సీనియర్‌ నటికి లైంగిక వేధింపులు | Veteran Actress Zeenat Aman Molestation Case | Sakshi
Sakshi News home page

Jan 30 2018 8:28 AM | Updated on Apr 3 2019 6:34 PM

Zeenat Aman Molestation Case - Sakshi

జీనత్‌ అమన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ వెటరన్‌ నటి జీనత్‌ అమన్‌(66) లైంగిక వేధింపులకు గురయ్యారు.  ఓ వ్యాపారవేత్త ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సోమవారం కేసు నమోదు అయ్యింది. 

ముంబైకి చెందిన వ్యాపారవేత్త అమర్‌ ఖాన్‌.. జీనత్‌ కుటుంబానికి మంచి స్నేహితుడు. కొంత కాలం క్రితం ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా మనస్పర్థలు రావటంతో వారిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. కానీ, కొద్ది నెలలుగా అమర్‌ మళ్లీ ఆమెతో మాట్లాడేందుకు యత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఓరోజు కలుద్దామని చెప్పి తన ఇంటికి రమ్మని ఆమెను అమర్‌ ఆహ్వానించాడు. అయితే ఇంటికి వచ్చిన ఆమెపై సెక్యూరిటీ గార్డు సాయంతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో  జీనత్‌ జూహు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముంబై డీసీపీ పరమజీత్‌ సింగ్‌ దహియా కేసు విషయాన్ని మీడియాకు విషయాలను వెల్లడించారు. సర్ఫరాజ్‌ అలియాస్‌​ అమర్‌ ఖాన్‌ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు డీసీపీ తెలిపారు. 

కాగా, 1970 ఫెమినా మిస్‌ ఇండియా ఏషియా ఫసిఫిక్‌ అయిన జీనత్‌ అమన్‌.. తర్వాత బాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. బోల్డ్‌ పాత్రలకు ఆమె పెట్టింది పేరు. హరే రామ్‌ హరే కృష్ణ, సత్యం శివం సుందరం, యాదోన్‌ కి బారాత్‌ తదితర చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 1985లో మజార్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు కుమారులు. 1998లో మజార్‌ చనిపోవటంతో ఇద్దరు కుమారులతో ఆమె జూహులోనే నివసిస్తున్నారు. తిరిగి చిత్రాల్లో కనిపించని జీనత్‌.. అవార్డు పంక్షన్‌లో, ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement