
సినిమా: సీనియర్ నటి ఉషారాణి(65) ఆదివారం కన్ను మూశారు. ఇటీవల అనారోగ్యానికి గురై చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈమె మలయాళ దర్శకుడు శంకర్ నాయార్‌ను 1971లో వివాహం చేసుకున్నారు. తమిళంతో పాటు మలయాళంలో 200 పైగా సినిమాల్లో నటించారు. చివరిగా తమిళంలో 2004లో మైలాటం చిత్రంలో నటించారు. భౌతిక కాయానికి పోరూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతిపై దక్షిణ భారత నటీనటుల సంఘం సంతాపం ప్రకటించింది.