Puneeth rajkumar: పునీత్‌కు ఇష్టమైన 30 రకాల శాకాహార, మాంసాహార వంటకాలను సమాధి వద్ద ఉంచి..

Puneeth Rajkumar 11th Day Death Ceremony - Sakshi

Puneeth Rajkumar 11th Day Death Ceremony: పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ 11 రోజుల పుణ్యతిథిని కుటుంబసభ్యులు నిర్వహించారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ సమాధికి సోమవారం ఉదయం భార్య అశ్విని, కూతుర్లు  వందితా, ధృతి, అన్నలు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఇతర కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పూజలు చేశారు. పునీత్‌కు ఇష్టమైన 30 రకాల  శాకాహార, మాంసాహార వంటకాలను సమాధి వద్ద ఉంచారు. సదాశివనగరలోని పునీత్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీఎం బసవరాజ్‌ బొమ్మై తదితర ప్రముఖులు పాల్గొన్నారు.  

అన్నదానం చేస్తున్న శివరాజ్‌కుమార్‌

తమ్ముడు కాదు కొడుకు: శివ రాజ్‌కుమార్‌ 
పునీత్‌ లేడంటే తట్టుకోలేకపోతున్నామని అన్న శివరాజ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సమాధి వద్ద అభిమానులకు అన్నదానం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. పునీత్‌ తమ్ముడు కాదు, కొడుకు వంటివాడు. కొడుకు పోయాడు అని కన్నీరుపెట్టారు. పునీత్‌ పద్మశ్రీ కాదు.. అమరశ్రీ. అందరి మనస్సులో ఉండిపోయాడు. పునీత్‌ ఎక్కడికీ వెళ్లలేదు అని అన్నారు. పునీత్‌ తండ్రికి తగిన తనయునిగా పేరు తెచ్చుకున్నారన్నారు. అభిమానులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని మనవి చేశారు. కాగా, పునీత్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని సీఎం బొమ్మై తెలిపారు.  

చదవండి: (పునీత్‌ రాజ్‌కుమార్‌కు మొదట వైద్యం చేసిన డాక్టర్‌ ఇంటికి భారీ బందోబస్తు)

సతీమణి అశ్విని, కూతుళ్లు 

తరలివచ్చిన ప్రముఖులు  
సీనియర్‌ నటి బి.సరోజదేవి, రంగాయణ రఘు, రవిశంకర్‌గౌడ, అవినాశ్, మాళవిక, దర్శకుడు హేమంత్‌ రావ్, సీనియర్‌ నటుడు దత్తణ్ణ, సీనియర్‌ దర్శకుడు ఓ సాయి ప్రకాశ్, చిత్రా శెణై, భగవాన్, దొడ్డణ్ణ, ఎమ్మెల్యే రోషన్‌ బేగ్, దునియా విజయ్‌తో పాటు వేలాదిగా అభిమానులు పునీత్‌ సమాధిని దర్శించుకున్నారు.

చదవండి: (పునీత్‌ పేరుతో పాఠశాల, ఆస్పత్రి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top