breaking news
	
		
	
  Puneeth Rajkumar
- 
      
                   
                                                       మళ్లీ ప్రాణం పోసుకున్న పునీత్ రాజ్‌కుమార్.. ఫ్యాన్స్‌తో మాట్లాడతాడు!కన్నడ సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా, కర్ణాటక ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న లెజెండరీ నటుడు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar). ఆయన మరణించి నాలుగేళ్లు(2021లో గుండెపోటుతో మరణించాడు) అవుతున్నా.. అభిమానులు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఏదో రకంగా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి ఓ వెబ్ సిరీస్‌లో పునీత్ రాజ్ కుమార్‌ని చూపించారు. ఇప్పుడు అదే టెక్నాలజీతో ఏకంగా ఫ్యాన్స్‌తో మాట్లాడేలా ఓ యాప్‌ని తీసుకొచ్చారు స్టార్ ఫ్యాండమ్ LLP సంస్థ. తాజాగా ఈ యాప్‌ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లాంచ్ చేశారు. పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ సహకారంతో, స్టార్ ఫ్యాండమ్ LLP వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సమర్థ రాఘవ నాగభూషణం నాయకత్వంలో అభివృద్ధి చేయబడిన ఈ యాప్, భారతదేశంలో మొదటి ఫ్యాన్డమ్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా చరిత్ర సృష్టించింది.పునీత్ రాజ్‌కుమార్ వర్ధంతి(అక్టోబర్ 29)కి మూడు రోజుల ముందే ఈ యాప్‌ని విడుదల చేశారు. 'అప్పు ఫ్యాండమ్ యాప్' (Appu Fandom App) అని కూడా పిలువబడే ఈ అప్లికేషన్, ఏఐ టెక్నాలజీ ద్వారా పునీత్ యొక్క ఆకర్షణ, క్రమశిక్షణ, సానుకూలత, మానవత్వ గుణాలను డైనమిక్‌గా ప్రతిబింబించడానికి రూపొందించబడింది. ఇది కేవలం ఒక ట్రిబ్యూట్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్‌తో పునీత్ ఆత్మను డిజిటల్‌గా కనెక్ట్ చేసే జీవంతమైన అనుభవంగా మారుతుంది.ఈ యాప్ పునీత్ రాజ్‌కుమార్ యొక్క 'పవర్ స్టార్' ఇమేజ్ను కొత్త తరాలకు అందించడమే కాకుండా, కన్నడ సినిమా పరిశ్రమకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. PRK ప్రొడక్షన్స్ ద్వారా అశ్విని నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్‌గా, ఇది పునీత్ యొక్క సినిమాలు, గ్రామీణ సేవలు, యువత ప్రేరణలను కలిగి ఉంటుంది. ఫ్యాన్స్ ఇప్పటికే యాప్‌ను డౌన్లోడ్ చేసి, పవర్ స్టార్‌తో 'కనెక్ట్' అవుతున్నారు.
- 
      
                   
                                                       సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారుఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే.. జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్లు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి మరణించిన గాయనీగాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ని మళ్లీ తెరపై చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమని సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఇతడు నటించిన పలు చిత్రాలు డబ్బింగ్గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగ గుడి అనే డాక్యుమెంటరీ రిలీజయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శకనిర్మాతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.అయితే 'మారిగల్లు' అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్‌ని ఈ సిరీస్‌లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గానీ పునీత్‌కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు)
- 
      
                   
                                                       గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురుప్రముఖ కన్నడ హీరో, దివంగత పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె పెదనాన్న శివరాజ్ కుమార్ తన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. 2021లో చదువుకునేందుకు అమెరికాకు ధృతి వెళ్లింది. అత్యున్నతమైన మార్కులతో తన ఫ్యాషన్ డిజైనర్ కోర్సును ఆమె పూర్తి చేసిన ఆమె పట్టభద్రురాలైంది.ధృతి గురించి శివరాజ్ కుమార్ ఇలా చెప్పారు. 'హాయ్ టోటో (ముద్దుపేరు), నీకు అభినందనలు! ఈ రోజు మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది, మనందరికీ చాలా గర్వకారణమైనది కూడా.. మీ నాన్నతో పాటు నన్ను కూడా చాలా గర్వపడేలా చేశావు. మీతో చాలా మంచి జ్ఞాపకాలు నా కళ్లముందు ఉన్నాయి. నువ్వు నవ్వినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, అప్పు(పునీత్ రాజ్‌కుమార్) వచ్చినట్లు ఉంటుంది. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు. అందుకే మా ప్రియమైన అప్పుకు మరోసారి అభినందనలు.' అని ఆయన అన్నారు. ధృతి తండ్రి పునీత్ రాజ్‌కుమార్ 2021లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.దింగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా పట్టభద్రురాలైంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ డిజైన్ స్కూల్‌గా ఆ యూనివర్శిటికి గుర్తింపు ఉంది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ కాలేజీ 1941లో ఫ్రాంక్ అల్వా పార్సన్స్‌గా పేరు మార్చబడింది. ఈ సంస్ధ ఐదు విభాగాలలో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తుంది. ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్లలో శిక్షణ ఇస్తుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పేరుగాంచిన మార్క్ జాకబ్స్, డోనా కరణ్ వంటివారు ఇక్కడే విద్యను అభ్యసించారు.Hi ಟೋಟೊ, Congratulations! ಈ ದಿನ ಬಹಳ ವಿಶೇಷವಾದ ದಿನ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ಹೆಮ್ಮೆಯ ದಿನ. You made me and dodappa very proud. Lots of good memories with ಅಪ್ಪು, ಅಶ್ವಿನಿ, you and ನುಕ್ಕಿ. ನೀನು ನಗುವಾಗ, ನಡೆಯುವಾಗ ಅಪ್ಪು ಬಂದಂತೆ, ನಿನ್ನಲಿಯೇ ಅಪ್ಪು. ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಅಪ್ಪುಗೆ. Congratulations once… pic.twitter.com/JZOw2mkZXW— DrShivaRajkumar (@NimmaShivanna) May 17, 2025
- 
            
                                     
                                                                                                         చైల్డ్ ఆర్టిస్టులుగానే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్.. ఈ తారల గురించి తెలుసా? (ఫొటోలు)
- 
      
                   
                                                       నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవిరాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్, భార్య శ్రీదేవి భైరప్ప మధ్య విడాకుల గొడవ కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. భార్య శ్రీదేవితో విడిపోవడానికి జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను యువ రాజ్‌కుమార్ దాఖలు చేశాడు. దానిని ఖండించిన శ్రీదేవి తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్తకు కన్నడ హీరోయిన్ సప్తమిగౌడతో ఎఫైర్ ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో యువ రాజ్‌కుమార్ లాయర్ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలే చేశాడు. మరోక వ్యక్తితో శ్రీదేవికి సంబంధం ఉందని, ఆస్తి కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఆయన తెలిపాడు.కోర్టును ఆశ్రయించిన సప్తమిగౌడశ్రీదేవిపై కాంతార నటి సప్తమిగౌడ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్‌కుమార్ కేసులో తన పేరు ప్రస్తావిస్తూ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సప్తమిగౌడ బెంగళూరు సిటీ సివిల్‌కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమె పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని జడ్జి ఆదేశాలిచ్చారు. శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. యువ రాజ్‌కుమార్ కాపురంలో కలతలకు నటి సప్తమిగౌడ కారణమని శ్రీదేవి ఆరోపిస్తోంది. 'యువ' సినిమాలో సప్తమిగౌడతో యువ రాజ్‌కుమార్ కలిసి నటించారు. ఈ సినిమా 2024 మార్చి ఆఖరులో విడుదలై మిశ్రమ ఫలితాల్ని చవిచూసింది. కానీ భారీగా వసూళ్లను రాబట్టింది. యువ రాజ్‌కుమార్, సప్తమి మధ్య అపైర్ ఉందని శ్రీదేవి ఆరోపించింది. ఇద్దరిని హోటల్ రూమ్‌లో చూశానని చెబుతోంది. ఇది సప్తమిగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో కోర్టును ఆశ్రయించింది.దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే. వీరిలో రాఘవేంద్ర కుమారుడే యువ రాజ్‌కుమార్. అయితే, ఈ వివాదంపై శివ రాజ్‌కుమార్ ఎలాంటి కామెంట్ చేయలేదు.
- 
      
                   
                                                       యువ రాజ్‌కుమార్, శ్రీదేవి దాంపత్య జీవితంలో 'ఎఫైర్స్' చిచ్చుకన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి బైరప్పతో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. తనను క్రూరంగా శ్రీదేవి హింసిస్తుందంటూ అందులో పేర్కొన్నాడు. దానిని ఖండించిన శ్రీదేవి కూడా తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తన భార్య శ్రీదేవి భైరప్పపై లీగల్ నోటీసులో తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిపై శ్రీదేవి భైరప్ప కూడా కౌంటర్ ఇచ్చింది. యువ రాజ్‌కుమార్‌కు అక్రమ సంబంధం ఉందని శ్రీదేవి సంచలన ఆరోపణ చేసింది. విడాకుల కేసుకు సంబంధించి యువ రాజ్‌కుమార్ తరఫు న్యాయవాది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీదేవి భైరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు. అది గమనించిన శ్రీదేవి భైరప్ప.. ‘సత్యం ఎప్పుడూ గెలుస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే.న్యాయవాది చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏమిటి..?'శ్రీదేవికి మరొకరితో అక్రమ సంబంధం ఉంది. శ్రీదేవి తన భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇంటి పేరు దుర్వినియోగం చేస్తుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తితో శ్రీదేవికి ఎఫైర్ ఉంది. తన అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ నటితో యువ రాజ్‌కుమార్‌కు సంబంధం ఉందంటూ తప్పుడు కథనం చెబుతుంది. యువ రాజ్‌కుమార్‌కు లైంగిక సమస్య ఉందని నా లీగల్ నోటీసుకు శ్రీదేవి సమాధానంగా ఇచ్చింది. లైంగిక సమస్య ఉంటే అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుంది..?' అని ప్రెస్మీట్లో న్యాయవాది ప్రశ్నించారు.ఆయనకు ఒక నటితో ఎఫైర్ ఉంది: శ్రీదేవి భైరప్ప 'వృత్తిపరమైన సమగ్రతను కాపాడుకోవాల్సిన వ్యక్తి బహిరంగంగా ఒక మహిళ పాత్రపై తక్కువ స్థాయిలో తప్పుడు ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనది. గత కొన్ని నెలలుగా నేను ఎన్నో బాధలు పడ్డా, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉన్నాను. కానీ నా మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం. యువ రాజ్‌కుమార్‌కు ఒక నటితో అక్రమ సంబంధం ఉంది. నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను.' అని శ్రీదేవి భైరప్ప సోషల్ మీడియాలో రాశారు.యువ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓమ్ చిత్రంలో మెప్పించాడు. ఈ ఏడాదిలోనే 'యువ' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మైసూరుకు చెందిన శ్రీదేవిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదు. అయితే పునీత్ రాజ్‌కుమార్ జోక్యంతో వీరిద్దరి పెళ్లి జరిగింది. నివేదిక ప్రకారం, శ్రీదేవి మొదట్లో డాక్టర్ రాజ్‌కుమార్ సివిల్ సర్వీస్ అకాడమీని చూసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నత చదువులు చదువుతోంది. జూలై 4 విడాకుల విషయం కోర్టులో విచారణ జరగనుంది. View this post on Instagram A post shared by Sridevi Byrappa (@sridevibyrappa)
- 
            
                                     
                                                                                                         Sangeetha Sringeri: పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- 
      
                   
                                 కొత్త కారు కొన్న స్టార్ హీరో సతీమణి.. ధర ఎంతో తెలిస్తేకన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి మూడేళ్లు కావస్తుంది. ఆయన మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఆయన సతీమణి అశ్విని తన భుజాన వేసుకున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల హోస్పేటలో జరిగిన 'యువ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సగంలో వదిలేసిన పనులను అశ్విని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన పిఆర్‌కె ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పలు సినిమాలు నిర్మాణరంగంలో ఉన్నాయి. ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్‌లను ఆమె కొనసాగిస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రంమలో నిర్మాత అశ్విని పునీత్ రాజ్‌కుమార్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పునీత్‌కు కూడా కారు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు AudiQ7 కారు ఆ జాబితాలో చేరింది. ఈ రోజుల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఆడి క్యూ7 ఇతర కార్ల కంటే డిజైన్, లుక్స్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ తదితర అంశాల్లో చాలా భిన్నంగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇది లీటర్ పెట్రోల్‌కు 14 కి.మీల మైలేజీని కూడా ఇస్తుంది. క్షణాల్లో 250 KMPH స్పీడ్‌ను అందుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఆడి క్యూ7 కారు ఆన్-రోడ్ ధర రూ.1 కోటి 10 లక్షల వరకు ఉంటుంది. 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్య అశ్వినికి రూ. 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు పునీత్. అంతకు ముందు కూడా జాగ్వార్ కారుని తన భార్యకి గిఫ్ట్‌గా పునీత్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశ్విక కొన్న కారు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- 
      
                   
                                 స్టార్ హీరో సినిమా రీరిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న సతీమణిపవర్స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'జాకీ' సినిమా కర్ణాటక వ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ చిత్రాన్ని KRG స్టూడియో రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా స్క్రీన్లలో విడుదల చేసింది. మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు ఉంది. దీంతో ఆయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని నేడు రిలీజ్ చేశారు. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ మరణించిన తర్వాత ఆయన నుంచి రీరిలీజ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలా వరకు థియేటర్లలో పూలతో అలంకరించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 'జాకీ' స్పెషల్ షోలు వేశారు. అభిమానులతో పాటు సినిమాను చూసేందుకు పునీత్ సతీమణి అశ్విని కూడా వెళ్లారు. వెండితెరపై తన భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారుజ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్వినితో పాటు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. దునియా సూరి డైరెక్షన్లో 2010లో జాకీ సినిమా విడుదల అయింది. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్‌సెట్టింగ్ చిత్రాలలో ఒకటిగా, పునీత్ రాజ్‌కుమార్ కెరీర్లో ల్యాండ్‌మార్క్ సినిమాల్లో ఒకటిగా జాకీ చిత్రం నిలిచింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన భావన ఇందులో నటించింది. Best ever Fan Show For me 🥺🔥👑 Stadium gintha jasthi soun ithu 🔥#Jackie #DrPuneethRajkumar pic.twitter.com/8HnpUMZDeP — Venka appu (@Venkaappu777) March 15, 2024
- 
      
                   
                                 స్టార్ హీరో చిత్రాన్ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఎందుకంటే?కన్నడ దివంగత స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన కెరీర్లో చివరిసారిగా నటించిన చిత్రం గంధడ గడ. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది. దీంతో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే అమెజాన్‌లో తొలగించినా.. గంధడ గడ మూవీ మరికొన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీల్లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే...రూ.100 అద్దె చెల్లించి చూసేయొచ్చు. ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్‌కుమార్. కాగా.. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్కన్నడ సినిమా యువరాజు, పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెంది నేటికి రెండేళ్లు. నేటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడు. సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు సామాజిక సేవలో కూడా అప్పూ నిమగ్నమయ్యాడు. అందుకే నేటికీ ఆయన అభిమానుల మదిలో మరపురాని జ్ఞాపకం. కంఠీర స్టూడియోలోని అప్పు స్మారకాన్ని పూలతో అలంకరించారు. సంస్మరణ సభకు సన్నాహాలు కంఠీరవ స్టూడియోలోని ఆయన సమాధి దగ్గర శనివారం అప్పు సంస్మరణ సభకు సన్నాహాలు చేశారు. ఈ సమాధిని పునీత్ రాజ్ కుటుంబం నిర్మించింది. పునీత్ రాజ్‌కుమార్ సమాధిని తెల్లటి పాలరాతితో నిర్మించారు. దానిపై పునీత్ ఫోటో పెట్టారు. సమాధి చుట్టూ ఉన్న ప్రాంతం తెల్లటి రాతి పలకతో కప్పబడి ఉంటుంది. తన తండ్రి స్మారకం మాదిరిగానే పుత్ర స్మారకం కూడా ఏర్పాటు చేశారు. నేడు ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్, పిల్లలు సమాధి దగ్గరకు వచ్చి పూజలు చేశారు. వారితో పాటుగా శివరాజ్ కుమార్ కూడా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాడు. అక్కడకు భారీగా ఆయన అభిమానులు తరలి వచ్చారు. క్యూలో నిల్చున్న అభిమానులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ, పునీత్ రాజ్‌కుమార్ సమాధులను రకరకాల పూలతో అలంకరించారు. పూజలు చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో సమాధి వద్దకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి నివాళీలు అర్పిస్తున్నారు. అప్పా (నాన్న) ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడని వారు నినాదాలు చేస్తున్నారు. పునీత్ మరణం తర్వాత జూ. ఎన్టీఆర్ మాట్లాడిన మాటాలను తాజాగా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిమానులకు అన్నదాన ఏర్పాట్లు పునీత్ సమాధి దర్శనానికి వచ్చే అభిమానులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మందికి పులావ్, పెరుగు, కుంకుమపువ్వు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. 20 మందితో కూడిన బృందం వంట చేస్తోంది. రోజంతా అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను శివరాజ్ కుమార్ ఏర్పాటు చేశాడు. ► పునీత్ రాజ్‌కుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేశాడు. అవి ఇప్పటికీ ఆయన భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ► పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. We Will Never Miss You....🥺 Untill See You Again......🙏🏻💐 ನಿಮ್ಮನು ಪಡೆದ ನಾವು ಪುನೀತ.... Atleast,We Are Waiting In Our Dream To See You 🥺😭🙏🏻#DrPuneethRajkumar pic.twitter.com/ntLaMstVmP — POWER STAR (@Yuva_PRK) October 28, 2023 #Appuliveson #DrPuneethRajkumar Day 730, Still love for him remains same ♥️pic.twitter.com/qWgQEfy0iu — Insulter (@Insulter3730010) October 29, 2023 We miss you @PuneethRajkumar garu 😭#WeMissYouAppu #AppuLiveOn #PowerStar #DrPuneethRajkumar #PuneethRajkumarLivesOn#DrPuneethRajkumar pic.twitter.com/mtGZEwdMNG — NTR Fans AnaNTapuR (@Anantapur_FCNTR) October 29, 2023
- 
      
                   
                                 పేరుకే నా తమ్ముడు.. తండ్రిలా నా కోసం ఏం చేశాడంటే: పునీత్ అన్నయ్యమనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుంది. జీవితంలో నిజమైన ఆప్తులు ఎవరో తెలియాలంటే బలమైన కష్టాలు రావాలి అనే మాట నూటికి నూరు శాతం నిజం. అలా ఎన్నో కష్టాలను ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరిని చూస్తే మరొకరికి ప్రేమ... కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ (శివన్న),రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లు రక్తసంబంధానికి ఉన్న విలువలను అనేకమార్లు చాటిచెప్పారు. ఈ ముగ్గురిలో అందరి కంటే పెద్దవారు శివన్న.. చివరి వాడు పునీత్ రాజ్‌కుమారు అని తెలిసిందే. (ఇదీ చదవండి: అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్) తాజాగా పునీత్ గురించి తన రెండో అన్న రాఘవేంద్ర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. పునీత్ రాజ్‌కుమార్‌ను తామందరం ఇంట్లో 'అప్పు' అని ప్రేమగా పిలుచుకుంటామని ఆయన గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంలోని అందరిపై అప్పు ప్రేమ ఒకేలా ఉంటుందని రాఘవేంద్ర ఇలా చెప్పాడు. 'నాకంటే అప్పు పదేళ్లు చిన్నవాడు.. అందుకే వాడిని నేను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశాను. పునీత్ బతికి ఉన్నప్పుడు కూడా కొడుకులానే భావించేవాడిని... అప్పును చిన్నప్పటి నుంచి నేనే షూటింగ్‌కి తీసుకెళ్లేవాడిని.. వాడికి స్నానం కూడా చెయించేవాడిని అలా మా మధ్య తండ్రీకొడుకుల బంధం ఏర్పడింది. ఒక సినిమాలో కూడా ఇద్దరం కలిసి అలాంటి పాత్రలలోనే కనిపించాం.' అని రాఘవేంద్ర చెప్పాడు పునీత్ రాజ్‌కుమార్ రక్తసంబంధానికి మంచి మెసేజ్ ఇచ్చి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తన అన్నయ్య గుర్తుచేసుకున్నారు. శివన్న, పునీత్‌లకు ఇద్దరికీ చెరో ఇల్లు ఉండేది. కానీ తనకు మాత్రమే సొంత ఇల్లు లేదని రాఘవేంద్ర చెప్పాడు. అలాంటి సమయంలో అప్పునే తనకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరి ఇంటి కంటే ఎంతో గొప్పగా ఇంటిని నిర్మించి తనకు ఇచ్చాడని పేర్కొన్నాడు. పునీత్ లేకుంటే ఇప్పటికి కూడా తాను ఇంత ఖరీదైన ఇల్లు నిర్మించుకునే వాడిని కాదని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్) 'అప్పట్లో నేను సినిమాల్లో నటించడం మానేశాను.. దీంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పట్లో నేను ఒంటరిగా ఆ కష్టాలను భరించేవాడిని ఎవరితోను చెప్పుకునే వాడిని కాదు. అలాంటి సమయంలో నా పరిస్థితిని గమనించి మా ఇంటి బాధ్యతను పునీత్ తీసుకున్నాడు. ఆర్థిక సాయంతో పాటు కొన్ని సినిమా అవకాశాలను కూడా అప్పూనే ఇప్పించాడు. ఏ సినిమా చేసినా నన్నూ వాడి వెంట ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు. అతను నాకు అన్నయ్య స్థానం ఇచ్చాడు, కానీ.. తండ్రిగా నా జీవితాన్ని నిలబెట్టి ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.' అని పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన గుర్తుచేసుకున్నాడు.
- 
      
                   
                                 జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది.వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలుగతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్నవయసులోనే హార్ట్ఎటాక్మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్‌తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదంతాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు.2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు?స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు.దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్‌లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు.హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
- 
      
                   
                                 హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. స్పందన ఆకస్మిక మరణం ఆమె కుటుంబ సభ్యులను,శాండల్‌వుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమో వయస్సు కేవలం 44 ఏళ్లు మాత్రమే. ఒకప్పుడు గుండెజబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయసు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 60ఏళ్లలో వచ్చే వ్యాధులు కూడా 30-40లోనే పలకరిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అసలు చిన్న వయస్సులోనే గుండెజబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి హార్ట్ ఎటాక్ వస్తే ప్రాణాలు పోయినట్లేనా? ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నవయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు 60లో వచ్చే గుండెజబ్బులు ఇప్పుడు టీనేజీ పిల్లలను కూడా కబలిస్తున్నాయి. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయ పాలన లేకపోవడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధానంగా కారణమవుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు స్ట్రోక్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గుండెజబ్బులకి కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలు లేవని చెబుతున్నా, కోవిడ్‌తో శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. డయాబెటీస్ కారణమా? ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు.. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు.2030 నాటికి ఇండియాలో 80 మిలియన్ మంది డయాబెటీస్‌తో బాధపడుతుంటారని అంచనా. మన దేశ జనాభాలో సుమారు 10శాతం యువత ఇప్పటికే పలు లైఫ్‌స్టైల్ డిజార్డర్లతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి ఉప్పు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం కూడా ఒక కారణం.వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వులు, హైపర్ టెన్షన్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్న వయసులోనే గుండెజబ్బు రావడానికి మరో కారణం.. డయాబెటీస్(మధుమేహం). డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. వీటినే బ్లడ్‌క్లాట్స్ అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె నొప్పి వస్తుంది. ఇక ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లు కూడా గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇప్పట్లో యూత్ చిన్న వయసులోనే స్మోకింగ్, డ్రింకింగ్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ఇది మితిమీరి గుండెపోటుకు కారణం అవుతుంది. గుండెనొప్పి సంకేతాలు ఇలా గుండె చాలా భారంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది రక్తం సరఫరా తగ్గి గుండెలో మంటగా ఉంటుంది. మత్తుగా ఉండి, చెమటలు ఎక్కువగా పడుతాయి. తీవ్రమైన అలసట, ఛాతి దగ్గర నొప్పి వస్తే అస్సలు నిర్లక్యం చేయొద్దు. రీర పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే గుండెనొప్పికి సంకేతంగా భావించవచ్చు. గుండె ఆరోగ్యం మీ చేతిలోనే.. ►గుండెజబ్బులు రాకుండా ముందునుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి ► మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నట్లయితే ముందస్తుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి ► ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ► వ్యాయామం చేస్తే మంచిదే కదా అని అతిగా చేయకూడదు. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది ► ఒత్తిడి,సరైన నిద్ర లేకపోవడం కూడా గుండెజబ్బులకు మరో కారణం ► కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు డైట్లో ఉండేలా చూసుకోవాలి
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం.. గుండెపోటుతో స్పందన మృతికన్నడ ప్రముఖ నటుడు,సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణించారు. కుటుంబంతో కలిసి బ్యాంకాక్‌కు విహారయాత్రకు వెళ్లిన స్పందన అక్కడ గుండెపోటుతో మరణించారు. ఆమె ఆకస్మిక మరణ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు శాండల్‌వుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు. 2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచి స్పందన మరణించడం చాలా బాధాకరమైన సంఘటననే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) ఈ నెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 2007లో విజయ్ రాఘవేంద్రను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన జంటకు శాండల్‌వుడ్‌లో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. తన భర్త సినిమాలకు స్పందననే నిర్మాతగా ఉండి పలు సినిమాలను కూడా నిర్మించింది. తుళు కుటుంబానికి చెందిన స్పందన మాజీ పోలీసు అధికారి శివరామ్ కుమార్తె. 2017లో విడుదలైన రవిచంద్రన్ చిత్రం అపూర్వలో కూడా ఆమె అతిధి పాత్ర పోషించింది. స్పందన భౌతికకాయం రేపటిలోగా బెంగళూరుకు తీసుకురానున్నట్లు సమాచారం. శాండల్‌వుడ్‌లో పాపులర్ యాక్టర్ అయిన స్పందన భర్త విజయ్ రాఘవేంద్ర నటించిన 'చిన్నారి ముఠా' సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అక్కడి పరిశ్రమలో ఆయన సుమారు 50 సినిమాలకు పైగా నటించగా 20కు పైగా పాటలు పాడారు. ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దిగ్భ్రాంతికి గురి చేసింది: కర్ణాటక ముఖ్యమంత్రి ప్రముఖ కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. స్పందనను కోల్పోయిన విజయ రాఘవేంద్ర, బికె శివరామ్‌ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
- 
      
                   
                                 ఛాతిపై పచ్చబొట్టుగా పవర్‌స్టార్ పేరు..పిక్ వైరల్కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు కావోస్తున్నా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కన్నడలో ఏ సినిమా ఈవెంట్ జరిగా పునీత్ పేరును స్మరించుకుంటున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు కూడా ఆయన పేరు తెరపై కనిపిస్తే.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పునీత్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ అయితే ప్రతి సినిమా ఈవెంట్లో తమ్ముడిని తలచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఇక తాజాగా తన తమ్ముడి పేరుని ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు రాఘవేంద్ర రాజ్‌కుమార్. (చదవండి: నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా..హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం) రాఘవేంద్రకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు కావడంతో అతన్ని సొంత కొడుకులా చూసుకున్నాడు. అయితే 46 వయసులో పునీత్ గుండె పోటుతో మరణించాడాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ ఏదైనా స్టేజిపై పునీత్ ఫొటో కనిపిస్తే దుఃఖం ఆపుకోలేడు. ఇక తన తమ్ముడిని చిరకాలం గుర్తించుకోవడం కోసం చాతిపై ‘అప్పు’ అని టాటూ వేయించుకున్నాడు. ఇది పునీత్ ముద్దు పేరు. అప్పుతో పాటు టోటో, నుక్కి పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. అవి పునీత్ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు. వాళ్ల అసలు పేర్లు ‘వందిత, ధృతి’. ఇక రాఘవేంద్ర విషయానికొస్తే.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. రాఘవేంద్ర చివరగా పునీత్ నటించిన ‘జేమ్స్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. ಅಪ್ಪು ಮತ್ತು ಅಪ್ಪು ಮಕ್ಕಳ ಹೆಸರನ್ನ ಎದೆ ಮೇಲೆ ಹಾಕಿಸಿಕೊಂಡ ರಾಘಣ್ಣ 🙏@iRaghanna #RaghavendraRajkumar pic.twitter.com/GMwRx7ZSYQ — Sagar Manasu (@SagarManasu) May 28, 2023
- 
      
                   
                                 ఓటీటీకి వచ్చేసిన పునీత్ రాజ్‌కుమార్ చివరి మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేంకగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'అప్పు' అంటూ ఆయన అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడు పునీత్ రాజ్ కుమార్. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్ 2021లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి ముందు గంధడ గుడి అనే వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి ఫిలిం తీశారు. ఈ మూవీ గతేడాది పునీత్ వర్ధంతి(అక్టోబర్ 22, 2022) సందర్భంగా థియేటర్లో రిలీజ్ అయ్యింది. పునీత్ చివరి సినిమా కావడంతో ప్రేక్షకులంత థియేటర్లకు క్యూ కట్టారు. కర్ణాటక అడువుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో గంధడ గుడి డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పునీత్ జయంతి సందర్భంగా శుక్రవారం (మార్చి 17)నుంచి ఈ సినిమాను కన్నడ వెర్షన్లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రకృతి ప్రేమికుడైన పునీత్ కర్ణాటక ప్రకృతి అందాలను నేటి యువత, విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరిని తీశారన్నారు ఆయన భార్య, ఈ మూవీ నిర్మాత అశ్విని. రాష్ట్రంలోని అడవులు, అందమైన ప్రదేశాలను ఇందులో చక్కగా చూపించామన్నారు అశ్విని.
- 
      
                   
                                 Puneeth Rajkumar: ఐరన్ స్క్రాప్‌తో పునీత్ రాజ్‌కుమార్ విగ్రహంతెనాలి: కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీనటుడు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల వినతిపై ఆయన నిలువెత్తు ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని సూర్య శిల్పశాల శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తయారు చేశారు. టన్నున్నర ఐరన్ స్క్రాప్‌ను వినియోగించి నాలుగు నెలలు శ్రమించి తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. బెంగళూరులోని ఓ ప్రధాన కూడలిలో ప్రతిష్టించనున్నారు.
- 
      
                   
                                 పునీత్ జయంతి రోజునే ఉపేంద్ర సుదీప్‌ల కబ్జా రిలీజ్తమిళసినిమా: కేజీఎఫ్ పార్టు–1, పార్టు–2, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోమా వంటి కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి భారతీయ సినిమానే తమ వైపు తిప్పుకున్నాయి. తాజాగా అదే బాణీలో రూపొందిన కన్నడ చిత్రం కబ్జా. బహు భాషా నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటించిన ఇందులో నటి శ్రియ కథానాయకిగా నటించారు. మురళి శర్మ, సుధ ముఖ్యపాత్రలు పోషించారు. శిద్దేశ్వరా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్ నిర్మించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 7 భాషల్లో కన్నడ చిత్ర పరిశ్రమ అప్పు అని అభిమానంతో పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలకు సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కబ్జా అని తెలిపారు. 1947 ప్రాంతంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేధింపులకు గురవుతాడన్నారు. ఆయన కుమారుడు గ్యాంగ్‌స్టర్ ముఠాలో చిక్కుకుంటాడని ఆ తర్వాత జరిగే కథే ఈ కబ్జా చిత్రం అని చెప్పారు.
- 
      
                   
                                 ఆయన స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేరు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రంలో నటిస్తోంది. పుష్-పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ ఎదిగిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలూ చేస్తోంది. కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్ అందుకున్న రష్మిక మందన్నా దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కమార్తో ఓ చిత్రంలో నటించారు. ఆయనతో కలిసి అంజనీపుత్ర అనే చిత్రంలో కనిపించారు. ఆ సినిమా విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు పుష్ప బ్యూటీ. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. ' ఇప్పటికీ అంజనీపుత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను పునీత్ రాజ్‌కుమార్‌తో సంభాషణలను గుర్తు చేసుకుంటూనే ఉంటా. పునీత్ సార్ నాపై ఎక్కువ నమ్మకంతో ఉండేవారు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థానాన్ని నా హృదయంలో ఎప్పటికీ భర్తీ చేయలేరు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన హర్ష సార్‌కు థాంక్యూ.' అంటూ పోస్ట్ చేసింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. It’s #5YearsForAnjaniPutra already🤍 I keep thinking about the conversations with @PuneethRajkumar sir and he was more confident in me than myself always. He has the best heart, forever will be irreplaceable in my heart. Thankyou Harsha sir for this film,it means a lot to me.🌸 — Rashmika Mandanna (@iamRashmika) December 21, 2022
- 
      
                   
                                 ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసింది: కిచ్చా సుదీప్కన్నడ హీరో దర్శన్‌పై చెప్పుల దాడిని మరో నటుడు కిచ్చా సుదీప్ ఖండించారు. ఇలా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని అన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఉండి ఉంటే ఇలాంటి చర్యలను సమర్థించేవారా అని ఆయన అభిమానులను సుదీప్ ప్రశ్నించారు. దర్శన్‌పై చెప్పులు విసరడాన్ని ఖండిస్తూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఆదివారం 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని హోస్పేట్లో సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. కిచ్చా సుదీప్ ట్విటర్లో రాస్తూ.. 'మన భూమి, భాష, సంస్కృతి అనేది ప్రేమ, గౌరవానికి సంబంధించినది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి వ్యక్తి గౌరవంగా వ్యవహరించడానికి అర్హులు. నేను చూసిన వీడియో నన్ను చాలా కలవరపెట్టింది. ఇంకా చాలా మంది అలాగే సినిమాలోని ప్రముఖ మహిళ కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వారంతా ఈవెంట్లో నిమగ్నమై ఉన్నారు. మీరు వారిని అవమానించారు. ఇలాంటి పనులు చేసింది కన్నడిగులేనా అన్న అనుమానం వస్తోంది.' అని రాసుకొచ్చారు. దర్శన్, పునీత్ అభిమానులకు మధ్య పరిస్థితులు బాగా లేవని నేను అంగీకరిస్తున్నా.. కానీ ఇలాంటి ప్రతిచర్యను పునీత్ స్వయంగా మెచ్చుకుని మద్దతు ఇచ్చేవారా? అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..: కాగా దర్శన్ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 'అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. అప్పుడు ఆమె ఎక్కడికీ వెళ్లదు' అని దర్శన్ చేసిన కామెంట్లు ఎంతగానో వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారు. శ్రీ విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిపై అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ అతడిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. కాగా.. దర్శన్ నటించిన చిత్రం క్రాంతి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వి హరికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దర్శన్ సరసన రచితా రామ్ నటిస్తోంది. Rebellion isn't always an Answer. ❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0 — Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022
- 
      
                   
                                 కన్నడ ప్రేక్షకులకు లేఖ రాసిన పునీత్ భార్య, ఏమన్నారంటే..దివంగ నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘గంధర గుడి’. వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి చిత్రంగా ఈ మూవీ రూపొందింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కర్ణాటక ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలను సైతం బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్ణాటక అడవులను, వాటిలోని ప్రాముఖ్యతను కన్నడిగులకు తెలియాలజేయాలనే ఉద్ధేశంతో పునీత్ రాజ్‌కుమార్ ఈ మూవీ చేశారట. చదవండి: విశ్వక్ సేన్‌పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు? ఈ విషయాన్ని తాజాగా ఆయన భార్య అశ్విని రేవంత్ తెలిపారు. ఈ మేరకు ఆమె కర్ణాటక ప్రేక్షకులను ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేశారు. ‘‘గంధద గుడి.. ఇది పునీత్ రాజ్‌కుమార్ కలల చిత్రం. కర్ణాటక అడవుల అందాలు అందరికీ చూపించాలని ఆయన ఈ సినిమా చేశారు. కన్నడ ప్రజలందరూ ఈ సినిమా చూడలన్నది ఆయన కోరిక. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రం చూడాలని అప్పు(పునీత్) ఎంతగానో కోరుకున్నారు. మన పిల్లల కోసం మన అడవులను కాపాడుకుందాం. వాళ్లకి కర్ణాటక అందాలను చూపిద్దాం’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’ కాగా అమోఘవర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పునీత్ భార్య అశ్వినీ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 28న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కొద్ది రోజులకే పునీత్ గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఆయన మరణించిన కొన్ని రోజు రోజులకే ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా విశేష ఆదరణ అందుకుంది. ప్రధానీ నరేంద్ర మోదీ సైతం గంధర గుడి ట్రైలర్‌పై స్పందించారు. ‘పునీత్ కోట్లాది మంది హృదయాలలో జీవిస్తూనే ఉంటారు. ఆయన ఎంతో ప్రతిభ కలిగిన నటులు. గంధద గుడి సినిమా కర్ణాటక ప్రకృతి సౌందర్యాన్ని చూపుతోంది. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు’ అని మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ನಾಡಿನ ಜನತೆಯಲ್ಲಿ ನನ್ನ ಒಂದು ಮನವಿ... An appeal to all the people of the state.#GGKids #GGMovie #GandhadaGudi #DrPuneethRajkumar pic.twitter.com/tf01Kt2Alu — Ashwini Puneeth Rajkumar (@Ashwini_PRK) November 6, 2022
- 
      
                   
                                 ‘కాంతార’కి ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ హీరో: అసలు విషయం చెప్పిన రిషబ్ శెట్టిరిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మొదట సెప్టెంబర్ 30న కన్నడ వెర్షన్లో రిలీజైన ఈ సినిమా అక్టోబర్ 15న తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత హిందీలోనూ రిలీజై నార్త్ ఆడిన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా కథకి, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? విడుదలైన అన్ని భాషల్లో కాంతార వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టాడు ‘కాంతార’ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించి నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోగా ముందు అనుకుంది తనని కాదని, ఓ కన్నడ స్టార్ హీరోనంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో తెలిపాడు రిషబ్ శెట్టి. ఇటీవల బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన రిషబ్ ఈ మూవీ విశేషాలను పంచుకున్నాడు. చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో ఈ సందర్భంగా కాంతార స్క్రిప్ట్ మొదట కన్నడ సూపర్ స్టార్, దివంగత నటులు పునీత్ రాజ్‌కుమార్ కోసం రాశానని చెప్పాడు. ‘పునీత్ రాజ్‌కుమార్ సార్ కోసమే కాంతార కథ రాశాను. స్క్రిప్ట్ అంత పూర్తయ్యాక వెళ్లి ఆయనను కలిసి స్క్రిప్ట్ చెప్పాను. అయితే ఆయన అప్పటికే పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పారు. అయితే ఈ కథ రియాలిటీగా రావాలంటే మీరు నటిస్తేనే బాగుంటుందని, ఇందులో మీరే చేయాలంటూ పునీత్ రాజ్‌కుమార్ సారు సలహా ఇచ్చారు. నన్నే హీరోగా చేయమన్నారు. ఇక ఆయన ఈ సినిమా చేయనన్నారు కాబట్టి. ఇక నేను చేశాను’ అంటూ రిషబ్ శెట్టి అసలు విషయం చెప్పుకొచ్చాడు.
- 
      
                   
                                 కన్నడ రాజ్యోత్సవ వేడుకలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలుసాక్షి, చెన్నై: ప్రజలు కుల మతాలకు అతీతంగా సమైఖ్యంగా ఉండాలని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆ యన ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. కాగా రజనీకాంత్ మంగళవారం బెంగళూరులో జరిగిన దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. కన్నడ రాజోత్సవ దినం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగింది. పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రజనీకాంత్, జూనియర్ ఎనీ్టఆర్ కలసి పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశి్వనికి అందజేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో ప్రసంగించి చప్పట్లు పొందారు. రజనీకాంత్ మాట్లాడుతూ అందరికీ కన్నడ రాజోత్సవ శుభాకాంక్షలు అన్నారు. పునీత్‌రాజ్‌కుమార్ అంత్యక్రియల్లో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. అయితే అది ఆయన నటుడు కావడం వలన కాదని, ఆయన మానవత్వం, సత్ప్రవర్తన కారణంగానే అని అన్నారు. రాజ్‌కుమార్ దైవబిడ్డ అని పేర్కొన్నారు. ఆయన నటించిన తొలి చిత్రం అప్పును తాను విడుదలకు ముందే చూశానని, అది శతదినోత్సవం జరుపుకుందని గుర్తు చేశారు. కాగా ప్రజలందరూ కుల,మతాలకు అతీతంగా, ఐక్యంగా, సంతోషంగా మనఃశ్శాంతిగా జీవించాలని అల్లా, జీసస్, రాజరాజేశ్వరి దేవతను ప్రార్థిస్తున్నానని రజనీకాంత్ పేర్కొన్నారు. కాగా జోరువానలో సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకి కర్ణాటక మంత్రి గొడుగు పట్టడం విశేషం.
- 
            
                                     
                                                             పునీత్‌రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డు.. ( వైరల్ ఫొటోలు )
- 
      
                   
                                 నా దృష్టిలో అతనే కర్ణాటక రత్న.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్కర్ణాటక అసెంబ్లీలో టాలీవుడ్ యంగ్ టైగర్ అదిరిపోయే ప్రసంగమిచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పునీత్ రాజ్‌కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు యంగ్ టైగర్. వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అప్పూ.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు అద్భుతం. రాజ్‌కుమార్‌తో ఉన్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తాను అప్పూకు ఓ స్నేహితుడిగానే ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశమిచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. అప్పూ ఫ్యామిలీ నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటా.' అంటూ కన్నడలో మాట్లాడారు. దీంతో సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డుతమిళసినిమా: దిగ్గజ నటుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడు, యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది గుండెపోటుతో హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. ఆయన చివరిగా నటించిన జేమ్స్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అదేవిధంగా కందాడ కుడి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ రూపొందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే ఆయన మరణించడంతో ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్ మిగిలిన భాగాన్ని విడుదల చేశారు. ఇది పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిని ఆయన తొలి వర్ధంతి సందర్భంగా సోమవారం విడుదల చేయనున్నారు. కాగా పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత అవార్డు కన్నడ రత్నను ప్రదానం చేయనుంది. ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుక పునీత్ రాజ్‌కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నవంబర్ 1న బెంగుళూరులో భారీఎత్తున ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి నటుడు రజనీకాంత్‌కు, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. వీరిద్దరూ ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొననున్నారు. దీనిపై నటుడు రజనీకాంత్ శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. పునీత్‌రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు నవంబర్ 1న మధ్యాహ్నం చెన్నై నుంచి బెంగళూరుకు చేరుకోనున్నట్లు అందులో పేర్కొన్నారు. పునీత్ గొప్ప నటుడని కొనియాడారు.
- 
      
                   
                                 జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక అసెంబ్లీకి రావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. టాలీవుడ్లోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అహ్వానాలు పంపింది. ఎన్టీఆర్, రజినీకాంత్‌కు కర్ణాటక చాలా ప్రత్యేకం. సూపర్ స్టార్‌కు మహారాష్ట్ర మూలాలు ఉన్నా కర్నాటకలోనే బస్ కండక్టర్‌గా పనిచేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్నాటక కావడంతో వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
- 
      
                   
                                 దివంగత స్టార్ హీరో ట్రైలర్ రిలీజ్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్కన్నడ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చిత్రం 'గంధడగుడి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ప్రధాని మోదీకి ట్వీట్ చేసింది చిత్రబృందం. దీనిపై మోదీ కూడా స్పందించారు. పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ రాస్తూ 'పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. పునీత్ అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారు. గంధడగుడి సినిమా ప్రకృతి మాతకు, కర్ణాటక ప్రకృతి సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు నివాళి' అంటూ ట్వీట్ చేశారు. కన్నడలో పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా మరణించారు. Appu lives in the hearts of millions around the world. He was brilliance personified, full of energy and blessed with unparalleled talent. #GandhadaGudi is a tribute to Mother Nature, Karnataka's natural beauty and environmental conservation. My best wishes for this endeavour. https://t.co/VTimdGmDAM — Narendra Modi (@narendramodi) October 9, 2022
- 
      
                   
                                 తెలుగులో విడుదల కానున్న పునీత్ రాజ్‌కుమార్ సూపర్ హిట్ చిత్రంకన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రాల్లో చక్రవ్యూహ ఒకటి. శాండల్‌వుడ్‌లో భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు సివిల్ ఇంజినీర్‌గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అయితే సంచలన సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చందన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు మరియు దీనిని T.N.సూరిబాబు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
- 
      
                   
                                 అప్పు గుర్తుగా అంబులెన్స్ విరాళమిచ్చిన ప్రకాశ్ రాజ్పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జ్ఞాపకార్థం సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 32 జిల్లాల్లో అప్పు ఎక్స్‌ప్రెస్ పేరుతో అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మొదటిగా మైసూరు నగరంలోని మిషన్ ఆస్పత్రికి అప్పు ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌ను ప్రకాశ్ రాజ్ అందజేశారు. ఈమేరకు పలు ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశాడు. కాగా కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే! “”APPU Xpress “” donated a free ambulance for the needy in memory of our dear #puneethrajkumar .. a #prakashrajfoundation initiative.. the joy of giving back to life .. pic.twitter.com/HI57F9wwZl — Prakash Raj (@prakashraaj) August 6, 2022 చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరే.. ఆర్ఆర్ఆర్లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే..
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. దేవుడి పాత్రలో..Lucky Man Teaser Released: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మరణం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఇక ఆయన కుటుంబీకులకు, అభిమానులకు ఎనలేని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికీ ఆయన్ను తలచుకోని అభిమాని లేడు. తన ప్రియతమ హీరోను వెండితెరపై చూడలేమన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ మరణం కన్నా ముందు కమిట్ అయి, చిత్రీకరించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో 2022, మార్చి 17న విడుదలైన 'జేమ్స్' ప్రేక్షకులను అలరించింది. పునీత్ రాజ్‌కుమార్‌ను వెండితెరపై చూసుకున్న అభిమానులు కంటతడిపెట్టారు. తర్వాత ఆయన్ను మళ్లీ చూస్తామో లేదో అని కుమిలిపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ అభిమానులకు త్వరలోనే సర్ప్రైజ్ దక్కనుంది. మరోసారి పునీత్ రాజ్‌కుమార్‌ను వెండితెరపై చూసే అదృష్టం కలగనుంది. పునీత్ మరణం కంటే ముందు ఆయన ఒప్పుకుని, నటించిన చిత్రాల్లో 'జేమ్స్'తోపాటు 'లక్కీ మ్యాన్' కూడా ఉంది. పునీత్ రాజ్‌కుమార్ గెస్ట్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్రబృందం. రొమాంటిక్ కామెడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ భగవంతుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పునీత్ రాజ్‌కుమార్ చేసే డ్యాన్స్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డార్లింగ్ కృష్ణ, సంగీత శృంగేరి, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
- 
      
                   
                                 కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం!కేజీఎఫ్ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఇక దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్-2 ఇటీవలే విడుదలయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌కు ఎంత పేరు వచ్చిందో ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'హోంబలే ఫిలిమ్స్'కు కూడా అంతే పేరు వచ్చింది. ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాగా తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించి హోంబలే ఫిలిమ్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ మనవడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్‌తో హోంబలే ఫిలిమ్స్ కొత్త సినిమా అంటూ యువరాజ్ లుక్‌తో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాతోనే యువరాజ్ కుమార్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. యువరాజ్ ఇంట్రడక్షన్ పోస్టర్లను విడుదల చేస్తూ దానికి వారసత్వం కొనసాగుతుందని క్యాప్షన్ ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్‌కు 'యువరత్న' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సంతోష్ ఆనంద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ಅಭಿಮಾನದಿಂದ ಅಭಿಮಾನಕ್ಕಾಗಿ ಈ ನಮ್ಮ ಪಯಣ. ಇರಲಿ ನಿಮ್ಮ ಅಪ್ಪುಗೆ The legacy continues..@yuva_rajkumar @SanthoshAnand15 @VKiragandur @hombalefilms#IntroducingYuvaRajKumar #YuvaRajKumar pic.twitter.com/c4vsklAYFj — Hombale Films (@hombalefilms) April 27, 2022
- 
      
                   
                                 పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రతNamratha Inked Puneeth Rajkumar Name: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి దాదాపు 6 నెలల కావోస్తోంది. అయినా ఇప్పటికీ ఆయన మరణాన్ని తలుచుకుని కన్నడిగులు కుమిలిపోతున్నారు. గతేడాది అక్టోబర్ 29న పునీశాండల్ వుడ్ సీని ప్రముఖులే కాదు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రెటీలు నివాళులు అర్పించారు. ఇక కన్నడ ప్రజలు, ఫ్యాన్స్ అయితే పునీత్ లేడనే వార్త విని గుండెలు విలపించేలా రోధించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మరికొందరి గుండెలు ఆగిపోయాయి. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. అంతలా ప్రతి ఒక్కరిని శోక సంద్రంలో ముంచిన పునీత్ రాజ్‌కుమార్ హీరోగానే కాదు ఓ మనిషిగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు. 45 స్కూళ్లు కట్టించి, 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపించి, 19 గోశాలలకు సాయం చేస్తూ.. చనిపోయినా రెండు కళ్లూ దానం చేశారు. ఇవన్ని చేసిన ఏనాడు పబ్లిసిటి చేసుకోలేదు. ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది. దీంతో యావత్ దేశం ఆయనకు సెల్యూట్ కొట్టింది. ఆయనకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆయనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఇండస్ట్రీలో సైతం ఉన్నారడానికి ఈ తాజ సంఘటనే ఉదాహరణ. చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2 పునీత్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఓ నటి ఏకంగా ఆయన పేరునుఏ టాటూగా వేసుకుంది. కన్నడ టీవీ నటి, నాగిని 2 ఫేం నమ్రత గౌడ పునీత్ రాజ్‌కుమార్‌ను వీరాభిమాని. దీంతో ఆయన పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకుంది. ఆయన జయంతి సందర్భంగా వేయించుకున్న ఈ పోస్ట్‌ను రీసెంట్గా నమ్రత షేర్ చేస్తూ ‘ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నమ్రత పునీత్ మిలనా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. 2007లో వచ్చిన ఈ సినిమాలో నమ్రత ప్రముఖ నటుడు సిహి కహీ చంద్రుని కుమార్తెగా ఓ చిన్న రోల్ పోషించింది. నాగిని(కన్నడ) సీరియల్‌తో గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తోంది. View this post on Instagram A post shared by namratha (@namratha__gowdaofficial) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
- 
      
                   
                                 పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అలీ, బ్రహ్మానందంసాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని ప్రముఖ తెలుగు నటులు బ్రహ్మానందం, అలీ ఆదివారం పరామర్శించారు. అశ్విని, రాఘవేంద్ర రాజ్‌కుమార్ తదితరులను వారు పలకరించి, పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చదవండి: (యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!)
- 
      
                   
                                 పునీత్ రాజ్ కుమార్ 'జేమ్స్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..దివంగత నటుడు, కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేంకగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'అప్పు' అంటూ ఆయన అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడు పునీత్ రాజ్ కుమార్. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్ హఠాన్మరణం యావత్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పు మరణవార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే పునీత్ చనిపోవడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఆయన చివరిసారిగా నటించిన చిత్రం 'జేమ్స్'. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. చదవండి: జేమ్స్ సినిమా చూడలేను: పునీత్ భార్య అశ్విని భావోద్వేగం పునీత్ జయంతి (మార్చి 17) సందర్భంగా జెమ్స్ మూవీ విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు అప్పు ఫ్యాన్స్ థియేటర్లకు పొటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. మార్చి 25వరకు కర్ణాటక అన్ని థియేటర్లో జెమ్స్ మూవీ మాత్రమే ప్రదర్శించారు. అప్పును చివరి సారిగా తెరపై చూసి కన్నీటి పర్యంతం అయ్యారు పునీత్ అభిమానలు. ఆయన్నుతలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా 'జేమ్స్' మూవీ ఓటీటీ విడుదల తేది ఖరారైంది. ఏప్రిల్ 14 నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు మరింత చేరువకానుంది. చదవండి: 'జేమ్స్' మూవీ ఎలా ఉందంటే...
- 
      
