మిస్‌ శ్లోక | Raashi Khanna as Shloka in Ustaad Bhagat Singh | Sakshi
Sakshi News home page

మిస్‌ శ్లోక

Jul 23 2025 2:21 AM | Updated on Jul 23 2025 2:21 AM

Raashi Khanna as Shloka in Ustaad Bhagat Singh

పవన్  కల్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు పవన్  కల్యాణ్‌. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని మరో హీరోయిన్  పాత్రకు రాశీఖన్నాను ఎంపిక చేసింది యూనిట్‌.

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ లో శ్లోక పాత్రలో రాశీఖన్నా నటిస్తున్నట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్  ఎర్నేని, వై.రవి శంకర్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అశుతోష్‌ రానా, నవాబ్‌ షా, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ అవినాష్, గౌతమి, నాగ మహేశ్, టెంపర్‌ వంశీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement