మొదటి భర్తతో అందుకే విడిపోయా.. ఒంటరితనంతో డిప్రెషన్‌లో.. | Actress Urvashi Reveals About Her First Marriage And Reasons Behind Divorce With Her Husband - Sakshi
Sakshi News home page

Urvashi Comments On Her Divorce: తాగమని బలవంతం, మందుకు బానిసయ్యా.. తాగుబోతునని నా కూతుర్ని కూడా..

Published Mon, Aug 28 2023 10:53 AM

Actress Urvashi About Divorce with First Husband - Sakshi

అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్‌గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది.

ఊర్వశి పర్సనల్‌ లైఫ్‌
ఊర్వశి 2000 సంవత్సరంలో నటుడు మనోజ్‌ కె.జయన్‌ను పెళ్లాడింది. వీరికి తేజ లక్ష్మి అనే కూతురు పుట్టింది. అయితే వీరి దాంపత్యజీవితం అంత సజావుగా సాగలేదు. 2008లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి చెన్నైవాసి శివప్రసాద్‌ను పెళ్లాడింది. వీరికి ఇషాన్‌ ప్రజాపతి అనే కొడుకు పుట్టాడు. అటు మనోజ్‌ కూడా మరొకరిని రెండో పెళ్లి చేసుకున్నాడు.


మొదటి భర్త మనోజ్‌ కె.జయన్‌తో ఊర్వశి

రోజూ మందు తాగేదాన్ని
తాజాగా ఊర్వశి తన మొదటి పెళ్లి గురించి, విడాకులకు గల కారణాన్ని గురించి వెల్లడించింది. 'మనోజ్‌ నేను విడిపోవడానికి ఒకే ఒక కారణం తాగుడు అలవాటు. అతడి ఇంట్లో అందరూ మందు తాగుతారు. కుటుంబమంతా కలిసే తాగుతారు. నన్ను కూడా తాగమని బలవంతం చేసేవాడు. రోజూ తాగితాగి నేను కూడా తాగుబోతులా తయారయ్యాను. అతడి వల్లే నేను మందుకు బానిసయ్యాను. అదే మా విడాకులకు కారణమైంది. నా కూతుర్ని కూడా నాకు దక్కకుండా చేశాడు.


రెండో భర్త శివప్రసాద్‌తో ఊర్వశి

ఒంటరితనంతో డిప్రెషన్‌లోకి..
నేను మందుకు బానిసయ్యానని చెప్పి కూతురి బాధ్యతలను తనే తీసుకున్నాడు. ఒంటరిదాన్నైపోయాను. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. చాలాకాలంపాటు నాలో నేనే కుమిలిపోయాను. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ శివప్రసాద్‌ను రెండో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఆ వయసులో పెళ్లేంటని చాలామంది విమర్శించారు. కానీ నేను వాటిని లెక్క చేయలేదు. ఇప్పుడు నా భర్త, కొడుకుతో సంతోషంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది.

చదవండి: కిక్‌ ఇచ్చేందుకు సంతానం రెడీ.. బ్రహ్మానందం, కోవై సరళతో పాటు..
శేఖర్‌ మాస్టర్‌ విషయంలో చాలా బాధపడ్డాను.. సినిమా ఎంట్రీకి ఆ ఫోటోనే కారణం: ‍శ్రీలీల

Advertisement
 
Advertisement