గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన స్టార్‌ హీరో కూతురు | puneeth Rajkumar Daughter Drithi Complete Her Graduation | Sakshi
Sakshi News home page

గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన స్టార్‌ హీరో కూతురు

May 18 2025 10:11 AM | Updated on May 18 2025 12:12 PM

puneeth Rajkumar Daughter Drithi Complete Her Graduation

ప్రముఖ కన్నడ హీరో, దివంగత పునీత్ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి అమెరికాలో తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె పెదనాన్న శివరాజ్‌ కుమార్‌ తన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. 2021లో చదువుకునేందుకు అమెరికాకు ధృతి వెళ్లింది. అత్యున్నతమైన మార్కులతో తన ఫ్యాషన్ డిజైనర్ కోర్సును ఆమె పూర్తి చేసిన ఆమె పట్టభద్రురాలైంది.

ధృతి గురించి శివరాజ్‌ కుమార్ ఇలా చెప్పారు. 'హాయ్ టోటో (ముద్దుపేరు), నీకు అభినందనలు! ఈ రోజు మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది, మనందరికీ చాలా గర్వకారణమైనది కూడా.. మీ నాన్నతో పాటు నన్ను కూడా చాలా గర్వపడేలా చేశావు. మీతో చాలా మంచి జ్ఞాపకాలు నా కళ్లముందు ఉన్నాయి. నువ్వు నవ్వినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, అప్పు(పునీత్ రాజ్‌కుమార్‌) వచ్చినట్లు ఉంటుంది. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు. అందుకే మా ప్రియమైన అప్పుకు  మరోసారి అభినందనలు.' అని ఆయన అన్నారు. ధృతి తండ్రి పునీత్ రాజ్‌కుమార్‌ 2021లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

దింగత నటుడు పునీత్ రాజ్ కుమార్  కుమార్తె ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా పట్టభద్రురాలైంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో  నంబర్ వన్ డిజైన్ స్కూల్‌గా ఆ యూనివర్శిటికి గుర్తింపు ఉంది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ కాలేజీ 1941లో ఫ్రాంక్ అల్వా పార్సన్స్‌గా పేరు మార్చబడింది. ఈ సంస్ధ ఐదు విభాగాలలో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తుంది.  ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లలో శిక్షణ ఇస్తుంది. ఫ్యాషన్ డిజైన్‌ రంగంలో పేరుగాంచిన మార్క్ జాకబ్స్, డోనా కరణ్ వంటివారు ఇక్కడే విద్యను అభ్యసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement