స్టార్‌ హీరో సినిమా రీరిలీజ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న సతీమణి | Ashwini Puneeth Rajkumar get emotional after watching Jackie movie - Sakshi
Sakshi News home page

రెండేళ్ల క్రితం భర్త మృతి.. సినిమా రీరిలీజ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సతీమణి

Mar 15 2024 4:04 PM | Updated on Mar 15 2024 4:41 PM

Ashwini Emotional In Jackie Movie Theater - Sakshi

పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా 'జాకీ' సినిమా కర్ణాటక వ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ చిత్రాన్ని KRG స్టూడియో రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా స్క్రీన్‌లలో విడుదల చేసింది. మార్చి 17న పునీత్‌ రాజ్‌కుమార్‌ పుట్టినరోజు ఉంది. దీంతో ఆయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని నేడు రిలీజ్‌ చేశారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణించిన తర్వాత ఆయన నుంచి రీరిలీజ​ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలా వరకు థియేటర్‌లలో పూలతో అలంకరించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 'జాకీ' స్పెషల్ షోలు వేశారు. అభిమానులతో పాటు సినిమాను చూసేందుకు పునీత్‌ సతీమణి అశ్విని కూడా వెళ్లారు. వెండితెరపై తన భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారుజ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్వినితో పాటు పునీత్ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు.

దునియా సూరి డైరెక్షన్‌లో 2010లో జాకీ సినిమా విడుదల అయింది.  కన్నడ  ఇండస్ట్రీలో  ట్రెండ్‌సెట్టింగ్ చిత్రాలలో ఒకటిగా, పునీత్ రాజ్‌కుమార్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమాల్లో ఒకటిగా జాకీ చిత్రం నిలిచింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన భావన ఇందులో నటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement