బాయ్‌ఫ్రెండ్‌ని ఉద్దేశించి అంకిత భావోద్వేగం

Ankita Lokhande Instagram Post About Boyfriend Vicky Jain - Sakshi

బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే బాయ్‌ఫ్రెండ్‌, సోల్‌మెట్‌ విక్కిజైన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు. తన వల్లే అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడని వాపోయారు. తనలాంటి పబ్లిక్‌ ఫిగర్‌తో కలిసి ఉండటం వల్లే అతను విమర్శలు ఎదుర్కొంటున్నాడని.. కానీ వాటికి అసలు అతడు ఏ మాత్రం అర్హుడు కాదని తెలిపారు. అలానే ప్రతిసారి తనను అర్థం చేసుకుని.. మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ప్రేమికుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత అంకిత తరచుగా వార్తల్లో నిలిచారు. సుశాంత్‌ ఆ‍త్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెలికి తీయాలని కోరారు. అభిమానులు కూడా అంకితకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో కొందరు విక్కి జైన్‌ అకింతకు తగినవాడు కాదంటూ ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలో అంకిత విక్కి జైన్‌కి క్షమాపణలు, కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఎలా ఉన్నా జడ్జ్‌ చేస్తూనే ఉంటారు)

ఈ మేరకు అంకిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నీ పట్ల నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు దొరకడం లేదు. కానీ నిన్ను చూసిన ప్రతిసారి నా మదిలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే నీ లాంటి మంచి వ్యక్తిని నా స్నేహితుడిగా, భాగస్వామిగా, సోల్‌మెట్‌గా పంపినందుకు. అలానే నీవు నాకు అన్ని వేళలా తోడుగా నిలిచావు. నా సమస్యలన్నింటిని నీవిగా భావించావు. నాకు అవసరమైన ప్రతిసారి సాయం చేశావు. నా సపోర్టు సిస్టంగా ఉన్నందుకు ధన్యవాదాలు. అన్నింటికి మించి నన్ను, నా సమస్యలని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ విక్కి జైన్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేశారు అంకిత. (చదవండి: 2 సెకన్ల చీప్‌ పబ్లిసిటీ కోసమే; అవునా!)

పవిత్ర రిష్తా సిరీయల్‌ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అంకిత. ఇందులో సుశాంత్‌ ఆమె కో స్టార్‌గా నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు ఆ తర్వాత విడిపోయారు. 2019లో అంకిత మణికర్ణిక చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top