దేవదాస్‌ బామ్మ కన్నుమూత | Ava Mukherjee Passes Away | Sakshi
Sakshi News home page

Jan 18 2018 9:45 AM | Updated on Apr 3 2019 6:34 PM

Ava Mukherjee Passes Away - Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ సీనియర్‌ నటి అవా ముఖర్జీ కన్నుమూశారు.  88 ఏళ్ల అవా అనారోగ్యం కారణంగానే చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేవదాస్‌ చిత్రంలో షారూఖ్‌ ఖాన్‌ బామ్మ పాత్రలో ఆమె నటించి మెప్పించారు.

రచయితగా కెరీర్‌ను ప్రారంభించిన అవా.. తర్వాత నటన వైపు మక్కువ చూపారు. 1966లో బెంగాళీ చిత్రం రామ్‌ ధక్కా ద్వారా ఆమె సినిమాల్లోకి అరంగ్రేటం చేశారు. దేవదాస్‌, ది ఫర్మ్‌ ల్యాండ్‌(2009), సిద్ధార్థ్‌(2009) చిత్రాలు ఆమె నటించిన వాటిలో చెప్పుకోదగినవి. రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మాణంలో.. సతీష్‌ కౌశిక్‌ డైరెక్ట్‌ చేసిన డర్నా జరూరీ హై(2006) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. 

ఇక ఈమె లీడ్‌ రోల్‌లో చేసిన డిటెక్టివ్‌ నాని చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్ర దర్శకురాలు రోమిల్లా ముఖర్జీ, అవా కూతురే కావటం మరో విశేషం. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement