Ankita Lokhande And Vicky Jain Pre Wedding Celebrations, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Ankita Lokhande Marriage: అంకిత లోఖండే ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు.. ఫొటోలు వైరల్‌

Dec 3 2021 4:04 PM | Updated on Dec 3 2021 4:20 PM

Ankita Lokhande Pre Wedding Celebrations And Photos Viral - Sakshi

Ankita Lokhande Pre Wedding Celebrations And Photos Viral: బాలీవుడ్‌ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలో వివాహం చేసుకోనుంది. ముంబైలో తన ప్రియుడు విక్కీ జైన్‌తో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి ప్రీ-వెడ్డింగ్‌ వేడుకల్లోని ఫొటోలను షేర్‌ చేసుకున్నాడు. ఈ ఫొటోలో వధువు పింక్‌, గోల్డెన్‌ బార్డర్‌తో గ్రీన్‌ కలర్‌ సారీలో కనిపిస్తుంది. అంకిత కొన్ని సాంప్రదాయ ఆభరణాలను ధరించడం మనం చూడొచ్చు.  మరోవైపు విక్కీ జైన్‌ ఆఫ్‌-వైట్‌ కుర్తా వేసుకున్నాడు. అంకిత కూడా 'పవిత‍్రం' అని క్యాప్షన్‌ ఇస్తూ ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది.

ఈ పోస్ట్‌లపై పలువురు ప్రముఖులు కామెంట్‌ బాక్స్‌లో హార్ట్‌ ఎమోజీస్‌తో తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సన్నిహితుల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ‍్యాయి. అంకిత, విక్కీ కొన్ని రోజుల క్రితం వారి వెడ్డింగ్‌ కార్డ్స్‌ కూడా పంచినట్లు సమాచారం. నవంబర్‌లో అంకిత తన ఫ్రెండ్స్‌ కోసం బ్యాచిలొరెట్‌ పార్టీ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ జంట డిసెంబర్‌ 12, 13, 14 తేదిల్లో వివాహం చేసుకోనున‍్నట్లు పుకార్లు జోరందుకున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. 

ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్‌ నిరూపించుకునేందుకు 'టాలెంట్‌ హంట్‌ రియాలిటీ షోలో పాల్గొంది. నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్‌ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్‌ సింగ్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉంది. కంగనా రనౌత్‌ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement