Allu Arjun Visit Bangalore Today To Meet Puneeth Rajkumar Family - Sakshi
Sakshi News home page

Allu Arjun: పునీత్‌ ఫ్యామిలీని పరామర్శించిన బన్నీ

Feb 3 2022 10:40 AM | Updated on Feb 3 2022 2:51 PM

Allu Arjun To Meet Puneeth Rajkumar Family - Sakshi

పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్‌ బెంగళూరుకు చేరుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 3) ఉదయం 10 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌ నుంచి బయలు దేరిన బన్నీ బెంగళూరుకు చేరుకోగానే ముందుకుగా పునీత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం చిత్రసీమకు తీరని లోటు. గతేడాది అక్టోబర్‌ 29న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణ, రామ్‌చరణ్‌.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

తాజాగా పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్‌ బెంగళూరుకు వెళ్లారు. గురువారం (ఫిబ్రవరి 3) ఉదయం బెంగళూరుకు చేరుకున్న బన్నీ ముందుగా పునీత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పునీత్‌ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement