సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే: రియా | Only Property Of Sushant I have Says Rhea Chakraborty | Sakshi
Sakshi News home page

సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే : రియా

Aug 8 2020 5:17 PM | Updated on Aug 8 2020 8:09 PM

Only Property Of Sushant I have Says Rhea Chakraborty  - Sakshi

ముంబై :  సుశాంత్‌కి సంబంధించిన ఆస్తి కేవ‌లం త‌ను రాసిన లెట‌ర్ మాత్ర‌మేన‌ని రియా చ‌క్ర‌వ‌ర్తి అన్నారు. ఇందులో సుశాంత్ రాసిన‌ట్లుగా ఉన్న ఓ లేఖ‌ను ఆమె విడుద‌ల చేశారు. లేఖ‌లో 'నా జీవితం ప‌ట్ల కృతజ్ఞుడిని.. లిల్లు (షోయుక్ చ‌క్ర‌వ‌ర్తి ), బెబు (రియా), స‌ర్ (రియా తండ్రి), మ్యాడ‌మ్ (రియా త‌ల్లి ), ఫ‌డ్జ్ (సుశాంత్ పెంపుడు కుక్క‌)  నా  జీవితంలో ఉన్నందుకు  నేను కృతజ్ఞుడిని' అని సుశాంత్ రాసిన లెట‌ర్‌ను ఈడీ ముందుంచారు. అయితే ఈ లెట‌ర్ నిజంగానే సుశాంత్ రాశాడా లేదా క‌ల్పిత‌మా అన్న‌ది తేలాల్సి ఉంది.

అంతేకాకుండా రియాకు ఈ లెట‌ర్ ఎక్క‌డినుంచి వ‌చ్చింద‌న్న‌ది కూడా స్ప‌ష్టం కాలేదు. ప్ర‌స్తుతం త‌న ద‌గ్గ‌ర సుశాంత్ రాసిన‌ట్లుగా ఉన్న ఈ లెట‌ర్, త‌ను వాడిన వాట‌ర్ బాటిల్ మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఇవే సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి అని రియా పేర్కొన్నారు. సుశాంత్ నుంచి తానెప్పుడూ డ‌బ్బు తీసుకోలేద‌ని,  ప్ర‌తీ అవ‌స‌రానికి త‌న ఆదాయం నుంచే ఖ‌ర్చు చేశాన‌ని తెలిపారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట రియా చక్రవర్తి వాంగ్మూలం నమోదు చేశారు. (వైరల్‌ వీడియో.. సుశాంత్‌ కోసం పెంపుడు కుక్క నిరీక్షణ)

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా శుక్రవారం ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 8 నుంచి తొమ్మిది గంటల పాటు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియా దాదాపు 15 కోట్ల రూపాయల మేర తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుందని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రియాతో పాటు ఆమె కుటుంసభ్యుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. సుశాంత్ మృతిపై మొద‌టినుంచి ప‌లు అనుమానాలు రేకెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సీబీఐ విచార‌ణ చేప‌డుతుండ‌టంతో మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకుంది. (నా సొంత ఆదాయం నుంచే ఖర్చు: రియా )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement