Zeenat Aman Finally Opens Up On Truth Behind Dating Rumours With Raj Kapoor, Deets Inside - Sakshi
Sakshi News home page

Zeenat Aman-Raj Kapoor: స్టార్‌ హీరోతో హీరోయిన్‌ లవ్‌.. నటుడి విరహవేదన.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన నటి

Published Sat, Apr 29 2023 8:33 AM

Zeenat Aman Opens on Dating Rumours with Raj Kapoor - Sakshi

ఎవర్‌ గ్రీన్‌గా నిలిచిపోయే పాటల్లో దమ్మారో దమ్‌ సాంగ్‌ ఒకటి. ఈ పాటను ఆస్వాదించినవాళ్లంతా జీనత్‌ కాన్‌ను అంత ఈజీగా మర్చిపోలేరు. బాలీవుడ్‌ తారే అయినా అన్ని భాషల ప్రేక్షకులు ఆమెను ఆరాధించారు. కెరీర్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలో హీరో రాజ్‌ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అప్పటికి జీనత్‌ను మరో హీరో దేవ్‌ ఆనంద్‌ ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోయాడు. తన ఆటోబయోగ్రఫీలో మాత్రం... తాను ప్రేమిస్తున్న జీనత్‌ మరొకరితో ప్రేమలో ఉందన్న వార్తలు బాధించాయని రాసుకొచ్చాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఓపెన్‌ అయింది జీనత్‌.

పబ్లిక్‌గానే కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పా
'నా కెరీర్‌ తొలినాళ్లలో బాలీవుడ్‌లో గోల్డెన్‌ త్రయం నడుస్తోంది. దేవ్‌ సాబ్‌, దిలీప్‌ కుమార్‌, రాజ్‌ కపూర్‌ హిందీ సినిమాకు తలమానికంగా నిలిచారు. ఈ క్రమంలో 1973లో రాజ్‌ కపూర్‌‌ డైరెక్షన్‌లో వచ్చిన బాబీ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా అవార్డులు సైతం గెల్చుకుంది. పబ్లిక్‌గానే అతడికి కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పాను. వకీల్‌ బాబు, గోపీచంద్‌ జసూస్‌ సినిమాల్లో అతడితోపాటు నటించాను. అతడి డైరెక్షన్‌లో సినిమా చేయాలనుండేది. తీరా ఆ అవకాశం వచ్చేసరికి నేను సత్యం శివం సుందరం సినిమా ఒప్పుకోవడంతో దాన్ని తిరస్కరించక తప్పలేదు. తర్వాత రాజ్‌ కపూర్‌ సినిమాల్లోనూ నటించాను. కానీ మా మధ్య ఉన్న సాన్నిత్యాన్ని దేవ్‌ సాబ్‌ తప్పుగా అర్థం చేసుకున్నాడు.

అబద్ధాన్ని ప్రచారం చేశాడు
2007లో వచ్చిన ఆయన ఆటోబయోగ్రఫీ రొమాన్సింగ్‌ విత్‌ లైఫ్‌ పుస్తకంలో దేవ్‌ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ రాజ్‌కు నాకు మధ్య బంధం చిక్కపడటం చూసి తన మనసు ముక్కలైందని రాసుకున్నాడు. అది చూశాక నాకు విపరీతమైన కోపం వచ్చింది. దేవ్‌ నన్ను ప్రేమిస్తున్న విషయమే నాకు తెలియదు, ఆయనను గురువుగా ఆరాధించాను, ఎంతో అభిమానించాను. కానీ తను ఓ అబద్ధాన్ని నమ్మి నాపైనే దుష్ప్రచారం చేశాడు. చాలా బాధేసింది. ఆ పుస్తకం పబ్లిష్‌ అయ్యాక నా ఫోన్‌ రింగవుతూనే ఉంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని నా స్నేహితులు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎంతో అవమానకరంగా భావించిన ఈ విషయం గురించి ఇన్నేళ్లుగా మాట్లాడలేకపోయాను. ఇన్నాళ్లకు దీనిపై క్లారిటీ ఇవ్వాలనిపించింది. దేవ్‌ ఆనంద్‌ అరుదైన ప్రతిభ కలవాడు. ఆయన్ను ఎవరైనా అవమానిస్తే నేను సహించలేను' అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది జీనత్‌.

సంజయ్‌ఖాన్‌తో ప్రేమ పెళ్లి, హింసతో బ్రేకప్‌
జర్నలిస్టు, మోడల్‌గా ఉన్న జీనత్‌ అమాన్‌ 1970లో హల్‌చల్‌తో నటిగా పరిచయమైంది. హరే రామ హరే కృష్ణతో స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. కుర్రకారంతా ఆమెను ఆరాధించింది. ప్రముఖ హీరో ఫిరోజ్‌ ఖాన్‌ తమ్ముడు, హీరో సంజయ్‌ ఖాన్‌ను ఆమె అందం కలవరపెట్టింది. అటు జీనత్‌కూ సంజయ్‌ అంటే ఇష్టం మొదలైంది. ఇద్దరూ అబ్దుల్లా సినిమాలో జంటగా నటించారు. ఈ క్రమంలో వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే సంజయ్‌కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. పైగా అతడు ముక్కోపి! ఓసారి పార్టీలో అందరి ముందే దవడ ఎముక విరిగేలా జీనత్‌కు కొట్టాడట సంజయ్‌. ఆ సంఘటనతో సంజయ్‌ జీవితంలో నుంచి తప్పించుకుంది. జీనత్‌. మూడేళ్ల వారి ప్రేమ హింసాత్మకంగా ముగిసింది. ఆ తర్వాత 1985లో మజర్‌ ఖాన్‌ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కుటుంబంతో సంతోషంగా జీవనం సాగిస్తుందనుకున్న సమయంలో 1998లో మజర్‌ కన్నుమూశాడు. సింగిల్‌ పేరెంట్‌గానే పిల్లలను పెద్ద చేసింది జీనత్‌.

చదవండి: కమెడియన్‌ యోగిబాబు సరసన మరోసారి నయనతార

Advertisement
Advertisement