పెళ్లిపీటలెక్కుతున్న జయమాలిని తనయుడు! | Actress Jayamalini Son Wedding Details | Sakshi
Sakshi News home page

Jayamalini: ఐటం సాంగ్స్‌తో ఫేమస్‌ అయిన నటి తనయుడి పెళ్లి.. మొదలైన పనులు!

Feb 22 2023 8:13 PM | Updated on Feb 22 2023 8:40 PM

Actress Jayamalini Son Wedding Details - Sakshi

జయమాలిని తనయుడు శ్యామ్‌ హరి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని వీజీపీ గోల్డెన్‌ బీచ్‌ రిసార్ట్‌లో శ్యామ్‌ పెళ్లి జరగనుందంటూ ఓ

స్పెషల్‌ సాంగ్స్‌తో ఓ ఊపు ఊపేసిన నిన్నటితరం హీరోయిన్‌ జయమాలిని. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అప్పట్లో ఆమెకు మంచి క్రేజ్‌ ఉండేది. దాదాపు స్టార్‌ హీరోలందరి సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో ఆడిపాడింది. కెరీర్‌ ప్రారంభంలో ఒకటీరెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా తర్వాత మాత్రం డ్యాన్సర్‌గానే అభిమానులను ఉర్రూతలూగించింది. పోలీస్‌ అధికారి పార్తీబన్‌ను పెళ్లాడిన తర్వాత ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయించింది.

కాగా జయమాలిని తనయుడు శ్యామ్‌ హరి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న చెన్నైలోని వీజీపీ గోల్డెన్‌ బీచ్‌ రిసార్ట్‌లో శ్యామ్‌ పెళ్లి జరగనుందంటూ ఓ పెళ్లి పత్రిక సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయట. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతడి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినీప్రముఖులు సైతం మండపానికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తారట.

చదవండి: ఆ కష్టం విలువ తెలుసు, మా పిల్లల్ని అలానే పెంచుతాం: ఉపాసన

Advertisement
 
Advertisement
Advertisement