Upasana Says Them To Stop Spreading Negativity About Her - Sakshi
Sakshi News home page

Upasana: చరణ్‌, నేను మా పిల్లలను అలానే పెంచుతాం..

Feb 22 2023 5:34 PM | Updated on Feb 22 2023 6:42 PM

Upasana Says Them To Stop Spreading Negativity About Her - Sakshi

రామ్‌ చరణ్‌, ఉపాసన(ఫైల్‌ ఫోటో)

‘నేను డైమాండ్‌ స్పూన్‌తో పుట్టడానికి నా పేరెంట్స్‌ చాలా కష్టపడ్డారు. ఆ కష్టం విలువ నాకు తెలుసు. చరణ్‌, నేను కలిసి మా పిల్లలను కష్టం విలువ తెలిసేలా పెంచుతాం’ అని మెగా కోడలు, రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల అన్నారు. తనపై వస్తున్న నెగెటివ్‌ వార్తలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆమె ఓ వీడియోని విడుదల చేశారు. 

ప్రతి ఒక్కరూ నన్ను చూసి డైమండ్ సిల్వర్ స్పూన్‌లో పుట్టానని అనుకుంటారు. అయితే అవన్నీ కావాలని నేను కోరుకోలేదు. నిజానికి నేను ఇంటి దగ్గరే రిలాక్స్‌గా కూర్చోవచ్చు. కానీ నాకంటూ ఏదో ఒక వైవిధ్యం పొందాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా పుట్టుకకు ఓ కారణముందని నమ్ముతాను. గొప్ప ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉండి కూడా చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఏం చేయకపోతే నా జీవితానికి అర్థం లేదు. దయచేసి నా గురించి నెగెటివ్ గా రాసి నెగెటివిటీని స్ప్రెడ్ చెయ్యొద్దు’ అని  ఉపాసన కోరారు.

రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ ఉమన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఉపాసన. ప్రస్తుతం తాను గర్భవతి. త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement