
సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): శివమొగ్గ తాలూకాలోని సక్రె బైలు ఏనుగుల శిబిరంలో ఇటీవల జన్మించిన బుజ్జి ఏనుగుకు పునీత్ రాజ్‌కుమార్ అని అధికారులు పేరు పెట్టారు. ప్రముఖ యువ నటుడు పునీత్ ఇటీవల కాలధర్మం చెందడం తెలిసిందే. కొన్ని నెలల క్రితం సక్రె బైలు ఏనుగుల శిబిరంలో సినిమా షూటింగ్‌కు వచ్చిన పునీత్ ఏనుగులతో సరదాగా గడిపారు. ఇందుకు గుర్తుగా గున్న ఏనుగుకు హీరో పేరును పెట్టారు.