‘ఆరేళ్ల వయసులో నాపై అత్యాచారం’

Daisy Irani Reveal Horrible Incident in Her Carrier - Sakshi

సాక్షి, సినిమా : తమ పిల్లల భవితవ్యం బాగుండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఆ ప్రయత్నంలో జరిగే పొరపాట్లు.. తర్వాత పిల్లల్ని జీవితాంతం నీడలా వెంటాడుతాయి. అందుకే తల్లిదండ్రులు వారిని కెరీర్‌ను చాలా జాగ్రత్తగా గమనించి కాపాడాలంటున్నారు బాలీవుడ్‌ సీనియర్‌ నటి డైసీ ఇరానీ. చిన్న వయసులో తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఓ ప్రముఖ పత్రికు ఆమె వివరించారు. ఆరేళ్ల వయసులో సంరక్షుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపారు. 

1950-60 మధ్య కాలంలో బాల నటిగా రాణించిన డైసీ.. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించారు. ‘అప్పుడు నా వయసు ఆరేళ్లు. మా అమ్మ ...నాజర్‌ అనే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని నాకు గార్డియన్‌గా నియమించింది. మద్రాస్‌లో ‘హమ్‌ పంచీ ఏక్‌ దల్‌ కే’  చిత్ర షూటింగ్‌ కోసం మేము వెళ్లాం. అక్కడ ఓ హోటల్‌లో నన్ను ఉంచిన నా సంరక్షకుడు ఓ రోజు నాపై అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత బెల్ట్‌తో నన్ను చితకబాది విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం ఏనాడూ నా తల్లితో చెప్పలేదు. పదేళ్ల క్రితం వాడు చనిపోయాడు కూడా’ అని 60 ఏళ్ల ఇరానీ తెలిపారు. 

ఇక మరో ఘటనను వివరిస్తూ... ‘నాకు పదిహేనేళ్ల వయసు ఉన్న సమయంలో ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఓ చిత్రం కోసం నన్ను కలవాలని మా అమ్మను కోరాడు. నాకు చీర కట్టి అందంగా అలంకరించిన మా అమ్మ నన్ను అతని ఆఫీస్‌కు తీసుకెళ్లింది. అయితే అప్పటికి నా శరీరం సౌష్టవంగా లేదు. దీంతో మా అమ్మ నా దుస్తుల్లోపల స్పాంజ్‌ను కుక్కింది. అతని కార్యాలయంలో ఓ సోఫాలో కూర్చుని ఉన్నాను. ఇంతలో అతను వచ్చాడు. మా అ‍మ్మను బయటికి వెళ్లమన్నాడు. భయపడుతూనే అమ్మ బయటకు వెళ్లింది. మాటల మధ్యలో అతను నన్ను తాకాలని యత్నించాడు. అతని ఉద్దేశం అర్థమైన నేను నా లోపల ఉన్న స్పాంజిని తీసి అతని చేతిలో పెట్టాను. అంతే కంగుతిన్న అతను బయటకు పరుగులు తీశాడు’ అని ఆమె వివరించారు. 

తల్లిదండ్రుల పిల్లలను స్టార్లను చేయాలన్న యత్నంలో దారుణమైన తప్పిదాలు చేస్తున్నారని.. కానీ, ఆ పొరపాట్లను, అనుభవించిన నరకాన్ని గుర్తు చేసుకుంటూ తర్వాత జీవితాంతం ఆ పిల్లలు బాధపడుతున్నారని ఆమె వాపోయారు. అయితే తర్వాతి కాలంలో ఆ తరహా ఘటనలు పునరావృతం కాలేదని..  తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా తన సోదరీమణుల(హనీ ఇరానీ, మేనకా ఇరానీ) విషయంలో మాత్రం ఆ తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో తాను రక్షణగా ఉన్నానని ఆమె తెలిపారు.

ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయన‍్న డైసీ.. కాస్టింగ్‌ కౌచ్‌ పేరిట నటీనటులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న అంశాలను ప్రస్తావించారు. చివరకు చిన్న పిల్లలను కూడా వదలటం లేదని.. అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. వారిలో టాలెంట్‌ ఉంటే వెతుక్కుంటూ వస్తారని.. అంతేగాకీ దొడ్డిదారిని ఆశ్రయించకండని ఆమె చెబుతున్నారు. బూట్‌ పాలిష్‌​, జగ్తే రమో, నయా దౌర్‌ లాంటి చిత్రాల్లో నటించిన డైసీ ఇరానీ తర్వాత బుల్లితెరపై కూడా రాణించారు. చివరిసారిగా షారూఖ్‌ ఖాన్‌ ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ చిత్రంలో కనిపించారు.    

 
తల్లిదండ్రులూ... జాగ్రత్త! : ఫర్హాన్‌ అక్తర్‌
డైసీ ఇరానీ ఇంటర్వ్యూ పై ఆమె సోదరి తనయుడు, దర్శక,నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ ట్విటర్‌లో స్పందించాడు. పిల్లల్ని స్టార్‌గా చూడాలని బలవంతంగా చేసే ప్రయత్నాలు మంచివి కావని.. అందుకు డైసీ ఇరానీ ఉదంతమే ఓ ఉదాహరణ, ఆమెకు ఎదురైన పరిస్థితులు మరెవరికీ కలగకూడదు అని ఫర్హాన్‌ అంటున్నారు. తల్లిదండ్రుల ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top