‘మేం విడిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?’

Ankita Lokhande Slams Sushant Singh Rajput Fans Over Trolling - Sakshi

సుశాంత్‌ సింగ్‌ ఫ్యాన్స్‌పై మండిపడ్డ అంకిత

తనను నిందించడం ఆపాలంటూ రిక్వెస్ట్‌

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వత బాలీవుడ్‌లో నెపోటిజం, డ్రగ్స్‌ వినియోగం గురించి భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇక సుశాంత్‌ మరణించిన నాటి నుంచి ఆయన అభిమానులు కొందరు తన మాజీ లవర్‌ అంకితా లోఖండేని టార్గెట్‌ చేస్తూ.. ట్రోల్‌ చేస్తున్నారు. సుశాంత్‌ మరణించి ఇప్పటికి దాదాపు 10 నెలలు గడుస్తున్నప్పటికి వారి ట్రోలింగ్‌ మాత్రం ఆగడం లేదట. ఈ నేపథ్యంలో తనను విమర్శిస్తున్న సుశాంత్‌ అభిమానులపై మండి పడ్డారు అంకిత. నా జీవితం గురించి మీకేం తెలుసని నన్ను విమర్శిస్తున్నారు అని ప్రశ్నించారు. 

ఈ మేరకు అంకిత ‘‘నా వైపు వేలు చూపుతున్న వారికి మా బంధం గురించి ఏ మాత్రం తెలియదు. మీరు తనని(సుశాంత్‌) ఎంతో ఎక్కువగా ప్రేమించే వారే అయితే.. ఇప్పుడేందుకు గొడవపడుతున్నారు. మా బంధం ముగిసిన నాడు మీరంతా ఎక్కడున్నారు. ఈ రోజు నన్ను తప్పు పడుతున్నారు. ఆ రోజు ఎక్కడ ఉన్నారు. మా బంధం విషయంలో నేను తప్పు చేయలేదు. ప్రతి ఒక్కరికి తమ జీవితానికి సంబంధించి వేర్వేరు దృక్పథాలు ఉంటాయి. సుశాంత్‌ తన జీవితంలో ఎదగాలనుకున్నాడు.. అలానే జీవించాడు. అందుకే తన దారి తాను చూసుకున్నాడు. దానికి నేనేలా బాధ్యురాలిని అవుతాను. నేను ఎందుకు అవమానం పొందాలి.. నేనేం తప్పు చేశాను.. నా గురించి మీకేం తెలుసని నన్ను తప్పుపడుతున్నారు. దయచేసి విమర్శించడం ఆపండి. ఇది చాలా బాధిస్తుంది’’ అన్నారు.

‘‘ఆరేళ్ల మా బంధానికి ముగింపు పలికినప్పుడు నేను చాలా చాలా బాధపడ్డాను. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నేను కూడా డిప్రెషన్‌ బారినపడ్డాను. నా జీవితంలో చీకటి రోజులు అంటే అవే. ఎంతో ఏడ్చాను. కానీ నేను ఎవరిని నిందించలేదు కదా.. దయచేసి నన్ను విమర్శించడం ఆపండి’’ అన్నారు అంకిత. పవిత్ర రిష్తా సీరియల్‌ షూటింగ్‌ సమయంలో అంకిత, సుశాంత్‌ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్,‌ రియా చక్రవర్తిని లవ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: 
ఎలా ఉన్నా జడ్జ్‌ చేస్తూనే ఉంటారు
నా వల్లే ఈ విమర్శలు.. క్షమించు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top