మాజీ ప్రేమికురాలి ప్లాట్‌ ఈఎమ్‌ఐలు చెల్లించిన సుశాంత్‌

Sushant Singh Rajput Paying EMIs Ankita Lokhande Plat - Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి 15 కోట్ల రూపాయలు మాయమయినట్లు హీరో తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ సుశాంత్‌ ప్రేమికురాలు రియా చక్రవర్తిని విచారిస్తుంది. అయితే తాజాగా నేడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తంలో నుంచి సుశాంత్‌ 4.5 కోట్ల రూపాయలు ఓ ప్లాట్‌ ఈఎమ్‌ఐ చెల్లించడానికి వాడినట్లు ఈడీ గుర్తించింది. ముంబైలోని మలాడ్‌లో ఉన్న ఈ ప్లాటులో ప్రస్తుతం సుశాంత్‌ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఉంటున్నారు. ఈ ప్లాట్‌కు సంబంధించి సుశాంత్‌ 4.5 కోట్ల రూపాయలను ఈఎమ్‌ఐల రూపంలో చెల్లించినట్లు తెలిసింది. (సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే: రియా)

సుశాంత్‌ ఆస్తుల గురించి ఈడీ రియాను ప్రశ్నించినప్పుడు ఆమె ఈ ప్లాట్‌ గురించి తెలిపింది. సుశాంత్‌ అంకిత కోసం ఈఎమ్‌ఐలు చెల్లించాడని.. వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా అతడు అంకితను ప్లాట్‌ ఖాళీ చేయమని కోరలేదని రియా తెలిపింది. ఈ ప్లాట్‌ తీసుకుని కొన్ని సంవత్సరాలు అవుతుంది. దాంతో అప్పటి విలువ ఎంతో తెలియలేదు. సుశాంత్‌కు చెందిన ఒక అకౌంట్‌ నుంచి ఈ ఈఎమ్‌ఐలు ప్రతి నెల కట్‌ అవుతున్నట్లు ఈడీ గుర్తించింది. గత కొద్ది నెలలుగా అవి పెండింగ్‌లో ఉన్నట్లు గమనించింది. ఇదిలా ఉండగా సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరుతూ ‘జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌’ పేరుతో ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు అంకిత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top