                   
                                 పునీత్ లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, దేవుడిపై కోపం తెప్పిస్తుంది: వర్మపునీత్ రాజ్‌కుమార్ మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. తన తాజా చిత్రం ‘మా ఇష్టం’ మూవీ ప్రమోషన్లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఆర్జీవీ ఈ సందర్భంగా పునీత్ సమాధిని దర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పునీత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కిల్లింగ్ వీరప్పన్ మూవీ షూటింగ్ సమయంలో పునీత్‌ను పలుమార్లు కలిశానని చెప్పారు. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే, దక్షిణాది భాషలు మాత్రమే ఇక్కడ.. ఇక ఆయన చివరి చిత్రం జెమ్స్ విజయంపై వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా లేకపోయిన రీయల్ హీరోగా పునీత్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆర్జీవ అన్నారు. అనంతరం వర్మ ట్వీట్ చేస్తూ మరోసారి పునీత్ మరణంపై గుర్తు చేసుకున్నారు. ‘పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తికి ఇలా జరగడమంటే దేవుడిపై నమ్మకం కొల్పోవడానికి ఇది మరో ఖచ్చితమైన కారణం అవుతుంది. నిజంగా కోపం తెప్పిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. If it can happen to someone as fit and as great a person as #PuneethRajkumar it is all the more reason why one should not believe in GOD ..Makes me really ANGRY pic.twitter.com/O4yILL8Jj7 — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2022
- 
      
                   
                                 బర్త్‌డే సందర్భంగా ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటనవిలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్(అప్పు) సేవల తన ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నా ప్రత్యేకమైన రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందం ఉంది. పునీత్ రాజ్‌కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకేళ్లబోతున్నాను. చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాను’ అంటూ అప్పు ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘అప్పు ఎక్స్‌ప్రెస్’ అని రాసి ఉన్న ఈ పోస్ట్‌ను ఆయన పంచుకున్నారు. ఆయన ట్వీట్‌పై పునీత్ ఫ్యాన్స్, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌పై ప్రశంసలు కురిపిస్తు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. కాగా ప్రకాశ్ రాజ్ లాక్డౌన్లో ఎంతోమందికి సేవలు అందించారు. తన ఫాంహౌజ్‌లో నిరాశ్రయులకు ఆయన ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. On my day today.. I’m extremely happy to announce this .. details soon a #prakashrajfoundation initiative “let’s give back to life” pic.twitter.com/hra3HYWPtO — Prakash Raj (@prakashraaj) March 26, 2022
- 
      
                   
                                 అభిమానులకు షాక్.. వారంలోపే పునీత్ చివరి సినిమా ఎత్తేస్తున్న థియేటర్లుసాక్షి, బెంగళూరు: కన్నడనాట యువ నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం జేమ్స్.. ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లతో సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నెల 17వ తేదీన జేమ్స్ విడుదలైంది. ‘ది క శ్మీర్ ఫైల్స్ తో పాటు మరో భారీ సినిమా కోసం బెంగళూరుతో సహా రాష్ట్రంలో పలు థియేటర్ల నుంచి జేమ్స్ సినిమాను తీసేస్తున్నారని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పరభాష చిత్రాల కోసం కన్నడ చిత్రాలకు అన్యాయం చేయొద్దని పలు కన్నడపర సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. సీఎల్పీ నేత– జేమ్స్ నిర్మాత భేటీ.. జేమ్స్ సినిమా నిర్మాత కిశోర్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఒక సినిమాను బలవంతంగా నిలిపేసి మరో సినిమాను చూడాలని ఒత్తిడి చేయడం సరికాదని సిద్ధరామయ్య అన్నారు. ఇక మరో భారీ సినిమా కోసం జేమ్స్ సినిమాను బలి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధాంతరంగా జేమ్స్‌ను తొలగించడం బాధాకరమని ఆ సినిమా దర్శకుడు, నిర్మాత వీడియో ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. జేమ్స్‌ను తొలగించరాదు: విశ్వనాథ్ మైసూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన జేమ్స్ సినిమాను ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం కోసం ఎత్తివేయడం తగదని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన మైసూరులో మాట్లాడుతూ కన్నడ సంప్రదాయాలకు నిదర్శనం డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. అలాంటి వ్యక్తి కుమారుడు పునీత్ అకాల మరణం తరువాత విడుదల అయిన జేమ్స్ చిత్రాన్ని పక్కన పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో కన్నడ చిత్రాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ర్యాలీ.. జేమ్స్‌కు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు మైసూరులో ర్యాలీ చేశారు. రామస్వామి సర్కిల్ నుంచి పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటంతో ఊరేగింపుగా వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా జేమ్స్ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎంకే సోమశేఖర్ పాల్గొన్నారు.
- 
      
                   
                                 జేమ్స్ సినిమా చూడలేను: పునీత్ భార్య అశ్విని భావోద్వేగంAshwini Puneeth Rajkumar About James Movie: దివగంత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరిగా నటించిన ‘జేమ్స్’ చిత్రం మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పునీత్ జయంతి(మార్చి 17) సందర్భంగా జెమ్స్ మూవీ విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు అప్పు ఫ్యాన్స్ థియేటర్లకు పొటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. మార్చి 25వరకు కర్ణాటక అన్ని థియేటర్లో జెమ్స్ మూవీ మాత్రమే వేయనున్నారు. అప్పును చివరి సారిగా తెరపై చూసి ఫ్యాన్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. బరువెక్కిన హృదయాలతో అభిమానులు థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్ ఇదిలా ఉంటే ఓ ఇంటర్య్వూలో అప్పు చివరి చిత్రం జేమ్స్‌పై ఆయన భార్య అశ్విని పునిత్ రాజ్‌కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ‘‘తాను జేమ్స్’ సినిమా చూడలేను అన్నారు. ఎందుకంటే అందరిలా నేను ఆ సినిమా చూడలేకపోవచ్చు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. జేమ్స్ మూవీ బాగా రూపుదిద్దుకుందని చిత్రబృందం, ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ నేను చూడలేను కాబట్టి వెళ్ళలేదు.. జేమ్స్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి పునీత్ నాకు చాలాసార్లు చెప్పారు. సినిమాలో వాడుతున్న టెక్నాలజీ గురించి కూడా ఆయన వివరించారు’ అని అశ్విని తెలిపారు. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్ ఇండస్ట్రీలో అన్ని రంగల్లోనూ కొత్తవారికి చోటు కల్పించాలనేది పునిత్ ఆశయం అని అశ్విని అన్నారు. ‘మా సంస్థ పీఆర్కే(పునిత్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్) ద్వారా ఇది కొనసాగుతుంది. మా బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ కాకపోయాన మా బెస్ట్ ఇవ్వగలిగాం. అప్పును కోల్పోయిన బాధలో ఉన్న మాకు ఆయన అభిమానులు అండగా నిలిచారు. ఆయన బర్త్ యానివర్సరీ రోజున రక్తదానం, నేత్రదానం, అన్నదానం వంటి అనేక కార్యక్రమాల ద్వారా అప్పును బతికించారు’ అంటూ అశ్విని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా అప్పు చివరి మూవీని ఆయన సోదరులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఆయన కుమార్తె వందిత, వినయ్ రాజ్‌కుమార్, యువ రాజ్‌కుమార్‌లు సహా మిగతా కుటుంబ సభ్యులు వీక్షించారు.
- 
      
                   
                                 గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అభిమాని మృతిPuneet Rajkumar Fan Dies Of Heart Attack In Nanjangud: దివంగత పునీత్ రాజ్‌కుమార్ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు..పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ సినిమా విడుదల సందర్భంగా మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హెడియాల గ్రామంలో గురువారం జరిగిన సంబరాల్లో హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షులు మంజులా కుమారుడు ఆకాశ్ (22) పాల్గొన్నాడు. ఈక్రమంలో ఆకాశ్ గుండెపోటుతో మరణించాడు.
- 
      
                   
                                 తమ్ముడిని తలుచుకొని కన్నీటి పర్యంతమయిన శివరాజ్‌కుమార్Shiva Rajkumar Watches Puneeth Rajkumar Last Film James In Mysuru: దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' గురువారం ఆయన జన్మదినం సందర్భంగా విడుదలైంది. ఉదయం ఆరు గంటల నుంచే అభిమానులు థియేటర్ల వద్ద గుమిగూడారు. కొందరు తెరపై పునీత్‌ను చూసి నృత్యం చేయగా మరి కొందరు విలపించారు. పవర్ స్టార్ 47వ పుట్టిన రోజును అభిమానులు ఒక పండుగలా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో సినిమా విడుదలైంది.చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ పునీత్ తెరపై కనపడగానే అభిమానుల ఈలలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయ్యాయి. మైసూరులో ఒక థియేటర్లో పునీత్ పెద్దన్న, నటుడు శివరాజ్‌కుమార్ సినిమాను చూశారు.ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఫిలిం సిటీకి పునీత్ పేరు పెడితే సంతోషం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో నిర్మిస్తున్న ఫిలిం సిటీకి తన తమ్ముడు, దివంగత పునీత్ రాజ్‌కుమార్ పేరు పెడితే సంతోషిస్తామని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. పునీత్ లేకుండా అతని పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో బాధగా ఉందని, ఇప్పటికీ తమ కుటుంబం అప్పు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ సినిమా చూస్తూ అభిమానుల కంటతడిPuneeth Rajkumar Fans Getting Emotional Seeing After James Movie: కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్ ఫీవర్ నడుస్తుంది. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది.మార్చి17న పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో ఈ సినిమా చేసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. పునీత్ యాక్షన్స్ సీన్స్ చూసి ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పునీత్‌ను తల్చుకొని అభిమానులు కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట Fans getting emotional seeing after #James movie🥺 Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8 — Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022
- 
      
                   
                                 పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూPuneeth Rajkumar James Movie Twitter Review In Telugu: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేంకగా చెప్పాల్సిన పనిలేదు. 'అప్పు' అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడాయన. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్ హఠాన్మరణం యావత్ పరిశ్రమను కదిలించింది. ఆయన మరణవార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే పునీత్ చనిపోవడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం జేమ్స్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి17న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కన్నడ, తెలుగు,తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ప్రియా ఆనంద్ పునీత్‌కి జోడీగా నటించింది. పునీత్ నటించిన చివరి చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. బెనిఫిట్ షో మొదలైనప్పటి నుంచి ఈ చిత్రానికి హిట్ టాక్ వస్తోంది. పునీత్ యాక్షన్ సీన్స్ చూసి ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావేద్వోగం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈసినిమా ఎలా ఉందన్నది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి అవేంటో చూసేయండి. #James 1st Half - Watch Out For The Massive Performance Of Our Power Star In The Pre Interval Sequence😭❤️Total Goosebumps Stuff❤️Man Literally Nailed That Whole Pre Interval Sequence 💥💥💥#BoloBoloJames #Appu #PuneethRajkumar #AppuLivesOn — Sumanth R (@Itz_Sumanth) March 17, 2022 Celebration began at Urvashi cinemas. APPU❤❤ @Kannada_BO#CelebratePuneethRajkumar #James #Appu #BoloBoloJames pic.twitter.com/z2Jh4NOaDT — ಪ್ರಶಾಂತ್ ವಿ (@prashanthv18) March 17, 2022 Action is his Trademark😭🙏🏻🙏🏻#DrPuneethRajkumar #James @PuneethRajkumar #JamesHistoricEuphoria pic.twitter.com/hmOCCku3Oj — 𝐀𝐩𝐩𝐮 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐇𝐨𝐮𝐬𝐞 ™ (@AppuCelebration) March 17, 2022 Mental mass first half Fights mamuluga levu🔥🔥💥 perfect tribute to appu sir 🙏🙏#James #JamesHistoricEuphoria https://t.co/gCw7uIaxia — Amarnath CA (@CNAmarnath) March 17, 2022 Fans getting emotional seeing after #James movie🥺 Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8 — Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022 Couldn’t control tears when ever i see him smile will miss that beautiful simle #PuneethRajkumar #james will cherish every second of all ur time with us fans powerstar ull be missed and forever live in our hearts 😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/01xa65MNJH — Nishanth (@nishantn138) March 17, 2022 #James is a great commercial action entertainer. A fast paced screenplay, good story, fantastic action sequences and also good emotional content make it a perfect commercial entertainer. This movie has nice production value, music and cinematography. A very good job by director. pic.twitter.com/8Zb9c6Smmm — Indian (@Indian1726) March 17, 2022 Watching Him First Time On Screen His action sequence are 💙🙏#James #AppuLivesOn #HappyBirthdayPuneethRajkumar #JamesTelugu pic.twitter.com/YOMVw0fp6T — Teja Maddy (@maddy_teja) March 17, 2022 ST - #James (Telugu) pic.twitter.com/RVBOw2Z4In — Ananth Nithiin (@ImAnanthV) March 17, 2022 Veeresh theatre crowd 💥💥Masssss👌#BoloBoloJames #James #CelebratePuneethRajkumar #DrPuneethRajkumar #DrPuneethRajkumar #JamesHistoricEuphoria pic.twitter.com/Dj4ZNWCbzZ — Mahantesh (@Mahi_Appu75) March 17, 2022 #PuneethRajkumar #James#Powerstar Rampage. That dance, fights, screen presence!!❤ It was immensely emotional and a constant mixture of feeling his presence onscreen and absence offscreen. Yet in our hearts #AppuLivesOn. Go watch him on screen!! — Gagan Gowda (@GaganGo39511084) March 17, 2022 As a director Chethan Wins big time he had challenges he executed things well@BahaddurChethan appreciation tweet for you Sir Exceeds expectations #James #JamesonMarch17 — Yuva | James ® (@Yuva_1234) March 17, 2022 #James - came out of the film with nothing but tears. Can't believe that this is his last commercial film. 'Paramathma' will forever stay in our hearts ❤️ Wishing best to team #James on behalf of Thalaivar @rajinikanth fans...#PuneethRajkumar @PuneethRajkumar — Bangalore RFC (@Bangalore_RFC) March 17, 2022
- 
      
                   
                                 ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదటPuneeth Rajkumar Aunt Stil Unaware Of His Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఇప్పటికీ అభిమానులకు షాకింగ్‌గానే ఉంది. ఆయన మరణించి సుమారు నాలుగు నెలలు దాటినా అభిమానులు ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడ నాట ఓ వెలుగు వెలిగిన పునీత్ గతేడాది అక్టోబర్29న చనిపోయిన సంగతి తెలిసిందే. 46ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు పునీత్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఆయన మేనత్తకు తెలియదట. 90 ఏళ్ల నాగమ్మ పునీత్ తండ్రి రాజ్‌కుమార్‌కు సొంత చెలెల్లు. ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం. పునీత్‌కి, మేనత్తకి మధ్య ఎంతటి అనుబంధం ఉందో కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అందుకే పునీత్ చనిపోయినప్పుడు ఆమెకు ఆ విషయం చెప్పకుండా దాచి పెట్టారు. అప్పు గురించి ఆమె ఎప్పుడైనా అడిగినా అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాడని చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం రాఘవేంద్ర రాజ్‌కుమార్(పునీత్ రెండో అన్న) గుండెపోటుకు గురయ్యాడని తెలిసి నాగమ్మ తట్టుకోలేకపోయిందట. ఆ షాక్‌తో ఆమెను హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందట. సోదరుడి పిల్లలను సొంత పిల్లల్లా చూసుకున్న నాగమ్మ.. వాళ్లకు ఏమైనా జరిగిందని తెలిస్తే తల్లడిల్లేవారట. అందుకే పునీత్ చనిపోయాడన్న విషయాన్ని ఇప్పటికీ ఆమెకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతున్నాం అని పునీత్ కుటుంబసభ్యుల్లో ఒకరు వెల్లడించారు. ఇక చుట్టుపక్కల వాళ్లు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినా పునీత్ విషయాన్ని ఇంట్లో ప్రస్తావించకుండా ముందే జాగ్రత్తపడతారట.
- 
      
                   
                                 పునీత్.. నువ్వయ్యా నిజమైన జగదేకవీరుడివి!Late Kannada SuperStar Birth Anniversary Special: పునీత్ రాజ్‌కుమార్.. నువ్వయ్యా నిజమైన జగదేకవీరుడివి! ఇండియన్ సినిమాలో ఏ హీరోకు సాధ్యం కానీ ఫీట్ అప్పు సొంతం! ఏంటో తెలుసా? ‘అమ్మా.. ఆయన ఫొటో వాట్సాప్‌లో ఎందుకు స్టేటస్ పెట్టుకున్నావ్?’.. అనే కొడుకు ప్రశ్నకు.. ‘‘లేదు బిడ్డా.. ఆయన కన్నడ హీరో అట. చాలా మంచోడు అట. 45 స్కూళ్లు కట్టించాడట. 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపిస్తున్నాడట. 19 గోశాలలకు సాయం చేస్తున్నాడట. ఇప్పుడు చనిపోయినా రెండు కళ్లూ దానం చేశాడట. ఇంత మంచోడు ఇయ్యాల రేపు ఉంటాడా?.. అందుకే స్టేటస్ పెట్టిన్రా అని సమాధానం ఇచ్చింది ఆ తల్లి. ఎక్కడ కర్ణాటక.. ఎక్కడ తెలుగు రాష్ట్రాలు.. పోనీ పునీత్ ఆయన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయమా? అంటే.. అదీ లేదు. ఓ చిన్న సాయం చేసి ప్రపంచానికి ఎలా చెప్పాలా? అని అనుకుంటాం మనమంతా. కానీ, స్టార్ హీరోగా ఉండి కూడా పునీత్ అలా కాదు. ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది.  ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం. ఆ.. ఎలా బతికామన్నదాన్ని బట్టే, ఎంతకాలం జనం గుండెల్లో నిలిచిపోతామన్నది ఉంటుంది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం.. తన అభిమానులనే కాదు.. ఏమాత్రం సంబంధం లేని వేరే రాష్ట్ర ప్రజలను సైతం కదిలించింది. పాతిక లక్షల మంది కరోనా లాంటి మహమ్మారిని సైతం లెక్కచేయకుండా పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు.. అతను సంపాదించుకున్న అభిమానం ఎంత గొప్పదో!.. ఆ అభిమానం చిరకాలం సజీవంగా ఉంటుంది కూడా!. తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ లెజెండరీ నటుడు. తల్లి దివంగత పార్వతమ్మ.. నిర్మాత. పెద్దన్న శివ రాజ్‌కుమార్ స్టార్ హీరో. రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ నటుడు కమ్ నిర్మాత. మొత్తం కుటుంబం సినీ నేపథ్యం ఉన్నా, బాల్యం నుంచే తెర మీద కనిపిస్తున్నా.. టాలెంట్‌తో ఎదిగిన పునీత్ అంటే అక్కడి జనాలకు ఇష్టం ఎక్కువ. తెర మీద ఒక స్ప్రింగ్‌లా అప్పు స్టెప్పులు వేస్తుంటే.. రెప్పవేయరు ఆడియొన్స్. ఆయన డైలాగ్ డెలివరీని మాస్‌తో పాటు క్లాస్ ఆడియొన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. యూత్ ఫాలోయింగ్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఒరియెంటెడ్ కంటెంట్ సినిమాలూ చిన్నవయసులోనే ఆయన క్రేజ్‌ను విపరీతంగా పెంచాయి. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. ‘గుడిసలె ఆగలి.. అరమనే ఆగలి.. అటవే నిల్లదు ఎందు ఆట నిల్లదు గుడిసెలో ఉన్నా.. బంగళాలో ఉన్నా.. అతనెప్పుడూ ఒకేలా ఉంటాడు. దాని చుట్టూనే ఆడుకుంటాడు. హిరియరె ఇరళి.. కిరియరి బరళి.. బెదవే తోరదు.. ఎందు బేధ తోరదు చిన్న అయినా.. పెద్ద అయినా.. అందరినీ గౌరవిస్తాడు. ఉన్నతంగా జీవిస్తాడు. ఎల్ల ఇద్దు ఎను ఇళ్లద హాగే బదుకిరువా ఉన్నతుడు కానీ గర్వం చూపించడు ఆకాశ నోడద కైయె నిన్నదు ప్రీతి హంచిరువా మధురమైన పాత జ్ఞాపకాలతో గడిపేస్తుంటాడు..’ పునీత్ రాజ్‌కుమార్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రాజకుమార సినిమా టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇవి. అలాంటి జ్ఞాపకాలనే కుటుంబానికి, అశేష అభిమానులకు అర్థాంతరంగా మిగిల్చి వెళ్లిపోయాడు అప్పు. పునీత్ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు.. పునీత్ చనిపోయేనాటికి వయసు 46 ఏళ్లు. సినీ ప్రస్థానం సాగింది 45 ఏళ్లు. ఆరు నెలల వయసుకే లోహిత్(పునీత్ పసితనంలో పేరు) తండ్రి లీడ్ రోల్ చేసిన ‘ప్రేమదా కనికే’ చిత్రంలో కనిపించాడు. బెట్టాడ హూవు సినిమాకుగానూ ఏకంగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నేషనల్ అవార్డు అందుకున్నాడు లోహిత్(పునీత్). 1976 నుంచి 89 మధ్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా కన్నడ సినిమాల్లో సందడి చేశాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో హీరోగా 2002లో అప్పు తో(తెలుగు ఇడియట్‌కి రీమేక్) ఎంట్రీ. ఒక హీరో తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి వరుసగా ఆరు సినిమాలు.. వంద రోజులు పూర్తి చేసుకుని కమర్షియల్ సక్సెస్ సాధించగలడా?. ఇండియన్ సినిమాలో ఆ రికార్డు పునీత్ పేరిట ఉంది. దానిని ఇప్పటిదాకా ఎవరూ బ్రేక్ చేసింది లేదు. 19 ఏళ్ల హీరో కెరీర్లో 29 సినిమాల్లో నటించాడు. శాండల్‌వుడ్‌లో మోస్ట్ సక్సెస్‌లు సాధించిన హీరోగా గుర్తింపు. అందుకే కన్నడలో పవర్ స్టార్ ట్యాగ్ దక్కింది ఆయనకు. అప్పు, అభి, వీర కన్నడిగ(ఆంధ్రావాలా రీమేక్), మౌర్య, ఆకాశ్, అజయ్(ఒక్కడు రీమేక్), అరసు, మిలనా, వంశీ, రామ్, జాకీ(పునీత్ స్టార్‌డమ్‌ను ఆకాశానికి చేర్చిన సినిమా), హుడుగరు, రాజకుమార, అంజనీ పుత్ర(తమిళ చిత్రం పూజై రీమేక్).. ఇలా పునీత్ కెరీర్లో కమర్షియల్ బ్లాక్బస్టర్లుగా నిలిచిన సినిమాలు. ముంగారు మలే(తెలుగులో ‘వాన’గా రీమేక్).. కన్నడ నాట ఒక సెన్సేషన్ హిట్. ఆ సినిమా కలెక్షన్లకు చాలా కాలం తర్వాత బ్రేక్ చేసింది పునీత్ రాజ్‌కుమారే. ఆయన నటించిన ‘రాజకుమార’ చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత కే.జీ.ఎఫ్ చాప్టర్ 1 ఆ రికార్డును క్రాస్ చేసేసింది. నటుడు, ప్లేబ్యాక్ సింగర్, టెలివిజన్ ప్రజెంటర్, నిర్మాత, వాయిస్ ఓవర్.. ఇలా పునీత్ మల్టీటాలెంటెడ్ పర్సన్. ఈ విషయంలో తండ్రి దివంగత రాజ్‌కుమార్‌కు ఏమాత్రం తీసిపోని ఆణిముత్యం పునీత్. చిన్నవయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా మెప్పించాడు. హీరోగా రాణిస్తున్న టైంలోనూ.. ప్రొఫెషనల్ సింగర్‌లాగా ఎన్నో సినిమాలకు.. అదీ ఇతర హీరోలకు సైతం పాడారు. అజాత శత్రువు స్టార్ డమ్ ఉన్న హీరోకి ఫ్యాన్స్ వార్ తప్పని విషయం. మరి పునీత్‌కు ఇలాంటివేం లేవా? అనే అనుమానాలు రావొచ్చు. ఆ విషయంలో పునీత్ ఫ్యాన్స్‌ను మెచ్చుకోవాల్సిందే. డ్యాన్సులో పోటీపడే హీరోలు ఉన్నా.. అంతా పునీత్‌తో సమానంగా అవతలి హీరోలనూ అభిమానించేవాళ్లే. అభిమానులే కాదు.. హీరోలూ పునీత్‌ను ఒక మంచి మిత్రుడిగా చూస్తుంటారు. ఎందుకంటే పునీత్‌కు తానొక బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని, స్టార్ హీరోను అనే గర్వం ఏ కోశాన కనిపించదు. అందుకే తమ సినిమా ఈవెంట్లలలో పునీత్‌కు ఆప్యాయంగా ప్రత్యేక ఆహ్వానం అందిస్తారు. ఇక సీనియర్లను పునీత్ గౌరవించే తీరు చూస్తే ఎవరైనా ఆయనకు ఫిదా కావాల్సిందే. ఒక కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ, ఆఖరికి బాలీవుడ్‌లోనూ పునీత్‌కు మంచి స్నేహితులు ఉన్నారు. విమర్శలు లెక్కచేయడు అన్ని భాషల్లోలాగే.. మిగతా భాషల్లోనూ మిగతా హీరోల్లాగే పునీత్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. సినిమాల్లోకి రాకముందు.. సినిమాల్లోకి వచ్చాక.. నెపోటిజం దగ్గరి నుంచి బాడీ షేమింగ్ దాకా ఎన్నింటినో చిరునవ్వుతో దాటేశాడు. సినిమాలపైనా, వ్యక్తిగత విమర్శలపై ఏనాడూ అతిగా ఆయన స్పందించింది లేదు. కన్నడ సోదరసోదరీమణులు అప్పూ అని పిల్చుకునే పునీత్.. శాశ్వతంగా దూరమైనా ఆయన సినిమాలు, వేల మందికి అందుతున్న సాయం రూపంలో నిత్య సజీవుడిగా ఉంటాడు. ఆ అభిమానం అలాంటిది మరి. మార్చి 17న కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్‌కుమార్ 47వ జయంతి సందర్భంగా..
- 
      
                   
                                 దళపతికి ఇన్నాళ్లకు తీరిందా..?గత ఏడాది అక్టోబర్ 29న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 46ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్. ముఖ్యంగా కన్నడిగులు అయితే తమను తన నటనతో ఇంతకాలం అలరించిన పవర్ స్టార్ ఒక్కసారిగా మరణించడంతో షాక్‌కు గురయ్యారు. చాలా రోజుల వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. నేటికీ పునీత్ సమాధిని తన అభిమానులు దర్శించుకుంటూనే ఉన్నారు. పునీత్ మృతి చెందిన సమయంలో యావత్ భారత సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో చివరి చూపు కోసం అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కూడా బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కన్నీళ్లు పెట్టుకుని మరీ పునీత్ అంతిమ సంస్కారాలను నిర్వహించిన సంగతి ప్రతి ఒక్కరికీ తెల్సిందే. అయితే తాజా విషయం ఏంటంటే.. పునీత్ సమాధిని తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ఘాట్‌ను సందర్శించి శ్రద్దాంజలి ఘటించాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో విజయ్ యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. పునీత్ చనిపోయిన ఇన్నాళ్లకు విజయ్‌కి సమయం దొరికిందా..? అంటూ కన్నడ మీడియా వర్గాలతో పాటు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయి ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటి దాకా తనకు తీరిక దొరక లేదా అంటూ విమర్శిస్తున్నారు. విజయ్ నిజంగానే అంత బిజీగా ఉన్నాడా ఇప్పటికి కానీ ఆయనకు కుదర్లేదా అంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో పని మీద బెంగళూరుకు వచ్చిన విజయ్ పనిలో పనిగా పునీత్ ఘాట్‌ను సందర్శించేందుకు వచ్చాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి కౌంటర్‌గా విజయ్ అభిమానులు తమ అభిమాన హీరోపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా విజయ్ పర్యటన వివాదాస్పదం అవ్వడం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది.
- 
      
                   
                                 పునీత్ ‘జేమ్స్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్‌గెస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరోలుకన్నడ పవర్ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రం బృందం మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 6న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరోలు హజరవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా వెళ్తున్నట్లు సమాచారం. చిత్ర బృందం వీరిని ఆహ్వానించడంతో చిరు, తారక్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూనియర్ ఎన్టీఆర్, పునీత్ రాజ్‌కుమార్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. తారక్‌పై ఉన్న అభిమానంతో పునీత్ తన సినిమాలో స్పెషల్‌గా ఓ సాంగ్ కూడా పాడించుకున్నారు.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదంకన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది. పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 20న) ఉదయం రేవనాథ్కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రేవనాథ్ గతంలో ఎన్హెచ్ఏఐ చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారు. అల్లుడు పునీత్ లాగే రేవనాథ్ కూడా మరణానంతరం తన కళ్లను దానం చేశారు. ఇప్పటికే భర్త పోయిన బాధలో ఉన్న అశ్వినికి తండ్రి రేవనాథ్ మరణం తీరని లోటనే చెప్పాలి!
- 
      
                   
                                 ‘జేమ్స్’ టీజర్: పునీత్‌ను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల సిద్దమవుతోంది. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న జేమ్స్ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.ఈ సందర్భంగా జేమ్స్ మూవీలోని పునీత్ పోస్టర్‌ను షేర్ చేశాడు ప్రభాస్. చదవండి: అల్లు అర్జున్‌కు అలాంటి అవాంతరాలు, జ్యోతిష్యులు ఏం చెప్పారంటే.. ఈ పోస్ట్‌లో ప్రభాస్ ‘‘మ్జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మార్చి 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన విషయం విధితమే. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas)
- 
      
                   
                                 పునీత్ చివరి సినిమా జేమ్స్ టీజర్ చూసేయండి!కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్రపరిశ్రమకే కాదు కన్నడ ప్రజలకు సైతం తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించగా ఇప్పటికీ ఆయన అభిమానులు, సెలబ్రిటీలు పునీత్‌ను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అంతేకాదు, ఆయన నటించిన చివరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. శుక్రవారం ఉదయం జేమ్స్ టీజర్ రిలీజ్చేశారు. 'ఎమోషన్స్ అనేవి వ్యాపారం కన్నా పెద్దవి' అన్న టైటిల్‌తో టీజర్ మొదలైంది. 'గన్స్ పట్టుకుని నిలబడే వంద వేస్ట్ బాడీస్ కంటే గన్నులాంటోడిని ఒక్కడిని తీసుకురండి.. ఎదురు నిలబడి కాపాడటమూ తెలుసుండాలి, ఎదురొచ్చే గుండెలో బుల్లెటు దింపడమూ తెలుసుండాలి' అన్న డైలాగ్‌తో పునీత్ పాత్రకు హైప్ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే పునీత్ సెక్యురిటీ ఏజెన్స్ ఆఫీసర్‌గా నటించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియా ఆనంద్, విలన్‌గా శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్చి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
- 
      
                   
                                 పునీత్ ఫ్యామిలీని పరామర్శించిన అల్లు అర్జున్కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్రసీమకు తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్‌చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా పునీత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్ బెంగళూరుకు వెళ్లారు. గురువారం (ఫిబ్రవరి 3) ఉదయం బెంగళూరుకు చేరుకున్న బన్నీ ముందుగా పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్Puneeth Rajkumar James Movie Army Officer Look Released: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఈ ఏడాది మార్చి17న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(జనవరి26)న స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆయన సైనికుడిలా కనిపించారు. చేతన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది.హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా, అను ప్రభాకర్ ముఖర్జీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా అదే రోజున ఈ సినిమా విడుదల చేయనున్నారు. దీంతో మార్చి 17-23 మధ్యలో ఎలాంటి సినిమాలు విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమానుకన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
- 
      
                   
                                 ఆ కల నెరవేరకుండానే చనిపోయిన పునీత్ రాజ్‌కుమార్Puneeth Rajkumars Ancestral House In Gajanur Made Into Museum: కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆసక్మిక మరణం సినీ పరిశ్రమను కలిచి వేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ ఈ ఏడాది అక్టోబర్29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి ముందే తన పూర్వీకులు, తన తండ్రి, సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ స్వస్థలమైన గాజనూర్లోని ఇంటిని మ్యూజియంగా మార్చాలని అనుకున్నాడట. ఇప్పటికే శిథిలావస్ధకు చేరుకున్న ఆ ఇంటిని అందంగా పునరుద్ధరించి ఓ మ్యూజియంగా మార్చాలని భావించాడట. ఇందులో భాగంగా పునీత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా ఆ ఇంటిని సందర్శించి మ్యూజియం ఏర్పాటుకు తగిన ప్రణాళికలు రూపొందించారట. అయితే దురదృష్టవశాత్తూ గుండెపోటుతో పునీత్ మరణించాడు. తాజాగా పునీత్ కలను నిజం చేయడానికి ఆయన మేనల్లుడు గోపాల్ రంగంలోకి దిగాడు. ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు శరవేగంగా పనులు ప్రారంభించాడు. మరో రెండు నెలల్లో రెన్నోవేషన్ పనులు పూర్తవుతాయని చెప్పుకొచ్చాడు.
- 
      
                   
                                 ఇదే ఆఖరుసారి అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం!Jr NTR Singing Geleya Geleya in RRR Press Meet for Late Puneeth Rajkumar: అందరివాడుగా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్‌కు తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్‌తోనూ అతడికి సన్నిహిత సంబంధం ఉంది. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం తారక్ ఓ పాట కూడా పాడాడు. 'గెలయా గెలయా..; అంటూ సాగే ఈ పాట సూపర్ డూపర్ హిట్టైంది. తాజాగా ఈ పాటను ఆర్ఆర్ఆర్ ప్రెస్మీట్లో పాడుతూ ఎమోషనల్ అయ్యాడు ఎన్టీఆర్. శుక్రవారం నాడు బెంగళూరులో ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌తో పాటు రాజమౌళి, అలియా భట్, రామ్‌చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు, కన్నడ సూపర్ స్టార్ పునీత్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు ఎన్టీఆర్. ఆయన లేని కర్ణాటక జీరోగా కనిపిస్తుందన్నాడు. ఎక్కడ ఉన్నా ఆయన ఆశీర్వాదాలు మాత్రం తనకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నాడు. అప్పు నటించిన సినిమాలోని గెలయా గెలయా.. సాంగ్‌ను పాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన గౌరవార్థం ఈ పాట ఇదే చివరిసారిగా పాడుతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. NTR singing #Geleya for the first & last time.#NTR @tarak9999 #RRRTrailer #PuneethRajkumarLivesOn pic.twitter.com/QP4iq5RygS — Nandamurifans.com 🦁🐯 (@Nandamurifans) December 10, 2021
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ వైల్డ్‌లైఫ్ షో టీజర్ చూశారా?Puneeth Rajkumar Wildlife Show Gandhada Gudi Teaser Out: కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ నటించిన వైల్డ్‌లైఫ్ డ్యాక్యుమెంటరి టీజర్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ రోజు(డిసెంబర్ 6) పునీత్ తల్లి పార్వత్మ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఆయన ఎంతో ఇష్టంగా చేసిన గంధడ గుడి పేరుతో ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. పునీత్ ప్రకృతి ప్రేమికుడనే విషయం తెలిసిందే. అందుకే అయన ఏరికోరి ఈ డాక్యుమెంటరీని చేశారట. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిని ఈ రియాలిటీ లైవ్ షోలో సుందరమైన బీచ్‌లు, నదుల అందాలను.. ప్రకృతిలోని ప్రపంచాన్ని అన్వేషిస్తుంది. చదవండి: అభిమానులకు పుష్ప టీం షాక్, ట్రైలర్ వాయిదా, కారణమిదే! కర్నాటక అడవుల్లో పరిరక్షణ కోసం సుప్రసిద్ధ వన్యప్రాణి చిత్ర నిర్మాత అమోఘవర్ష జెఎస్‌తో పునీత్ జతకట్టారు. పునీత్ చేసిన ఈ డాక్యుమెంటరీ చాలా కాలంగా రూపొందుతోంది. ఈ డాక్యుమెంటరీకి గంధడ గుడి అనే పేరు పెట్టారు. గంధడ గుడి అంటే గంధపు చెక్కల గుడి అని అర్ధం. కాగా గతంలో గంధడ గుడి టైటిల్‌తో అప్పు తండ్రి దివంగత లెజెండ్ డాక్టర్ రాజ్‌కుమార్ సినిమా కూడా చేశారు. 1973లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో పునీత్ అదే పేరుతో ఈ ప్రకృతి డ్యాక్యుమెంటరిని తీశారు. తన సొంత రాష్ట్రం కర్ణాటక గురించి రాష్ట్రంలోని అందాల గురించి ఇతర రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అప్పు ఎన్నో ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టారు. చదవండి: సమంత మరో పాన్ ఇండియా చిత్రం టైటిల్ ఇదే, డైరెక్టర్లు ఎవరంటే.. అందులో ఈ ‘గంధడ గుడి’ వైల్డ్‌లైఫ్ డ్యాక్యుమెంటరి ఒకటి. వచ్చే ఏడాది థియేటర్లో అప్పు వైల్డ్‌లైఫ్ షో విడుదల కానుంది. ఇక గంధడ గుడి డాక్యుమెంటరీ కర్ణాటకలోని అరణ్యాల పవిత్రతను, సంపదను రక్షించడం వంటి ప్రాముఖ్యతను వివరిస్తోంది. ఈ టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత అమోఘవర్ష ‘అప్పు కల ఒక అద్భుతమైన ప్రయాణం, మా భూమి విశిష్టత గురించి తెలియజేసే ఒక పురాణం.. గంధడ గుడి’ అంటూ ట్వీట్ చేశారు. 2019లో అమోఘవర్ష రూపొందించిన వైల్డ్ డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పుడు ఈ వైల్డ్ డాక్యుమెంటరీని తోటి వన్యప్రాణి చిత్ర నిర్మాత కళ్యాణ్ వర్మతో కలిసి అమోఘవర్ష రూపొందించారు.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డిసాక్షి, కర్ణాటక: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. బెంగుళూరులోని పునీత్ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి అశ్వినితో మాట్లాడారు. ఈ సందర్భంగా పునీత్ అకాల మరణం చాలా బాధించిందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చిన్న వయసులోనే అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ అని పెద్దిరెడ్డి అన్నారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న ఇంట్లో జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి: (PuneethRajkumar: పునీత్ పెళ్లికి 22 ఏళ్లు..)
- 
      
                   
                                 David Warner: ‘అప్పు’ను గుర్తుచేసిన వార్నర్.. అదైతే కష్టం కానీ!IPL 2022: David Warner Reply After Fan Requested Him Join RCB: ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడుపోతాడు, ఎవరిని ఏ జట్టు కొనుగోలు చేస్తే బాగుంటుందన్న అంశాలపై చర్చలు సాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్లతో ముచ్చటిస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ ఆసక్తికర పోస్టుతో ముందుకు వచ్చాడు. ఇటీవల మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తుచేస్తూ.. తన సినిమాలోని సీన్‌ను ఫేస్‌యాప్ సాయంతో రీక్రియేట్ చేసి రీల్ షేర్ చేశాడు. ‘‘రెస్పెక్ట్’’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేశాడు. కన్నడ అభిమానుల నుంచి ఇందుకు విశేష స్పందన లభిస్తోంది. అప్పును మీరిలా గుర్తుచేయడం మా హృదయాలను ద్రవింపజేసింది. ధన్యవాదాలు అంటూ వార్నర్‌కు థాంక్స్ చెబుతున్నారు. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ సాధించిపెట్టిన డేవిడ్ వార్నర్.. వేలంలో భాగంగా మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందా అని ఓ అభిమాని అడిగాడు. ఇందుకు స్పందించిన వార్నర్.. అది చాలా కష్టమన్నట్లుగా కామెంట్ చేశాడు. అదే సమయంలో మరో నెటిజన్.. ‘‘మరి కర్ణాటకకు ఆడతారా? అదే.. ఆర్సీబీలో చేరతారా’’ అంటూ ప్రశ్న సంధించాడు. ఇందుకు ఎమోజీలతో బదులిచ్చాడు వార్నర్. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో వార్నర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడటం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఆర్సీబీ బెంగళూరు ఫ్రాంఛైజీ విరాట్ కోహ్లి (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు)ను రిటైన్ చేసుకోగా.. సన్‌రైజర్స్ వార్నర్‌ను వదిలేసింది. మరోవైపు.. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలగడంతో వార్నర్ జట్టులోకి వస్తే అతడు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చదవండి: Ind Vs Nz 2nd Test- Virat Kohli: 62 పరుగులకే ఆలౌట్.. అయినా అందుకే టీమిండియా ఫాలో ఆన్ ఆడించలేదు! View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)
- 
      
                   
                                 PuneethRajkumar: పునీత్ పెళ్లికి 22 ఏళ్లు..సాక్షి, బెంగళూరు: నెల కిందట ఆకస్మికంగా కన్నుమూసిన ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు వివాహమై 22 ఏళ్లు పూర్తయింది. 1999 డిసెంబరు 1వ తేదీన అశ్వినిని పునీత్ ప్రేమించి పెళ్లాడారు. ఎన్నో ఆశలతో ఇద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ విధి మరోలా తలచడంతో 22వ వివాహ వార్షికోత్సవానికి పునీత్ లేరు. అల్లు శిరీష్ పరామర్శ పునీత్ అకాల మరణం శాండల్‌వుడ్‌కు తీరని లోటు అని తెలుగు నటుడు అల్లు శిరీష్ అన్నారు. బుధవారం ఆయన బెంగళూరులో పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ పునీత్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది, బెంగళూరుకు ఎప్పుడు వచ్చినా పునీత్‌ను కలిసేవాడినని అన్నారు. చదవండి: (పునీత్ మరణం ఒక ప్రశ్న: సోదరుడు రాఘవేంద్ర)
- 
      
                   
                                 పునీత్ మరణం ఒక ప్రశ్న: సోదరుడు రాఘవేంద్రసాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి అప్పుడే 30 రోజులైంది. ఆయన కుటుంబసభ్యులు సోమవారం కంఠీరవ స్టూడియలో పునీత్ సమాధికి పూజలు చేశారు. అన్న శివరాజ్‌కుమార్, భార్య గీతా, మరో అన్న రాఘవేంద్ర, పునీత్ భార్య అశ్విని తదితరులు పాల్గొన్నారు. పూజల తరువాత రాఘవేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పునీత్‌కు కార్లు, కోట్ల డబ్బులున్నప్పటికీ ఐదు నిమిషాల సమయం దొరకలేదని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. పునీత్ ఇంత త్వరగా ఎందుకు మరణించారనేది ప్రతి అభిమానికీ ఒక ప్రశ్నగా మారిందని అన్నారు. నాయండహళ్లి రోడ్డుకు పునీత్ పేరు నాయండహల్లి జంక్షన్ నుంచి బన్నేరఘట్ట రోడ్డు మెగాసిటీ మాల్ జంక్షన్ వరకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టాలని బీబీఎంపీ నిర్ణయించింది. 12 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుకు పునీత్ పేరును ఖాయం చేయనున్నారు. చదవండి: (శివన్న అని ప్రేమగా పునీత్ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్‌కుమార్)
- 
      
                   
                                 శివన్న అని ప్రేమగా పునీత్ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్కుమార్కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించిన నేటికి నెల రోజులు. ఆయన మన మధ్య లేరనే చేదు నిజాన్ని నిజాన్ని ఫ్యాన్స్, సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికీ పునీత్ సమాధికి ఆయన అమిమానులు, సన్నిహితులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న పునీత్ అన్న, హీరో శివరాజ్ కుమార్ తమ్ముడి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. చదవండి: పునీత్ చనిపోయాకే ఆ విషయం తెలిసింది, షాకయ్యా: రాజమౌళి తన చిన్న తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటా భావోద్వేగానికి లోనయ్యారు. తాను జీవించి ఉన్నంతవరకూ పునీత్ కుటుంబానికి సాయం చేస్తూనే ఉంటానని భరోసా ఇచ్చాడు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘పునీత్.. మరణాన్ని ఇప్పటికీ నేనింకా నమ్మలేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. శివన్న అని ప్రేమగా పిలుస్తున్న గొంతు వినిపిస్తోంది. నెల రోజులు ఎలా గడిచాయో కూడా అర్థం కావడం లేదు. ఈ బాధ నుంచి బయట పడేందుకు సినిమాలపై దృష్టి పెడుతున్నా. చదవండి: పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం అయినప్పటికీ ఎక్కడికి వెళ్లినా పూల దండలతో ఉన్న పునీత్ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ ఒక్కసారి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అందుకే వాటిని చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరికి మరణం అనివార్యమని తెలుసు. ఎప్పుడో ఒకసారి నా ఫొటోలు కూడా అలాగే పెడతారని కూడా తెలుసు. కానీ నాకంటే ముందు నా చిన్న తమ్ముడి ఫొటోలను అలా చూడలేకపోతున్నా. సమయంలో అన్నింటిని మర్చిపోయేలా చేస్తుందంటారు. కానీ అది చాలా అబద్ధం’ అంటూ ఆయన ఏమోషనల్ అయ్యారు.
- 
      
                   
                                 పునీత్ అభిమాని పాదయాత్రPuneeth Rajkumar Fan Walks From Mysuru To Tirupati As Tribute: మైసూరుకు చెందిన అభిమాని ఒకరు దివంగత యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని ఆగ్రహారకు చెందిన మసాజ్ సందీప్‌కు పునీత్ అంటే వీరాభిమానం. ఆయన హఠాన్మరణంతో ఆవేదనకు గురయ్యాడు. పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈనెల 19 నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
- 
      
                   
                                 పునీత్ చనిపోయాకే ఆ విషయం తెలిసింది, షాకయ్యా: రాజమౌళిDirector Rajamouli About Puneeth Rajkumar Death: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చాలా మందికి సాయం చేసినప్పటికీ ఎవ్వరికీ చెప్పలేదని, ఆయన మరణం తర్వాతే ఆయన సేవల గురించి అందరికీ తెలిసిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. తాజాగా ఆయన పునీత్ రాజ్‌కుమార్ మరణంపై స్పందిస్తూ.. తనకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. ‘ఎన్నో సేవ కార్యక్రమాలు, 1800 పేద విద్యార్థులకు ఉచిత చదువు, పదుల సంఖ్యలో అనాధాశ్రమాలు, ఓల్డేజ్ హోంలు ఏవరూ చేస్తారు ఇలా. ఇంత పెద్ద సాయం చేస్తూ ఎన్నడూ బయటకు చెప్పలేదు. ఓ సాధారణ వ్యక్తిలా కనిపించారు. చదవండి: ముగ్గురు టాలీవుడ్ హీరోలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి! పునీత్ చనిపోయాక ఆయన సేవ కార్యక్రమాల గురిచి తెలిసి షాక్ అయ్యాను. అలాంటి గొప్ప వ్యక్తి అందరి మధ్య సాధారణ మనిషిలా ఉన్నారా?’ అంటూ రాజమౌళి భావోద్యేగానికి గురయ్యారు. సాధారణంగా ఎవరైనా చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలిసేలా ప్రచారం చేసుకుంటారని, పునీత్ రాజ్‌కుమార్ మాత్రం అలా కాదని ఆయన అన్నారు. నాలుగు ఏళ్ల క్రితం తాను బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్ రాజ్‌కుమార్‌ను కలిశానని. తనను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని చెప్పారు. తనతో ఆయన సరదాగా మాట్లాడారని, ఒక స్టార్‌తో మాట్లాడుతున్నాననే భావనే తనకు కలగలేదని రాజమౌళి పేర్కొన్నారు. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ..
- 
      
                   
                                 పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్ఆర్ఆర్ టీం ఫిదాధర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ మ్యానియా దేశం మొత్తం వ్యాపించింది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘నాటు నాటు’ సాంగ్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల నవంబర్ 10న విడుదలై ఈ పాట 3 కోట్ల వీక్షణలకు చేరువైంది. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మాస్ సెప్పులు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంఉన్నాయి. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి దీంతో ఆ పాట స్పూఫ్ చేస్తూ పలువురు సోషల్ మీడియాలో వీడియోలు వదలుతున్నారు. టీవీలో వస్తున్న ఈ పాటకు ఓ బామ్మ స్టెప్పులేసిన వీడియో నెట్టింట తెగ వైరలైంది. ఇక ఈ పాటను పెద్ద తెరపై వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. చదవండి: ఆసక్తికర ఫొటో, క్యాప్షన్‌తో జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీ అప్డేట్ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత కవర్ సాంగ్స్‌తో, ఎడిటర్స్ తమ అభిమాన కథానాయకుల పాత సాంగ్స్‌తో ‘నాటు’ను రీక్రియేట్ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ డ్యాన్స్ స్టెప్పులకు నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్ను రూపొందించారు. ఈ వీడియోకి నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ టీం కూడా ఈ వీడియోకి స్పందించడం విశేషం. #ಹಳ್ಳಿನಾಟು ft PowerStar⚡@PuneethRajkumar❤️#PuneethRajkumar #KingAPPU pic.twitter.com/lOHjtOtagV — Pramod⚡ (@_PramodAppu1) November 21, 2021
- 
      
                   
                                 పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవంKannada Star Hero Darshan And Bad Experience At Puneeth Rajkumar Namana Samsmaran Sabha: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు కన్నడ సినీ పరిశ్రమ తరపున ‘పునీత్ నామన’ పేరుతో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో భారీగా ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్నడ సినీ పరిశ్రమకు సినీ ప్రముఖలు, నటీనటులతో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, హీరో విశాల్‌తో తదితరులు హాజరయ్యారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా అలాగే టాలీవుడ్ నుంచి హీరో మంచు మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారంత పునీత్‌కు నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు రావడంతో అక్కడ బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ ప్రాంగణం వెలుపల ఓ కన్నడ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురైంది. శాండల్‌వుడ్ అంతా అభిమానంగా డి బాస్ అని పిలుకునే స్టార్ హీరో దర్శన్‌ను లోపలికి వెళ్లకుండా అక్కడి పోలీసులు అడ్డగించినట్లు సమాచారం. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ టాప్ స్టార్ హీరోలలో దర్శన్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభకు దర్శన్ కొంచెం ఆలస్యంగా రావడంతో ఆయనను గేటు దగ్గర పోలీసులు ఆపినట్లు సమాచారం. ఆడిటోరియం ఫుల్ అయిపోవడంతో.. కూర్చోడానికి సీట్లు కూడా లేవని చెప్పి దర్శన్‌ను బయటే ఆపేపేశారట. తను లోపలికి వెళ్లి వెంటనే బయటికి వచ్చేస్తాని దర్శన్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదట. ఆ సమయంలో హీరో దర్శన్‌తో పాటు కొంతమంది ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారట. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన అనంతరం ఉన్నతాధికారులు వచ్చి దర్శన్‌ను లోపలికి అనుమతించారట. చదవండి: మెగాస్టార్ రిక్వెస్ట్.. సినీ పరిశ్రమలోని వారికి 50 శాతం డిస్కౌంట్ కానీ లోపలికి వెళ్లినా కూర్చోవడానికి సీట్లు లేక సెకండ్ క్లాస్‌లో కాసేపు కూర్చున్నాడు. ఇక కార్యక్రమంలో దర్శన్ స్టేజ్‌పై మాట్లాడుతూ పునీత్ హఠ్మారణం తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో కొద్దిసేపు మాత్రమే దర్శన్ మాట్లాడి స్టేజ్‌పై నుంచి వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పునీత్ బదులుగా దేవుడు తనని తీసుకేళ్లినా బాగుండంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక విశాల్ సైతం పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, ఇది తనకు అప్పగించాల్సిందిగా పునీత్ కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేశాడు.
- 
      
                   
                                 పునీత్ రాజ్ కుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్.. అప్పుకు అంకితంగాPuneeth Raj Kumar Wife Ashwini Emotional Post: కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు యాక్టివ్‌గా ఉండని ఆమె అకౌంట్ ఓపెన్ చేసి మరీ మొదటి పోస్టును పునీత్ రాజ్ కుమార్‌కు అంకితమిచ్చారు. ఆమె ఆ పోస్టులో 'శ్రీ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు, మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్‌గా ఉంది. ఆయన్ను 'పవర్ స్టార్' చేసిన అభిమానులకు పునీత్ లేని లోటు ఊహించడం కష్టమే. ఈ బాధలో మీరు మనోనిబ్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, గౌరవంగా పునీత్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. సినీ ప్రియులు మాత్రమే కాకుండా ఇండియాతో పాటు విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. అప్పు (పునీత్ రాజ్ కుమార్)ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం, మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని మీరు చేసే మంచి పనుల్లో పునీత్ జీవించే ఉంటారు. మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.' అంటూ అశ్విని కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by Ashwini Puneeth Rajkumar (@ashwinipuneeth.official) కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత నెల 29న గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అది తట్టుకోలేని 21 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఆయన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. 46 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్. వేలాది మంది అభిమానులు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. ఆయన మరణించి 20 రోజులు అవుతున్నా కర్ణాటకలో ఇప్పటికీ ఆయన పేరే వినిపిస్తోంది.
- 
      
                   
                                 Puneeth Rajkumar: తీవ్ర భావోద్వేగానికి లోనైన నటుడు శరత్‌కుమార్Sarathkumar Emotional Words About puneeth Rajkkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. పునీత్ మరణంతో కన్నడ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా మంగళవారం బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పునీత్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్నతమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్..పునీత్‌ను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది. ఇదే వేదికపై రాజకుమార మూవీ 100రోజుల వేడుక జరిగింది. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది' అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా 2017లో రాజకుమార సినిమాలో పునీత్‌కు తండ్రిగా నటించారు శరత్‌కుమార్. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావేద్వాగానికి లోనయ్యారు.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవంKarnataka CM Announce Karnataka Ratna Award To Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ నటించినవి మొత్తం 29 చిత్రాలే అయినా తన మరణాన్ని జీర్ణించుకోలేని తన అభిమానులు 21 మంది గుండెలు ఆగిపోయాయి. తన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు తనకు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. 46 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్. ఆయన మరణించి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ కర్ణాటకలో ఆయన నామస్మరణ జరుగుతుంది. ప్రతి రోజూ లక్షలాది మంది వచ్చి పునీత్ రాజ్‌కుమార్ సమాధిని దర్శించుకుంటున్నారు. అంతే కాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమ జంటలు ఆయన సమాధి దగ్గర పెళ్లి చేసుకుంటున్నారంటే కర్ణాటకలో పునీత్ పేరు ప్రఖ్యాతులు ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పునీత్ ఉన్నా లేకపోయినా తను చేస్తున్న సేవా కార్యక్రమాలు మాత్రం ఆగకూడదని కొన్నేళ్ల కిందే తన ట్రస్టులో 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. దీని తర్వాత అక్కడి ప్రజలకు పునీత్‌పై అభిమానం మరింత పెరిగింది. ఇలాంటి మంచి మనిషిని దేవుడు ఎందుకు ఇంత చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోయాడు అంటూ కన్నడిగులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం పునీత్‌కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. అత్యుత్తమ సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల అభిమానం పొందిన అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చే పురస్కారం కర్ణాటక రత్న. ఇది కన్నడిగులకు మాత్రమే ఇచ్చే పురస్కారం అని తెలుస్తుంది. అయితే దీనితో పాటు పునీత్‌కు బసవ శ్రీ బిరుదు కూడా ఇవ్వాలని అభిమానులు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. దాని గురించి కూడా ఆలోచిస్తామని ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారం.
- 
      
                   
                                 జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శివరాజ్ కుమార్పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం కేవలం పునీత్ కుటుంబ సభ్యులనే కాదు కన్నడిగులను, భారత సినీ పరిశ్రమ సైతం విషాదంలోకి నెట్టింది. ఆయన మరణించిన రోజు సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు పునీత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ మరణించ రెండు వారాలు దగ్గరపడుతున్నాయి. చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆయన అన్నయ్య, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పునీత్ అకాల మరణంతో తమ కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక పునీత్ మరణించిన రోజు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజు అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గరికి వచ్చి ‘మీకు నేను ఉన్నా అన్న’ అంటూ ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా శివరాజ్ చెప్పారు. చదవండి: Upasana: ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్‌జెండర్.. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను’ అలాగే ఎన్టీఆర్‌పై తనకు ఉన్న అనుబంధం, అభిమానంను శివ రాజ్‌కుమార్ తెలియజేశారు. కాగా ఎన్టీఆర్‌కు కన్నడ ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ కోసం ఎన్టీఆర్ ఆయన సినిమాలో ఒక పాట పాడి కన్నడిగులను తన గొంతుతో ఆకట్టుకున్నారు. ఈ పాట తర్వాత పునీత్, ఎన్టీఆర్‌ల మధ్య సన్నిహిత్యం మరింత బలపడింది. అంతేగాక ఎన్టీర్ తనకు బ్రదర్ లాంటి వాడంటూ పునీత్ గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. "నేనున్నాను అన్నా మీకు" - ఎన్.టి.ఆర్ శివరాజ్ కుమార్ @NimmaShivanna గారిని పరామర్శించిన ఎన్.టి.ఆర్@tarak9999 @PuneethRajkumar pic.twitter.com/Qijeqlagc9 — MilagRRRo Movies (@MilagroMovies) November 11, 2021
- 
      
                   
                                 పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామీజీసాక్షి, యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర బృహమఠం డాక్టర్ శివమూర్తి మురుఘా గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్‌కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మరణానంతరం ఆయనకు బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించటానికి రావాలని పునీత్ భార్య అశ్వినిని ఆహ్వానించారు. అభిమానుల అన్నదానం మైసూరు: హీరో పునీత్ రాజ్‌కుమార్ పుణ్య స్మరణగా టి.నరసిపుర తాలూకా బసవనహళ్ళిలో అభిమానులు, గ్రామస్తులు భారీఎత్తున అన్నదానం నిర్వహించారు. సుమారు 2 వేల మందికి మాంసాహారంతో కూడిన భోజనం వడ్డించారు. మంచే గౌడ అనే అభిమాని గుండు చేయించుకుని నివాళులు అర్పించారు. చదవండి: ఇతని పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు.
- 
      
                   
                                 వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించిన రాఘవేంద్ర రాజ్కుమార్బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతిని తట్టుకోలేక చెన్నపట్టణ తాలూకా ఎలేకేరి నివాసి వెంకటేశ్ (25) అన్నపానీయాలు మాని తీవ్ర కలతచెంది గతవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ బుధవారంనాడు వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వెంకటేశ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చదవండి: (పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు)
- 
      
                   
                                 పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలుRajinikanth Slammed By Puneeth Rajkumar Fans: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కన్నుమూసి 12 రోజులు గడుస్తున్నా ఆయన లేరనే చేదు నిజాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. ఆయన మరణ వార్త విని భారత సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. దీంతో శాండల్‌వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే స్టార్ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం చాలా ఆలస్యంగా పునీత్‌కు సంతాపం తెలిపారు. చదవండి: రజనీకాంత్ ఎమోషనల్.. పునీత్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నా.. అయితే దానికి కారణం లేకపోలేదు. పునీత్ మరణించిన రోజే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజే డిశ్చార్జ్ అయిన రజనీ అప్పటి నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్ మరణించిన 12 రోజుల తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా పునీత్‌కు నివాళులు అర్పించారు. అది కూడా ఆయన కూతురు, సినీ దర్శకురాలు సౌందర్య కొత్తగా ప్రారంభించిన హూట్ అనే యాప్ ద్వారా సంతాపం తెలిపారు. చదవండి: హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు పునీత్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు లేవన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను పునీత్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా నాన్నా’ అంటూ చేసిన ట్వీట్‌ను హూట్ యాప్‌లో తన ఆడియో సందేశ లింకును జత చేశారు. అయితే, ఆయన ఇచ్చిన సందేశంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హుట్ యాప్ ద్వారా ఆయన సందేశం ఇవ్వడంతో.. ఇది పునీత్ మరణానికి చలించినట్టు లేదని, తన కూతురు యాప్‌ను ప్రమోట్ చేయడానికి ఆయన మృతిని ఉపయోగించుకున్నట్టు కనిపిస్తోందంటూ పునీత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Rajini became 100% viyabaari (businessman ) — Shattia Nathan (@Shattianathan1) November 10, 2021 దీంతో ఓ అభిమాని రజనీ చేసిన ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ ‘కన్నింగ్ ఫెలో’ అంటూ విమర్శ వ్యాఖ్యలు చేశాడు. ‘మీ లాంటి గొప్ప నటులు యాప్ ప్రమోషన్ కోసం మరణ సందేశాలను ఇవ్వడం షాక్‌కు గురి చేసింది’ అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇక హూట్ యాప్‌ను సంతాపాల కోసమూ వాడుకోవచ్చన్నమాట’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు సంతాపం తెలియజేస్తున్నారా? లేదంటే యాప్‌ను ప్రమోట్ చేసుకుంటున్నారా?' అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇంత చెత్త పద్ధతిలో యాప్‌ను ప్రమోట్ చేయడం ఆపేయండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ఇంత నీచానికి దిగజారిపోతారా? అంటూ నెటిజనల్లు రజనీపై మండిపడుతున్నారు. So cunning fellow. Puneeth died ten days before now only u giving condolence words. Am ashame of your behaviour. U given speech reg daughters new project. U will get best lesson from God am sure. — Bhaskar (@baaskarnamitha) November 10, 2021 Shocked.. Legend like you should not use grievance message for App Promotion😡😡 — Wasim raja (@wasimrajam) November 10, 2021 Now condolence also in Hoote App. Ithu ungalukkey overaa illaya Sir. Or @soundaryaarajni whoever is handling this id. 🙆♂️ — Anees H (@Anees_Offl) November 10, 2021 How to get it thalaiva ? ...its a condolence or app promotion?🙂 — i m -sarju (@SarjethSs) November 10, 2021 Whoever using this id please stop promoting the app in such a worst manner.. Promoting the app through condolences is such a low for this Legend superstar @rajinikanth 😌 — Ctrl C + Ctrl V (@thalapathy_modi) November 10, 2021
- 
      
                   
                                 రజనీకాంత్ ఎమోషనల్.. పునీత్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నా..చెన్నై(తమిళనాడు): పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన మృతికి నటుడు రజనీకాంత్ కాస్త ఆలస్యంగా సంతాపం వ్యక్తం చేశారు. అందుకు కారణం లేకపోలేదు. పునీత్‌రాజ్‌కుమార్ మరణానికి ముందు రోజే రజినీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరా రు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సంతాపం తెలిపారు. దీని గురించి రజినీకాంత్ హూట్ యాప్‌లో మాట్లాడుతూ.. ‘‘నువ్వు లేవన్న విషయాన్నే జీరి్ణంచుకోలేకపోతున్నాను పునీత్.. రెస్ట్ ఇన్ పీస్ మై చైల్డ్’’ అని పేర్కొన్నారు. చదవండి: సుందర్‌పై అందరికి జాలి కలుగుతుంది: ఆనంద్ దేవరకొండ
- 
      
                   
                                 Puneeth Rajkumar: గున్నకు పునీత్ పేరుసాక్షి, శివమొగ్గ (కర్ణాటక): శివమొగ్గ తాలూకాలోని సక్రె బైలు ఏనుగుల శిబిరంలో ఇటీవల జన్మించిన బుజ్జి ఏనుగుకు పునీత్ రాజ్‌కుమార్ అని అధికారులు పేరు పెట్టారు. ప్రముఖ యువ నటుడు పునీత్ ఇటీవల కాలధర్మం చెందడం తెలిసిందే. కొన్ని నెలల క్రితం సక్రె బైలు ఏనుగుల శిబిరంలో సినిమా షూటింగ్‌కు వచ్చిన పునీత్ ఏనుగులతో సరదాగా గడిపారు. ఇందుకు గుర్తుగా గున్న ఏనుగుకు హీరో పేరును పెట్టారు.
- 
      
                   
                                 పునీత్ లేడంటే తట్టుకోలేకపోతున్నాం: శివరాజ్‌కుమార్ ఆవేదనPuneeth Rajkumar 11th Day Death Ceremony: పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 11 రోజుల పుణ్యతిథిని కుటుంబసభ్యులు నిర్వహించారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధికి సోమవారం ఉదయం భార్య అశ్విని, కూతుర్లు వందితా, ధృతి, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఇతర కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పూజలు చేశారు. పునీత్‌కు ఇష్టమైన 30 రకాల శాకాహార, మాంసాహార వంటకాలను సమాధి వద్ద ఉంచారు. సదాశివనగరలోని పునీత్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అన్నదానం చేస్తున్న శివరాజ్‌కుమార్ తమ్ముడు కాదు కొడుకు: శివ రాజ్‌కుమార్ పునీత్ లేడంటే తట్టుకోలేకపోతున్నామని అన్న శివరాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాధి వద్ద అభిమానులకు అన్నదానం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. పునీత్ తమ్ముడు కాదు, కొడుకు వంటివాడు. కొడుకు పోయాడు అని కన్నీరుపెట్టారు. పునీత్ పద్మశ్రీ కాదు.. అమరశ్రీ. అందరి మనస్సులో ఉండిపోయాడు. పునీత్ ఎక్కడికీ వెళ్లలేదు అని అన్నారు. పునీత్ తండ్రికి తగిన తనయునిగా పేరు తెచ్చుకున్నారన్నారు. అభిమానులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని మనవి చేశారు. కాగా, పునీత్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని సీఎం బొమ్మై తెలిపారు. చదవండి: (పునీత్ రాజ్‌కుమార్‌కు మొదట వైద్యం చేసిన డాక్టర్ ఇంటికి భారీ బందోబస్తు) సతీమణి అశ్విని, కూతుళ్లు తరలివచ్చిన ప్రముఖులు సీనియర్ నటి బి.సరోజదేవి, రంగాయణ రఘు, రవిశంకర్‌గౌడ, అవినాశ్, మాళవిక, దర్శకుడు హేమంత్ రావ్, సీనియర్ నటుడు దత్తణ్ణ, సీనియర్ దర్శకుడు ఓ సాయి ప్రకాశ్, చిత్రా శెణై, భగవాన్, దొడ్డణ్ణ, ఎమ్మెల్యే రోషన్ బేగ్, దునియా విజయ్‌తో పాటు వేలాదిగా అభిమానులు పునీత్ సమాధిని దర్శించుకున్నారు. చదవండి: (పునీత్ పేరుతో పాఠశాల, ఆస్పత్రి)
- 
      
                   
                                 పునీత్ పేరుతో పాఠశాల, ఆస్పత్రిసాక్షి బళ్లారి(కర్ణాటక): అద్భుత నటనతో పాటు సామాజిక సేవలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన పునీత్‌రాజ్‌కుమార్ మరణం యావత్తు కర్ణాటక ప్రజలను దుఃఖ సాగరంలో నింపిందని, ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువేనని కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన బెళగల్ క్రాస్‌లోని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమంలో పునీత్‌రాజ్‌కుమార్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బళ్లారి నగరంలో పునీత్‌రాజ్‌కుమార్ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామన్నారు. తమ సొంత నిధులతో పేదలకు ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వినయ విధేయతలకు పునీత్ మారుపేరుగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలిసోమశేఖరెడ్డి, బుడా చైర్మన్ పాలన్న, గాలిజనార్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇకపై బళ్లారిలోనే ఉంటా: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకపై బళ్లారిలోనే ఉంటానని కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను పర్మనెంటుగా బళ్లారిలోనే ఉండవచ్చునని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బళ్లారిలోనే ఉంటూ సేవా కార్యక్రమాలను చేపడుతామన్నారు. రాయల్ బస్టాండుకు పునీత్ పేరు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలిసోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పునీత్ మరణం తీరనిలోటని, పునీత్‌తో తమకు ఎంతో అవినాభవ సంబంధం ఉందని గుర్తు చేసుకొన్నారు. నగరంలోని రాయల్ బస్టాండ్‌కు పునీత్ పేరు పెడతామని అన్నారు.
- 
      
                   
                                 పునీత్ గొప్ప మనసు, సేవా కార్యక్రమాల కోసం రూ. 8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణించిన నేటికి 11 రోజులు. ఆయన మృతిని ఇప్పటికీ కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించారనే చేదు వార్తను విని తట్టుకోలేక కొంతమంది అభిమానుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతేగాక రోజు ఆయన సమాధి వద్దకు వందల, వేల సంఖ్యల్లో తరలివస్తున్నారు. ఇంతమంది ప్రేక్షకుల అభిమాన్ని పునీత్ కేవలం హీరోగా మాత్రమే గెలుచుకోలేదు. ఆయన చేపట్టిన ఎన్నో సేవ కార్యక్రమాలతో, స్టార్ హీరో అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా అందిరితో కలిసిపోవడం, తన కోసం వచ్చిన ప్రతి అభిమానిని పేరుపేరున కలిసి పలకరించే వ్యక్తిత్వంతో ఇలా పునీత్ ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. చదవండి: Puneeth Rajkumar:పునీత్ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది ఇక ఆయన మరణాంతరం పునీత్ సేవాకార్యక్రమాలకు సంబంధించిన వార్తలు వస్తుండటం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పించారు. ఆఖరికి మరణాంతరం తన రెడు కళ్లు కూడా దానం చేశారు. వీటితో పాటు మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిన పునీత్ హఠాత్తుగా లోకాన్ని విడిచి వెల్లడం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. అంతేగాక తాను ఉన్న లేకపోయిన తను చేపట్టిన సేవ కార్యక్రమాలు ఎప్పటిలాగే కొనసాగాలని పునీత్ వాటి పేరుతో 8 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారట. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! ఈ విషయం తెలిసి ఎంతో మంది ఆయన గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సమక్షంలో అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో అత్యుత్తమ పురస్కారం పునీత్ రాజ్ కుమార్‌కు మరణానంతరం లభించింది. అత్యున్నత సేవలు చేసిన వారిని కర్ణాటక ప్రభుత్వం బసవ శ్రీ పురస్కారం అందించనుంది. ఇది కేవలం కన్నడిగులకు మాత్రమే సొంతం. ఇప్పుడు ఈ అత్యుత్తమ పురస్కారం పునీత్ రాజ్‌కుమార్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. అలాగే ఆయన చేపట్టిన ఎనలేని సేవా కార్యక్రమాల దృష్ట్యా పునీత్ రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: హృదయ విదారకం: పునీత్ లేడని వాటికెలా చెప్పేది.. సమాధి వద్దకు తీసుకెళ్లి A man with golden heart 💓 45 Free Schools 26 Orphanages 16 Old age homes 19 Goshala lu 1800 Students Education 2 Eyes were Donated Finally 1 Man He is #PuneethRajkumar ❣️🙏 Miss u so much sir 😞#PuneetRajkumar @PuneethRajkumar pic.twitter.com/GT3gFhYUEJ — Gani Thor (@gani_thor) October 29, 2021
- 
      
                   
                                 హృదయ విదారకం: పునీత్ లేడని వాటికెలా చెప్పేది.. సమాధి వద్దకు తీసుకెళ్లికొంతమంది జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. వాటికి ఏమైనా అయితే ఏ మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా పెంపుడు కుక్కల విషయంలో మనుషులు అమితమైన ప్రేమ కనబరుస్తుంటారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) కూడా అంతే. ఆయనకు కుక్కలు అంటే చాలా ఇష్టం. చాలా కుక్కలను ఆయన పెంచుకున్నారు. గతంలో అనేకసార్లు తన పెంపుడు కుక్కలకు సంబంధించిన ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఆయన హఠాన్మరణంతో లక్షలాది అభిమానులతో పాటు ఆ పెంపుడు శునకాలు కన్నీంటి పర్యంతమవుతున్నాయి. అప్పు ఇక రాలేడనే విషయం తెలియక.. ఆయన ఫోటో ముందుకెళ్లి దీనంగా ఏడుస్తూ కుర్చుంటున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెంటుకుంటున్నారు. పునీత్ కనిపించకపోవడంతో అవి ఆహారం కూడా తీసుకోవడం లేదట. పునీత్ ఇక రాలేడనే విషయం వాటికి ఎలా చెప్పాలో తెలియక.. చివరికి రాజ్‌కుమార్ సమాధి వద్దకు ఆ కుక్కలను తీసుకెళ్లారు. గతేడాది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు ఆయన పెంపుడు కుక్క కూడా వారం రోజుల పాటు ఏమీ తినకుండా అనారోగ్యం పాలైంది. చివరికి వాళ్ల కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప అది ప్రాణాలతో బయట పడలేదు. మరి రాజ్‌కుమార్ శునకాలు ఎప్పుడు మాములు పరిస్థితి వస్తాయో చూడాలి.
- 
      
                   
                                 పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ..Puneet Rajkumar : అర్ధాంతరంగా నిష్క్రమించిన యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ సమాధిని అభిమానులు పెద్దసంఖ్యలో సందర్శిస్తుండడంతో బెంగళూరు కంఠీరవ స్టూడియో రద్దీగా మారింది. ఆదివారం సెలవు కావటంతో వేల సంఖ్యలో అభిమానులు దర్శించుకుని స్మరించుకొన్నారు. తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అభిమానులు కంఠీరవకు క్యూ కట్టారు. వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు అనే తేడా లేకుండా తరలివచ్చారు. సుమారు ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది. నేడు 11 రోజుల శాస్త్రం పునీత్ మరణించి సోమవారానికి 11 రోజులు అవుతుంది, ఇంటి వద్ద 11వ రోజు సంస్మరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు అన్నదానం, నేత్రదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నేత్రదానాలు ముమ్మరం పునీత్ నేత్రదానంతో స్ఫూర్తి పొందిన వందలాది మంది మరణానంతరం నేత్రాలను దానం చేస్తామని ఆస్పత్రులకు రాసి ఇస్తున్నారు. బెంగళూరు నగరంలో రోజూ రెండు వేల మంది నేత్రదానం చేయడానికి ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొంటున్నారు. ఎమ్మెల్యే రేణుకాచార్య కూడా నేత్రదానం చేస్తానని ప్రకటించారు.
- 
      
                   
                                 పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!బెంగళూరు: ఇటీవల మరణించిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం 'పద్మశ్రీ' అవార్డు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి అంటూ కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రలు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) కన్నడ సూపర్‌స్టార్ ఇటీవల అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ మాట్లాడుతూ" పునీత్ రాజ్‌కుమార్ జీవించి ఉన్నప్పుడే ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని, అయితే దురదృష్టవశాత్తు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడంతో మరణానంతరం ఇవ్వాల్సిందే. నేను అతని అభిమానినే. పునీత్‌కి నటుడిగానే కాకుండా, సమాజానికి అందించిన సేవల కోసమైన ఇవ్వాల్సిందే. పైగా అతనికి ఆ అర్హత ఉంది. అని అన్నారు. అంతేకాదు పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్ మాట్లాడుతూ.. 'పునీత్ రాజ్‌కుమార్ మానవాళికి సేవ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి, నేను సామాజిక సేవలో ఉన్నప్పుడు పల్స్ పోలియో వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మాతో కలిశాడు. ఆయనకు పద్మశ్రీని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి " అని అన్నారు. అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. పునీత్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్లో కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ... “పద్మ అవార్డులకు ఎప్పుడు, ఏ రంగాల వ్యక్తులను సిఫారసు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఏకగ్రీవ సిఫార్సు అవుతుందేమో. ఏదిఏమైన ప్రభుత్వ పరంగా అన్నీ విషయాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!)
- 
      
                   
                                 త్వరలో పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకొంటాం: గురురాజ్, గంగాబెంగళూరు: కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధిని బుధవారం నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు దర్శించుకొంటున్నారు. బళ్లారికి చెందిన గురురాజ్, గంగా అనే జంట పునీత్‌కు వీరాభిమానులు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరు శనివారం పునీత్ సమాధిని దర్శించుకున్నారు. త్వరలో ఇక్కడే పెళ్లి చేసుకొంటామని తెలిపారు. ఇందుకు శివరాజ్‌కుమార్ కూడా సమ్మతించారని చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పునీత్‌కు అభిమానులు ప్రేమను చాటుకుంటున్నారు. చామరాజనగర వద్ద జరిగిన గోరె హబ్బలో రాజ్, పునీత్‌ల చిత్రాన్ని ప్రదర్శించారు. చదవండి: (పునీత్‌కు అప్పటికే చెమటలు పట్టాయి.. అందుకే అక్కడకు వెళ్లాలని సూచించా..)
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్‌కు మొదట వైద్యం చేసిన డాక్టర్ ఇంటికి భారీ బందోబస్తుPuneeth Rajkumar Doctor Gets Police Protection: ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మృతికి వైద్యుని నిర్లక్ష్యం కారణమని కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో డా.రాజ్‌కుమార్ కుటుంబ వైద్యుడు డాక్టర్ రమణరావు నివాసం వద్ద పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. బెంగళూరు సదాశివనగరలోని రమణరావు ఇల్లు, క్లినిక్ వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి భద్రత ఏర్పాటైంది. డాక్టర్ రమణరావు నిర్లక్ష్యం కారణంతో పునీత్ కన్నుమూశారని, ఆయనను అరెస్టు చేయాలనే డిమాండుతో కొన్ని సంఘాలు ఆయన ఇంటి ముందు ధర్నాకు సిద్ధం కావడంతో ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు) చికిత్సలో లోపం లేదు: రమణరావు.. దీనిపై డా.రమణరావు ముందు నుంచి ఇస్తున్న వివరణనే ఇచ్చారు. పునీత్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. క్లినిక్‌కు వచ్చిన సమయంలో ప్రాథమిక చికిత్సలు చేశానని రమణరావు తెలిపారు. 35 ఏళ్ల నుంచి తను రాజ్‌కుమార్ కుటుంబానికి వైద్యునిగా పని చేస్తున్నట్లు చెప్పారు. పునీత్‌కు చికిత్సలో తమ వైపు నుంచి ఎలాంటి లోపం జరగలేదని అన్నారు. జిమ్ చేసిన తరువాత సుస్తిగా ఉందని గత నెల 29న ఉదయం 11.15కు పునీత్ మా క్లినిక్‌కు వచ్చారు. ఆయనకు అప్పటికే చెమటలు పట్టిన కారణంగా ఈసీజీ తీశా, గుండెపోటు వచ్చి ఉండవచ్చనే అనుమానంతో తక్షణం యాంజియోగ్రాం చేయటానికి విక్రం ఆస్పత్రికి వెళ్లాలని సూచించా. అయితే అంబులెన్స్ కోసం ఎదురు చూస్తే ఆలస్యం అవుతుందని వారి కారులోనే నాలుగైదు నిమిషాలలో ఆస్పత్రికి వెళ్లేలా చూశాం. అక్కడ చేసిన చికిత్స ఫలించలేని కారణంగా పునీత్ మృతి చెందారు. వైద్యులు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు అని పేర్కొన్నారు. చదవండి: (పునీత్‌కు ఇలా జరిగిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: రామ్‌చరణ్)
- 
      
                   
                                 పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అశ్వినిPuneeth Rajkumar Family Appeals Fans Not To End Lifes: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. గుండెపోటుతో చిన్న వయసులోనే పునీత్ హఠాన్మరణానికి గురవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేరన్న వార్త తెలిసి ఇప్పటికే సుమారు 12మంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వరుసగా అభిమానులు సూసైడ్‌కు పాల్పడుతుండటంపై పునీత్ భార్య అశ్విని స్పందించారు. 'పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఇలాంటి పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదు. అప్పు లేడన్న విషయాన్ని మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు' అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు అప్పు సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్రలు సైతం అభిమానులెవరూ అఘాయిత్యాలకు పాల్పడద్దని కోరారు. అంత్యక్రియల దృశ్యాలకు కూడా పదేపదే ప్రసారం చేయవద్దని మీడియాకు సైతం విజ్ఞప్తి చేశారు. చదవండి: పునీత్ మరణాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ ఆగ్రహం
- 
      
                   
                                 పునీత్ మరణాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ ఆగ్రహంకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కన్నుమూసి వారం రోజులు గడుస్తున్నా ఆయన లేరనే చేదు నిజాన్ని కన్నడీగులు జీర్ణించుకోలేకపోతున్నారు. వందల సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద ఆయన సమాధిని దర్శించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఆయన మరణం.. మరికొందరికి అవకాశంలా మారింది. చదవండి: కన్నీరు పెట్టిస్తున్న పునీత్ రాజ్‌కుమార్ పెయింటింగ్.. గుండెపోటుతో కారణంగా మరణించిన పునీత్ మృతిని కొందరు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకు బెంగళూరులోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌యే ఉదాహరణ. ఒకపక్క పునీత్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూనే మరోపక్క ఆయన పేరుతో సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ క్యాష్ చేసుకోవడం చూసి ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సంగతేంటంటే.. సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ అప్పు మృతికి సంతాపం తెలుపుతూ ఫ్లెక్సీ పెట్టింది. అంతేగాక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా అందరికీ గుండె, ఇతర చెకప్‌లు ఉచితంగా చేస్తామని ప్రకటించింది. చదవండి: మెగా కోడలు ఉపాసన దీపావళి వేడుకలో సమంత సందడి, ఫొటోలు వైరల్ ఇంత వరకు బాగానే ఉంది కానీ.. దాని కింద కాస్తా గమనించి చూస్తే మీరు కూడా మండిపడక తప్పదు. ఇంతకి అదేంటంటే.. ‘మా వద్దకు బీపీ. ఈసీజీ, క్రెటిన్ లైన్, కొలస్ట్రాల్ చెకప్స్ చేయించుకుంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అంటూ ప్రకటన యాడ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు, పునీత్ ఫ్యాన్స్ ఇలాంటి సమయంలో కూడా ఓ మనిషి ఇంత నీచంగా ఆలోచిస్తాడంటూ మండిపడుతున్నారు. ಎಲ್ಲದರಲ್ಲೂ ಲಾಭ ಹುಡುಕುವ ರಣಹದ್ದುಗಳು!! pic.twitter.com/g6JwxwTwMX — ಮಂಜುನಾಥ್ ಜವರನಹಳ್ಳಿ (@manjujb1) November 2, 2021
- 
      
                   
                                 కన్నీరు పెట్టిస్తున్న పునీత్ రాజ్‌కుమార్ పెయింటింగ్..కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసి వారం రోజులు గడుతున్నా ఇప్పటికి ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సమాధిని దర్శించుకు రోజు వందల్లో అభిమానులు తరలివస్తున్నారు. ఎంతో ఫిట్‌గా ఉండే అప్పు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం తీవ్రం కలచివేస్తోంది. ఆయనను తలచుకుంటూ కన్నీరుపెట్టుకుంటున్నారు. చూస్తుంటే దీని నుంచి కన్నడ పరిశ్రమ కానీ, అభిమానులు కానీ ఇప్పడే బయట పడేలా కనిపించడం లేదు. చదవండి: పునీత్ సమాధి వద్ద కన్నీటి పర్యంతరమైన హీరో ఆయన మరణ వార్త ఒక్క శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు భారత సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా పునీత్ అభిమాని వేసిన ఓ పెయింటింగ్ ప్రతి ఒక్కరిని హత్తుకుంటోంది. కరణ్ ఆచార్య అనే ఓ వ్యక్తి గీసిన ఈ పెయింటింగ్‌లో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ స్వర్గంలో కూర్చొని ఉండగా.. ఆయన వెనక నుంచి వెళ్లిన పునీత్ కళ్లు మూసి తండ్రిని సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రం చూడగానే అందరి కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లుతున్నాయి. ఇందులో వారిద్దరిని చూసి అభిమానులంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ చిత్రంపై తమదైన శైలిలో స్పందిస్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు!
- 
      
                   
                                 పునీత్ సమాధి వద్ద కన్నీటి పర్యంతరమైన హీరోకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గత శుక్రవారం(అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు భారత సినీ, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన పలువురు అగ్ర హీరోలంతా పాల్గొన్నారు. అయితే తమిళ పరిశ్రమ నుంచి ఒక్క శరత్ కుమార్ మాత్రమే ఆయన అంత్యక్రియలకు హజరయ్యారు. ఈ నేపథ్యంలో నేడు పునీత్ సమాధిని హీరో సూర్య సందర్శించారు. అనంతరం ఆయన కటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! కాగా పునీత్ సమాధి దగ్గర ఆయనకు నివాళులు అర్పించిన సూర్య. కన్నీటీ పర్యంతరం అయ్యారు. పునీత్ ఇక మన మధ్యలేరనే చేదు నిజాన్ని తలచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాయల్ దేవ్‌రాజ్ అనే నటుడు ట్విటర్ ద్వారా పంచుకున్నారు. అయితే ఆయన అంత్యక్రియలకు రాలేని నటీనటులంతా ఆ తర్వాత స్వయంగా పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాగార్జున్, మెగా హీరో రామ్ చరణ్‌లతో పాటు పలువురు నటులు బెంగళూరులోని ఆయన నివాసానికి వచ్చి పునీత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. ఇక పలు కారణాల చేత అంత్యక్రియలకు రాలేకపోయిన సూర్య కూడా శుక్రవారం వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. చదవండి: Puneeth Rajkumar: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున #Suriya paid his respects to Late #PuneethRajkumar at Bengaluru#ripPuneethrajkumar @Suriya_offl pic.twitter.com/oEx3lvCt8v — Actor Kayal Devaraj (@kayaldevaraj) November 5, 2021
- 
      
                   
                                 పునీత్‌కు ఇలా జరిగిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: రామ్చరణ్సాక్షి, బెంగళూరు: పునీత్ రాజ్‌కుమార్ మరణించిన విషయాన్ని నమ్మలేకపోతున్నానని రామ్‌చరణ్ అన్నారు. బుధవారం బెంగళూరు సదాశివనగర్‌లోని పునీత్ రాజ్‌కుమార్ నివాసంలో భార్య అశ్విని, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, పునీత్‌కు నివాళులర్పించారు. అనంతరం రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. 'పునీత్ మా కుటుంబ సభ్యుల్లో ఒకరు. పునీత్ మరణంతో తన సోదరుడిని కోల్పోయిన బాధ కలిగింది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. దేవుడు అంత త్వరగా తీసుకెళ్లడం ఆవేదన కలిగిస్తోంది. ఆయనకు ఇలా జరిగిందన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. మాటలు రావట్లేదు. చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు) పునీత్ చాలా నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉంది. పునీత్ మా ఇంటికొస్తే ఆయన ముందు మేము గెస్ట్‌లాగా పీలయ్యేలా చేస్తారు. గతంలో శివరాజ్‌కుమార్ కూతురు వివాహానికి ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి శివన్నతో కలిసి పునీత్ హైదరాబాద్‌లో మా ఇంటికి వచ్చారని ఈ సందర్భంగా రామ్‌చరణ్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఇండస్ట్రీకి, సొసైటీకి చాలా చేశారు. వీ లవ్ యూ పునీత్, వీ మిస్ యూ పునీత్ అంటూ రామ్‌చరణ్ భావోద్వేగానికి గురయ్యారు. భగవంతుడు వారి కుటుంబ సభ్యలకు, అభిమానులకు తగినంత శక్తినివ్వాలని రామ్‌చరణ్ ఆకాంక్షించారు.
- 
      
                   
                                 Puneeth Rajkumar: పునీత్ అభిమాని ఆత్మహత్యసాక్షి, బళ్లారి: పవర్ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక దావణగెరె నగరంలోని విజయనగర కాలనీకి చెందిన సీ.కుమార్ (25) అనే యువకుడు బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ రాజకుమార్ అంటే ఇష్టపడేవాడని, పునీత్ నటించిన ప్రతి సినిమాను వీక్షించేవాడని, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పునీత్‌కు నివాళి రాయచూరురూరల్: కర్ణాటక విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రముఖులు, నాయకులు కేపీటీసీఎల్ భవనంలో బుధవారం పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అధ్యక్షుడు గోపి తదితరులు పాల్గొన్నారు. చదవండి: (కంఠీరవకు.. అభిమాన సంద్రం)
- 
      
                   
                                 కంఠీరవకు.. అభిమాన సంద్రంసాక్షి, బెంగళూరు: కంఠీరవ స్టూడియోలో హీరో పునీత్ రాజ్‌కుమార్ సమాధిని పెద్దసంఖ్యలో అభిమానులు సందర్శిస్తున్నారు. మంగళవారం పాలశాస్త్రం పూజలు ముగియడంతో బుధవారం నుంచి అనుమతించారు. విభిన్న రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తుమకూరు జిల్లా పావగడ నుంచి ఎద్దుల బండిలో కొందరు అభిమానులు వచ్చారు. వారు శివరాజ్‌కుమార్ ఇంటికి చేరుకున్నారు. పునీత్ దూరమైనప్పటికీ, అన్న శివ రాజ్కుమార్నే పునీత్‌గా భావించి అభిమానిస్తామని వారు చెప్పారు. శివరాజ్ వారిని ఆప్యాయంగా పలకరించారు. చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు) నృతం చేసిన చిన్నారులు పునీత్ సమాధిని బాల నృత్యకారులు దర్శించుకుని నృత్యాంజలి సమర్పించారు. కెంగేరి సమీపంలోని నాట్యలోక డాన్స్ గ్రూపునకు చెందిన చిన్నారులు అలా నివాళులు అర్పించారు. పునీత్ బాల డ్యాన్సర్లను ఎప్పుడూ ప్రోత్సహించేవారని అన్నారు.
- 
      
                   
                                 పునీత్ మరణంపై అవమానకర పోస్టులు, యువకుడి అరెస్ట్Bengaluru Man Arrested For Offensive Comments On Puneeth rajkumar Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. అభిమానులు ఇంకా ఈ వార్తను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక పునీత్ కుటుంబ సభ్యుల ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. శుక్రవారం(అక్టోబర్ 29) పునీత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అప్పుకు నివాళులు అర్పిస్తుంటే.. మరికొందరూ ఆకతాయిలు ఆయన మరణంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! మద్యం సీసాతో పునీత్ మరణాన్ని అపహస్యం చేస్తూ రిత్విక్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ వరుస పోస్టులు పెట్టాడు. అది గమనించిన బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషన్ కమల్ పంత్ స్పందిస్తూ.. ‘ఇప్పటికే ఓ యువకుడిని అరెస్టు చేశాం. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ట్విటర్లో వెల్లడించారు. కాగా శుక్రవారం పునీత్ గుండెపోటుతో మృతి చెందిన అనంతరం కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించిన విషయం విధితమే. చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక అలాగే నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. దీనిపై నిందితుడు మద్యం సీసాను చేతిలో పట్టుకొని ‘రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర.. ’అంటూ అవమానకర రీతిలో పోస్ట్ పెట్టాడు. దీంతో పునీత్ ఫ్యాన్స్ సదరు నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The accused has been arrested and further legal action is being taken. https://t.co/uIEHFryfUk — Kamal Pant, IPS (@CPBlr) November 1, 2021
- 
      
                   
                                 పునీత్ సమాధిని దర్శించేందుకు ఫ్యాన్స్‌కు అనుమతికన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ సమాధిని దర్శించేందుకు నేటి నుంచి అభిమానులకు అవకాశం కల్పించారు. శుక్రవారం పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మణంతో కన్నడిగులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానుల దర్శనార్థం కంఠీరవ సూడియోలో పునీత్ పార్థీవదేహన్ని ఉంచారు. కడసారి తమ అభిమాన హీరోని చూసేందుకు లక్షల్లో అభిమానులు తరలివచ్చారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! ఇక మంగళవారం పునీత్ సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పూజ అనంతరం ఆయన అన్న, హీరో శివ రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. అభిమానుల కోరిక మేరకు బుధవారం నుంచి పునీత్ సమాధి సందర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
- 
      
                   
                                 పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు!Puneeth Rajkumar Home Inside CCTV Video Goes Viral: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా దైవంలా ఆరాధించే తమ అప్పు ఇకలేరనే చేదు నిజాన్ని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ సైతం జీర్ణించుకోలేకపోతోంది. కర్ణాటకలో ఏ వీధి, ఏ షాపు చూసినా పునీత్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎంతో ఆరోగ్యంగా ఉండే అప్పును గుండెపోటు ఎలా బలి తీసుకుందంటూ అభిమానులు రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే పునీత్ మరణానంతరం ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: 50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు ఈ నేపథ్యంలో ఆయన మరణానికి ముందటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. శుక్రవారం ఒంట్లో నలతగా ఉందని భార్య అశ్వినితో కలిసి అప్పు ఆసుపత్రికి బయలుదేరిన వీడియో అంటూ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు జిమ్ చేసిన తర్వాత గుండెల్లో అసౌకర్యంగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరిన వీడియో ఇది. ఈ క్రమంలో తానే స్వయంగా కారు వరకు నడుచుకుంటూ వెళ్లారు పునీత్. ఈ వీడియోలో చాలా యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. చివరి క్షణాలు ఇవే అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోలో అప్పుని చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లితున్నాయి. గుండెలు బరువెక్కుతున్నాయి. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం డాక్టర్ దగ్గరకు కారు ఎక్కిన పునీత్ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే జీవచ్ఛవంలా మారారని తలుచుకుంటుంటే కన్నీరు ఆగడం లేదు. కాగా ఆ రోజు వారి ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీసేవరకూ ఆయన యాక్టివ్గానే ఉన్నారట. అయితే ఈసీజీ రిపోర్ట్‌లో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్ రమణారావు సూచించారు. అయితే తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని తన భార్యతో పునీత్ చెప్పారు. అనంతరం కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారట. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు పరిస్థితి చేజారిపోయింది. చదవండి: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున
- 
      
                   
                                 50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలుబెంగళూరు: పునీత్ రాజ్‌కుమార్ సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన ఇష్టపడే ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు 50 రకాల వంటకాలను సమాధిపై పెట్టి పూజలు చేశారు. భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య పాల్గొన్నారు. తమిళ నటుడు పరామర్శ: తమిళ నటుడు శివ కార్తికేయన్ మంగళవారం బెంగళూరు నాగవారలోని శివరాజ్‌కుమార్ నివాసానికి వెళ్లారు. భార్య, కూతుర్లను పరామర్శించి, కంఠీవర స్టూడియోకు వెళ్లి సమాధికి పూజలు చేశారు. నేటి నుంచి పునీత్ సమాధి దర్శనాలు బనశంకరి: బుధవారం నుంచి పునీత్ రాజ్‌కుమార్ సమాధి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. మంగళవారం పునీత్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు పాల పూజల అనంతరం పునీత్ అన్న శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ... అప్పు సమాధి దర్శనానికి బుధవారం నుంచి అభిమానులను అనుమతి ఇస్తామని తెలిపారు. చదవండి: (పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున)
- 
      
                   
                                 పునీత్ మరణం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయంబెంగళూరు(కర్ణాటక): కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ మాట్లాడుతూ.. ఇక నుంచి జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలలో ట్రైనర్లకు ప్రథమ చికిత్స, ప్రత్యేక శిక్షణపై మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపారు. జిమ్‌లో వర్కవుట్స్ సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తామని తెలిపారు. అదే విధంగా, ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తకుండా జిమ్ నిర్వాహకులు చూడాలన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె సుధాకర్, పలువురు కార్డియాలజిస్ట్‌లతో సమస్యను చర్చించి మరిన్ని మార్గదర్శకాలను జారీచేస్తామని పేర్కొన్నారు. కాగా, గత ఆదివారం 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ గుండెపోటుతో.. కన్నడ నటుడు పునీత్‌రాజ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే.
- 
      
                   
                                 పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జునకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం(అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు భారత సినీ, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికి పునీత్ మరణాన్ని అభిమానులతో పాటు నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన అగ్ర హీరోలంతా పాల్గొన్నారు. ఇక సోషల్ మీడియాలో పునీత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అక్కినేని హీరో నాగార్జున ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం పునీత్ ఇంటికి వెళ్లిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పునీత్ సోదరుడు, హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు ఆయన భార్య, పిల్లలను పరామర్శించారు. శివరాజ్‌తో కాసేపు మాట్లాడి ఓదార్చారు. కాగా ఆయన అంత్యక్రియలకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వెంకటేశ్, శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువుకు తెలుగు హీరోలు హజరైన సంగతి తెలిసిందే.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ చనిపోయింది జిమ్ వల్ల కాదు: శ్రీకాంత్Hero Srikanth Reveals Facts Behind Puneeth Rajkumar Death: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆసక్మిక మరణం అందరిని కలిచివేసింది. ఎంతో ఫిట్‌గా కనిపించే పునీత్ చిన్నవయసులోనే కన్నుమూయడం యావత్ చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తెంది. పేరుకు కన్నడ హీరో అయినా ఎన్టీఆర్, బాలకృష్ణ సహా పలువురు టాలీవుడ్ హీరోలతో పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. ఇటీవలె ఆయన తెలుగులో యువరత్న అనే సినిమాను చేశారు. తాజాగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని హీరో శ్రీకాంత్ ఎమోషనల్ అయ్యారు. చదవండి:పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్ కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జిమ్ చేయడం వల్లే ఆయన చనిపోయాడన్నది నిజం కాదు. ఆరోజు ఆయన అసలు జిమ్‌కే వెళ్లలేదు. నిజానికి ఆయన రాత్రి నుంచే అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కూడా అన్ఈజీగా ఉందని వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. పునీత్ వాళ్ల తండ్రి రాజ్‌కుమార్ కూడా గుండెపోటుతో చనిపోయారు. వాళ్ల అన్న శివరాజ్‌కుమార్‌కి కూడా గతంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. అలాగే పునీత్‌కి కూడా సడెన్ స్ట్రోక్ రావడం వల్లే మరణించారు. ఇప్పటికీ పునీత్ మన మధ్య లేడంటే నమ్మలేకపోతున్నా. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి దూరం అవడం జీర్ణించుకోలేకపోతున్నా అని పేర్కొన్నారు. కాగా పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్ర పోషించారు. చదవండి: పునీత్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా! అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత
- 
      
                   
                                 పునీత్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా!Why Tamil Heros Not Attend Puneeth Rajkumar Funerals: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం యావత్ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ హఠాన్మరణం చెందడం అందరిని కలిచివేస్తుంది. పేరుకు కన్నడ హీరో అయినా అందరితో ఎంతో సత్సంబంధాలు కొనసాగించేవారు. పునీత్ ఇకలేరని తెలిసి కన్నడ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ సహా ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. చదవండి: పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్ ఇక పునీత్ అంత్యక్రియలకు లక్షలాది అభిమానులు సహా టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అయితే కోలీవుడ్ నుంచి మాత్రం ఒక్కరు కూడా హాజరుకాలేదు. నిజానికి విశాల్, సూర్య, విజయ్ వంటి హీరోలతో పునీత్‌కి మంచి స్నేహం ఉంది. అయినా వాళ్లు కడసారి చూపుకు రాలేదు. దీనికి కారణం కావేరీ జలాల సమస్య అని తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం నడుస్తుంది. ఆ మధ్య తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు. దీంతో ఇలాంటి సమయంలో పునీత్ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురువుతాయనే ఉద్దేశంతోనే కోలీవుడ్ హీరోలు హాజరు కాలేదని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి:నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం
- 
      
                   
                                 నా చేతులతో ఎత్తుకుని ఆడించా.. ఈ బాధలు ఎవరికీ రాకూడదు: శివ రాజ్కుమార్సాక్షి, యశవంతపుర: ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణంతో ఆయన కుటుంబంతో పాటు లక్షలాది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కన్నుమూసి నాలుగురోజులు దాటింది. సోమవారం ఆయన పెద్దన్న, హీరో శివ రాజ్‌కుమార్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పునీత్ మరణం మా కుటుంబానికి తీరని శోకం. నా చేతులతో ఎత్తుకుని ఆడించా. ఈ బాధలు ఎవరికీ రాకూడదు. పునీత్‌కు పాల శాస్త్రం చేయడం ఎంతవరకు సరి అనేది అర్థం కావడం లేదన్నారు. పాలశాస్త్రం తంతు ముగియగానే అభిమానులను కంఠీరవ స్టూడియోలో సమాధి వద్దకు అనుమతించటంపై సీఎంతో చర్చిస్తాన్నారు. చదవండి: (‘పునీత్’ కళ్లు నలుగురికి చూపునిచ్చాయి) మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి పునీత్ రాజ్‌కుమార్ దేవునివంటివాడు అని ఇంటి సెక్యూరిటీ గార్డు రామచంద్రప్ప విలపించారు. ఇంత మంచి పేరు సంపాదించిన వ్యక్తిని దేవునిగా భావించాం. ఎవరైనా అభిమానులు ఇంటి వద్దకు వస్తే కసురుకోవద్దని చెప్పేవారు. మమ్మల్ని అన్నా అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఇక అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద సమాధిని చూడాలని పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు వారిని అనుమతించడం లేదు. చదవండి: (పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్) శివాజీప్రభు పరామర్శ పునీత్ కుటుంబాన్ని తమిళ సీనియర్ నటుడు శివాజీ ప్రభు సోమవారం పరామర్శించారు. తమ తండ్రి శివాజీ గణేశన్, కంఠీరవ రాజ్‌కుమార్‌లు మంచి స్నేహితులు. నేను శివరాజ్, రాఘవేంద్ర, పునీత్‌లు మంచి మిత్రులమని ఆయన చెప్పారు. పవర్ సినిమాలో పునీత్‌తో కలిసి నటించానన్నారు. పునీత్ తనను ఎప్పుడు ఆన్న అని పిలిచేవాడని తెలిపారు.
- 
      
                   
                                 మొక్కకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టిన విశాల్మాదాపూర్: తాను నాటిన మొక్కకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు నటుడు విశాల్. ఎనిమీ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, మృణాళిని రవి.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ తన స్నేహితుడు పునీత్ రాజ్‌కుమార్ గుర్తుగా మొక్కని నాటినట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో ఆయన ప్రారంభించిన ఈ చాలెంజ్ గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ఎనిమీ చిత్రబృందానికి అందజేశారు.
- 
      
                   
                                 ‘పునీత్’ కళ్లు నలుగురికి చూపునిచ్చాయియశవంతపుర (బెంగళూరు): కన్నడ పవర్ స్టార్, యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ నేత్రాలను నలుగురికి అమర్చి చూపును ప్రసాదించారు వైద్యులు. పునీత్ శుక్రవారం గుండె వైఫల్యంతో బెంగళూరులో కన్ను మూసిన విషయం విదితమే. పునీత్ దేహం నుంచి కళ్లను ఆ రోజే నారాయణ నేత్రాలయ వైద్యులు సేకరించారు. ఆ కళ్లను శనివారం నలుగురు యువతకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు. సోమవారం ఆయన వైద్య బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా రెండు కళ్లను ఇద్దరికే అమర్చుతామని, కానీ పునీత్ కళ్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొరగా రెండు భాగాలుగా విభజించామని తెలిపారు. వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వివరించారు. కొత్త కంటిని శరీరం తిరస్కరించే ప్రమాదాన్ని ఇది బాగా తగ్గిస్తుందని కూడా తెలిపారు. వాడకుండా మిగిలిపోయిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్‌లో కంటి మూల కణాలను ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఎవరికైనా ప్రమాదాల్లో తెల్ల గుడ్డుకు గాయాలైతే ఆ కణాల ద్వారా చికిత్స చేయవచ్చన్నారు. రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులు, వారి తనయుడు పునీత్ కళ్లను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు.
- 
      
                   
                                 సౌత్ ఇండియాలోనే ఏ హీరోకి లేని సక్సెస్ గ్రాఫ్ పునీత్ సొంతంబెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు సౌత్ ఇండియాలోనే ఏ సినిమా హీరోకి లేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన నటించిన 29 చిత్రాలలో అత్యదికం హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లే అత్యధికం. పునీత్ రాజ్‌కుమార్ కెరీర్లో కెవలం 4 సినిమాలు మాత్రమే నిరాశను కలిగించాయి. ఇలా పునీత్ రాజ్‌కుమార్ కెరీర్ ఆరంభంలో వరుసగా 11 చిత్రాలు సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లే కావడం విశేషం. ఆ రికార్డ్స్ సౌత్ ఇండియాలో ఏ ఇతర హీరోకు లేదనే చెప్పాలి. అయితే ఆయన విజయంలో మన తెలుగు వాళ్ళ పాత్రే ఎక్కువ. పునీత్ మొదని సినిమా నుంచి పవర్ స్టార్ బిరుదు వరకు తెలుగు సినిమా దర్శకులు, రచయితల పాత్ర ఉండటం విశేషం. తన తండ్రి స్వర్గీయ రాజ్‌కుమార్ కోరిక మేరకు మొదటి సినిమా పూరీ జగన్నాద్ దర్శకత్వంలో నటించాడు. పూరీ దర్శకత్వంలో 'అప్పు' చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు పునీత్. ఆ సినిమా రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాకు మాత్రుక కావడం గమనార్హం. మొత్తంగా పునీత్ రాజ్‌కుమార్ నటించిన 29 చిత్రాలలో 6 బ్లాక్‌బస్టర్ హిట్లు కాగా 15 సూపర్ హిట్లు, అలాగే 5 సినిమాలు ఏవరేజ్ గానూ కెవలం 4 సినిమాలు మాత్రమే ప్లాప్‌గా నిలిచాయి. ఇలా తన కెరీర్లో 87% సక్సెస్ గ్రాఫ్ పునీత్ రాజ్‌కుమార్ సొంతం. తన నటన, డ్యాన్స్‌లతో లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన కన్నడ పవర్ స్టార్ ఇప్పుడు తమ మద్య లేక పోవడంతో తన అభిమానులతో పాటు యావత్ సినీ లోకం శోక సంద్రంలో మునిగి పోయింది.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయంPuneeth Rajkumar Last Movie James: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నడిగులు ఆరాధ్యదైవంలా అభిమానించే పునీత్ ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఇదిలా ఉంటే పునీత్ హఠాన్మరణంతో ఆయన చివరిగా సంతకం చేసిన రెండు సినిమాలు ప్రశ్నార్థకంగా మారాయి. చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’! మరణించే సమయానికి ఆయన నటిస్తున్న ‘జేమ్స్’ షూటింగ్ చివరి దశకు చేరుకోగా..మరో చిత్రం ద్విత్వ డిసెంబర్లో సెట్స్‌పైకి వచ్చేందుకు రెడీ అవుతోందట. దాదాపు 60 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న జేమ్స్ మూవీలో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నారు. దీని కోసమే ఆయన జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుతో ఆయన మరణించారు. ఇక జేమ్స్ మూవీ ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. ఆయన మృతి చెందడంతో సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ మూవీకి సంబంధించి పునీత్ యాక్షన్ పార్ట్ పూర్తయిందట. అలాగే షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి కావడంతో ఈ సినిమాను అభిమానుల కోసం వచ్చే ఏడాది ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చదవండి: పునీత్ రాజ్‌కుమార్: మళ్లీ ఇలా వస్తే ఎంత బాగుండో.. అంతా బాగానే ఉన్న ఆయన వాయిస్ డబ్బింగ్ దగ్గరే అసలు చిక్కొచ్చి పడిందట. పునీత్ వాయిస్ కాకుండా వేరే వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిస్తే.. అభిమానుల్లో అసంతృప్తి నెలకొంటుంది. అందుకే ఫ్యాన్స్‌ను నొప్పించకుండా పునీత్ వాయిస్‌తోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు అధునాత టెక్నాలజీ ఉపయోగించబోతున్నారట చిత్ర బృందం. ఇందుకోసం ముంబైకి చెందిన ఓ ఐటీ కంపెనీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్కాలజీతో ‘జేమ్స్’ షూటింగ్ సమయంలో పునీత్ రాజ్‌కుమార్ చెప్పిన డైలాగ్స్ క్వాలిటీ పెంచి విజువల్స్‌కు సింక్ చేసే ప్రయత్నం చేయబోతున్నారని సమాచారం. 2022 మార్చి 17న పునీత్ పుట్టినరోజు వరకు జేమ్స్ మూవీ పూర్తి చేసి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
- 
  
      పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకి కారణాలు వివరించిన కమెడియన్ డా.భద్రం
- 
      
                   
                                 పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్Vishal To Continue Puneeth Rajkumars Charity Work: పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని హీరో విశాల్ అన్నారు. ఆయన నటుడిగానే కాకుండా చాలా మంచి మనిషి అని తెలిపారు. ఎనిమి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పునీత్‌కు నివాళులు అర్పించిన అనంతరం విశాల్ మాట్లాడారు. 'పునీత్ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి తీరని లోటు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. చివరికి తన కళ్లు కూడా దానం చేశారు. ఆయన చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను. ఒక స్నేహితుడిగా పునీత్ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తానని మాటిస్తున్నాను అని విశాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విశాల్ గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విశాల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఆర్య మాట్లాడుతూ.. ‘పునీత్ సర్ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం తీరని లోటు. మిస్ యూ సర్’ అంటూ ఎమోషన్ అయ్యారు. కాగా విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన ‘ఎనిమి’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా?
- 
      
                   
                                 పెళ్లి మండపంలోనే పునీత్‌కు నివాళి అర్పించిన కొత్తజంటNewly Married Couple Pays Tributes To Puneeth Rajkumar At Mysore: కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించి అభిమానాన్ని చాటుకున్నారు. మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట వివాహం జరిగింది. మూడుముళ్ల సంబరమయ్యాక అక్కడే పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అతిథులు నూతన జంటని ఆశీర్వదించడంతో పాటు పునీత్‌కు శ్రద్దాంజలి ఘటించారు. అందరిలోనూ పెళ్లి సంతోషం కంటే పునీత్ దూరమయ్యాడన్న బాధ వ్యక్తమైంది.చదవండి: నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? పునీత్ అభిమాని ఆత్మహత్య మైసూరు: పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తట్టుకోలేక ఒక అభిమాని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం మైసూరు జిల్లాలోని కేఆర్ నగర పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుడైన అశోక్ (40) పునీత్ లేడన్న నిజాన్ని భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు
- 
      
                   
                                 పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్News Reader Cries While Reading Puneeth Rajkumar Death News: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. కన్నడిగులు ఆరాధ్యదైవంలా అభిమానించే పునీత్.. 46ఏళ్ల వయసులోనే చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మరణం తీవ్రంగా కలివేస్తుంది. చదవండి: నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? ఈ క్రమంలో పునీత్ మరణవార్తకు సంబంధించి న్యూస్ చదువుతూ ఓ యాంకర్ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చదువుతూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. వార్తను చదువుతూ బోరున ఏడ్చేసింది. కొద్ది సేపటి వరకు అలానే ఏడుస్తూ కనిపించింది. కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ న్యూస్‌ను కంటిన్యూ చేసింది. ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్ కావడంతోపునీత్ అభిమానులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై.. అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు
- 
      
                   
                                 నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా?List Of Kannada Star Heroes Who Died At Young Age: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ అకాల మరణాన్ని అభిమానులు సహా సినీ ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో నెంబర్1 హీరోలుగా ఉన్నవారు ఇలా అకాల మరణం చెందడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ పలువురు కన్నడ స్టార్ హీరోలు హఠాన్మరణం చెందారు. ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ విషయంలోనే ఇదే జరిగింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్29న గుండెపోటుతో మరణించారు. జిమ్ చేస్తుండగా తీవ్రమైన అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్ హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా 2020 జూన్7న గుండెపోటుతో కన్నుమూశారు. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే 39ఏళ్ల వయసులో ఆయన మరణించారు. చనిపోయే సమయానికి చిరంజీవి సర్జా చేతిలో సుమారు మూడు సినిమాలు ఉన్నాయి. ఈయన యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 2018లో ప్రముఖ నటి మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్న చిరంజీవి సర్జా..పెళ్లైన రెండేళ్లకే మేఘనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2009లో కన్నడ మెగాస్టార్ విష్ణువర్ధన్ 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. చనిపోయే సమయానికి ఆయన అగ్ర హీరో. 200కు పైగా సినిమ్లాల్లో నటించాడు. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ తర్వాత అంతటి స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. అయితే ఆయన కూడా పునీత్ మాదిరిగానే గుండోపోటుతో మరణించాడు. ఇక 1990లో శంకర్ నాగ్ అనే స్టార్ హీరో కూడా కేవలం 35 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి కన్నడలో స్టార్ హీరో. వరుస విజయాలతో చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. శంకర్ నాగ్ చనిపోయిన 4 ఏళ్ల వరకు ఆయన నటించిన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయంటే అతడి స్టార్ స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో శంకర్ నాగ్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం. ఒక సినిమా షూటింగ్లో భాగంగా కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు ఆయన. స్టేజ్ నటుడి నుంచి సినిమా నటుడిగా ఎదిగిన విజయ్ సంచారి. కన్నడ సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో సైతం నటించిన సంచారి విజయ్ 2021 జూన్ 15న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శాండల్‌వుడ్ చార్మింగ్ హీరో సునీల్ 1994 జులై 24న బాగల్కోట్ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సమయంలో ఆయన వయస్సు 30 సంవత్సరాలు. చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన సునీల్ మరణం అభిమానులను షాక్‌కి గురిచేసింది.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై..CM Bommai Kisses Puneeth Rajkumar Forehead At Last Rites: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, సిద్దరామయ్యలతో పాటు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. పునీత్ చివరిచూపు కోసం లక్షలాది మంది అభిమానులు కంఠీరవ స్టూడియానికి తరలివచ్చారు. ఆశ్రునయనాల మధ్య పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. చదవండి: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు అంత్యక్రియలు నిర్వహించే ముందు సీఎం బొమ్మై..పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు అలా నిల్చుండిపోయారు. మరోసారి తల నిమురుతూ తీవ్ర భావేద్వోగానికి లోనయ్యారు. పునీత్ నుదిటిపై సీఎం బొమ్మై ముద్దుపెట్టిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పునీత్ అంటే బొమ్మైకి ఎంత అభిమానమో ఈ ఒక్క ఫోటో చూస్తుంటే అర్థం అవుతుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి:పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. ఇక కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియానికి తరలివచ్చారు. కాగా పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే. చదవండి: పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య!
- 
      
                   
                                 పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీAllu Arjun And Vijay Devarakonda About Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సంతాపం వ్యక్తం చేశారు. పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పునీత్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన మా ఇంటికి వచ్చేవారు. కలిసి భోజనం చేసేవాళ్లం. నేను బెంగళూరుకు వెళ్లినప్పుడు కలిసేవాళ్లం. ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం. ఓ డ్యాన్స్ కార్యక్రమానికి ఇద్దరం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఎప్పుడు కలిసినా బెంగళూరు రమ్మనేవారు. అలాంటిది అకస్మాత్తుగా ఆయన లేరనే వార్త తెలిసి షాక్‌కి గురయ్యాను. పునీత్ గొప్ప వ్యక్తి అని, ఆయన చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని తెలిపారు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..కొన్నాళ్ల క్రితం ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లి తనతో రెండు, మూడు గంటలు మాట్లాడాను. ఆయన అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం కలిచివేసింది. ఏదో ఒకరోజు ఈ లోకం నుంచి మనం వెళ్లిపోతాం. ఉన్నంతకాలం కలిసి పనిచేద్దాం. సంతోషంగా ఉందాం. ప్రేమిద్దాం..ఇతరకులకు మద్ధతుగా నిలుద్దాం అని విజయ్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి
- 
      
                   
                                 అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలుPuneeth Rajkumars Last Rites At Kanteerava Studios:కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి.అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ అన్న రాఘవేంద్ర కుమారుడు వినయ్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో రాఘవేంద్ర చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. కంఠీరవ రాజ్‌కుమార్‌కు మొత్తం ముగ్గురు కుమారులు. వారిలో పునీత్ చిన్నవాడు. శివరాజ్ కుమార్ పెద్దకొడుకు కాగా, రాఘవేంద్ర రెండోవాడు. ఆయన కుమారుడే వినయ్ రాజ్‌కుమార్. అతని చేతుల మీదుగా పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్ హీరోగా ఎదగడానికి కూడా పునీత్ ఎంతో సహాయపడ్డారు. కర్ణాటక సీఎం సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు..
- 
  
      తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు..
- 
      
                   
                                 తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు..Puneeth Rajkumar Funeral: అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం సహా అనేక మంది ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు బరువెక్కిన గుండెలతో పునీత్ కడసారి వీడ్కోలు పలికారు. చదవండి: (Puneeth Rajkumar: ధృతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు) కాగా, కోట్లాది మంది ఆత్మీయ బంధువు, విలక్షణ నటుడు, కన్నడ సినీ పరిశ్రమ ముద్దుబిడ్డ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన ఇకలేరనే విషయం తెలుసుకున్న ప్రజలు కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో తరలివచ్చారు. పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్: మళ్లీ ఇలా వస్తే ఎంత బాగుండో..బెంగళూరు: కన్నర పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులతో పాటు సామన్యులు, సినీ, రాజకీయ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దక్షిణాది, బాలీవుడ్ సినీ ప్రముఖులు పునీత్ మృతికి సంతాపం తెలిపారు. పునీత్‌ని చివరి సారిగా చూసేందుకు వస్తున్న అభిమానులతో కంఠీరవ స్టేడియం జనసంద్రాన్ని తలపిస్తుంది. పునీత్ రాజ్‌కుమార్ స్టార్ హీరో అయినప్పటికి ఆయనలో ఆ గర్వం ఇసుమంత కూడా ఉండేది కాదు. అందరితో కలిసి పోయేవారు. ఇక ఆయన ఉదార మనస్తత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా కన్నా కూడా మంచి మనిషిగా ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్నారు పునీత్. (చదవండి: Puneeth Rajkumar: ధృతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు) ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్‌ది. ఇక అభిమానులు, తన కో స్టార్స్‌కి సర్ప్రైజ్ ఇవ్వడంలో ముందుంటారు పునీత్. ఆయన మరణం తర్వాత పునీత్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా ఓ వీడియో జనాలను కదిలిస్తోంది. దీనిలో ఉన్నట్లే పునీత్ మళ్లీ తిరిగి వస్తే ఎంత బాగుండు అని కోరుకుంటున్నారు అభిమానులు. (చదవండి: Puneeth Rajkumar: చివరి క్షణాల్లో ఏం జరిగింది? వైద్యులు ఏం చెప్పారు?) ఈ వీడియోలో కొందరు అభిమానులు పునీత్ గురించి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో పునీత్ అక్కడకు వచ్చి వారి వెనక నిల్చుని.. సర్ప్రైజ్ ఇస్తాడు. ఈ వీడియోని కేంద్ర మంత్రి పీసీ మోహన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్ ఆప్యాయత స్వభావం అన్ని జనరేషన్ల వారికి ఆయనను దగ్గర చేసింది. ఆయన నిజాయతీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. Puneeth Rajkumar’s affable nature endeared him to people across generations. His genuineness will stay in our hearts forever.#PuneethRajkumar #Appu Video Credits: @hombalefilms pic.twitter.com/RLWwwCijAr — P C Mohan (@PCMohanMP) October 29, 2021 చదవండి: పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే..
- 
      
                   
                                 Puneeth Rajkumar: ధృతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదుబెంగళూరు: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. అభిమానులు ఇంకా ఈ వార్తను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక పునీత్ కుటుంబ సభ్యుల ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందారు పునీత్ రాజ్‌కుమార్. కుటుంబ సభ్యుల్లో కొందరు.. ముఖ్యంగా కుమార్తె ధృతి విదేశాల్లో ఉండటం.. ఆమె ఇంకా భారత్ చేరుకోకపోవడంతో పునీత్ అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న పునీత్ కుమార్తె ధృతి శనివారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి సరాసరి కంఠీరవ స్టేడియానికి చేరుకున్న ధృతి.. తండ్రి పార్థీవదేహాన్ని చూసి కన్నీరుపెట్టుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. (చదవండి: పోటెత్తిన అభిమానులు : శోకసంద్రమైన బెంగళూరు ) చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: Puneeth Rajkumar: ఆ ఇష్టమే రాజ్‌కుమార్‌కు కంటకంగా మారిందా?
- 
  
      తండ్రిని చూసి కన్నీటిపర్యంతమైన ధృతి
- 
            
                                     
                                                             పునీత్ భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళులు
- 
      
                   
                                 ఆ కల నెరవేరకుండానే కన్నుమూసిన పునీత్Puneeth Rajkumar Last Wish: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆయన అభిమానులనే కాదు, సౌత్ ఇండియా సెలబ్రిటీలను సైతం షాక్‌కు గురి చేసింది. ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా పునీత్ శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే! ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన దర్శకుడు మెహర్ రమేశ్.. పునీత్ తన చిరకాల కల నెరవేరకుండానే కన్నుమూశారన్నారు. 'పునీత్ నాకు లైఫ్ ఇచ్చిన హీరో. ఆయన హీరోగా నటించిన 'వీర కన్నడిగ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాను. తర్వాత ఆయనతో మరో సినిమా కూడా చేశాను. నన్ను ఇంటిసభ్యుడిలా చూసుకునేవాడు. 'భోళా శంకర్' సినిమా ప్రకటించినప్పుడు పునీత్ నాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలన్నది తన కోరిక అని, ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వమని కోరారు. అది కుదరకపోతే కనీసం ఏదైనా ఒక పాటలో మెగాస్టార్‌తో కలిసి చిన్న స్టెప్పు వేస్తానని అడిగారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది' అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
- 
  
      చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి
- 
      
                   
                                 చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవిPuneeth Rajkumar Funerals : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. చిన్న వయసులోనే పునీత్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్ అన్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించిన ఎన్టీఆర్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించారు. వీరితో పాటు శ్రీకాంత్, అలీ కూడా పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ మరణం తీరని లోటన్న శ్రీకాంత్.. ఆయన కటుంబసభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. మరోవైపు పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి రాజ్‌కుమార్ బెంగళూరుకు చేరుకుంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు పునీత్ అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య! పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే..
- 
      
                   
                                 జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన 46ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అందర్నీ షాక్‌కి గురిచేస్తుంది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ నేపథ్యంలోప పునీత్ ప్రొడక్షన్ వెంచర్ ఫ్రెంచ్ బిరియానీలో నటించిన హాస్యనటుడు డానిష్ సైత్, ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా తన "గురువు" అయిన పునీత్ మరణానికి సంతాపం తెలిపారు. అంతేకాదు డానిష్ సైత్ ట్విట్టర్లో " నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ప్రపంచంలోనే అత్యత్తుమమైన వ్యక్తి పునీత్ అన్న ఇక లేరు. నేను ఒకసారి అడిగాను అన్న మీరే స్వంతంగా సినిమాలు తీయోచ్చు కదా ఎందుకు మా మీద డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకుంటారు. మరో తరాన్ని తీసుకురావలంటే చాలా సమయం పడుతుంది అందువల్ల ఒక తరం ఇంకోతరం కోసం కాస్త రిస్క్ తీసుకోవడానికి ముందుకి రావాలి. అంతేకాదు మా ప్రేక్షక్షులు ఎల్లప్పుడూ వినోదభరితంగా ఉండాలి అని తన గురువు పునీత్ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. పైగా పునీత్ అన్నఒకసారి అమెజాన్ ఈవెంట్‌కి జెఫ్ బెజోస్‌తో కలిసి హాజరయ్యారు. ఇది చలనచిత్ర తారల సమూహంతో జరిగిన ఈవెంట్. ఈ ఈవెంట్లో అందరూ జెఫ్ బెజోస్‌తో కలిసి ఫోటోలు తీసుకుంటుంటే అన్నమాత్రం అందరికంటే భిన్నంగా దూరంగా నిలుచుని ఉన్నాడు. దీంతో అమెజాన్ బృదం ఎందుకు మీరు దూరంగా ఉన్నారు రండి ఇలా, మీరు ఎవరినైనా కలవాలనుకుంటున్నారా అని అడిగారు. దానికి అన్న నేను పంకజ్ త్రిపాఠిని కలవాలనుకుంటున్నా అన్నారు. నిజానికి పంకజ్ త్రిపాఠి అనే పేరు ఇప్పుడు చిత్రపరిశ్రమలో సుపరిచితమైన పేరు గానీ 2012లో గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌లో అద్భుతమైన పాత్ర లభించడానికి ముందు చాలా సంవత్సరాలు నటుడిగా రాణించడానికి చాలా కష్టపడ్డాడు. నా అన్న ఎప్పుడూ ప్రతిభకే మొదటి ప్రాధాన్య త ఇస్తాడు." అని భావోద్వేగంగా ట్వీట్ చేశారు. (చదవండి: కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి!)
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలుసాక్షి, బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన అప్పూ పార్ధివ దేహాన్ని దర్శించుకున్న పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక విషయాన్ని ప్రకటించారు. కర్ణాటక పర్యాటకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను,యాప్‌ను విడుదల చేయమని కోరుతూ గురువారం పునీత్ తనను కలిసారని తెలిపారు. నవంబరు ఒకటిన ఈ యాప్‌ను లాంచ్ చేయాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకుండా పోయారంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా షాకింగ్‌గా ఉంది. ఆయన మరణం తమతోపాటు, సినీ రంగానికి, ముఖ్యంగా యువతకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్‌కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్త్నుట్లు ఆయన ప్రకటించారు. (Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు) కాగా శుక్రవారం తమిళనాడులోని గాజనూరులో పునీత్ రాజ్‌కుమార్ పర్యటించాల్సి ఉంది. దీంతో ఆయన అభిమానులు పునీత్‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అప్పూ ఇక లేడన్న వార్త వారిని శోకసంద్రంలో ముంచేసింది. మరోవైపు పునీత్ భౌతిక కాయాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచి కడసారి దర్శించు కునేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో పునీత్‌కు తుది నివాళులర్పించేందుకు అభిమాన జనం వేలాదిగా తరలివచ్చారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) On Thursday, he (#PuneethRajkumar) had asked me to release a website regarding Karnataka tourism. I would have launched his app on Nov 1 but he's not between us. It is so shocking. State, cinema, and youths will miss him: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/TfLOCrT4Am — ANI (@ANI) October 30, 2021 Karnataka CM Basavaraj Bommai announces postponement of actor Puneeth Rajkumar’s funeral to Sunday, 31 October. Postponement taking into consideration the sentiment of fans who are still flocking in to pay homage. @TheQuint pic.twitter.com/eSKpHu5xEU — Nikhila Henry (@NikhilaHenry) October 30, 2021
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని అభిమాని ఆత్మహత్య!Puneeth Rajkumar Fan Dies by Suicide: పునీత్ రాజ్‌కుమార్ విషాదం చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. అతి తక్కువ కాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం విస్మయానికి గురిచేస్తుంది. పునీత్ మరణంతో ఫ్యాన్స్ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తమ అభిమాన హీరో ఇక లేరన్న విషయం తెలిసి పునీత్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ అభిమాని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బెళగావి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పునీత్ మరణవార్త విని ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయినట్లు సమాచారం. పునీత్ మరణవార్త విని ఓ అభిమాని గుండెపోటుతో మరణించారు. కర్ణాటకకు చెందిన మునియప్పన్ అనే 30 ఏళ్ల వ్యక్తి పునీత్ మరణవార్త విని కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఉడిపి జిల్లా సాలిగగ్రామానికి చెందిన మరో అభిమాని సతీష్(35)సైతం పునీత్ మరణవార్త విని గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.పునీత్ మరణవార్తకు సంబంధించి టీవీలో దృశ్యాలు చూసి నిరంతరంగా ఏడుస్తూనే ఉన్నాడట. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే..Puneeth Rajkumar Called As Power Star: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన 46ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అందరిని షాక్‌కి గురిచేస్తుంది. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడం విస్మయానికి గురిచేస్తుంది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావేద్వేగానికి లోనయ్యారు. ఇక ప్రతి హీరోకు తమ అభిమానులు ఓ బిరుదు ఇస్తుంటారు. అలా పునీత్ రాజ్‌కుమార్‌ను కన్నడ నాట పవర్ స్టార్ అంటారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన కన్నడిగుల మనసు గెలుచుకున్నాడు పునీత్ రాజ్‌కుమార్. ఇతర నటీనటుల పట్ల గౌరవం, అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండటం ఆయన్ను పప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. తన ఇంటికి వచ్చిన ఏ అబిమానిని ఆయన నిరాశతో పంపరని కన్నడ నాట పేరుంది. ఇక పునీత్ నటించిన సినిమాల్లో ఎక్కువగా వంద రోజులకు పైగా ఆడాయంటే ఆయన క్రేజ్ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఈ స్టామినానే ఆయనకు పవర్‌స్టార్ అనే బిరుదు వచ్చేలా చేసింది. ఓ సందర్భంలో తన పేరు ముందున్న పవర్‌స్టార్ బిరుదు గురించి మాట్లాడుతూ.. అభిమానులే తనకు ఈ బిరుదు ఇచ్చారని, వాళ్లే నా పవర్ అని చెప్పుకొచ్చారు. చదవండి: పునీత్ అంత్యక్రియలకు హాజరు కానున్న ఎన్టీఆర్ పునీత్‌ను అలా చూసి బాలయ్య కంటతడి..వీడియో వైరల్
- 
      
                   
                                 పునీత్‌ను అలా చూసి బాలయ్య కంటతడి..వీడియో వైరల్కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం కన్నడ చిత్రపరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండే పునీత్ గుండెపోటుతో మరణించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. తమ అభిమాన హీరో ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ చివరిచూపు కోసం కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు అభిమానులు. పునీత్ మరణంతో షాక్ అయిన టాలీవుడ్ హీరోలు బెంగళూరు వెళ్తున్నారు. (Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు) బాలకృష్ణ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య ఎమోషనల్ అయ్యాడు. పునీత్ పార్థీవ దేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పెడుతూ పక్కకి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పునీత్ మరణం వ్యక్తిగతం తనకు తీరని లోటు అని అన్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు అంటే పునీత్‌కు ఎంతో అభిమానం. గతంలో కర్ణాటకలో జరిగిన ఓ వేడుకకు బాలకృష్ణ హాజరవ్వగా.. ఆ సమయంలో వారిద్దరి మధ్య అనుబంధంకి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది. బాలకృష్ణ ముఖానికి ఏదో అంటుకుంటే గుర్తించిన పునీత్ రాజ్‌కుమార్ దానిని శుభ్రం చేశారు. ఆ వీడియో ఈ సమయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. His bonding with #NBK has always been special ❤#PuneethRajkumar #NandamuriBalakrishna pic.twitter.com/7T6CQkApit — Pulagam Chinnarayana (@PulagamOfficial) October 29, 2021
- 
  
      కంటతడి పెట్టిన బాలయ్య
- 
      
                   
                                 పోటెత్తిన అభిమానులు : శోకసంద్రమైన బెంగళూరుసాక్షి, బెంగళూరు: తమ అభిమాన హీరో పునీత్ రాజ్‌కుమార్‌ను కడసారి దర్శించుకునేందుకు అభిమానులు ఉప్పెనలా తరలివస్తున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా శోకసంద్రంలో మునిగిన అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. సంద్రాన్ని తలపించేలా వస్తున్న అభిమానులు ‘‘అప్పూ.. మిస్.. యూ’’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. దేవుడా ఏం తప్పు చేశాడని కోట్లాది మంది అభిమానుల ప్రాణాలను తీసుకుపోయావు అంటూ రోదిస్తున్నారు. పునీత్ తల్లిదండ్రులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ అంత్యక్రియలు జరిగిన కంఠీరవ స్టేడియంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విదేశాల్లో ఉన్న పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కంఠీరవ స్టేడియంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం బొమ్మై దివంగత నటుడికి నివాళులర్పించారు.(Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) కాగా 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పూకి అంతిమ నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని స్టేడియంకు తరలించారు. (Puneeth Rajkumar:పునీత్ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది Fans walking in to Kanteerava stadium to get a last glimpse of Kannada actor Puneeth Rajkumar. His body will be kept here for public homage till evening. @TheQuint pic.twitter.com/vHc80JhvBx — Nikhila Henry (@NikhilaHenry) October 30, 2021 ) God, took away the lives of crores of his admirers. What bad did he do🙏 Never in his life, 💔😔 #PuneethRajkumar #PuneethRajkumarFans pic.twitter.com/1netN5OsVN — KR  (@ImKalyanRaksha) October 29, 2021
- 
      
                   
                                 Puneeth Rajkumar: చివరి క్షణాల్లో ఏం జరిగింది? వైద్యులు ఏం చెప్పారు?Puneeth Rajkumar Death Reason: కన్నడ చిత్రపరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. 46 ఏళ్ల పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సదాశివనగరలోని తన నివాసంలో జిమ్‌లో పునీత్ యథావిధిగా వర్కవుట్లు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పునీత్‌ను సమీపంలోని రమణశ్రీ క్లినిక్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని విక్రమ్ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో ఉంచి, వైద్యం ప్రారంభించారు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునీత్ మరణాన్ని బసవరాజ బొమ్మై అధికారికంగా ప్రకటించారు. ఆస్పత్రికి వచ్చేటప్పటికే... పునీత్ కుటుంబ వైద్యులు ఈసీజీ తీయగా, గుండెపోటు అని నిర్ధారణ అయ్యాకే తమ ఆస్పత్రికి వచ్చినట్లు విక్రమ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పునీత్‌ను ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పుడే ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారని, హృదయ స్పందన లేదని వైద్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ మూడు గంటల పాటు తీవ్రంగా ప్రయత్నించామన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చనిపోయినట్లుగా తాము నిర్ధారించినట్లు ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. స్టేడియానికి భౌతికకాయం... శుక్రవారం సాయంత్రం పునీత్ భౌతికకాయాన్ని సదాశివనగరలోని ఇంటికి తరలించారు. అక్కడ కొన్ని పూజలు చేశాక కంఠీరవ స్టేడియానికి తరలించారు. సాయంత్రం 7 గంటల తర్వాత నుంచి అభిమానుల అంతిమ దర్శనానికి అవకాశం కల్పించారు. పునీత్ పెద్ద కుమార్తె అమెరికాలో చదువుతోంది. శనివారం సాయంత్రానికి ఆమె బెంగళూరు చేరుకుంటుంది. అనంతరం పునీత్ అంత్యక్రియలను ఆదివారం కంఠీరవ స్టూడియోలో ఆయన తల్లిదండ్రుల సమాధి చెంతన నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించిన ఎన్టీఆర్Puneeth Rajkumar Funerals: పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి జూ. ఎన్టీఆర్ నివాళులర్పించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్న ఆయన పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ సోదరుడు శివరాజ్‌ను ఓదార్చారు. మరికాసేపట్లో చిరంజీవి బెంగళూరుకు చేరుకోనున్నారు.ఇప్పటికే బాలకృష్ణ పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి బాలయ్య కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటునరేశ్, శివబాలాజీ పునీత్‌కు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్‌కుమార్‌న కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. పేరుకు కన్నడ హీరో అయినప్పటికి పునీత్ రాజ్‌కుమార్‌కు టాలీవుడ్ హీరోలతో మంచి అనుబంధం ఉంది. దీంతో ఆయనను చివరిసారిగా చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. చదవండి: Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ ఇదే! శోక సంద్రంలో పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు... వారి భయమే నిజమైంది
- 
      
                   
                                 Puneeth Rajkumar: ఆ ఇష్టమే రాజ్‌కుమార్‌కు కంటకంగా మారిందా?Puneeth Rajkumar Death Reason: ఫిట్‌నెస్‌కు మారుపేరు పునీత్ రాజ్‌కుమార్. ఆయన చేసే కఠినమైన వ్యాయామ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి. ఫిట్ నెస్ కోసం ప్రాణం పెట్టి మరీ వర్కవుట్స్ చేస్తారు. వర్కౌట్ చేయపోతే ఆ రోజు వృథా అయినట్టే అనేది పునీత్ అభిప్రాయం. అంత ఫిట్‌గా ఉండే రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడం విస్మయానికి గురిచేయడంతో పాటు పలు అనుమానాలకు దారితీసింది. ఫిట్నెస్ కోసం కఠిన వ్యాయామం చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందా? వర్కౌట్లు, వ్యాయామంపై రాజ్‌కుమార్‌కు ఉన్న ఇష్టమే ఆయన ప్రాణం తీసిందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ్యాయామం కోసం రాజ్‌కుమార్‌కు స్పెషల్‌గా ఒక జిమ్ సెంటర్ ఉంది. అందులో ఆధునిక వ్యాయామ సామగ్రిని అమర్చారు. నిత్యం ఒకటి రెండు గంటల పాటు అక్కడే గడిపేవారు. కరోనా సమయంలోనూ ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు. ఆయన చేసి కఠినమైన వ్యాయామ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకసార్లు వైరల్ అయ్యాయి. ఫిట్‌నెస్‌పై ఆయనకు ఉన్న ఇష్టమే ప్రాణాలు తీసిందని, కఠిన వ్యాయామం చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే గుండెలోని రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే పునీత్ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. జిమ్ సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు వైరల్Puneeth Rajkumar Family Images: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్తతో కర్ణాటక మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంతో ఇండియాలో వివిధ సినీ పరిశ్రమల్లోని నటులు ఆయనకి నివాళి తెలిపారు. ఈ తరుణంలో పునీత్ పాత ఫోటోలు వైరల్‌గా మారాయి. అమ్మ, నాన్నతో ఫ్యామీలీతో ఆయన చిన్నప్పుటి పిక్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి.. చదవండి: రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ‘జిమ్’ గండం! View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official)
- 
      
                   
                                 Puneeth Rajkumar: రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ‘జిమ్’ గండం!Puneeth Rajkumar Workout Video: పునీత్ రాజ్‌కుమార్ ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటారు. ఇలాంటి వయసులో, ఇంత ఫిట్‌గా ఉన్నవారికి గుండెపోటు రావడం కొంత విస్మయం, మరికొంత ఆందోళన కలిగించే అంశమే. రాజ్‌కుమార్ చివరిరోజుల వరకు యోగా, వ్యాయామం చేస్తూ వచ్చారు. అలాగే పునీత్ కూడా దేహ దారుఢ్యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మంచి ఫిజిక్‌ను సాధించాలనే ఆసక్తే ఆయన్ను పూర్తి స్థాయి ఫిట్నెస్ లవర్‌గా మార్చింది. జిమ్ వర్కవుట్‌తో పాటు క్రాస్ ఫిట్, మార్షల్ ఆర్ట్స్, యోగా వంటివి కూడా ప్రతిరోజూ తప్పనిసరిగా సాధన చేసేవారు. తరచుగా తన వర్కవుట్ వీడియోలను అభిమానులతో పంచుకునేవారు. (చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!) పునీత్ కఠినమైన వ్యాయామ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి. లాక్డౌన్ టైమ్‌లో వీలైనన్ని వ్యాయామాలు చేసినా 2 నుంచి 3 కిలోలు బరువు పెరిగానని, లాక్డౌన్ ఎత్తేయగానే తిరిగి షేప్ సాధించడం కోసం ఎదురు చూస్తున్నానని పునీత్ ఆ మధ్య అన్నారు. ఆయన ఫిట్నెస్ ప్రియత్వానికి ఓ ఉదాహరణ ఇది. వర్కవుట్ చేయని రోజు అంటే తన దృష్టిలో అది వృథా అయిన రోజు అనే పునీత్.. ఏ ఫిట్నెస్ మీద ఇష్టంతో గంటల పాటు జిమ్‌లో గడిపారో అదే జిమ్‌లో గుండెపోటుకు గురి కావడం విషాదం. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ కుటుంబానికి వ్యాయామశాల కలసి రాలేదనే చర్చ సాగుతోంది. గతంలో పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర జిమ్ చేస్తుండగా పక్షవాతం వచ్చింది. అలాగే గతంలో శివ రాజ్‌కుమార్ కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official) View this post on Instagram A post shared by Puneeth Rajkumar (@puneethrajkumar.official)
- 
      
                   
                                 బళ్లారి జిల్లాతో పునీత్‌కు విడదీయలేని బంధం.. ఎలా అంటే..!Puneeth Rajkumar Bonding With Bellary: పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు బళ్లారి జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. సినిమా చిత్రీకరణల సందర్భంగా అనేక పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. పునీత్ రాజ్‌కుమార్ ఉత్తమ నటన, ఆయన ఉత్తమ వ్యక్తిత్వం, అందరితో కలిసిపోయే గుణం కారణంగా జిల్లాలో ఆయనకు లక్షలాదిగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన చిత్రాలు జిల్లాలో వంద రోజులపాటు ప్రదర్శించారు. పునీత్‌రాజ్‌కుమార్ గురు రాఘవేంద్ర స్వామి భక్తుడు కావడంతో మంత్రాలయం వెళ్లినప్పుడు బళ్లారికి వచ్చి వెళ్లేవారు. బళ్లారికి వచ్చిన ప్రతిసారీ వేలాదిగా అభిమానులు ఘన స్వాగతం పలికేవారు. ఆయన నటించిన సినిమాలు బళ్లారిలోని శివ థియేటర్లో వంద రోజులపాటు ప్రదర్శించామని బళ్లారి సినిమా థియేటర్ల ఆసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, హనుమంతరెడ్డిలు తెలిపారు. పునీత్‌రాజ్‌కుమార్ మృతికి సంతాపసూచకంగా బళ్లారిలో సినిమా థియేటర్లను మూసివేశారు. శ్రద్ధాంజలి ఘటించిన అభిమానులు పునీత్ రాజ్‌కుమార్ ఆకాల మరణంతో అభిమానులు కంటతడిపెట్టారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అప్పు సేవా సమితి, రాజ్‌కుమార్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో రాయల్ సర్కిల్‌కు చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నటరాజ్ థియేటర్ యజమాని లక్ష్మీకాంత్‌రెడ్డి, పునీత్ అభిమానులు కప్పగల్ చంద్ర«శేఖర్ ఆచారి, మంజునాథ్,› ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!) గంగావతి: బస్టాండ్ సర్కిల్లో పునీత్ రాజ్‌కుమార్ చిత్ర పటం ఉంచి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్సీ హెచ్ఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు పంపణ్ణనాయక్, చెన్నబసవ జైకిన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో రాయచూరు జిల్లాలో అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. కన్నడపర సంఘటనల సంచాలకుడు అశోక్ కుమార్ జైన్, గోవింద రాజులు, నరసింహులు, సాధిక్, బసవరాజ్ కళస, శివకుమార్‌యాదవ్, రవి, అశోక్ శెట్టి, రమేష్, రాజశేఖర్, వినోద్ రెడ్డి, శరణప్ప, మాజీ ఎమ్మెల్సీ బోసురాజ్, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్లు సంతాపం వ్యక్తం చేశారు. కంప్లి: పునీత్‌రాజ్‌కుమార్ మృతితో కంప్లిలో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే గణేష్ కార్యాలయం వద్దకు పునీత్ అభిమానులు చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి సమర్పించారు.
- 
  
      అప్పూ అల్విదా...
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్ మృతి.. పూరి జగన్నాథ్ భావోద్వేగంకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని శాండల్‌వుడ్ సినీ ప్రుముఖులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సెలబ్రెటీలు సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పునీత్ మృతిపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పందించారు. ఆయన మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్.. ‘చావు అనేది ఊహించలేనిది అని తెలుసు. కానీ పునీత్ మృతి మాత్రం షాక్‌కు గురి చేసింది. పునీత్ నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. తనతో ‘అప్పు’ మూవీ తీశాను. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు, ఎందరికో సాయం చేశారు. ఆయన చాలా మంచి వారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్ గారు లేరు, ఆయన తల్లి పార్వతమ్మ కూడా పోయారు.. ఇప్పుడు పునీత్ మృతి తట్టుకోలేకపోతున్నా. పునీత్‌ది చాలా చిన్న వయసు. అంతలోనే ఆయన కన్నుయూయడం జీర్ణించుకోలేకపోతున్నా. ఇటీవల నాకు ఫోన్ చేసి మాట్లాడారు.. చాలా సరదాగా మాట్లాడుకున్నాం. త్వరలోనే కలుద్దామని కూడా చెప్పారు. ఎప్పుడు సరదాగా ఉంటే వ్యక్తి మరణించడం ఆయన కుటుంబానికే కాదు భారత సినీ పరిశ్రమకు సైతం బిగ్ లాస్. లవ్యూ పునీత్, రియల్లీ ఐ మిస్ యూ’ అంటూ పూరి జగన్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!
- 
  
      విషాదంలో కన్నడ చిత్ర పరిశ్రమ..
- 
  
      జిమ్ చేయడమే పునీత్ కు శాపమా ?
- 
      
                   
                                 పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని హార్ట్ ఎటాక్స్ వెంటాడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది జరిగిన సంఘటనలను చూస్తుంటే. అగ్ర కథానాయకుడైన పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ, రాజ్‌కుమార్ గుండెపోటుతోనే చనిపోయారు. అలాగే ఆయన సోదరుడు, స్టార్ హీరో శివరాజ్ కుమార్ గతంలో గుండెపోటుతోనే చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. జిమ్ హెవీ వర్కౌట్స్ చేయడం వల్లే శివరాజ్ కుమార్‌కు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఆయన జిమ్‌లో అతిగా కష్టపడటం తగ్గించారు. ఇక నేడు అదే కారణంతో పునీత్ రాజ్‌కుమార్ మరణించడం బాధాకరం. చదవండి: మరణం, డెస్టినీ గురించి పునీత్ రాజ్‌కుమార్ ఏమన్నారంటే.. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ 77 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక 54 ఏళ్ల వయసులో జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తుండగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్‌కు ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయనను వెంటనే బెంగళూరు విఠల్మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో ఆయనకు వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి ఆయన జిమ్‌లో తక్కువగా కనిపిస్తారు. కానీ పునీత్ రాజ్‌కుమార్ మాత్రం ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడుపుతారని తాజాగా వైరల్ అవుతున్న తన జిమ్ వీడియోలు చూస్తే అర్థం అవుతోంది. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్.. కన్నడ సినీ పరిశ్రమలో పునీత్ రాజ్‌కుమార్.. ఎనర్జిటిక్ అండ్ చార్మింగ్ హీరోగా పేరు కూడా ఉంది. జిమ్‌లోనే కాదూ షూటింగ్ కోసం ఎక్కడికెళ్లినా వర్కౌట్స్ మాత్రం వదలరట. ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. తాజాగా జేమ్స్ అనే సినిమాకు సైన్ చేసిన పునీత్.. ఇందులో బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నారట. ఇందుకోసం బాడీ బిల్డర్‌గా తనని తాను మేకోవర్ చేసుకునేందుకు జిమ్‌లో ఓవర్‌గా ఎక్స్ర్సైజులు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన జిమ్ సిబ్బంది, సహాయకులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ డేంజర్ స్ట్రోక్ పునీత్‌ను బలితీసుకుంది. భారత సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.
- 
      
                   
                                 22 ఏళ్ల క్రితం.. పునీత్ రాజ్‌కుమార్ తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ఇంటర్నెట్ డెస్క్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన అకాలమరణం చెందారు. వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణించలేకుండా ఉంది. ఈ క్రమంలోనే అభిమానులు, ప్రజలు దాదాపు 22 ఏళ్ల క్రితం పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి చర్చించుకుంటున్నారు. అదే పునీత్ రాజ్‌కుమార్ తండ్రి కిడ్నాప్. పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. వీరప్పన్ నేరాల్లో ఈ సంఘటన ఇప్పటికి కూడా ప్రజలను వెంటాడుతూనే ఉంటుంది. దీని గురించి ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. తమిళనాడుకు చెందిన వీరప్పన్ కన్నడ సూపర్‌స్టార్‌ను ఎందుకు కిడ్నాప్ చేశాడు.. తర్వాత ఏం జరిగింది వంటి తదితర వివరాలు.. (చదవండి: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు.. ) ఈ కిడ్నాప్ 2000 సంవత్సరం, జూలై 30న చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగిన సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. సంఘటన జరిగిననాడు.. రాజ్‌కుమార్.. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని గాజనూరు గ్రామంలో ఉన్న తన ఇంటికి వచ్చారు. అప్పటికి ఎనిమిది నెలల క్రితమే పునీత్ రాజ్‌కుమార్ వివాహం జరిగింది. (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే) జూలై 30, రాత్రి 09.30 గంటలకు కిడ్నాప్... రాజ్‌కుమార్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. ఆ సమయంలో వీరప్పన్ తన అనుచరలతో కలిసి రాజ్‌కుమార్ ఇంటికి వచ్చి.. ఆయనను కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. (చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు) ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని.. ఇది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే) రాజ్‌కుమార్ కిడ్నాప్ గురించి ఏడాది ముందే సమాచారం వీరప్పన్‌ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గంధపు చెక్కల స్మగ్లర్.. రాజ్‌కుమార్‌ను టార్గెట్ చేశాడని.. కిడ్నాప్‌కు ఏడాది ముందే అనగా.. 1999లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించడంతో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్..) ఫలించని చర్చలు.. 108 రోజుల బందీ రాజ్‌కుమార్ కిడ్నాప్ వ్యవహారంపై అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో వీరప్పన్‌తో చర్చలు జరిపింది తమిళ ప్రభుత్వం. నక్కిరన్ పత్రిక ఎడిటర్ ఆర్ఆర్ రాజగోపాల్ ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించినప్పటికి ఫలితం లేకపోయింది. అలా 108 రోజుల పాటు రాజ్‌కుమార్‌ను బంధించిన వీరప్పన్.. చివరకు 2000, నవంబర్ 15న ఆయనను వదిలేశాడు. చర్చలు జరిపినా మాట వినని వీరప్పన్.. ఉన్నట్లుండి రాజ్‌కుమార్‌ను విడుదల చేయడం నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. (చదవండి: ఒక్కసారి కూడా నా తండ్రిని చూడలేదు) 19 ఏళ్ల పాటు సాగిన కేసు.. తమిళనాడు కోర్టులో రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసు ఏళ్ల పాటు నడిచింది. ఈ కేసు విచారణ సమయంలో రాజ్‌కుమార్ కుటుంబం ఎవరిని నిలదీయలేదు. కిడ్నాప్ అయిన 19 ఏళ్ల తర్వాత అనగా 2018, సెప్టెంబర్‌లో కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. రాజ్‌కుమార్ కుటుంబం వీరికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయకపోవడంతో.. వీరంతా నిర్దోషులుగా విడుదల అయ్యారు. కేసు ముగియడానికి ముందే వీరప్పన్, రాజ్‌కుమార్ రెండు ఏళ్ల తేడాతో మృతి చెందారు. సిట్ బృందం చేతిలో 2004లో వీరప్పన్ మృతి చెందగా.. 2006లో రాజ్‌కుమార్ మృతి చెందారు. ఇక చర్చల సమయంలో వీరప్పన్ తన మీద ఉన్న మొత్తం 135 కేసులును ఎత్తేయాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు అంగీకరించేదట. చదవండి: వీరప్పన్‌కు ఇచ్చింది రూ.15 కోట్లు!
- 
  
      కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు..రోజా
- 
  
      పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం
- 
  
      పునీత్ లేడు అనే విషయం తట్టుకోలేక పోతున్నాను
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్: కళ్లు దానం చేసిన కన్నడ సూపర్ స్టార్Puneeth Rajkumar Eyes Donated: భారత సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(46) మరణ వార్తతో అందరి గుండెలు బరువెక్కాయి. కన్నడనాట ఎక్కడ చూసిన అభిమానుల రోదనలు మిన్నంటుతున్నాయి. చిన్న వయసులో తమ అభిమాన హీరో, సహానటుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఇది నిజం కాదు.. ప్లీజ్ తిరిగి రా అప్పు’ అంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన చనిపోయిన కూడా మరొకరి ద్వారా ఈ లోకాన్ని చూడనున్నారు. ఈ సూపర్ స్టార్ తన కళ్లను దానం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఫ్యాన్స్ సోషల్ మీడియా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా ఈ రోజు ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు.
- 
            
                                     
                                                             Puneeth Rajkumar: భార్య అశ్వినితో పునీత్ రాజ్‌కుమార్.. రేర్ పిక్స్
- 
  
      Puneeth Rajkumar Death: అప్పు మిస్ యూ..
- 
      
                   
                                 మరణం, డెస్టినీ గురించి పునీత్ రాజ్‌కుమార్ ఏమన్నారంటే..కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(46)ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో కన్నడ సినీ పరిశ్రమంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన హీరోహీరోయిన్లు, నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్.. ఇదిలా ఉంటే గతంలో ఆయన భవిష్యత్తు గురించి, చావు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పునీత్.. ‘భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధి రాతను ఎవరూ మార్చలేరు’ అంటూ చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇది చూసిన వారంత ‘అప్పుడు ఆయన తెలియదు ఈ రోజు మనకు దూరం అవుతారని, అయ్యో.. దేవుడా ఈ చేదు వార్తను నమ్మలేకపోతున్నాం. ఈ వార్త నిజం కాకూడదు.. ప్లీజ్ పునీత్ తిరిగి రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- 
      
                   
                                 Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ ఇదే!Know About Power Star Puneeth Rajkumar Family: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జిమ్ చేస్తుండగా తీవ్ర గుండెపోటు రావడంతో హఠాన్మరణానికి గురయ్యారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన హీరో ఇక లేరన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో కెరీర్ ఉన్న పునీత్ ఇలా హఠాన్మరణానికి గురవడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.చదవండి: కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్ మూడవ కొడుకే పునీత్ రాజ్‌కుమార్. ఆయన తండ్రి ప్రముఖ నటుడు కాగా, తల్లి పార్వతమ్మ నిర్మాతగా గుర్తింపు పొందారు. 1976లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన పునీత్.. బాలనటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, అంజనీపుత్ర వంటి ఎన్నోసూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పునీత్ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్‌లు కూడా నటులే. ఇక పునీత్ వ్యక్తిగత జీవితానికి వస్తే..1999లో అశ్వనీ రేవంత్ అనే అమ్మాయిని పునీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన అశ్వనీని పెద్దల అంగీకారంతో పునీత్ వివాహం చేసుకున్నారు. వీరికి ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం పెద్ద కూతురు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. చదవండి: Puneeth Rajkumar: గుండె పగిలిపోయింది.. ప్లీజ్ కం బ్యాక్ అప్పూ.. పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్..
- 
  
      పునీత్ గురించి రోజా ఎమోషనల్
- 
      
                   
                                 పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్సాక్షి, హైదరాబాద్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం(అక్టోబర్ 29వ తేదీ) తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే తమ అభిమాన హీరో అప్పు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం అలు అభిమానులతో పాటు, పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈసందర్భంగా జిమ్ వర్కవుట్స్ వీడియోలు, ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అశ్వినీ రేవంత్, పునీత్ రాజ్ కుమార్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. (Puneeth Rajkumar: గొప్ప ఔదార్యంపై ఔరా అంటున్న ఫ్యాన్స్) పునీత్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా అతని అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసింది. కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. పునీత్ ఆఅంత్యక్రియలు రేపు అంటే (అక్టోబర్, 30) జరగనున్నాయి. 1976లో బాలనటుడిగా కరియర్ ప్రారంభించిన పునీత్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా పాపులయ్యారు. లవ్ స్టోరీ పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. అలా కొనసాగిన వారి స్నేహం ఒకరిపై మరొకరికి ప్రేమను పెంచింది. ఎనిమిది నెలల స్నేహం తరువాత పునీత్ ఆమెకు ప్రపోజ్ చేయగా, ఆమె వెంటనే అంగీకరించింది. అయితే అన్ని ప్రేమ కథల్లాగానే వీరి స్టోరీలో కూడా అడ్డంకులూ, అభ్యంతరాలూ వచ్చాయి. కానీ ఒపిగ్గా పెద్ద వారిని ఒప్పంచి మరీ తమ ప్రేమను గెలిపించుకున్నారు. వీరి పెళ్లికి పునీత్ కుటుంబం సంతోషంగా ఒప్పుకున్నా, అశ్విని కుటుంబం అంగీకరించలేదు. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు అశ్విని కుటుంబం ఆమోదం తెలిపింది. చివరికి 1999న డిసెంబర్ ఒకటిన పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలందుకున్నారు. ఈ దంపతులకు దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సజావుగా సాగిపోతున్న వీరి 20 ఏళ్ల కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో, పునీత్ అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడటం విషాదం. ఎవరీ అశ్విని రేవంత్ అశ్విని 1981లో కర్నాటకలోని బెంగళూరులో జన్మించారు. ప్రస్తుతం ఆమె శాండిల్‌వుడ్‌లో ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పని చేశారు. 2019లో పునీత్ ప్రొడ్యూస్ చేసిన కవల్‌దారి మూవీని ప్రెజంటర్గా వ్యవహరించారు. అలాగే వీరిద్దరూ పీఆర్కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మించారు. అలా 2016లో మాయాబజార్, తరువాత ఫ్రెంచ్ బిర్యానీ, 02 లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను తెరకెక్కించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబి నేషన్‌లో ఒక మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- 
  
      సినీ పరిశ్రమకు తీరని లోటు: మోహన్ బాబు
- 
      
                   
                                 పునీత్ మృతి.. అభిమానులు శాంతంగా ఉండాలి: బొమ్మైబెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్ శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. (చదవండి: తారక్ నా సోదరుడు: పునీత్ పాత వీడియో వైరల్) పునీత్ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం బొమ్మై మీడియాతో మాట్లాడారు. పునీత్ రాజ్‌కుమార్ యూత్ ఐకాన్ అన్నారు. ఈ సమయంలో ఆయన అభిమానులు శాంతించాలని సీఎం బొమ్మై విజ్ఞప్తి చేశారు. పునీత్‌ను కాపాడటానికి వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు. చిన్నవయసులోనే హార్ట్ ఎటాక్ రావడం చాలా అరుదు అన్నారు బొమ్మై. (చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు) ఈ నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్ పార్థీవ దేహాన్ని కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు. శనివారం తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పునీత్ కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటన ఆమె ఇండియా బయలుదేరారు. చదవండి: కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం


