
Puneeth Rajkumar Death Reason: ఫిట్‌నెస్‌కు మారుపేరు పునీత్ రాజ్‌కుమార్. ఆయన చేసే కఠినమైన వ్యాయామ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి. ఫిట్ నెస్ కోసం ప్రాణం పెట్టి మరీ వర్కవుట్స్ చేస్తారు. వర్కౌట్ చేయపోతే ఆ రోజు వృథా అయినట్టే అనేది పునీత్ అభిప్రాయం. అంత ఫిట్‌గా ఉండే రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడం విస్మయానికి గురిచేయడంతో పాటు పలు అనుమానాలకు దారితీసింది. ఫిట్‌నెస్ కోసం కఠిన వ్యాయామం చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందా? వర్కౌట్లు, వ్యాయామంపై రాజ్‌కుమార్‌కు ఉన్న ఇష్టమే ఆయన ప్రాణం తీసిందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వ్యాయామం కోసం రాజ్‌కుమార్‌కు స్పెషల్‌గా ఒక జిమ్ సెంటర్ ఉంది. అందులో ఆధునిక వ్యాయామ సామగ్రిని అమర్చారు. నిత్యం ఒకటి రెండు గంటల పాటు అక్కడే గడిపేవారు. కరోనా సమయంలోనూ ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు. ఆయన చేసి కఠినమైన వ్యాయామ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకసార్లు వైరల్ అయ్యాయి. ఫిట్‌నెస్‌పై ఆయనకు ఉన్న ఇష్టమే ప్రాణాలు తీసిందని, కఠిన వ్యాయామం చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే గుండెలోని రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే పునీత్ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. జిమ్ సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.