Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌కు కన్నడ డిస్ట్రిబ్యూటర్ల ఘన నివాళి

Puneeth Rajkumar James Movie Army Officer Look Released - Sakshi

Puneeth Rajkumar James Movie Army Officer Look Released: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌ ఈ ఏడాది మార్చి17న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నేడు(జనవరి26)న స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఆయన సైనికుడిలా కనిపించారు. చేతన్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటించింది.హీరో శ్రీకాంత్‌ విలన్‌గా నటించగా, అను ప్రభాకర్‌ ముఖర్జీ కీలక పాత్రలో కనిపించనున్నారు.

కాగా మార్చి 17న పునీత్‌ జయంతి సందర్భంగా అదే రోజున ఈ సినిమా విడుదల చేయనున్నారు. దీంతో మార్చి 17-23 మధ్యలో ఎలాంటి సినిమాలు విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమానుకన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top