Gandhada Gudi In OTT: ఓటీటీకి వచ్చేసిన పునీత్‌ రాజ్‌కుమార్‌ చివరి మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Late Actor Puneeth Rajkumar Gandhada Gudi Movie Streaming on Amazon Prime - Sakshi

కన్నడ సూపర్‌ స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేంకగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'అప్పు' అంటూ ఆయన అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్. స్టార్‌ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్‌ 2021లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి యావత్‌ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆయన మరణానికి ముందు గంధడ గుడి అనే వైల్డ్‌ లైఫ్‌ డాక్యుమెంటరి ఫిలిం తీశారు. ఈ మూవీ గతేడాది పునీత్‌ వర్ధంతి(అక్టోబర్‌ 22, 2022) సందర్భంగా థియేటర్లో రిలీజ్‌ అయ్యింది. పునీత్‌ చివరి సినిమా కావడంతో ప్రేక్షకులంత థియేటర్లకు క్యూ కట్టారు. కర్ణాటక అడువుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్ వీడియో గంధడ గుడి డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో పునీత్‌ జయంతి సందర్భంగా శుక్రవారం (మార్చి 17)నుంచి ఈ సినిమాను కన్నడ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రకృతి ప్రేమికుడైన పునీత్‌ కర్ణాటక ప్రకృతి అందాలను నేటి యువత, విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరిని తీశారన్నారు ఆయన భార్య,  ఈ మూవీ నిర్మాత అశ్విని. రాష్ట్రంలోని అడవులు, అందమైన ప్రదేశాలను ఇందులో చక్కగా చూపించామన్నారు అశ్విని. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top