Prime Minister Modi Tweet On Kannada Star Puneeth Rajkumar Trailer Gandhadagudi - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: ఆయన ఒక అద్భుతం.. పవర్‌ స్టార్‌ను కొనియాడిన మోదీ

Oct 9 2022 3:38 PM | Updated on Oct 9 2022 4:57 PM

Prime Minister Modi Tweet On Kannada Star Puneeth Rajkumar Trailer Gandhadagudi - Sakshi

ఫైల్‌ ఫోటో

కన్నడ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చిత్రం 'గంధడగుడి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ప్రధాని మోదీకి ట్వీట్ చేసింది చిత్రబృందం. దీనిపై మోదీ కూడా స్పందించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. 

ప్రధాని మోదీ రాస్తూ 'పునీత్‌ రాజ్‍కుమార్ మన మధ్య లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. పునీత్ అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారు. గంధడగుడి సినిమా ప్రకృతి మాతకు, కర్ణాటక ప్రకృతి సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు నివాళి' అంటూ ట్వీట్ చేశారు. కన్నడలో పవర్‌ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా మరణించారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement