Puneeth Rajkumar Funeral, At Sree Kanteerava Outdoor Stadium in Bengaluru - Sakshi
Sakshi News home page

తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు..

Oct 31 2021 7:34 AM | Updated on Nov 2 2021 10:15 AM

Puneeth Rajkumar Funerals At Sree Kanteerava Outdoor Stadium in Bengaluru - Sakshi

Puneeth Rajkumar Funeralఅశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం సహా అనేక మంది ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో పునీత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు బరువెక్కిన గుండెలతో పునీత్‌ కడసారి వీడ్కోలు పలికారు. 

చదవండి: (Puneeth Rajkumar: ధృతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు)

కాగా, కోట్లాది మంది ఆత్మీయ బంధువు, విలక్షణ నటుడు, కన్నడ సినీ పరిశ్రమ ముద్దుబిడ్డ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణం రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన ఇకలేరనే విషయం తెలుసుకున్న ప్రజలు కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో తరలివచ్చారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement