Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ ఇదే! | Puneeth Rajkumar Death: Know About Power Star Puneeth Rajkumar Family | Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ ఇదే!

Oct 29 2021 5:03 PM | Updated on Oct 29 2021 6:39 PM

Puneeth Rajkumar Death: Know About Power Star Puneeth Rajkumar Family - Sakshi

Know About Power Star Puneeth Rajkumar Family: కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జిమ్‌ చేస్తుండగా తీవ్ర గుండెపోటు రావడంతో హఠాన్మరణానికి గురయ్యారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన హీరో ఇక లేరన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో కెరీర్‌ ఉన్న పునీత్‌ ఇలా హఠాన్మరణానికి గురవడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.చదవండి: కర్ణాటకలో హైఅలర్ట్‌.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం

లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ కొడుకే పునీత్‌ రాజ్‌కుమార్‌. ఆయన తండ్రి ప్రముఖ నటుడు కాగా, తల్లి పార్వతమ్మ నిర్మాతగా గుర్తింపు పొందారు. 1976లో చైల్డ్‌  ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌.. బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, అంజనీపుత్ర వంటి ఎన్నోసూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పునీత్‌ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, శివ రాజ్‌కుమార్‌లు కూడా నటులే.

ఇక పునీత్‌ వ్యక్తిగత జీవితానికి వస్తే..1999లో అశ్వనీ రేవంత్‌ అనే అమ్మాయిని పునీత్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయిన అశ్వనీని పెద్దల అంగీకారంతో పునీత్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం పెద్ద కూతురు అమెరికాలో ఉన్నట్లు సమాచారం.

చదవండి: Puneeth Rajkumar: గుండె పగిలిపోయింది.. ప్లీజ్‌ కం బ్యాక్‌ అప్పూ..
పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆఖరి ట్వీట్‌ వైరల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement