పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి | Peddireddy Ramachandra reddy meet puneeth rajkumar family Bengaluru | Sakshi
Sakshi News home page

పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి

Dec 5 2021 1:13 PM | Updated on Dec 5 2021 1:28 PM

Peddireddy Ramachandra reddy meet puneeth rajkumar family Bengaluru - Sakshi

బెంగుళూరులోని పునీత్‌ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి అశ్వినితో మాట్లాడారు. ఈ సందర్భంగా...

సాక్షి, కర్ణాటక: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. బెంగుళూరులోని పునీత్‌ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి అశ్వినితో మాట్లాడారు.

ఈ సందర్భంగా పునీత్‌ అకాల మరణం చాలా బాధించిందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చిన్న వయసులోనే అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్‌ అని పెద్దిరెడ్డి అన్నారు. కాగా, పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29న ఇంట్లో జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

చదవండి: (PuneethRajkumar: పునీత్‌ పెళ్లికి 22 ఏళ్లు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement