
'కంగువ'తో ఓ రేంజులో దెబ్బతిన్న సూర్య.. 'రెట్రో'తో కొంతమేర పర్వాలేదనిపించుకున్నాడు. ఎందుకంటే తమిళంలో మోస్తరుగా ఆడిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కరుప్పు' మూవీతో వస్తున్నాడు. బుధవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))
'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. మరి దర్శకనిర్మాతలు ఏం ఆలోచించారో ఏమోగానీ అదే టైటిల్‌ని యధాతథంగా ఉంచేశారు. టీజర్ చూస్తుంటే కూడా తమిళ ఫ్లేవర్ ఎక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే మాస్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకుడు.
(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన)