బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. రిజల్టిదే! | Sakshi
Sakshi News home page

Bigg Boss: నెలసరి ఆలస్యం.. కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. ఫలితం ఏమని వచ్చిందంటే?

Published Sat, Nov 25 2023 3:49 PM

Bigg Boss 17: Ankita Lokhande Pregnancy Test Result Out; Check Here Result - Sakshi

బిగ్‌బాస్‌ షోలో సింగిల్‌ కంటెస్టెంట్లతోపాటు అప్పుడప్పుడూ జోడీలను కూడా తీసుకొస్తుంటారు. మాజీ ప్రేమికులను, ప్రస్తుత ప్రేమపక్షులను, పెళ్లి చేసుకున్న దంపతులను షోకి రప్పిస్తూ ఉంటారు. అలా హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో బాలీవుడ్‌ జంట అంకితా లోఖండే- విక్కీజైన్‌ను తీసుకొచ్చారు.

అక్కడ ఇక్కడ సేమ్‌ టు సేమ్‌...
వీరు ఇంట్లో ఎలా ఉన్నారో బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ అలాగే ఉన్నారు. అలకలు, కోపతాపాలు, గిల్లికజ్జాలు, పోట్లాటలు, ప్రేమానురాగాలు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు. అయితే ఇటీవల అంకిత తనకు నెలసరి రాలేదని కంగారు పడింది. ఒంట్లో కూడా నిస్సత్తువగా ఉందని, రోజులు గడుస్తున్నా పీరియడ్స్‌ రావడం లేదని భర్తతో చెప్పింది. మొదట విక్కీ జైన్‌ అదేంటి.. ఇంతవరకు రాకపోవడమేంటి? అని అడిగాడు. అందుకు ఆమె సమాధానమిస్తూ.. నెలసరి రాకపోవడంతో మెడికల్‌ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కూడా చేశారు అని పేర్కొంది.

పరీక్షల రిజల్ట్‌ ఇదే
రక్త, మూత్ర పరీక్షలు చేశారు, కానీ ఫలితాలు మాత్రం చెప్పలేదట. దీంతో అంకిత ప్రెగ్నెంటా? కాదా? అని అభిమానులు కంగారుపడుతున్నారు. తాజాగా ఆమె ప్రెగ్నెన్సీ రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నామని ఆలోచిస్తున్న అంకిత- విక్కీల ఆశల మీద నీళ్లు గుమ్మరించినట్లవుతుంది. కాగా హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌ అక్టోబర్‌ 15 న అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ సారి కూడా సల్మాన్‌ ఖానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి.. రెస్టారెంట్లు మూసేసి నటననే నమ్ముకున్నాడు..

Advertisement
Advertisement