6గురు హీరోలతో స్టార్‌ హీరోయిన్‌ లవ్‌ ఎఫైర్‌.. చివరకు ముగ్గురు పిల్లల తండ్రితో.. | Sakshi
Sakshi News home page

Vyjayanthimala Tragic Life Story: స్టార్‌ హీరోలతో లవ్‌ ఎఫైర్‌, అబార్షన్‌ కూడా.. ఇంట్లో ఎదిరించి మరీ ఆల్‌రెడీ పెళ్లయిన వ్యక్తితో ఏడడుగులు.. కోట్లు సంపాదించినా..

Published Thu, Sep 14 2023 5:17 PM

Know About Tragic Life Story Of Veteran Actress Vyjayanthimala And Her Controversial Love Life - Sakshi

వైజయంతిమాల.. కలువపువ్వులాంటి కళ్లు.. చంద్రబింబం లాంటి ముఖము.. తేనెలొలికే పెదాలు.. ఆమె ముఖారవిందాన్ని ఏమని వర్ణించగలం. తను నడిస్తే నాట్యం చేసినట్లే ఉంటుంది. అందం, అభినయం, నాట్యం.. అన్నింటినీ ఒకే మనిషిలో గుమ్మరించినట్లుగా ఉంటుంది. ఆమె గురించే ఈ ప్రత్యేక కథనం..

13 ఏళ్లకే నటిగా..
తినే మెతుకు మీద మన పేరు రాసి ఉన్నట్లే ఎవరు ఏం చేయాలని కూడా ముందే రాసి ఉంటుందేమో! తమిళనాడులో నటి వసుంధర దేవి కడుపున జన్మించింది వైజయంతిమాల. తల్లి పోలికలతో పాటు నటనైపుణ్యాన్ని పుట్టుకతోనే సంపాదించింది. ఐదేళ్లకే క్లాసికల్‌ డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టింది. 13 ఏళ్లకే నటిగా మరింది వైజయంతి. అయితే తల్లి అండ మాత్రం ఆమెకు దక్కలేదు, కానీ అమ్మమ్మే అమ్మగా మారి తన ఆలనా పాలనా, బాధ్యతలు చూసుకుంది.

తొలి సినిమా..
1949లో తమిళంలో 'వాస్‌కాయ్‌' సినిమా చేయగా అది తెలుగులో 'జీవితం' అనే టైటిల్‌తో విడుదలైంది. తమిళ అమ్మాయి అయిన వైజయంతి.. తండ్రి సాయంతో తన తొలి చిత్రానికి తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. తన నటన కన్నా తను వేసే స్టెప్పులకే ఎక్కువమంది ఫిదా అయ్యారు. హిందీ కూడా నేర్చుకుని అక్కడ చేసే సినిమాలకు సైతం తనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో బడా స్టార్స్‌తో కలిసి నటించింది వైజయంతిమాల.

అందరూ నో చెప్పిన పాత్రకు ఎస్‌ చెప్పిన హీరోయిన్‌
కొన్ని సినిమాలు ఆడకపోయినా ఆమె డ్యాన్స్‌ మాత్రం జనాలు అంత ఈజీగా మర్చిపోయేవాళ్లు కాదు. 1955లో దేవదాసు సినిమాలో చంద్రముఖి పాత్రకు నర్గీస్‌, బీనా రాయ్‌, సూర్య అందరూ నో చెప్పారు. కానీ వైజయంతిమాల ఏమాత్రం ఆలోచించకుండా నటించింది. ఈ మూవీలో వైజయంతి నటనకుగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్‌ అవార్డు ప్రకటించారు. అయితే తాను హీరోయిన్‌తో సమానమైన పాత్ర చేశానని, అలాంటప్పుడు అది సహాయ పాత్ర ఎందుకవుతుందని అవార్డును తిరస్కరించింది.

స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌
రెండు దశాబ్దాలపాటు నటిగా రాణించి భారతీయ సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా, ప్లేబ్యాక్‌ సింగర్‌గానూ మెప్పించింది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎంతోమంది స్టార్‌ హీరోలతో జోడీ కట్టిందీ హీరోయిన్‌. ఆ సమయంలో తన గురించి ఎన్నో పుకార్లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. చాలామంది హీరోలతో ఎఫైర్‌ నడిపిందని టాక్‌ నడిచింది.

ఏ చీర కట్టుకోవాలో కూడా ఆ హీరోనే డిసైడ్‌ చేసేవారట
ట్రాజెడీ కింగ్‌ దిలీప్‌ కుమార్‌.. మధుబాలకు బ్రేకప్‌ చెప్పిన తర్వాత వైజయంతిమాలను ప్రేమించాడని ప్రచారం జరిగింది. తన సినిమాలో ఏ చీర కట్టుకోవాలనేది కూడా దిలీపే నిర్ణయించేవారని టాక్‌ నడిచింది. తర్వాత షోమాన్‌ రాజ్‌ కపూర్‌తో ఆమెను లింక్‌ చేశారు. నజరాణా సినిమాలో వీళ్లిద్దరూ ‍ప్రేమలో పడ్డారని అప్పట్లో బీటౌన్‌ కోడై కూసింది. వీళ్లు సహజీవనం చేశారని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన రాజ్‌ కపూర్‌ భార్య.. బెదిరింపులకు దిగడంతో ఇకమీదట వైజయంతిమాలను కలడం, ఆమెతో పని చేయడం మానేస్తానని వాగ్ధానం చేశాడట. ఆ సమయంలో వైజయంతి అబార్షన్‌ చేయించుకుందని ఓ పుకారు.

వైజయంతిపై మనసు పారేసుకున్న డాక్టర్‌
సౌత్‌లో జెమిని గణేశన్‌, శివాజీ గణేశన్‌, ఎంజీఆర్‌, రాజేంద్ర కుమార్‌తోనూ ప్రేమాయణం నడిపిందని ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడైతే డాక్టర్‌ చమన్‌లాల్‌ బాలి తన జీవితంలో అడుగుపెట్టాడో అప్పుడే ఈ ప్రచారాల పరంపరకు ఫుల్‌స్టాప్‌ పడింది. డాక్టర్‌ బాలికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన తరచూ వైజయంతి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు వైజయంతి అమ్మమ్మ అతడి తీరు గమనించి.. ముగ్గురు పిల్లల తండ్రివి, నా మనవరాలిని ఏం చేద్దామనుకుంటున్నావు? అని కోప్పడింది. అంత పెద్దాయనను గుమ్మంలో నిలబెట్టి కోప్పడతావేంటని వైజయంతి ఎదురుతిరగడంతో ఆమె మద్రాసు వెళ్లిపోయింది.

విడాకులతో లైన్‌ క్లియర్‌
1966లో బాలి, తన భార్య రూబితో విడిపోయారు. అప్పటి నుంచి వైజయంతి, బాలి కలిసి నివసించడం మొదలుపెట్టారు. కానీ తను డ్రగ్స్‌ తీసుకుంటోందని రూమర్స్‌ మొదలయ్యాయి. దీంతో మానసిక ఒత్తిడికి లోనైంది వైజయంతి. ఇంతలో 1967లో బాలికి విడాకులు మంజూరవడంతో వైజయంతికి లైన్‌ క్లియర్‌ అయింది. 1968 మార్చి 10న మద్రాసులో వైజయంతి- బాలి పెళ్లి చేసుకున్నారు. వీరికి సుచేంద్ర అని ఒక బాబు పుట్టాడు. కొడుకు పుట్టాక డాక్టర్‌ వృత్తి మానేసిన బాలి.. కుమారుడి పేరిట సుచీ సీ ఫుడ్స్‌ అనే వ్యాపారం మొదలుపెట్టి కోట్లు సంపాదించాడు. కానీ తర్వాతి కాలంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు.

ఆరోగ్యం విషమించి..
అమెరికాలో బైపాస్‌ సర్జరీ చేయించుకున్న మూడేళ్ల తర్వాత ఆరోగ్యం మరింత దెబ్బతింది. 1986లో ఒకరోజు బాత్రూమ్‌లో తల గోడకు తగిలింది. కొన్నాళ్లకు తల బొప్పి కట్టి మెదడులో రక్తం గడ్డకట్టడంతో స్పృహ తప్పి పడిపోయారు. ఆపరేషన్‌ చేసినప్పటికీ మళ్లీ అదే ప్రాంతంలో పుండు ఏర్పడంతో మరోసారి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. అప్పటికే కోమాలో ఉన్న  బాలి 1986 ఏప్రిల్‌ 21న కన్నుమూశాడు. వైజయంతి ప్రస్తుతం తన కొడుకుతో కలిసి నివసిస్తోంది.

చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్‌, షాక్‌లో ఫ్యాన్స్‌.. అనారోగ్య సమస్యలే కారణమా?
త్వరలోనే అమీర్‌ ఖాన్‌ కూతురు పెళ్లి.. వేదిక ఎక్కడంటే!

Advertisement
 
Advertisement