Puri Jagannadh Emotional Words About Puneeth Rajkumar Death
Sakshi News home page

Puneeth Rajkumar Last Breath: పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి.. పూరి జగన్నాథ్‌ భావోద్వేగం

Oct 29 2021 9:22 PM | Updated on Oct 30 2021 4:15 PM

Puri Jagannadh Emotional Words About Puneeth Rajkumar Death - Sakshi

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్త విని శాండల్‌వుడ్‌ సినీ ప్రుముఖులతో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన సెలబ్రెటీలు సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పునీత్‌ మృతిపై డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ స్పందించారు. ఆయన మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆఖరి ట్వీట్‌ వైరల్‌..

‘చావు అనేది ఊహించలేనిది అని తెలుసు. కానీ పునీత్‌ మృతి మాత్రం షాక్‌కు గురి చేసింది. పునీత్‌ నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. తనతో ‘అప్పు’ మూవీ తీశాను. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు, ఎందరికో సాయం చేశారు. ఆయన చాలా మంచి వారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్‌ గారు లేరు, ఆయన తల్లి పార్వతమ్మ కూడా పోయారు.. ఇప్పుడు పునీత్‌ మృతి తట్టుకోలేకపోతున్నా. పునీత్‌ది చాలా చిన్న వయసు. అంతలోనే ఆయన కన్నుయూయడం జీర్ణించుకోలేకపోతున్నా. ఇటీవల నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు.. చాలా సరదాగా మాట్లాడుకున్నాం. త్వరలోనే కలుద్దామని కూడా చెప్పారు. ఎప్పుడు సరదాగా ఉంటే వ్యక్తి మరణించడం ఆయన కుటుంబానికే కాదు భారత సినీ పరిశ్రమకు సైతం బిగ్‌ లాస్‌. లవ్‌యూ పునీత్‌, రియల్లీ ఐ మిస్‌ యూ’ అంటూ పూరి జగన్నాథ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. 

చదవండి: పునీత్‌ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement