Senior Actress Jayasudha Reveals About Why She Rejects Ajith Valimai Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Senior Actress Jayasudha: ఆ భయంతోనే అజిత్‌ సినిమాను వదులుకున్నాను: జయసుధ

Jan 30 2023 3:01 PM | Updated on Jan 30 2023 3:44 PM

Senior Actress Jayasudha Open Up About Why Ajith Valimai Rejects - Sakshi

‘సహజనటి’ జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  80లలో హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తున్నారు. తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వెండితెరపై తల్లి పాత్ర అంటే వెంటనే గర్తొచ్చే పేరు జయసుధదే. అందుకే ఆమె దాదాపు స్టార్‌ హీరోలందరికి తల్లిగా నటించారు.

చదవండి: కర్ణాటకలో సింగర్‌ కైలాష్‌ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

ఒక్క తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన వారిసు(వారసుడు) మూవీ​లో ఆమె హీరోకి తల్లిగా నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. వారిసు సక్సెస్‌ నేపథ్యంలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు స్టార్‌ హీరోలందరిక మదర్‌గా చేశారని, కానీ నటుడు అజిత్‌తో మాత్రం నటించలేదు ఎందుకు? అని ప్రశ్న ఎదురైంది.

చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’

దీనికి ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు అజిత్‌ వలిమై సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక్క రోజు షూటింగ్‌కు కూడా హాజరయ్యాను. అయితే కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్ వాయిదా పడింది. తర్వాత షూటింగ్‌ మొదలైనా.. కొవిడ్‌ భయం కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. నా స్థానంలో ఆ పాత్రకు సుమిత్ర నటించారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఏడాది సంక్రాతికి అజిత్‌ తునివు, విజయ్‌ వారిసు చిత్రాలు విడుదల కాగా వారి అభిమానుల మధ్య కోల్డ్‌ వార్‌ నడిచిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement