారు. . ఓ నెటిజన్ రాస్తూ.. అంకితకు ఇంత చెడ్డ భర్త ఉన్నాడా? ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఏది ఏమైనా ఇతరుల ముందు ఆమెపై అరవవడం ఏంటి? అని పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. “ఆమెలాంటి భర్త విక్కీని ఎవరూ కోరుకోరు. నేను అతనిని ద్వేషిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. ఏది ఏమైనా బిగ్‌బాస్ హోస్లో భార్య పట్ల విక్కీ జైన్ అలా వ్యవహరించడం సరికాదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: రూ.1000 కోట్ల కల.. డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే!) #AnkitaLokhande and her spat with #VickyJain! I think both are very strong headed about their perceptions! Vicky believes his game to be right and wants her to be cordial to the housemates while ankita doesn’t seem on the same page!#BB17• #BiggBoss17 pic.twitter.com/Ea6W70nX3Q — adya (@d_addy_a) October 26, 2023 -
బిగ్‌బాస్ హౌస్‌లోకి భార్యాభర్తలు.. ఆమెకే ఎక్కువ రెమ్యునరేషన్
బిగ్‌బాస్ షో.. ఈ రియాలిటీ షోలోకి ఒక్కసారైనా వెళ్లిరావాలనుకునేవారు కొందరైతే.. మాకొద్దురా బాబూ అని తూర్పు తిరిగి దండం పెట్టేసేవాళ్లు మరికొందరు. అటు ప్రేక్షకుల్లోనూ బిగ్‌బాస్‌ను ఆరాధించేవాళ్లున్నారు, తిట్టిపోసేవాళ్లూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే తిడుతూనే బిగ్‌బాస్ షోను చూసే జనాల సంఖ్యా ఎక్కువే! బిగ్‌బాస్‌కు వస్తున్న ఆదరణను బట్టే అన్ని చోట్లా ప్రతి ఏడాది కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఏడో సీజన్ నడుస్తుండగా తాజాగా హిందీలోనూ కొత్త సీజన్ షురూ అయింది. అక్టోబర్ 15న హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ ప్రారంభమైంది. ఈ షోలోకి 17 మంది సెలబ్రిటీలు అడుగుపెట్టారు. అందులో హీరోయిన్ మన్నారా చోప్రా, కమెడియన్ మునావర్ ఫరూఖి, క్రిమినల్ లాయర్ సనా రేస్ ఖాన్‌తో పాటు రెండు జంటలు కూడా ఉన్నాయి. నీల్ భట్-ఐశ్వర్య శర్మ, అంకితా లోఖండే-విక్కీ జైన్ దంపతులున్నారు. ఈ సీజన్లో అందరి కళ్లు అంకిత- విక్కీ దంపతుల మీదే ఉంది. ఈ రియాలిటీ షో కోసం అంకితా లోఖండే భారీ ఎత్తున షాపింగ్ కూడా చేసింది. ఇకపోతే ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్నవారిలో అంకిత లోఖండే మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కుగానూ ఆమె వారానికి రూ.10-12 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు భోగట్టా! ఆమె భర్త విక్కీ జైన్ మాత్రం వారానికి ఐదు లక్షలతో సరిపెట్టుకుంటున్నాడట! ఏమైనా అంకితా లోఖండే బుల్లితెరమీదే కాదు బిగ్‌బాస్ షోలోనూ తన డామినేషన్ చూపిస్తోంది! చదవండి: సిద్దార్థ్ చిన్నా మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే! -
బాలీవుడ్ నటి ఇంట విషాదం.. తండ్రి పాడె మోస్తూ భావోద్వేగం..
బాలీవుడ్ నటి అంకిత లోఖండే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శశికాంత్ లోఖండే(68)శనివారం కన్నుమూశారు. తండ్రి మరణంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆదివారం ఉదయం శశికాంత్ అంత్యక్రియలు జరగ్గా అంకిత తండ్రి పాడె మోసింది. తండ్రిని తలుచుకుని ఆమె భావోద్వేగానికి లోనవుతుండగా భర్త విక్కీ జైన్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ అంకిత? ఇండోర్‌లో జన్మించిన అంకితకు నటనంటే ఆసక్తి. తన కలను సాకారం చేసుకునేందుకు 2005లో ముంబైకి వచ్చింది. అవకాశాలు వెతుక్కునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. రూమ్ రెంట్ కట్టడానికి డబ్బుల్లేని సమయంలో తండ్రే తనను ప్రోత్సహిస్తూ డబ్బులు సమకూర్చేవాడు. మొదట 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్తా' సీరియల్లో నటించింది. ఈ ధారావాహికతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. సుశాంత్‌తో బ్రేకప్ ఈ సీరియల్ షూటింగ్ సమయంలో సహనటుడు సుశాంత్ సింగ్‌తో ప్రేమలో పడింది. ఆరేళ్ల పాటు సుశాంత్‌తో రిలేషన్షిప్లో ఉంది. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. మూడేళ్ల డేటింగ్ తర్వాత 2021 డిసెంబర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంకిత 'మణికర్ణిక','బాఘీ 3' సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) చదవండి: టాప్ హీరోయిన్.. 18 ఏళ్లకే హీరోయిన్.. పెళ్లైన డైరెక్టర్‌తో ప్రేమే కొంప ముంచిందా? గదిలో శవమై -
అంకిత పార్టీ లుక్‌పై ట్రోలింగ్, ఇంకాస్త రుద్దుకోకపోయావా?
తెరపై తళుకులీనే తారలు మేకప్ వేసుకోవడం సర్వసాధారణం. కెమెరా ముందు మాత్రమే కాదు ఏదైనా పార్టీలు, ఫంక్షన్స్ ఉన్నా సరే మేకప్ వేసుకున్నాకే అడుగు బయటపెడ్తుంటారు. కానీ సరిగా మేకప్ వేసుకోకపోయినా, దాని డోస్ ఎక్కువైనా సరే ప్రేక్షకులు అస్సలు సహించరు. మేకప్ ఎలా వేసుకోవాలో కూడా మేమే నేర్పాలా? అని చిందులు తొక్కుతారు. తాజాగా బాలీవుడ్ నటి అంకిత లోఖండేకు కూడా ఇలానే క్లాస్ పీకుతున్నారు నెటిజన్లు. అంకిత- విక్కీ జైన్ దంపతులు ఇటీవల రాహుల్ మహాజన్ భార్య నటల్య బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. ఈ నూతన దంపతులు బ్లాక్ డ్రెస్‌లో పార్టీలో తళుక్కుమని మెరిశారు. ఈ వేడుకలో తను ఎలా రెడీ అయిందో తెలుపుతూ మచ్చుకు కొన్ని ఫొటోలు వదిలింది అంకిత. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'నువ్వు ధరించిన డ్రెస్సుకు, వేసుకున్న మేకప్‌కు సంబంధమే లేదు, 'మరీ అంత మేకపా? నువ్వు సహజంగానే బాగుంటావు, కాస్త టచప్ మాత్రమే సరిపోతుంది, కానీ ఇలా ఓవర్ మేకప్ అస్సలు బాగోలేదు', 'చాలా, ఇంకాస్త రుద్దుకోకపోయావా?' అంటూ తిట్టిపోస్తున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం అంకిత లుక్‌ను చూసి దీపికా పదుకోణ్, కెండల్ జెన్నర్‌తో పోల్చుతూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita) View this post on Instagram A post shared by 💥CASHMAKEUPARTISTRY 💥 (@cashmakeupartistry) చదవండి: కీర్తి సురేష్ 'చిన్ని' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే? -
ప్రియుడ్ని పెళ్లాడిన అంకిత లోఖండే, ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్
Ankita Lokhande- Vicky Jain Are Married: సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే ప్రియుడు విక్కీ జైన్‌ను వివాహమాడింది. ఈ వేడుకకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికైంది. వధువు అంకిత గోల్డెన్ కలర్ లెహంగా ధరించగా, వరుడు విక్కీ జైన్ కూడా వధువుకు సరిపోలే బంగారు- తెలుపు రంగు షేర్వాణీ ధరించాడు. వేదిక వద్దకు వధూవరులిద్దరు పాతకాలపు కారులో రావడం ఆకట్టుకుంది. వీరి పెళ్లి వేదికను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. కాగా కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహ కార్యక్రమం ఈరోజు(డిసెంబర్ 14) ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మెహందీ, ఎంగేజ్మెంట్, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు సంబధించిన ఫొటోలను అంకిత కొద్ది రోజులుగా షేర్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొంది. చదవండి: (భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్) నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. చదవండి: (Katrina Kaif: సల్మాన్, రణ్‌బీర్ నుంచి కత్రినాకు ఖరీదైన బహుమతులు, అవేంటంటే..) -
సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి పెళ్లి.. మెహందీ ఫంక్షన్ ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలో వివాహం చేసుకోనుంది. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అంకిత- విక్కీజైన్లు డిసెంబర్ 14న మూడుముళ్ల బంధంతో ఒకటికానున్నారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ ఈ వివాహ వేడుకకి వేదిక కానుంది. ఇప్పటికే అంకిత ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. శనివారం(డిసెంబర్ 11) అంకిత- విక్కీల ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా అంఖితా మెహందీ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లి వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొంది. నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. పెద్దల అనుమతితో ఇప్పుడు పెళ్లిపీటలెక్కుతున్నారు. -
అంకిత లోఖండే ప్రి-వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోలు వైరల్
Ankita Lokhande Pre Wedding Celebrations And Photos Viral: బాలీవుడ్ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలో వివాహం చేసుకోనుంది. ముంబైలో తన ప్రియుడు విక్కీ జైన్‌తో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లోని ఫొటోలను షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోలో వధువు పింక్, గోల్డెన్ బార్డర్‌తో గ్రీన్ కలర్ సారీలో కనిపిస్తుంది. అంకిత కొన్ని సాంప్రదాయ ఆభరణాలను ధరించడం మనం చూడొచ్చు. మరోవైపు విక్కీ జైన్ ఆఫ్-వైట్ కుర్తా వేసుకున్నాడు. అంకిత కూడా 'పవిత్రం' అని క్యాప్షన్ ఇస్తూ ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) ఈ పోస్ట్‌లపై పలువురు ప్రముఖులు కామెంట్ బాక్స్‌లో హార్ట్ ఎమోజీస్‌తో తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సన్నిహితుల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంకిత, విక్కీ కొన్ని రోజుల క్రితం వారి వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచినట్లు సమాచారం. నవంబర్‌లో అంకిత తన ఫ్రెండ్స్ కోసం బ్యాచిలొరెట్ పార్టీ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ జంట డిసెంబర్ 12, 13, 14 తేదిల్లో వివాహం చేసుకోనున్నట్లు పుకార్లు జోరందుకున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. View this post on Instagram A post shared by Vicky Jain (@jainvick) ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్ రియాలిటీ షోలో పాల్గొంది. నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. -
సుశాంత్ పాత్రలో నటించాలంటే భయపడేలా చేశారు: నటుడు
Pavitra Rishta 2 Serial: బుల్లితెరపై ప్రభంజనం సృష్టించిన 'పవిత్ర రిష్తా' సీరియల్ ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మానవ్ పాత్రలను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ రెండో సీజన్లో సుశాంత్ మానవ్ పాత్రలో ప్రముఖ బుల్లితెర నటుడు షాహీర్ షేక్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షాహిర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆస్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే పవిత్ర రిష్తాలో మానవ్ పాత్రకు తాను ఒకే చెప్పడంతో చాలా మంది తనని భయపెట్టారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహిర్ మాట్లాడుతూ.. ‘ఈ ఆఫర్ రాగానే చాలా ఎక్జైయిట్ అయ్యాను. కానీ కొంతమంది నా దగ్గరకి వచ్చి నిజంగానే నువ్వు ఈ మానవ్ పాత్ర చేయడానికి సిద్దంగా ఉన్నావా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎంతో పాపులర్ అయిన సీరియల్ ఇది. అంతేగాక లెజెండరీ నటుడు సుశాంత్ చేసిన పాత్ర కావడంతో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని హెచ్చరించారు. ఇవి అన్ని విని నాలో భయం మొదలైంది. ఈ పాత్ర చేయాలా వద్దా? అని ఆలోచనలో పడిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ‘మహాభారతం సీరియల్ సమయంలో కూడా అర్జునుడు పాత్రకు కూడా అంతే భయపడ్డాను. ఈ పాత్ర నేను చేయగలనా? లేదా? అని ఆలోచించాను. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పుకుండా సక్సెస్ అవుతామనే సిద్దాంతాన్ని గట్టిగా నమ్ముతాను. అలా మహభారతంలో నటించడానికి ఒప్పుకున్న. ఇప్పుడు మానవ్ పాత్రకు కూడా అలాంటి పరిస్థితియే ఎదురైంది. దీంతో ఈ దీన్ని చాలెంజీంగ్ తీసుకున్నాను. ప్రయత్నించకుండానే అవకాశాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు అనుకున్న. అందుకే పవిత్ర రిష్తాలో నటించడాలని గట్టిగా నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నాడు. కాగా ‘పవిత్ర రిష్తా 2’లో అర్చన పాత్రలో అంకిత లోఖండే నటిస్తుంది. అయితే ఈ సీరియల్‌ను ప్రకటించగానే సుశాంత్ అభిమానులు ఈ సీరియల్‌పై విమర్శలు గుప్పించారు. మానవ్ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేమని, సుశాంత్ వల్లే పవిత్ర రిష్తా సీరియల్ హిట్టయిందని, అలాంటిది అతడు లేకుండా రెండో సీజన్ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. ‘మానవ్ అంటే ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్.. మానవ్ 2గా సుశాంత్‌ను కాకుండా మరొకరిని ఊహించుకోలేం’ అంటూ #BoycottPavitraRishta2 అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక సుశాంత్ అంటే నిజమైన ప్రేమే ఉంటే అంకిత ఈ సీరియల్లో నటించేందుకు ఒప్పుకునేదే కాదని అంకిత లోఖండేను కూడా విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
సుశాంత్ ప్లేస్‌లో మరొకరిని ఊహించుకోలేం, దాన్ని నిషేధించండి
'పవిత్ర రిష్తా' సీరియల్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చే వ్యక్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. 2009లో ఏక్తాకపూర్ తెరకెక్కించిన ఈ సీరియల్ బుల్లితెర మీద ప్రభంజనం సృష్టించింది. మానవ్‌గా సుశాంత్ సింగ్, అర్చనగా అంకిత లోఖండేల నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సుమారు ఐదేళ్లపాటు ప్రసారమైన ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సుశాంత్. తాజాగా ఈ సీరియల్ రెండో సీజన్ త్వరలో సందడి చేయబోతుందంటూ ఆల్ట్ బాలాజీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. 'ఆర్డినరీ జీవితాల్లో కొన్నిసార్లు ఎక్స్ట్రార్డినరీ లవ్‌స్టోరీలు కూడా కనిపిస్తాయి. పవిత్ర రిష్తా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో ఆల్ట్ బాలాజీలో స్ట్రీమింగ్ కానుంది' అని ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సీజన్లో అర్చన పాత్రను మరోసారి అంకిత చేస్తుండగా మానవ్ పాత్రలో నటించేందుకు షాహీర్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఫొటోతో సహా వెల్లడించారు. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) అయితే సుశాంత్ సింగ్ అభిమానులు మానవ్ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. సుశాంత్ వల్లే పవిత్ర రిష్తా సీరియల్ హిట్టయిందని, అలాంటిది అతడు లేకుండా రెండో సీజన్ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. 'మానవ్ అంటే ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్.. మానవ్ 2గా సుశాంత్‌ను కాకుండా మరొకరిని ఊహించుకోలేం' అంటూ #BoycottPavitraRishta2 అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సుశాంత్ అంటే నిజమైన ప్రేమే ఉంటే అంకిత ఈ సీరియల్లో నటించేందుకు ఒప్పుకునేదే కాదని సదరు నటిని కూడా విమర్శిస్తున్నారు. If this lady really loved our SSR then she would never take part in this serial again . Such a fake lady😠🤒. Thank god SSR was break-up with her.#BoycottPavitraRishta2 Eyes On Law Minister 4 SSR#SSRians pic.twitter.com/vFVKYuaIR0 — Scarcastic memer (@scarcasticmemer) July 13, 2021 #BoycottPavitraRishta2 No one will be able to take Sushant's place. @itsSSR 🌿🌸💫✨🦋🌼🦋✨💫🌸🌿 Pavitra Rista serial was popular for Sushant, not for any Natunkita. OUR MANAV ONLY SUSHANT#BoycottBullywood #BoycottPavitraRishta2 pic.twitter.com/aY7lTAPDsB — Pari Sona Sanjay (@PariSonaSanjay) July 13, 2021 #pavitrarishta pic.twitter.com/XP92sIZL8r — Ankita lokhande (@anky1912) July 11, 2021 looking so cheap...how can a person even think to cash a dead person's name... #BoycottPavitraRishta2#Boycottankita#JusticeForSushantSinghRajput pic.twitter.com/LnhqoS6e1R — debashree (@debashr35191593) July 13, 2021 #BoycottPavitraRishta2 You deserve this only.God will never leave you in peace. You are killing his soul everyday! Why remake after his death not before?? @ektarkapoor @Shaheer_S @anky1912 VULTURES!! pic.twitter.com/t5oWT57f3S — Ritu🇮🇳 (@Sushritu) July 13, 2021 -
బిగ్‌బాస్‌లోకి సుశాంత్ మాజీ ప్రేయసి: క్లారిటీ ఇచ్చిన నటి!
ఒక్కసారైనా బిగ్‌బాస్‌కు వెళ్లాలని చాలామంది కలలు కంటుంటారు.. కానీ బిగ్‌బాస్‌కు వెళ్లిన కొద్దిమంది మాత్రం దాన్నో పీడకలగా అభివర్ణిస్తారు. ఎందుకంటే.. ఈ రియాలిటీ షో కొందరికి ప్రత్యేక గుర్తింపుతో పాటు పాపులారిటీని తెచ్చిపెడితే మరికొందరికి మాత్రం అప్రతిష్టను మూటగడుతుంది. అందుకే ఈ షో నుంచి పిలుపు వచ్చినా అందులో అడుగు పెట్టాలంటేనే వెనకడుగు వేస్తుంటారు కొందరు సెలబ్రిటీలు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, నటి అంకిత లోఖండే కూడా ఇదే కోవలోకి చెందుతుంది. తను హిందీ బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ గత కొంతకాలంగా ప్రచారం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ రూమర్లు అంకిత వరకూ చేరాయి. దీంతో ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తాను బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదని తేల్చిపారేసింది. "ఈ ఏడాది నేను బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు చదివాను. కానీ అవి నిరాధారం. నేను ఆ షోలో భాగం కావడం లేదు. నేను బిగ్‌బాస్ షోలో భాగం కానప్పటికీ ప్రజలు నన్ను ద్వేషించడంలో మాత్రం ముందున్నారు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) చదవండి: Sushant Singh: ఆ నవ్వులు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి -
వైరల్ వీడియో: ప్రియురాలితో సుశాంత్ సింగ్ స్టెప్పులు
-
Sushant Singh: ఆ నవ్వులు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నేటికి ఏడాది. ఈ సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకిత లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్‌తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అని రాసుకొచ్చింది. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించిన సుశాంత్ చిరునవ్వులు చిందిస్తూ అంకితతో స్టెప్పులేశాడు. ఆయన చిరుదరహాసాన్ని చూస్తుంటే అభిమానుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఎంతో భవిష్యత్తున్న టాలెంటెడ్ నటుడు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడమేంటని అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది ఆత్మహత్య కాదని, బాలీవుడ్ మాఫియా చేయించిన హత్య అని ఆరోపించారు. సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. సుశాంత్ ఈ లోకాన్ని విడిచి పెట్టి సంవత్సరం పూర్తైనా అభిమానుల గుండెల్లో మాత్రం ఇప్పటికీ కొలువై ఉన్నాడు. ఇదిలా వుంటే పవిత్ర రిష్తా సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్, రియా చక్రవర్తిని లవ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నేను సారా అలి ఖాన్ కలిసి గంజాయ్ పీల్చాం: రియా -
వైరల్: టీకా తీసుకుంటూ ఏడ్చేసిన నటి
ఇంజక్షన్ అంటే చిన్న పిల్లలకే కాదు.. చాలా మంది పెద్దవారికి కూడా విపరీతమైన భయం. కొందరైతే ఏకంగా ఏడుస్తారు. నటి అంకిత లోఖండే కూడా ఇదే కోవలోకి వస్తారు. కోవిడ్ టీకా తీసుకునేటప్పుడు పాపం భయంతో ఏడ్చినంత పని చేశారు అంకిత. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. "నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను.. ఇక మీ వంతు" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో అంకితకు నర్స్ వ్యాక్సిన్ వేయడానికి వస్తుంది. టీకా తీసుకునే సమయంలో అంకిత చాలా భయపడుతుంది. ప్లీజ్ నెమ్మదిగా వేయండి అని నర్స్‌ని రిక్వెస్ట్ చేస్తుంది. అంకిత అంతలా భయపడటం చూసి నర్స్ కూడా నవ్వుతుంది. ఇక వ్యాక్సిన్ వేస్తుండగా అంకిత బప్పా.. బప్పా అంటూ దేవుడిని తలచుకుంటు.. ఏడ్చినంత పని చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అంకిత స్నేహితులు, అభిమానులు చాలా ముద్దుగా ఉన్నావ్ అంటూ కామెంట్ చేస్తుండగా.. కొందరు "మాకు కూడా వ్యాక్సిన్ అంటే చాలా భయం" అంటున్నారు నెటిజనులు. కోవిడ్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి టీకా వేయడానికి కేంద్రం అంగీకరించినప్పటికి పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. చదవండి: ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా! -
వైరల్ వీడియో: టీకా తీసుకుంటూ ఏడ్చేసిన నటి
-
ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా!
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండేకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ విక్కీ జైన్‌తో కలిసి హోలీ పండగ వేడుకను సెలబ్రెట్ చేసుకున్న వీడియోను అంకిత సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది చూసి సుశాంత్ అభిమానులు, నెటిజన్లు ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్‌తో ఆనందంగా చిందులేస్తూ హోలీ పండగను జరుపుకోవడమే కాక ఆ వీడియోను షేర్ చేస్తావా అంటూ నెటిజన్లు మండిపడుతూ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో అంకిత ఆమె బాయ్‌ఫ్రెండ్ విక్కిలు సంతోషంతో ఊగిపోతూ ఒకరికొకరు రంగులు అద్దుకుంటూ.. డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీనిని అంకిత ‘అందరికి హోలీ శుభాకాంక్షలు’ అంటూ షేర్ చేసింది. ఇక దీనిపై సుశాంత్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘ఛీఛీ సిగ్గుచేటు సుశాంత్ చనిపోయి ఏడాది కూడా కాలేదు హోలీ ఎలా సెలబ్రెట్ చేసుకుంటున్నావ్ అంకిత’, ‘సుశాంత్ అభిమానులుగా మేమే హోలీ పండగ సెలబ్రేట్ చేసుకోలేకపోయాం.. కానీ నువ్వు ఆయన ప్రియురాలివి..ఒక్క ఏడాది కూడా అగలేకపోయావా అంకిత’, ‘సుశాంత్ విషయంలో అంకిత చెప్పినవన్ని అబద్ధాలే.. ఫేం కోసం సుశాంత్ ప్రియురాలినని చెప్పుకుంది. పెద్ద మహానటి’, ‘హేట్ యూ అంకిత’ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కాగా అంకిత సుశాంత్ మరణాంతరం తనిన ప్రేమించానని, ఏడాది వారకు తామిద్దరం డేటింగ్లో ఉన్నామంటు అవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక సుశాంత్‌ను పెళ్లి చేసుకోవడం కోసం తనకు వచ్చి మూవీ ఆఫర్స్‌ను తిరస్కరించానని, షారుక్ ఖాన్‌తో ‘హ్యాపీ న్యూయర్’, ‘రామ్-లీలా’ వంటి సూపర్ హిట్ మూవీస్ కూడా వదులుకున్నట్లు ఆమె ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) చదవండి: చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి ‘మేం విడిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?’ -
చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి
ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటంతో నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ కెరియర్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియాతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను జాతీయ మీడియాతో పంచుకుంది. ‘నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. హిందీలో పవిత్ర రిస్తా సీరియల్ ద్వారా నేను ప్రేక్షకాదరణను పొందిన తర్వాత నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఒక స్టార్ హీరో నన్ను గదిలోకి పిలిచి కంప్రమైజ్ అవుతావా అని అడిగాడు. ఆయన ప్రశ్నకు నేను తెలివిగా సమాధానం ఇచ్చాను. మీ నిర్మాతకు ఎలాంటి కంప్రమైజ్ కావాలట? నేనేమైనా పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని ప్రశ్నించాను. దీంతో ఆ హీరో ఏమి మాట్లాడలేదు. అతనికి ఒక షేక్‌హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాను. ఆ సినిమా చాన్స్ ఇక నాకు రాదని అప్పుడే అర్థమైంది. ’అని అకింతా లోఖండే చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్ హీరో పేరుకాని, నిర్మాత పేరును కానీ అకింతా వెల్లడించలేదు. ఇక అంకితా లోఖండే కెరీర్ విషయానికొస్తే.. ఆమె నటిగా కంటే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలిగానే ఎక్కువ గుర్తింపుపొందింది. బాలీవుడ్లో మణికర్ణిక, భాగీ3 చిత్రాల్లో నటించింది. చదవండి: ‘ఏం అర్హత ఉందని నీకు ఇంత అందమైన భార్య?’ హీరోయిన్‌పై పిడిగుద్దులు కురిపించిన నితిన్! -
‘మేం విడిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వత బాలీవుడ్లో నెపోటిజం, డ్రగ్స్ వినియోగం గురించి భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇక సుశాంత్ మరణించిన నాటి నుంచి ఆయన అభిమానులు కొందరు తన మాజీ లవర్ అంకితా లోఖండేని టార్గెట్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ మరణించి ఇప్పటికి దాదాపు 10 నెలలు గడుస్తున్నప్పటికి వారి ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదట. ఈ నేపథ్యంలో తనను విమర్శిస్తున్న సుశాంత్ అభిమానులపై మండి పడ్డారు అంకిత. నా జీవితం గురించి మీకేం తెలుసని నన్ను విమర్శిస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ మేరకు అంకిత ‘‘నా వైపు వేలు చూపుతున్న వారికి మా బంధం గురించి ఏ మాత్రం తెలియదు. మీరు తనని(సుశాంత్) ఎంతో ఎక్కువగా ప్రేమించే వారే అయితే.. ఇప్పుడేందుకు గొడవపడుతున్నారు. మా బంధం ముగిసిన నాడు మీరంతా ఎక్కడున్నారు. ఈ రోజు నన్ను తప్పు పడుతున్నారు. ఆ రోజు ఎక్కడ ఉన్నారు. మా బంధం విషయంలో నేను తప్పు చేయలేదు. ప్రతి ఒక్కరికి తమ జీవితానికి సంబంధించి వేర్వేరు దృక్పథాలు ఉంటాయి. సుశాంత్ తన జీవితంలో ఎదగాలనుకున్నాడు.. అలానే జీవించాడు. అందుకే తన దారి తాను చూసుకున్నాడు. దానికి నేనేలా బాధ్యురాలిని అవుతాను. నేను ఎందుకు అవమానం పొందాలి.. నేనేం తప్పు చేశాను.. నా గురించి మీకేం తెలుసని నన్ను తప్పుపడుతున్నారు. దయచేసి విమర్శించడం ఆపండి. ఇది చాలా బాధిస్తుంది’’ అన్నారు. ‘‘ఆరేళ్ల మా బంధానికి ముగింపు పలికినప్పుడు నేను చాలా చాలా బాధపడ్డాను. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నేను కూడా డిప్రెషన్ బారినపడ్డాను. నా జీవితంలో చీకటి రోజులు అంటే అవే. ఎంతో ఏడ్చాను. కానీ నేను ఎవరిని నిందించలేదు కదా.. దయచేసి నన్ను విమర్శించడం ఆపండి’’ అన్నారు అంకిత. పవిత్ర రిష్తా సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్, రియా చక్రవర్తిని లవ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘ఎలా ఉన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు’ ‘నా వల్లే ఈ విమర్శలు.. క్షమించు’ -
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నటి స్టెప్పులు
ముంబై: బాలీవుడ్ నటి అంకితా లోఖండే తరచు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఆమె తాజాగా తన బాయ్ ఫ్రెండ్ విక్కిజైన్తో కలిసి డాన్స్ చేసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నేను, విక్కి కలిసి డాన్స్ చేస్తున్నాము’ అని ఆమె కాప్షన్ జతచేశారు. ఆ వీడియోలో ఇద్దరూ తెల్లని దుస్తులు ధరించి నృత్యం చేశారు. 2014లో విడుదలైన హృతిక్ రోషన్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాలోని ఓ పాటకు ఇద్దరూ హుషారుగా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని ఉద్దేశించి అంకిత భావోద్వేగం ఇటీవల ఈ జంట దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా అంకిత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. హిందిలో ప్రజాధారణ పొందిన టీవీ షో ‘పవిత్ర రిష్ట’ ద్వారా అంకిత పాపులర్ అయ్యారు. దీంతో పాటు ఏక్ థి నాయక, శక్తి-అస్తిత్వా కే ఎహ్సాస్ కి వంటి షోల్లో ఆమె నటించారు. గత ఏడాది కంగానా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘మణికర్ణిక’ మూవీ ద్వారా అంకిత బాలీవుడ్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ బాగీ-3 నటి జలక్ దిఖ్లాజా, కామెడీ సర్కస్ వంటి ప్రముఖ రియాలటీ షోలలో కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) -
‘నా వల్లే ఈ విమర్శలు.. క్షమించు’
బాలీవుడ్ నటి అంకితా లోఖండే బాయ్‌ఫ్రెండ్, సోల్మెట్ విక్కిజైన్కి ఇన్స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తన వల్లే అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడని వాపోయారు. తనలాంటి పబ్లిక్ ఫిగర్‌తో కలిసి ఉండటం వల్లే అతను విమర్శలు ఎదుర్కొంటున్నాడని.. కానీ వాటికి అసలు అతడు ఏ మాత్రం అర్హుడు కాదని తెలిపారు. అలానే ప్రతిసారి తనను అర్థం చేసుకుని.. మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ప్రేమికుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అంకిత తరచుగా వార్తల్లో నిలిచారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెలికి తీయాలని కోరారు. అభిమానులు కూడా అంకితకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో కొందరు విక్కి జైన్ అకింతకు తగినవాడు కాదంటూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో అంకిత విక్కి జైన్‌కి క్షమాపణలు, కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఎలా ఉన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు’) ఈ మేరకు అంకిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నీ పట్ల నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు దొరకడం లేదు. కానీ నిన్ను చూసిన ప్రతిసారి నా మదిలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే నీ లాంటి మంచి వ్యక్తిని నా స్నేహితుడిగా, భాగస్వామిగా, సోల్‌మెట్‌గా పంపినందుకు. అలానే నీవు నాకు అన్ని వేళలా తోడుగా నిలిచావు. నా సమస్యలన్నింటిని నీవిగా భావించావు. నాకు అవసరమైన ప్రతిసారి సాయం చేశావు. నా సపోర్టు సిస్టంగా ఉన్నందుకు ధన్యవాదాలు. అన్నింటికి మించి నన్ను, నా సమస్యలని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ విక్కి జైన్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు అంకిత. (చదవండి: 2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే; అవునా!) View this post on Instagram I can’t find the words to describe my feelings for you. One thing which come in my mind when I see us together is I’m grateful to god for sending u in my life as a friend, partner and as soul mate ❤️ Thanku for being someone who was always there for me. Thanks for making all my problems as yours and helping me whenever I needed you.Thankyou for being my support system. Most important thanku for understanding me and my situations ❤️ And I am sorry because of me u hv to face criticism which u don’t deserve at all . Words fall short but this bond is amazing🤗I love you 😽 @jainvick #viank A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Nov 1, 2020 at 11:04pm PST పవిత్ర రిష్తా సిరీయల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అంకిత. ఇందులో సుశాంత్ ఆమె కో స్టార్‌గా నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు ఆ తర్వాత విడిపోయారు. 2019లో అంకిత మణికర్ణిక చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. -
‘ఎలా ఉన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు’
‘‘నువ్వు ఎలా ఉన్నా సరే.. ఎవరో ఒకరు నిన్ను జడ్జ్ చేయడం మానరు. కాబట్టి ఇతరులను ఇంప్రెస్ చేసేలా బతకాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు సంతోషపెట్టుకుంటూ, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు’’ అంటూ బాలీవుడ్ నటి, టీవీ స్టార్ అంకితా లోఖండే తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎదుటివారిని సంతోషపెట్టాలని భావిస్తే భంగపడక తప్పదని, కాబట్టి ఎవరికి నచ్చినట్లు వారు జీవించడమే ఉత్తమమని చెప్పుకొచ్చారు. కాగా బుల్లితెరపై నటిగా ప్రాచుర్యం పొంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన అంకిత.. కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించిన అంకిత, ఆ తర్వాత భాగీ 3 వంటి పలు చిత్రాల్లోనూ మెరిశారు.(చదవండి: ట్విన్స్ రాకతో సంతోషం: అంకిత) ఇక అంకిత గతంలో.. ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో తనకు జోడీగా కనిపించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ప్రేమించిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల పాటు కొనసాగిన వీరి బంధంలో కలతలు చెలరేగడంతో స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆ తర్వాత అంకిత విక్కీ జైన్‌కు దగ్గర కాగా.. సుశాంత్ నటి రియా చక్రవర్తి ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో జూన్ 14న అతడు బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. దీంతో భావోద్వేగానికి లోనైన అంకిత.. సుశాంత్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. సుశాంత్ మృతి కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో న్యాయమే గెలుస్తుందంటూ అతడి కుటుంబానికి మద్దతుగా నిలవగా, సింగర్ శిబానీ దండేకర్ వంటి కొంతమంది వ్యక్తులు, ఆమెది చీప్ పబ్లిసిటీ అంటూ విమర్శలకు దిగారు. అయినప్పటికీ అంకిత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ట్రోల్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.(చదవండి: నటికి అంకితా లోఖండే గట్టి కౌంటర్) View this post on Instagram In the end, People will judge you anyway, So don’t live your life impressing others live your life impressing yourself ❤️ Shot by - @imtanmaykhutal A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Oct 21, 2020 at 12:21am PDT -
ప్లీజ్ ఆ వీడియో తొలగించండి: అంకిత
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తోలగించకపోవడంపై సుశాంత్ సహా నటి అంకిత లోఖండే అసహనం వ్యక్తం చేశారు. ఆ వీడియోను వెంటనే తొలగించాలంటూ అభిమానిని అభ్యర్థించారు. మీ అభిమాన నటుడుకి ప్రేమ, మద్దతు చూపడానికి ఇది తగిన మార్గం కాదని అభిమానికి సూచించారు. ‘మీరు ఏం చేస్తున్నారో అర్థం అవుతోందా. ఇలాంటి వీడియోలను పోస్టు చేయడం మానేయండి, అవి మనందరికి ఇబ్బందిని కలిగిస్తాయి’ అంటూ అంకిత ట్వీట్ చేశారు. పవిత్ర రిషిత టీవీ సీరియల్లో సుశాంత్‌కు జోడిగా అంకిత నటించిన విషయం తెలిసిందే. ఆ సీరియల్ సమయంలో వారిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. (చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) సుశాంత్ మృతి అనంతరం ఓ అభిమాని అతడి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. అది చూసిన అంకిత ఆ వీడియోను తొలగించాల్సిందిగా అభిమానిని అభ్యర్థించారు. ‘మీరు సుశాంత్‌ను ప్రేమిస్తున్నారని తెలుసు. కానీ మీ మద్దతు, అభిమానాన్ని చాటుకోవడానికి ఇది మార్గం కాదు. ఈ వీడియోను వెంటనే తొలగించండి’ అంటూ గతంలో కోరారు. జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడికి సంబంధించిన జ్ఞాపకాలను అంకిత తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే సుశాంత్ అంత్యక్రియలకు అంకిత హాజరు కాలేదు. -
2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే; అవునా!
ముంబై: రెండు సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే అంటూ తనపై విమర్శలు గుప్పించిన శిబానీ దండేకర్‌కు నటి అంకితా లోఖండే గట్టి కౌంటర్ ఇచ్చారు. చనిపోయిన తన స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తేనే తనకు ప్రచారం లభిస్తుందని అనుకోవడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత 17 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని, టీవీ యాక్టర్‌ను అయినందుకే చిన్నచూపు చూస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత) ఈ నేపథ్యంలో అతడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే.. నటుడి కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ రియా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సుశాంత్ మృతి కేసులో రియాకు మద్దతుగా స్వరా భాస్కర్, రాధికా మదన్, మంచు లక్ష్మి తదితర నటీమణులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి శిబానీ దండేకర్ రియాను విడుదల చేయాలంటూ ఆమెకు న్యాయం చేకూరాలి అంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంకితపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంకిత పితృస్వామ్య భావజాలానికి రాకుమారి వంటిదని, 2 సెకన్ల ప్రచారం కోసం ఇలా చేస్తోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) ఇక ఇందుకు అంకిత సైతం ఘాటుగానే బదులిచ్చారు. ‘‘ రెండు సెకన్ల ఫేం- ఈ పదం నన్ను ఆలోచింపజేసింది. సాధారణ పట్టణంలోని మర్యాదగల కుటుంబం నుంచి వచ్చాను. నన్ను నేను ప్రమోట్ చేసుకునే ఫ్యాన్సీ ఎడ్యుకేషన్ నాకు లేదు. 2004లో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే పవిత్ర రిష్తా సీరియల్‌తో 2009లోనే నా అసలైన ప్రయాణం మొదలైంది. 2014 వరకు ఆ సీరియల్ కొనసాగింది. వరుసగా ఆరేళ్లపాటు అత్యధిక టీఆర్సీతో కొనసాగిన విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించక తప్పడం లేదు. నిజం చెప్పాలంటే ఫేం అనేది ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ, అభిమానానికి అదనపు హంగు మాత్రమే అనుకుంటున్నా. ప్రేక్షకుల్లో నాకున్న గుర్తింపు కారణంగానే మణికర్ణిక, భాగీ వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 17 ఏళ్లుగా టీవీ పరిశ్రమలో ఉన్న నేను నా స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేయడం కేవలం 2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే అనడం ఎందుకో నాకైతే అర్థం కావడంలేదు’’ అంటూ టీవీ నటిని అయినందుకు గర్విస్తున్నా నని శిబానీకి ఘాటు కౌంటర్ ఇచ్చారు. కాగా పవిత్ర రిష్తా సీరియల్లో సుశాంత్‌కు జంటగా కనిపించిన అంకిత ఆరేళ్లపాటు అతడితో బంధాన్ని కొనసాగించింది. అయితే సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత సుశాంత్ ఆమెకు దూరం కావడంతో ఇద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారు. ఇక సింగర్‌గా గుర్తింపు పొందిన శిబానీ ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్‌తో ప్రేమలో ఉన్నారు. అతడి కూతుళ్లతోనూ ఆప్యాయంగా మెలుగుతూ ఉంటారు. -
నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత
ముంబై: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారని తాను ఎప్పుడూ అనలేదని ఆయన మాజీ ప్రేయసి అంకితా లోఖాండే తెలిపారు. సుశాంత్‌కు, అతని కుటుంబానికి న్యాయం జరగాలని మాత్రమే కోరానని పేర్కొంది. సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ సోషల్‌మీడియా వేదికగా నిరసనలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన నార్కోటిక్ అధికారులు ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. 🙏🏻 pic.twitter.com/Hu985iz6Od — Ankita lokhande (@anky1912) September 9, 2020 ఈ విషయంపై స్పందించిన అంకిత ‘ఇది అనుకోకుండా జరిగింది కాదని, చేసుకున్న కర్మ ఫలితం’ అని ట్వీట్ చేసింది. ఇక సుశాంత్ ఆత్మహత్య గురించి మీరు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించగా, తాను కేవలం సుశాంత్ మానసిక స్థితి గురించి మాట్లాడానని, సుశాంత్‌ను హత్య చేశారని ఎప్పుడూ అనలేదని పేర్కొన్నారు. తాను ఎవరిని అనుమానిస్తున్నట్లు కూడా పేర్కొనలేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు సుశాంత్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని చెప్పారు. ఈ కేసులో ఉన్న నిజానిజాలు బయటకు రావాలని మాత్రమే తాను పోరాడుతున్నట్లు తెలిపారు. JUSTICE ⚖️ pic.twitter.com/O5aRCirGPD — Ankita lokhande (@anky1912) September 8, 2020 ఇక అంకిత, రియాకు పలు ప్రశ్నలు సంధించారు. సుశాంత్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వాళ్లు డాక్టర్ చెప్పిన మందులు కాకుండా డ్రగ్స్‌ను తీసుకోవడానికి ప్రోత్సహిస్తారా? అసలు ఎవరైనా అలా చేస్తారా? అని ప్రశ్నించారు. రియా కేవలం సుశాంత్ అనారోగ్యం గురించి మాత్రమే ఆయన కుటుంబ సభ్యులకు చెప్పింది. అంతేకాని సుశాంత్ డ్రగ్స్ వాడుతున్నట్లు చెప్పిందా? లేదు. ఎందుకంటే తాను కూడా ఆ డ్రగ్స్‌ను తీసుకుంటూ ఆనందించింది. అందుకే నేను ఖర్మ తప్పదూ అంటూ పేర్కొన్నాను అని అంకిత తెలిపింది. చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?! -
దేవుడు మావైపే ఉన్నాడు: సుశాంత్ సోదరి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో చోటుచేసుకున్న అనేక పరిణామాల తర్వాత నేడు మధ్యాహ్నం రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ స్వాగతించారు. దేవుడు తమతోనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈమేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ఆమె అభిప్రాయాన్ని బలపరుస్తూ సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే 'అవును, అక్కా' అని రాసుకొచ్చారు. (చదవండి: రియా.. రియా.. అంటూ అడ్డగించారు!) కాగా సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ అతని తండ్రి రియా చక్రవర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పట్నా పోలీసులు కేసు నమోదు చేయగా ఎన్నో ట్విస్టుల తర్వాత ఆ కేసు సీబీఐ చెంతకు చేరింది. ఈ విషయంలో మొదటి నుంచి అంకిత.. సుశాంత్ కుటుంబానికి తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఇదిలా వుండగా సుశాంత్ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో నటి రియా ఎన్సీబీ అధికారుల ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు. సుమారు 8 గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా రియా బాలీవుడ్‌కు చెందిన 18 నుంచి 19 మంది డ్రగ్స్ తీసుకుంటున్నారని వెల్లడించడంతో సినీ పరిశ్రమలో కలకలం మొదలైంది. (చదవండి: 8 గంటలు ప్రశ్నల వర్షం) -
‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’
ముంబై: సుశాంత్‌తో విడిపోయిన అనంతరం తానెన్నడూ మళ్లీ అతడితో మాట్లాడలేదని నటి అంకితా లోఖండే స్పష్టం చేశారు. రియా చక్రవర్తి చెబుతున్నట్లుగా బ్రేకప్ తర్వాత తమ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదని పేర్కొన్నారు. తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ సందర్బంగా ‘మణికర్ణిక’ సినిమా విడుదల సమయంలో సుశాంత్ తన పోస్టర్‌పై కామెంట్ చేస్తే అందుకు బదులిచ్చానే తప్ప ఫోన్లో ఎన్నడూ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. అంతేగాక తాము విడిపోయిన సమయంలో సుశాంత్ ఎలాంటి కుంగుబాటుకు లోనుకాలేదని, మానసికంగా ఎల్లప్పుడూ దృఢంగా ఉండేవాడని స్పష్టం చేశారు. అదే విధంగా ముంబైలోని ఫ్లాట్ గురించి తానిప్పటికే క్లారిటీ ఇచ్చానని, ఇందుకు సంబంధించిన ఈఎమ్ఐలు కూడా కడుతున్నానని తెలిపారు.(చదవండి: సుశాంత్ అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి) కాగా జూన్ 14న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అనేక కీలక పరిణామాల అనంతరం ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఇటీవల ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ.. సుశాంత్, అతడి మాజీ ప్రేమికురాలు అంకితల బంధం గురించి కామెంట్ చేశారు. విడిపోయిన నాలుగేళ్ల తర్వాత ఇటీవలే వీరిద్దరి మధ్య మళ్లీ మాటలు మొదలయ్యాయని అంకిత పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన అంకిత.. రియా మాటలను ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ప్రకటన విడుదల చేశారు.(చదవండి: ‘ఈఎమ్ఐలు నేనే చెల్లిస్తున్నా.. ఇదిగో సాక్ష్యాలు’) ‘‘ ఫిబ్రవరి 23, 2016 వరకు మేం కలిసే ఉన్నాం. తను ఎన్నడూ సైకియాట్రిస్ట్‌ను కలవలేదు. ఎలాంటి డిప్రెషన్‌కు లోనుకాలేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు బ్రేకప్ తర్వాత మేమిద్దరం టచ్‌లోనే ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదు. నిజానికి మణికర్ణిక సినిమా విడుదల సమయంలో నాకు సంబంధించిన పోస్టర్ ముఖేశ్ చాబ్రా ఇన్‌స్టాలో షేర్ చేయగా సుశాంత్ స్పందించాడు. నాకు గుడ్ లక్ చెప్పాడు. నేను అందుకు బదులిచ్చాను అంతే. సుశాంత్‌తో నేను ఫోన్లో మాట్లాడనన్న రియా మాటలను ఖండిస్తున్నా. ఇప్పటి వరకు ప్రతీ ఇంటర్వ్యూలోనూ సుశాంత్, నేను కలిసి ఉన్నపుడు తను కుంగుబాటుకు లోనుకాలేదని చెప్పాను. అంతేకాదు మేమిద్దరం కలిసి కన్న కలల గురించి మాట్లాడాను. తను ఎక్కడైనా విజయం సాధించాలని కోరుకున్నాను. (చదవండి ‘విష ప్రయోగం వల్లే సుశాంత్ మృతి చెందాడు’) అవన్నీ నిజాయితీగా నేను మాట్లాడిన మాటలే. నిజం చెప్పాలంటే నాకు రియా గురించి, సుశాంత్‌తో ఆమె బంధం గురించి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక వ్యక్తి తన ప్రాణం కోల్పోయాడనే బాధ, నిజం బయటకు రావాలనే తప్ప నాకింకా దేనిగురించి పట్టదు. ఒకవేళ నన్ను కూడా ప్రశ్నిస్తే మేం కలిసి ఉన్న నాటి సమయం గురించి నిజాలే చెబుతాను. కచ్చితంగా సుశాంత్ కుటుంబం వైపే నిలబడతా. రియా వైపు కాదు. ఎందుకంటే తనే అంతా చేసిందని వాళ్లు నమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన చాట్స్, ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని ఎవరూ కాదనలేరు. అందుకే నేను వాళ్ల వైపే ఉంటా’’అని అంకిత లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది. సుశాంత్‌తో పరిచయం నాటి నుంచి సహజీవనం, జూన్ 8న ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లడం తదితర విషయాల గురించి ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. View this post on Instagram Few Revelations on today.. Follows #ITWILLCONTINUETILLWEGETJUSTICE A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Aug 27, 2020 at 9:30am PDT -
సుశాంత్ అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి
నటి అంకిత లోఖండే, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ సందర్భంగా ప్రారంభమైన వీరి బంధం ఆ తర్వాత విబేధాలు రావడంతో ముగిసిపోయింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా వెబ్సైట్ సుశాంత్‌తో విడిపోయిన తర్వాత అంకిత, కుశాల్ టాండన్ అనే నటుడితో కొన్నాళ్లు డేటింగ్ చేసిందంటూ కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్తా హాట్ టాపిక్‌గా మారడంతో కుశాల్ టాండన్ దీనిపై స్పందించారు. సదరు వెబ్‌సైట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ తనకు అన్నలాంటి వాడని.. అంకిత మంచి స్నేహితురాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కుశాల్ ట్వీట్ చేశారు. (చదవండి: ట్విన్స్ రాకతో సంతోషం: అంకిత) This is a shame journalism, like really , I was a friend of both ,Sushanth was a brother and @anky1912 a friend , at this time who so ever z team is trying to get my name in this blame game ... plz keep me out of this ....... 😡😡😡😡😡shocking how we live in a world of news 🙏 pic.twitter.com/B65xy737KR — KUSHAL TANDON (@KushalT2803) August 27, 2020 ‘నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇది జర్నలిజమా.. నేను.. సుశాంత్, అంకితలకు మంచి స్నేహితుడిని. తను నాకు సోదరుడిలాంటివాడు. అంకిత నాకు మంచి స్నేహితురాలు. దయచేసి మీ బ్లేమ్ గేమ్‌లో నన్ను చేర్చకండి. ఇలాంటి వార్తా ప్రపంచంలో ఉన్నందుకు షాక్ అవుతున్నాను’ అంటూ కుశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే సుశాంత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలపై కూడా స్పందించారు. సుశాంత్ మృతిని సర్కస్‌లా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుశాల్ టాండన్. ‘ప్రపంచమా.. దయచేసి తన ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వు. ఇక్కడ జరుగుతున్న సర్కస్ని చూసి స్వర్గంలో ఉన్న ఆ వజ్రం గట్టిగా నవ్వుతుంది. సుశీ. ఎప్పటిలానే వీటన్నింటిని లైట్ తీసుకో. చిల్ అవ్వు’ అంటూ మరో ట్వీట్ చేశారు కుశాల్ టాండన్. (చదవండి: సుశాంత్ ఇంటి ముందు ఆ ‘మిస్టరీ గర్ల్’ ఎవరంటే!) And for the world plz let his soul rest in peace 🙏it’s a circus 🎪 out here and the diamond must be laughing out loud from heaven ..... sushi take lite like u always did ❤️u chil it’s only caos down here 😇you angel 😇 — KUSHAL TANDON (@KushalT2803) August 27, 2020 ఇక కుశాల్‌తో డేటింగ్ వార్తలపై అంకిత స్పందించారు. ‘ఒక అమ్మాయి ఒంటరిగా ఉందంటే చాలు తను ఎవరితో డేటింగ్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ అందరికి ఒక్కటి స్పష్టంగా చెప్తున్నాను. ఎవరితోనే డేటింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. సమయం అంతకన్నా లేదు. నా పని నాకు ముఖ్యం. ఇలాంటి వార్తలు చదివి.. స్పందించి.. వివరణ ఇవ్వడం కూడా దండగ’ అన్నారు అంకిత. -
‘ఈఎమ్ఐలు నేనే చెల్లిస్తున్నా.. ఇదిగో సాక్ష్యాలు’
ముంబై : తాను నివసిస్తున్న ప్లాట్‌కు సంబంధించిన ఈఎమ్ఐలను తనే చెల్లిస్తన్నట్లు సుశాంత్ మాజీ ప్రేమికురాలు అంకితా లోఖండే పేర్కొన్నారు. తన ఫ్లాట్ కోసం సుశాంత్ ఏ రోజు ఈఎమ్ఐలు చెల్లించలేదని ఆమె స్పష్టం చేశారు. సుశాంత్ వివిధ బ్యాంక్ అకౌంట్ల నుంచి 15 కోట్ల రూపాయలు మాయమైయినట్లు తన తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. సుశాంత్ 4.5 కోట్ల రూపాయలు ఓ ప్లాట్ ఈఎమ్ఐ చెల్లిస్తున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. (మాజీ ప్రేమికురాలి ప్లాట్ ఈఎమ్ఐలు చెల్లించిన సుశాంత్) ముంబైలోని మలాడ్‌లో ఉన్న ఈ ప్లాటులో ప్రస్తుతం అంకితా లోఖండే నివసిస్తున్నారు. అయితే సుశాంత్ నుంచి ఈ ఫ్లాట్‌ను అంకితా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక ఇదే విషయంపై రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించినప్పుడు.. సుశాంత్ అంకిత కోసం ఈఎమ్ఐలు చెల్లించాడని.. వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా అతడు అంకితను ప్లాట్ ఖాళీ చేయమని కోరలేదని రియా తెలిపింది. (సుశాంత్ అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం) ఈ విషయంపై అంకితా శనివారం ట్విటర్ ద్వారా స్పందించారు. తన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాగితాలతోపాటు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లను పంచుకున్నారు. ‘నాపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెడుతున్నాను. ఇవి నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు. నా బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు. నా ఫ్లాట్ ఈఎమ్ఐలను నేనే చెల్లిస్తున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను’. అని ట్వీట్ చేశారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అంకితా లోఖండే ఫ్లాట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నట్లు కన్పిస్తోంది. సుశాంత్ ఫ్లాట్ నెం 403ను కొనుగోలు చేశాడు. అలాగే అంకితా లోఖండే 404 ఫ్లాట్ కొన్నారు. సుశాంత్ తన ఫ్లాట్ ఈఎమ్ఐ చెల్లిస్తున్నట్లు, అంకిత తన ఇంటి ఈఎమ్ఐ చెల్లిస్తున్నట్లు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా తెలుస్తోంది. (‘సుశాంత్ మా కొడుకు లాంటివాడు’) Here i cease all the https://t.co/Hijb7p0Gy6 transparent as I could https://t.co/YUZm1qmB3L Flat's Registration as well as my Bank Statement's(01/01/19 to 01/03/20)highlighting the emi's being deducted from my account on monthly basis.There is nothing more I have to say🙏 pic.twitter.com/qpGQsIaOGw — Ankita lokhande (@anky1912) August 14, 2020 -
రూ.4.5 కోట్ల ప్లాటు.. రియా కోసం కాదు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్ల రూపాయలు మాయమయినట్లు హీరో తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తిని విచారిస్తుంది. అయితే తాజాగా నేడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తంలో నుంచి సుశాంత్ 4.5 కోట్ల రూపాయలు ఓ ప్లాట్ ఈఎమ్ఐ చెల్లించడానికి వాడినట్లు ఈడీ గుర్తించింది. ముంబైలోని మలాడ్‌లో ఉన్న ఈ ప్లాటులో ప్రస్తుతం సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఉంటున్నారు. ఈ ప్లాట్‌కు సంబంధించి సుశాంత్ 4.5 కోట్ల రూపాయలను ఈఎమ్ఐల రూపంలో చెల్లించినట్లు తెలిసింది. (సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే: రియా) సుశాంత్ ఆస్తుల గురించి ఈడీ రియాను ప్రశ్నించినప్పుడు ఆమె ఈ ప్లాట్ గురించి తెలిపింది. సుశాంత్ అంకిత కోసం ఈఎమ్ఐలు చెల్లించాడని.. వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా అతడు అంకితను ప్లాట్ ఖాళీ చేయమని కోరలేదని రియా తెలిపింది. ఈ ప్లాట్ తీసుకుని కొన్ని సంవత్సరాలు అవుతుంది. దాంతో అప్పటి విలువ ఎంతో తెలియలేదు. సుశాంత్‌కు చెందిన ఒక అకౌంట్ నుంచి ఈ ఈఎమ్ఐలు ప్రతి నెల కట్ అవుతున్నట్లు ఈడీ గుర్తించింది. గత కొద్ది నెలలుగా అవి పెండింగ్‌లో ఉన్నట్లు గమనించింది. ఇదిలా ఉండగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరుతూ ‘జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్’ పేరుతో ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు అంకిత. -
ట్విన్స్ రాకతో సంతోషం: అంకిత
ముంబై: బాలీవుడ్ నటి అంకితా లోఖండే ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ట్విన్స్ రాకతో తమ కుటుంబంలో సంతోషం వెల్లవిరిసిందంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్ చేశారు. ‘‘అబీర్, అబీరాలకు స్వాగతం. ఈ కవలల రాకతో మా కుటుంబం మరింత విస్తృతమైంది. కొత్త జీవితం ఆరంభమైంది’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. కాగా అంకితా లోఖండే బిలాస్‌పూర్‌కు చెందిన విక్కీ జైన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులకు కూడా ఆమె బాగానే దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో విక్కీ సోదరి వర్షా జైన్- అభిషేక్ శ్రీవాస్తవ దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనివ్వడంతో.. అంకిత ఈ మేరకు ఇన్‌స్టాలో నవజాత శిశువుల ఫొటోలు షేర్ చేసి ఆనందం పంచుకున్నారు.(రియా వేధిస్తుందని చెప్పాడు: అంకిత) ఇక బుల్లితెరపై ప్రాచుర్యం పొంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన అంకిత.. కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత భాగీ 3 వంటి పలు చిత్రాల్లోనూ తళుక్కుమన్నారు. కాగా అంకిత గతంలో.. ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో తనకు జోడీగా కనిపించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ప్రేమించారు. ఆరేళ్ల పాటు కొనసాగిన వీరి బంధంలో కలతలు చెలరేగడంతో స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆ తర్వాత అంకిత విక్కీ జైన్‌కు దగ్గర కాగా.. సుశాంత్ నటి రియా చక్రవర్తితో బంధం కొనసాగించాడు.(‘సుశాంత్ భార్యవి నువ్వే అంకిత.. లవ్ యూ’) ఈ క్రమంలో జూన్ 14న సుశాంత్ బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన అంకిత.. సుశాంత్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. సుశాంత్ మృతి కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో చివరకు న్యాయమే గెలుస్తుందంటూ అతడి కుటుంబానికి మద్దతు పలుకుతున్నారు. కాగా సుశాంత్ ఆత్మహత్యకు రియానే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీబీఐ లోతుగా దర్యాప్తు చేపట్టింది. (‘ఏడేళ్లు తనకోసమే బతికా.. నిజం తెలియాలి’) -
‘సుశాంత్‌కు చాక్లెట్లు, గులాబ్ జామ్లంటే ఇష్టం’
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపుతో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే స్పందించారు. సుశాంత్‌ని మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తిగా ప్రేక్షకులు గుర్తించుకోవద్దని, దేశంలోనే అనేక మందికి ఆయన ప్రేరణ కలిగించారని అంకిత గుర్తు చేశారు. ప్రేక్షకులు ఆయనను ప్రేరణ కలిగించే వ్యక్తిగా గుర్తుంచుకోవాలని సూచించారు. సుశాంత్‌తో ఉన్న సాన్నిహిత్యంపై స్పందిస్తూ.. తనకు నటన నేర్పిన గొప్ప వ్యక్తి అని పేర్కొంది. కానీ మీడియాలో సుశాంత్‌పై సొంతంగా కథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు సుశాంత్‌ది చిన్న పిల్లల మనస్థత్వమని, చిన్న విషయాలను సైతం సుశాంత్ ఆస్వాధించేవాడని తెలిపింది. ఆయనకు చాక్లెట్లు, గులాబ్ జామ్లంటే చాలా ఇష్టమని పేర్కొంది. అంకిత బుల్లితెర నటిగా, హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో వచ్చిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో అంకిత, సుశాంత్ కలిసి నటించారు. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. సినిమాల్లో అవకాశం వచ్చిన తర్వాత సుశాంత్, అంకితకు దూరమయ్యాడని సమాచారం. ఆ తర్వాత అంకిత కూడా సినిమాల్లో నటించారు. మణికర్ణిక సినిమాలో అంకిత కీలక పాత్ర పోషించారు. -
నాపై భయంకరమైన వార్తలు రాస్తున్నారు: రియా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో గత వారం రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు సుశాంత్ డిప్రెషన్, బంధుప్రీతి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు. కానీ తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ బిహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అనూహ్యంగా సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. ఆమె వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. రియా, ఆమె కుటుంబ సభ్యులు డబ్బు కోసం సుశాంత్‌ను వేధించారని కేకే సింగ్ ఆరోపించారు. రియా తన కొడుకు డబ్బులు, నగలు తీసుకుని పారిపోయిందన్నారు. మరోవైపు సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రియా తనను వేధిస్తోందని సుశాంత్ తనతో చెప్పాడన్నది అంకిత. ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (సహ జీవనం.. జూన్ 8 వరకు తనతోనే: రియా) ఈ పరిస్థితుల నేపథ్యంలో రియా చక్రవర్తి తొలిసారి మీడియా ముందుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ మేరకు రియా టీం ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశారు. దీనిలో రియా.. దేవుడిపై అలాగే న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని.. తనకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియాలో తన గురించి చాలా భయంకరమైన విషయాలు చెబుతున్నప్పటికీ.. తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను అన్నారు. వీటిపై తన లాయర్స్ సలహా మేరకే స్పందిస్తానన్నారు రియా. చివర్లో సత్యమేవ జయతే.. నిజం గెలుస్తుంది అంటూ వీడియోను ముగించారు రియా. వీడియోలో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. Rhea Chakraborty breaks down in new video released by her team: Even though horrible things have been said about me in electronic media, I believe truth shall prevail.#SushantSinghRajput pic.twitter.com/zWtXakQuFm — Ananya Bhattacharya (@ananya116) July 31, 2020 -
‘ఏడేళ్లు తనకోసమే బతికా.. నిజం తెలియాలి’
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి బిహార్‌లో కేసు నమోదు చేశాడు. ఆమె వచ్చాకే సుశాంత్ తమకు దూరమయ్యాడని.. డబ్బుల కోసం ఆమె సుశాంత్‌ని వేధించిందని తెలిపాడు. తాజాగా సుశాంత్ మాజీ ప్రియురాలు అంకత లోఖండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో అంకిత తాను సుశాంత్ కుటుంబం తరఫున మాట్లాడతానని తెలిపారు. ఈ సందర్భంగా అంకిత మాట్లాడుతూ.. ‘నేను సుశాంత్, రియాల బంధం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయను. సుశాంత్ కుటుంబం తరఫున నేను మాట్లాడతాను. వారికి మద్దతుగా నిలబడతాను. ఇక్కడ నిరూపించాల్సింది.. ప్రజలకు చూపించాల్సిన వాస్తవాలు ఉన్నాయి. సుశాంత్ కుటుంబంతో నాకు ఏళ్ల పరిచయం. నేను వారితో ఎంతో సమయం గడిపాను. అందుకే వారి తరఫున మాట్లాడతాను. నాకు నిజం తెలియాలి’ అన్నారు. (రియా వేధిస్తుందని చెప్పాడు: అంకిత) అంతేకాక ‘సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడంటే నేను నమ్మను. ఒవవేళ తనది ఆత్మహత్య అని ఎవరైనా అంటే.. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక వేళ ఇది హత్య అయితే.. ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో ఏడు సంవత్సరాలు సుశాంత్ కోసం, అతడి కుటుంబం కోసం కేటాయించాను. నాకు నిజం కావాలి. అసలు వాస్తవంగా ఏం జరిగిందనేది నాకు తెలియాలి’ అన్నారు అంకిత. అంతేకాక ‘నేను చూసినంత వరకు సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యే వ్యక్తి కాదు. తనలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కునే వాడు. వ్యవసాయం అంటే అతడికి ఇష్టం. రాబోయే ఐదేళ్ల గురించి తన ప్రణాళికలు సిద్ధం చేసుకునేవాడు. ఖచ్చితంగా ఐదేళ్లలోపు వాటిని పూర్తి చేసేవాడు. తన కలల గురించి డైరీలో రాసుకునేవాడు. అతడి మరణం తర్వాత డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వింటే నా గుండె బద్దలవుతోంది. తనను కుంగుబాటుకు గురయిన వ్యక్తిగా లోకం గుర్తించడం నాకు ఇష్టం లేదు. తను హీరో.. ఎందరికో స్ఫూర్తి’ అన్నారు అంకిత. సుశాంత్, అంకిత పవిత్ర రిష్తా సీరియల్లో కలిసి నటించారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2016లో విడిపోయారు. కానీ మంచి స్నేహితులుగా ఉన్నారు.(సుశాంత్ ఖాతా నుంచి 15 కోట్లు మాయం!) -
రియా వేధిస్తుందని చెప్పాడు: అంకిత
ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నటి, సుశాంత్ ప్రేయసిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా అతడి తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ముంబైకి చేరుకుంది. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రేమికురాలు అంకితా లోఖండేను బుధవారం ఈ టీం ప్రశ్నించగా.. ఆమె సుశాంత్-రియా బంధం గురించి కీలక విషయాలు వెల్లడించారు.(సుశాంత్ కేసులో మరో మలుపు.. సుప్రీంకు రియా) 2019లో తన అరంగేట్ర సినిమా‘మణికర్ణిక’ విడుదల సమయంలో తనను అభినందించేందుకు సుశాంత్ తనకు మెసేజ్ చేశాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడని, రియా తనను వేధిస్తోందని చెప్పాడని తెలిపారు. అందుకే తనతో బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నట్లు సుశాంత్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇరువురి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను బిహార్ పోలీసులకు అందించారు. సుశాంత్ బలవన్మరణం తర్వాత అతడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రెండుసార్లు పట్నాకు వెళ్లానన్న అంకిత.. సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. ఇక విచారణ అనంతరం.. ‘‘నిజమే గెలుస్తుంది’’అంటూ అంకిత తన సోషల్ మీడియా అకౌంట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. (‘సుశాంత్ భార్య, తల్లీ.. అప్పుడు అన్నీ నువ్వే అంకిత’) కాగా టీవీ నటుడిగా పరిచయమైన సుశాంత్.. ఆ తర్వాత బీ-టౌన్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..‘పవిత్ర రిష్తా’ సీరియల్లో తనకు జంటగా నటించిన అంకిత లోఖండేతో అతడు ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లపాటు సజావుగానే సాగిన వీరి బంధంలో కలతలు రేగడంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సుశాంత్ రియా చక్రవర్తితో డేటింగ్ చేయగా.. అంకిత బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త విక్కి జైన్‌ను ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. -
రియాపై ఫిర్యాదు.. అంకిత స్పందన
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్.. రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే స్పందించారు. రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిసిన కాసేటికే అంకిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ట్రూత్ విన్స్’ అనే ఇమేజ్‌ని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజనులు రియా మీద వస్తోన్న ఆరోపణల గురించి అంకితకు తెలుసని.. అందుకే ఆమె ఇలా స్పందిచారని భావిస్తున్నారు. సుశాంత్ మరణించిన నాటి నుంచి అంకిత తన ఆలోచనలను వ్యక్తికరించడానికి మాటల బదులు సింబల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ‘దిల్ బేచారా’ విడుదల సమయంలో అంకిత పవిత్ర ‘రిష్తా టూ దిల్ బేచారా వన్ లాస్ట్ టైమ్’ అంటూ పోస్ట్ చేశారు. సుశాంత్ పవిత్ర రిష్తా సిరీయల్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘దిల్ బేచారా’ అతడి ఆఖరి చిత్రం. (‘నీకు ఆ అర్హత లేదు.. ఆమెను వదిలేయ్’) View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Jul 28, 2020 at 11:53pm PDT 2009లో వచ్చిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో అంకిత, సుశాంత్ కలిసి నటించారు. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. సినిమాల్లో అవకాశం వచ్చిన తర్వాత సుశాంత్, అంకితకు దూరమయ్యాడని సమాచారం. ఆ తర్వాత అంకిత కూడా సినిమాల్లో నటించారు. మణికర్ణిక సినిమాలో అంకిత కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆమె బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త విక్కి జైన్‌ను ప్రేమిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె సుశాంత్‌ను ఆర్థికంగా మోసం చేసిందని.. మానసికంగా హింసించిందని తెలిపాడు. రియా వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ఈ మేరకు రియాపై బిహార్‌లో కేసు నమోదు చేశారు. -
‘నీకు ఆ అర్హత లేదు.. ఆమెను వదిలేయ్’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో పలవురు సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరమయిన సంగతి తెలిసిందే. మరి కొందరు తమ సోషల్ మీడియా అకౌంట్స్ కామెంట్ సెక్షన్నికి లిమిట్ సెట్ చేసుకున్నారు. వీరిలో సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే బాయ్‌ఫ్రెండ్ విక్కీ జైన్ కూడా ఉన్నారు. సుశాంత్ మరణించిన నాటి నుంచి పలువురు అభిమానులు విక్కీ జైన్‌ను విమర్శిస్తూ కామెంట్ చేస్తున్నారట. ‘నీకు అంకిత కావాల్సి వచ్చిందా.. ఆమెను వదిలేయ్’ అంటూ నెటిజనులు విక్కిని ట్రోల్ చేస్తున్నారట. దాంతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కామెంట్ సెక్షన్‌కి లిమిట్ సెట్ చేశాడు విక్కిజైన్. సుశాంత్ మరణించిన నాటి నుంచి అంకిత కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.(‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’) 2009లో వచ్చిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో అంకిత, సుశాంత్ కలిసి నటించారు. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. సినిమాల్లో అవకాశం వచ్చిన తర్వాత సుశాంత్, అంకితకు దూరమయ్యాడని సమాచారం. ఆ తర్వాత అంకిత కూడా సినిమాల్లో నటించారు. మణికర్ణిక సినిమాలో అంకిత కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆమె బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త విక్కి జైన్‌ను ప్రేమిస్తున్నట్లు ప్రకటించారు. వారిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఒక సారి ఇంటర్వ్యూలో అంకిత విక్కి జైన్ గురించి మాట్లాడుతూ.. ‘తను చాలా మంచి వ్యక్తి. అతను బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త. ప్రస్తుతం మేం ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి గురించి వెల్లడిస్తాం’ అని తెలిపారు. -
ఆ నెంబర్‌కు సుశాంత్ అభిమానుల ఫోన్‌కాల్స్
ఇండోర్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువనికి కొద్ది రోజులుగా విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. క్షణం విడిచిపెట్టకుండా ఒకరు విడిచి మరొకరు పోన్లు చేస్తూనే ఉన్నారు. చేసిన ప్రతీ ఒక్కరికీ ఇది రాంగ్ నంబర్ అని చెప్పలేక అతను విసిగిపోయాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ.. అతనికి వస్తున్న ప్రతీ కాల్ కూడా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసమే కావడం గమనార్హం. బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణవార్త దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే పేరు మీద ఎవరో గుర్తు తెలియన వ్యక్తులు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. (‘గత నెల సుశాంత్ 50 సిమ్‌లు మార్చాడు’) అందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ కూలీ నెంబర్‌ను పొందుపరిచారు. ఇది నిజమైన అకౌంట్ అని నమ్మిన ఎంతో మంది సుశాంత్ అభిమానులు నిత్యం అతనికి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అయితే కొందరు రాంగ్ నంబర్ అని తెలియగానే కట్ చేసినప్పటికీ మరికొందరు మాత్రం సుశాంత్ ఆత్మహత్య తమను కుంగదీసిందంటూ అతని దగ్గర గోడు వెల్లబోసుకుంటున్నారు. ఒకటీ, రెండు అయితే సర్ది చెప్పవచ్చు కానీ ఫోన్లు చేసేవారి సంఖ్య వందలు, వేలు దాటేసరికి అతని నెత్తి బొప్పికట్టింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. నటి అంకిత లోఖండే పేరు మీద నకిలీ అకౌంట్ క్రియేట్ చేశారని, అందులో సదరు బాధితుడి నంబర్ పొందరుపర్చారని గుర్తించారు. ఈ ఫేక్ అకౌంట్‌ను 40 వేల మంది ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. ఇక ఆ అకౌంట్‌ను నడుపుతున్న వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నారు. (ఐ వాన్న అన్‌ఫాలో యు) -
‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం మాజీ ప్రేయసి అంకితా లోఖండే తన జీవితాన్ని అంకితం చేసిందని సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ అన్నారు. అంకితా మాత్రమే సుశాంత్‌ను నిజంగా అర్థం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. అసలు రియా చక్రవర్తిని పెళ్లి చేసుకోవాలన్న సుశాంత్ ఆలోచన గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. కాగా ఈ నెల 14 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని అర్థాంతరంగా తనువు చాలించిన విషయం తెలిసిందే. అయితే కెరీర్ పరంగా సమస్యలు తలెత్తడంతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అందరూ భావిస్తున్నారు. (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ : కీలక ప్రకటన) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తనకు చెప్పలేదని వెల్లడించారు. సుశాంత్ ఇంట్లో ఎప్పుడూ కొంతమంది వ్యక్తులు ఉండేవారన్నారు. తానెప్పుడూ సుశాంత్‌తో ఫోన్ కాల్స్ ద్వారా టచ్‌లో ఉండే వాడని పేర్కొన్నారు. రియా చక్రవర్తితో సుశాంత్ రిలేషన్ గురించి అడగ్గా.. ‘వాళ్లు పెళ్లి చేసుకుంటారని నాకు తెలీదు. ఆ పెళ్లి గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. నాకు నిజంగా తెలీదు. ఒకానొక సమయంలో సుశాంత్, అంకితా పెళ్లి చేసుకోవాల్సి ఉండేది. నాకు తెలిసినంతవరకు అదే సుశాంత్ చివరి రిలేషన్ అనుకుంటా’. అని తెలిపారు.(తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్ తండ్రి) సుశాంత్‌ను అంకితా స్నేహితురాలుగా కాకుండా తన తల్లిగా చూసుకునేదని సందీప్ అన్నారు. అంకితా గురించి మాట్లాడుతూ.. ‘ఆమె సుశాంత్ జీవితంలో తన తల్లి స్థానాన్ని పొందింది. నా 20 ఏళ్ల సినీ పరిశ్రమలో అంకితా లాంటి అమ్మాయిని చూడలేదు. అంత మంచి అమ్మాయి. సుశాంత్‌కు ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది. తన కోసం ఏమైనా చేస్తుంది. సుశాంత్‌కు అనుగుణంగా మెలిగేది. అనికి నచ్చిన ఫుడ్‌ను వండి పెట్టేది. అంకితా తన ఇంటిని సుశాంత్‌కు నచ్చే విధంగా డిజైన్ చేసుకుంది.సుశాంత్ కోసం తన కెరీర్‌ను వదులుకుంది. ఇలా ప్రతిదీ సుశాంత్ ఇష్టం మేరకే చేసేది. అంకితా లాంటి అమ్మాయిని పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇటీవల తనతో మాట్లాడాను అంకితా ఎంత బాధపడుతుందో నాకు తెలుసు’. అంటూ ముగించారు. (‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’) -
తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్ తండ్రి
ముంబై: ‘‘పెళ్లి చేసుకోమని సుశాంత్‌ను ఎన్నోసార్లు అడిగాం. కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నుంచి బయటపడ్డాకే నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నానన్నాడు. పెళ్లి విషయం గురించి తనతో జరిగిన చివరి సంభాషణ అదే’’ అంటూ బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ సుశాంత్‌కు ఇచ్చామని.. కానీ ఆ ముచ్చట తీరకుండానే తను శాశ్వతంగా తమకు దూరమయ్యాడని భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అందరితో కలివిడిగా ఉండేవాడని.. కానీ ఆత్మహత్యకు కొన్నిరోజుల ముందు తను ఎందుకు గంభీరంగా మారిపోయాడో తెలియదని ఆవేదన చెందారు.(‘సుశాంత్ భార్య, తల్లీ.. అప్పుడు అన్నీ నువ్వే అంకిత’) ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కేకే సింగ్‌ను సుశాంత్ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించగా.. తన స్నేహితురాళ్ల గురించి తమకు తెలుసునన్నారు. నటి అంకిత లోఖండేతో తమ కుటుంబానికి పరిచయం ఉందని తెలిపారు. ముంబైతో పాటు తమ స్వస్థలం పట్నాలోని ఇంటికి కూడా ఆమె వచ్చిందని పేర్కొన్నారు. అదే విధంగా హీరోయిన్ కృతి సనన్‌ను కూడా ఓసారి ముంబైలో కలిశానన్న కేకే సింగ్.. ప్రస్తుతం సుశాంత్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి గురించి మాత్రం తనకు ఏమీ తెలియదన్నారు. కాగా బుల్లితెర నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. ఆ తర్వాత బీ-టౌన్లో ప్రవేశించి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే టీవీ నటుడిగా ఉన్న సమయంలో ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో తనకు జోడీగా నటించిన అంకిత లోఖండేను సుశాంత్ ప్రేమించాడు. ఆరేళ్లపాటు సన్నిహితంగా మెలిగిన వీరు.. తమ మధ్య విభేదాలు తలెత్తడంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. (నీ శత్రువు అదే: కృతి సనన్ భావోద్వేగం) కాగా కృతిసనన్‌కు దగ్గరైనందువల్లే సుశాంత్.. అంకితకు బ్రేకప్ చెప్పాడని రూమర్లు ప్రచారం కాగా వారిద్దరు ఈ వార్తలను కొట్టిపడేశారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రియా చక్రవర్తి పేరు తెరమీదకు వచ్చింది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్లో టాక్ వినిపించింది. కాగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సుశాంత్.. గత కొన్ని రోజులుగా అవకాశాలు చేజారడంతో డిప్రెషన్‌కు లోనై జూన్ 14న ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అతడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు అంకిత లోఖండే, కృతి సనన్, శ్రద్ధా కపూర్ తదితర సెలబ్రిటీలు హాజరై అంతిమ వీడ్కోలు పలికారు. -
‘సుశాంత్ భార్యవి నువ్వే అంకిత.. లవ్ యూ’
బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో గడిపిన క్షణాలను తలచుకుంటూ అతడి స్నేహితుడు సందీప్ సింగ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సుశాంత్‌ను ఎంతగానో ప్రేమించిన అంకిత గనుక అతడి జీవిత భాగస్వామి అయి ఉంటే.. తను ఈరోజు తమ మధ్యే ఉండేవాడని ఉద్వేగానికి గురయ్యాడు. వారిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారని తాను నమ్ముతున్నానని.. ఆమె సాన్నిహిత్యంలో సుశాంత్ ఎంతో సంతోషంగా ఉండేవాడని గుర్తుచేసుకున్నాడు. తమ ముగ్గురి స్నేహం కలకాలం కొనసాగాలని కోరుకుంటే ఇంతలో ఇలా జరిగిందని ఆవేదన చెందాడు. సుశాంత్ బలవన్మరణం నేపథ్యంలో అతడి మాజీ ప్రేయసి అంకిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ.. వారిద్దరి ఫ్రెండ్ సందీప్ సింగ్ ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు.(ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!) ‘‘ప్రియమైన అంకిత, రోజులు గడుస్తున్నా ఆ ఆలోచనలు నన్ను వదలడం లేదు. మనం ఇంకాస్త గట్టిగా ప్రయత్నించాల్సింది, తనను ఆపి ఉండాల్సింది, తనను అర్థించి ఉండాల్సింది! మీరిద్దరు వేరైపోయినప్పటికీ, నువ్వు తన సంతోషం, గెలుపునే ఆకాంక్షించావు. నీ ప్రేమ స్వచ్ఛమైనది. ఎంతో ప్రత్యేకమైనది. నీ ఇంటి నేమ్‌ప్లేట్‌పై నువ్వు ఇంతవరకు సుశాంత్ పేరును తొలగించలేదు. ఈనాటికీ నేను నమ్ముతున్నది ఒక్కటే. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీ ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ. ఈ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. గాయపరుస్తున్నాయి... నేనెలా వీటన్నింటిని మరచిపోవాలి! అవన్నీ ఎలా తిరిగి పొందాలి! గతంలోని మనం ముగ్గురం ఎలా ఉన్నామో అచ్చంగా అలాగే మళ్లీ నాకు కావాలి! నాకు తెలుసు నువ్వొక్కదానివే తనను రక్షించగలిగేదానివి. మీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు నేను ఎన్నోసార్లు కలగన్నాను. తను నిన్ను తనతోనే ఉండనివ్వాల్సింది... నువ్వు తన ప్రేమికురాలు, భార్య, తల్లి, ప్రాణ స్నేహితురాలిగా ఉన్నావు. లవ్ యూ అంకితా. నీలాంటి స్నేహితురాలిని నేను ఎప్పటికీ వదులుకోలేను’ అంటూ ముగ్గురు కలిసి ఉన్న ఫొటోను శుక్రవారం ఇన్‌స్టాలో షేర్ చేశాడు. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్..) కాగా బుల్లితెర నటుడిగా పరిచయమైన సుశాంత్.. ఆ తర్వాత బీ-టౌన్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే టీవీ నటుడిగా ఉన్న సమయంలో ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో తనకు జంటగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్ ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లపాటు సజావుగానే సాగిన వీరి బంధంలో కలతలు రేగడంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే వెండితెర హీరోగా బిజీ అయిన తర్వాత సుశాంత్‌కు ఓ హీరోయిన్‌తో స్నేహం పెరగడంతోనే అతడు అంకితకు దూరమైనట్లు వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సుశాంత్‌తో పాటు ఆ హీరోయిన్ కూడా ఆ వార్తలను కొట్టిపారేశారు. కానీ అంకిత మాత్రం సుశాంత్‌కు దూరమైన తర్వాత ఎంతో వేదనకు గురైందని ఆమె సన్నిహితులు పలుమార్లు వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరు విడిపోయినా.. స్నేహం అనే బంధం మిగిలి ఉన్న కారణంగా తను సుశాంత్ అంత్యక్రియలకు హాజరై అతడికి అంతిమ వీడ్కోలు పలికిందని తెలిపారు. View this post on Instagram Dear Ankita, with each passing day, one thought keeps haunting me over and over again. Kaash... I wish... We could have tried even harder, we could've stopped him, we could've begged him! Even when you both seperated, you only prayed for his happiness and success... Your love was pure. It was special. You still haven't removed his name from the nameplate of your house❤️ I miss those days, when the three of us stayed together in lokhandwala as a family, we shared so many moments which bring tears to my heart today...cooking together, eating together, ac ka paani girna, our special Mutton bhaat, our long drives to uttan, lonavala or Goa! Our crazy holi! Those laughs we shared, those sensitive low phases of life when we were there for each other, you more than anyone. The things you did to bring a smile on Sushant's face. Even today, I believe that only you two were made for each other. You both are true love. These thoughts, these memories are hurting my heart...how do I get them back! I want them back! I want 'us three' back! Remember the Malpua!? And how he asked for my mother's Mutton curry like a little kid! I know that only you could've saved him. I wish you both got married as we dreamt. You could've saved him if he just let you be there...You were his girlfriend, his wife, his mother, his best friend forever. I love you Ankita. I hope I never lose a friend like you. I won't be able to take it. A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on Jun 19, 2020 at 8:44am PDT -
'బాగీ-3లో మణికర్ణిక ఫేమ్ అంకితా లోఖండే'
మణికర్ణిక ఫేమ్, పవిత్ర రిష్తా సీరియల్‌తో టీవీ ప్రేక్షకులకు చేరువైన నటి అంకితా లోఖండే తాజాగా మరో భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రాన్ని చేజిక్కించుకుంది. హీరో టైగర్‌ష్రాఫ్, సాహో ఫేమ్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న బాగీ-3 చిత్రంలో అంకితాకు నటించే అవకాశం దక్కింది. కాగా బాలీవుడ్‌లోకి అంకితా లోఖండే డెబ్యూ మూవీ మణికర్ణికతో అడుగుపెట్టారు. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీలో ఆమె రితేష్ దేశ్ముఖ్తో పాటు నటిస్తున్నారని ఈ మేరకు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాగీ-3లో ఆమె శ్రద్ధాకపూర్‌కు అక్కగా నటిస్తుండగా, మరోవైపు రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రంలో టైగర్‌కు అన్నగా నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తనని మునుపటి కంటే కొత్తగా చూపనున్నారని, ప్రేక్షకులకు తన పాత్ర బాగా నచ్చుతుందని అంకితా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్రం మార్చి 2020లో రిలీజ్ కానుంది. -
పబ్లిక్‌గా ముద్దిచ్చిన నటి.. వీడియో వైరల్
హిందీ టీవీ రంగంలో నటిగా పాపులరైన అంకిత లొకాండె.. మణికర్ణికతో సినీరంగంలోకి అడుగుపెట్టి, ఎంట్రీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణికర్ణికలో కంగనాకు సపోర్టుగా జల్కరి బాయి పాత్రలో ఒదిగిపోయి మంచి మార్కులు కొట్టేసింది. పవిత్ర రిష్తా టీవీ షో చేసే సమయంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చాలా కాలం రిలేషన్షిప్లో ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత 2016లో అతడితో విడిపోయింది. సుశాంత్ టీవీ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసే క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే ఇటీవల అంకిత, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త విక్కీ జైన్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్టు, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై అంకిత కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. 'విక్కీ చాలా మంచి వ్యక్తి. నేను అతనితో ప్రేమలో ఉన్నా. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఒక వేళ పెళ్లి చేసుకుంటే మీ అందరిని పిలిచే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతానికైతే అలాంటి ప్లాన్లేవీ లేవు. నా ఫోకస్ అంతా పని మీదే ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల అంకిత, విక్కీ జైన్ ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆడిపాడారు. ఈ జంట మ్యూజిక్‌ని ఆస్వాధిస్తుండగా ఒక్కసారిగా విక్కీని దగ్గరకు తీసుకుని అందరు చూస్తుండగానే అంకిత ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించి వీడియోను నటుడు అర్జున్ బిజ్లానీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
లవ్ స్టోరీతో నటి గ్రాండ్ ఎంట్రీ
బెంగళూరు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ఇటీవలే బ్రేకప్ అయిన భామ అంకితా లోఖాండే వెండితెరకు పరిచయం కానుంది. బుల్లితెరపై ప్రముఖ నటిగా రాణిస్తున్న ఈ భామ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న 'మలాంగ్'తో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో పోలీస్ అధికారిణిగా అంకితా కనిపించనుందని సమాచారం. గతంలో షారుక్ సరసన ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో చేజారడంతో కొన్ని రోజులు ఎదురుచూసిన ఈ బ్యూటీకి అదృష్టం తలుపు తట్టిందని చెప్పవచ్చు. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత కొన్నిరోజులు ఎంతో బాధపడ్డ ఈ బ్యూటీ.. తన తొలి మూవీనే ఓ మేజర్ ప్రాజెక్టు కావడంపై హర్షం వ్యక్తం చేసింది. అయితే మలాంగ్ ఓ క్యూట్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగనున్నట్లు మూవీ యూనిట్ చెబుతోంది. ఫరాఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ న్యూ ఇయర్ లో షారుక్ ఖాన్ సరసన అంకితా ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగినా అది కేవలం వదంతులు అని తేలిపోయాయి. అయితేనేం సంజయ్ దత్ లాంటి అగ్రనటుడి మూవీతో అంకిత తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మూవీ షూటింగ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ఫుల్లుగా తాగి.. హీరోను నోటికొచ్చినట్లు తిట్టింది!
ముంబై: ఇటీవలే బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ జంట సుశాంత్ సింగ్ రాజపుత్, అంకితా లోఖాండే. విడిపోయిన ఈ జోడీ గురించి మరిన్ని విషయాలు బయటకొస్తున్నాయి. బ్రేకప్ విషయాన్ని మొదటపెట్టింది సుశాంత్. అంతటితో ఆగకుండా అంకితాతో విడిపోవడానికి గల కారణాలను ఒక్కొక్కటిగా లీక్ చేస్తున్నాడు. ఓ ప్రైవేట్ పార్టీలో టీవీ నటి అంకితా ఫుటుగా తాగి లవర్ సుశాంత్ పై నోరు పారేసుకుందట. ఇష్టం వచ్చినట్లు సుశాంత్ ను తిట్టిందట. ఈ విషయాలు అక్కడి మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందని వదంతులు వినిపించాయి. అంకిత కూడా ఈ విషయంలోనే సుశాంత్ తో తరచూ గొడవ పడేదని బాలీవుడ్ టాక్. 'ఆమె బాగా డ్రింక్ చేస్తేనేమి, నేను ఆడవాళ్లతో క్లోజ్ గా ఉంటేనేం' ఏది ఏమైనా మా బ్రేకప్ జరిగిపోయిందంటూ కొన్ని రోజుల కిందట సుశాంత్ ట్వీట్ చేశాడు. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీన్ని బట్టి అంకితా తాగుడుకు హద్దు లేదని, ఆ తర్వాత ఆమె కంట్రోల్ లో ఉందడని తేలిపోయింది. కరెక్టుగా ఆ సమయంలో సుశాంత్ మిగతా సెలబ్రిటీలతో చాలా చనువుగా మెలగడం కూడా అంకితాకు కోపం తెప్పించిందని కథనాలు వచ్చాయి. తనతో క్లోజ్ గా ఉన్నందుకు తనపై తనకే విరక్తిగా ఉందని, ఇంకా ఏవో మాటలన్నదని సుశాంత్ ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. తనకు ప్రేమించడం ఎలాగన్నది తెలుసునంటూ అంకితా కూడా ఈ మధ్య ట్వీట్ చేసింది. బ్రేకప్ అయిన తర్వాత ఇప్పటివరకూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ, విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. Truth -Your Source Was getting close 2himself,didn't like it,got drunk&then abused himself 4being close 2himself:) https://t.co/GQbAmZ7PR7 — Sushant S Rajput (@itsSSR) 10 May 2016 -
హీరోయిన్ వల్లే వాళ్లు బ్రేకప్ అయ్యారా?
బెంగళూరు: ఒకరితో విడిపోవడం ఆ వెంటనే కొన్ని రోజులకే మరొకరితో జతకట్టడం బాలీవుడ్ లో కామన్ అయిపోయింది. ఇటీవలే బ్రేకప్ అయిన బాలీవుడ్ జంట సుశాంత్ సింగ్ రాజపుత్, అంకితా లోఖాండే. హీరో సుశాంత్, బుల్లితెర నటి అంకితా లోఖాండేలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లిపీటలెక్కుతారంటూ వార్తలు అలా గుప్పుమన్నాయో లేదో ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుని బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ నటిస్తున్నాడు. ఆ మూవీ కంటే ముందుగా రాబ్తా మూవీకి సైన్ చేశాడు. కొన్ని నెలల నుంచి రాబ్తా కూడా షూటింగ్ జరుగుతోంది. సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందని వదంతులు వినిపించాయి. అంకిత కూడా ఈ విషయంలోనే సుశాంత్ తో తరచూ గొడవ పడేది. ప్రస్తుతం ‘రాబ్తా’. షూటింగ్ లో పాల్గొంటున్న సుశాంత్, కృతీసనన్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారట. అంకితతో తెగదెంపులు చేసుకున్న సుశాంత్, కృతీతో కొత్త ప్రేమను వెతుక్కుంటున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్ ఫ్రెండ్ షిప్ కంటే ఎక్కువ అని, త్వరలోనే ఈ విషయంపై అందరికీ వారు ఓ క్లారిటీ ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కృతీతో పరిచయం పెరిగినప్పటి నుంచీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమెతో కలిసి దిగిన ఫొటో ఏదో ఒకటి అప్ లోడ్ చేస్తూ సుశాంత్ అంకితను అప్ సెట్ చేయడమే బ్రేకప్ కు కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. -
బాలీవుడ్ జోడీ బ్రేకప్ చెప్పేసింది
బెంగళూరు: బాలీవుడ్ కు బ్రేకప్ అనే పదం బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. లవర్స్ మాత్రమే కాదు భార్యాభర్తలు కూడా పదేళ్ల బంధం తర్వాత విడిపోతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా అలాంటి బ్రేకప్ మరొకటి బాలీవుడ్ లో జరిగింది. టీమిండియా క్రికెటర్ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ నటిస్తున్నాడు. సుశాంత్, బుల్లితెర నటి అంకితా లోఖాండేలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీరు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని స్థానిక మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సుశాంత్ భావించాడు. అంకితతో బ్రేకప్ అయినట్లు సుశాంత్ సన్నిహితుల వద్ద చెప్పాడట. ట్విట్టర్లో తన బ్రేకప్ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు సుశాంత్. ఇప్పుడు వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వార్తలు చూసి ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ జీవితాన్ని పంచుకుంటారని ఆశపడ్డారు. కానీ, ఇంతలోనే బ్రేకప్ వార్తలు ప్రచారం జరిగాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందనుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఆమె నటిస్తున్న చిత్రం ‘రాబ్తా’.. ఈ మూవీ షూటింగ్స్ లో భాగంగా కాస్త చనువుగా ఉండటంపై అంకిత కోపంగా ఉండటమే ఈ బ్రేకప్ వరకు వెళ్లిందని బాలీవుడ్ వర్గాల టాక్. Neither she was an alcoholic nor I am a womaniser . People do Grow apart & its unfortunate . Period!! — Sushant S Rajput (@itsSSR) 4 May 2016