భార్య లేని సమయం చూసి ముగ్గురమ్మాయిలతో నటుడు పార్టీ! | Sakshi
Sakshi News home page

Ankita Lokhande: బిగ్‌బాస్‌ హౌస్‌లో భార్య.. ఇంట్లో అమ్మాయిలతో నటుడి పార్టీ.. వారంలో మూడోసారి!

Published Sun, Jan 28 2024 12:17 PM

Rohit Shetty Reveals To Ankita Lokhande that Vicky Jain has been Partying - Sakshi

బిగ్‌బాస్‌ షోకి కావాల్సిందే గొడవలు, లవ్‌ ట్రాకులు. అందుకనే ఆచితూచి కంటెస్టెంట్లను ఎంపిక చేసుకుంటూ ఉంటుంది బిగ్‌బాస్‌ టీమ్‌. అన్ని భాషల్లో కంటే హిందీ బిగ్‌బాస్‌ ఈ విషయంలో ఓ మెట్టు పైనే ఉంటుంది. ఆల్‌రెడీ బ్రేకప్‌ చెప్పుకున్న జంటలను, ప్రేమలో ఉన్నవారినీ, పెళ్లైన దంపతులను తీసుకొస్తారిక్కడ. ఇంకేముంది.. బుల్లితెర ఆడియన్స్‌కు సినిమా కనిపిస్తుంది.

అలా హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో బుల్లితెర జంట అంకిత లోఖండే-విక్కీ జైన్‌ను తీసుకొచ్చారు. చుట్టూ కెమెరాలున్నాయన్న సంగతే మర్చిపోయి గొడవపడ్డారు. మావాడిమీదకు కాలెత్తుతుందా? అని విక్కీ తల్లి, నీ కొడుకు చేయెత్తింది మర్చిపోయావా? అని అంకిత తల్లి వాదులాడుకున్నారు. అలా ఈ దంపతుల విభేదాలు రెండు కుటుంబాల మధ్య గొడవలుగా మారాయి.

విక్కీ లేకపోతే నీ గేమ్‌ ఎక్కడ?
అయితే ఈ వారం జరిగిన మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌కు విక్కీ బలయ్యాడు. ఐదు రోజుల క్రితం హౌస్‌లో నుంచి బయటకు వచ్చేశాడు. నేటి గ్రాండ్‌ ఫినాలేతో షోకి ఎండ్‌ కార్డ్‌ పడనుంది. ఈ క్రమంలో శనివారం నాడు దర్శకుడు రోహిత్‌ శెట్టి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఫైనలిస్టులతో మాట్లాడి వారికి శుభాకాంక్షలు చెప్పాడు. అలా అంకిత లోఖండేతోనూ ముచ్చటించాడు. విక్కీ నిన్ను పట్టించుకోవడం లేదని, నువ్వెంత బాధపడుతున్నా లెక్క చేయడం లేదని ఫీలయ్యావు. అసలు విక్కీనే లేకపోతే నీ ఆట ఎలా ఉండేది? అని అడిగాడు.

నేనేమీ అతడిని అడ్డుకోలేదు
అందుకు అంకిత.. తను లేకపోతే ఇంకా బాగా ఆడేదాన్ని. సరైన నిర్ణయాలు తీసుకునేదాన్నది బదులిచ్చింది. అందుకు రోహిత్‌.. విక్కీ కూడా బయట ఇదే అంటున్నాడు అని చెప్పాడు. అంకిత మాట్లాడుతూ.. నేనేమీ అతడిని ఆటకు అడ్డుకోలేదు. నిన్ననే నా జర్నీ చూసుకున్నాను. విక్కీ నేను చాలాసార్లు గొడవపడ్డాం. అయినా సరే అతడు ఎప్పటికీ నాకు హీరోనే అని చెప్పింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ అనుమతితో ఓ ఆసక్తికర వార్తను అంకితకు చేరవేశాడు రోహిత్‌.

ఆమెవరో తెలీదు
'విక్కీ ఇప్పటికి రెండుసార్లు పార్టీ చేసుకున్నాడు. ఓ పార్టీలో సనా, ఆయేషాతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఆమెవరో నాకు తెలీదు. కానీ ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పుడు మూడోసారి కూడా పార్టీ చేసుకుంటున్నాడు' అని చెప్పాడు. ఇందుకు అంకిత నవ్వుతూనే బయటకు వచ్చాక గట్టిగానే దెబ్బలు పడతాయి అని బదులిచ్చింది. కాగా సనా, ఆయేషా మరెవరో కాదు బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లే!

చదవండి: పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. అయోధ్యలోనే మా పెళ్లి!

Advertisement
 
Advertisement