
హీరో మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’(వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కేఎల్ నారాయణ నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ పడింది.
వెకేషన్‌లో భాగంగా ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లారు మహేశ్‌బాబు. మరోవైపు బహమాస్ తీరంలో సేద తీరుతున్నారు ప్రియాంకా చోప్రా. ఇంకోవైపు ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులపై రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. ఇలా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ఆగస్టులో ప్రారంభమవుతుందని తెలిసింది.
ఈ చిత్రం గత షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరిగింది. ఆగస్టులో మొదలుకానున్న కొత్త షెడ్యూల్ విదేశాల్లో మొదలవుతుందా? లేక హైదరాబాద్ శివార్లలో వేసిన వారణాసి సెట్‌లో ప్రారంభం అవుతుందా? ఈ విషయంపై స్పష్టత రావాలి.